మెయిన్ ఫీచర్

జ్ఞానమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
సర్వాత్మకతా భావన కల్గిన జ్ఞాని, బ్రహ్మాదిస్తంబ పర్యంతము బ్రహ్మమయమని గ్రహించును.
230. మృత్యార్యభూతో‚ పి మృదో న భిన్నః
కుమ్బో‚ స్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్‌
న కుమ్భరూపం పృథగస్తి కుమ్భః
కుతో మృషా కల్పితనామమాత్రః॥
కుండ మృత్ (మట్టి) కార్యరూపము. దానిలో సర్వత్ర వ్యాపించి ఉన్నది మట్టి తప్ప మరే పదార్థము లేదు. మనకి తోచిన ఒక పేరును దానికి పెట్టినంతమాత్రాన అది మట్టి స్వరూపముకన్న భిన్నముకాదు కదా! ‘‘యథా సోమ్య ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతగ్‌ం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్వేవ సత్యమ్’’ (మృత్పిండముయొక్క జ్ఞానముతో మట్టితో తయారైన కుంభాదులు మృణ్మయములని తెలుస్తున్నదికదా! మట్టితో నిర్మితమైన కార్యరూపములన్నియు కేవలము నామమాత్రములు. వాటిని తయారుచేయుటకు మూలమైన మట్టిమాత్రమే సత్యము (్ఛ.ఉ.6-1-4). పరబ్రహ్మమే సర్వమునకు ఉపాదానకారణము మరియు నిమిత్త కారణము. కారణ స్వరూపమైన బ్రహ్మమే సత్యము. ఆకారవికారాదులతో ఉన్న కార్యరూపములు, నామమాత్రములు. మిథ్యారూపములైన ఈ అసద్వస్తువులన్నియూ నిత్యములేనివి. ఊహాజనిత నానాప్రకార నామధేయములతో తమ ప్రాపంచిక వ్యవహారమునకు మనుష్యనిర్మితమైన వీటి కాలపరిమితి స్వల్పము, ప్రయోజనమూ స్వల్పమే.
231. కేనాపి మృద్భిన్నతయా స్వరూపం
ఘటస్య సందర్శయితుం న శక్యతే
అతో ఘటః కల్పిత ఏవ మోహాత్
మృదేవ సత్యం పరమార్థ భూతమ్‌॥
ఎవనికైనా ఘటముయొక్క మూల స్వరూపము (ఉపాదాన కారణము) మట్టికాదని నిరూపించుట అశక్యము. అజ్ఞానముచేత నామరూపాది వికారముల ఆధారముగా ఘటము అనే భేదము లోకములో కల్పించబడుతున్నది. కాని, మట్టిమాత్రమే సత్యము. ఘటము యొక్క పరమార్థము మట్టిలోనే ఉన్నది, ఇంకెందులోనూ లేదు. అదేవిధముగా, పరమాత్మక భిన్నమైన ప్రపంచము, అజ్ఞానమువలన వేరుగా చూడబడుతున్నది.
232. సద్బ్రహ్మకార్యం సకలం సదైవ
సన్మాత్రమేత న్న తతో‚న్యదస్తి
అస్తీతి యో వక్తి న తస్య మోహో
వినిర్గతో నిద్రితవత్ప్రజల్పః॥
విశ్వసృష్టికి కారణము శుద్ధచైతన్య స్వరూపమైన పరబ్రహ్మము. అందువలన, జగత్తులో భాసిస్తున్న సమస్తము బ్రహ్మస్వరూపము తప్ప వేరొకటి కాదు. ఎవడైనా, బ్రహ్మమునకు అతిరిక్తమైనది ఈ విశ్వసృష్టిలో ఉన్నదని పల్కినచో అది వాని అజ్ఞానముచే ప్రకటించును. నిద్రపోతున్న వ్యక్తి ప్రేలాపనలు ఎటువంటివో, వాటికి తుల్యమైనవే నిస్సారమైన ఆ పలుకులు.
233. బ్రహ్మైవేదం విశ్వమిత్యేవ వాణీ
శ్రౌతీ బ్రూతే‚ థర్మనిష్ఠా వరిష్ఠా
తస్మాదేవ ద్బ్రహ్మమాత్రం హి విశ్వం
నాధిష్ఠానాద్భిన్నతారోపితస్య॥
అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణింపబడే అథర్వణవేదము ‘‘బ్రహ్మైవేదం విశ్వమిదం సర్వం వరిష్ఠమ్’’ అని ప్రకటిస్తున్నది (ము. ఉ.2- 2-11). అందువలన, ఈ జగత్తులోనున్న సమస్తమూ బ్రహ్మస్వరూపము తప్ప ఇంకొకటి కాదని నిశ్చతము.
234. సత్యం యది స్యాజ్జగదేతదాత్మనో‚ నన్తత్వ
హాని ర్నిగమాప్రమాణతా
అసత్య వాదిత్వ మపీశితుః స్యాత్ నైతత్త్రయం
సాధుహితం మహాత్మనామ్‌॥
మనకుకల్పిస్తున్న ఈ జగత్తు కల్పితముకాక యథార్థమే అయినచో, పరబ్రహ్మ అనంతత్వమునకు హాని, వేద విరుద్ధవౌను. సద్వస్తువైన బ్రహ్మమే శాశ్వతము. తదితరములన్నీ నిత్యత్వము లేనివి. నశించేవి. అందువలన, శ్రుతి దృశ్యప్రపంచము బ్రహ్మపదార్థముకాదని దానిని నిరాకరించి పరబ్రహ్మము అద్వితీయమని నిర్ధారిస్తున్నది. అంతేకాదు, ‘‘సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ’’ అనే శ్రుతి వాక్యము (తై.ఉ.2-1-1) పరబ్రహ్మ స్వరూపలక్షణమును స్పష్టము చేస్తున్నది.
జగత్తుకు విలక్షణమైన బ్రహ్మపదార్థము, అద్వితీయము, అఖండ జ్ఞానస్వరూపము, మరియు అనంతము. జగత్తుకు సత్యత్వాది బ్రహ్మలక్షణములను ఆపాదించిన అది శ్రుతి విరుద్ధవౌతుంది. విరుద్ధ ధర్మములుగల ఘటము- పటము (కుండ- వస్తమ్రు) ఒకే పదార్థమని భావించుట ఎంత యుక్తమో, జగత్తు- బ్రహ్మము ఏకమని భావించుట అంతే యుక్తవౌను.
ఇంకా ఉంది