మెయిన్ ఫీచర్

జ్ఞానమే పరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
సర్వజ్ఞుడైన పరమేశ్వరుని సత్సంకల్పముతో నిర్మితమైనదే జగత్తు. అందువలన ఈశ్వరుని లీలగా అంగీకరింపబడుతున్నది. జగత్తు సత్స్వరూపమైన బ్రహ్మమని భావించుట ఈశ్వరునకు అసత్యవాదిత్వమును ఆరోపించట అఖండావృత్తిగల మహాత్ములకు, సత్యనిష్ఠగలవారికి ఎంత మాత్రము తగదు. అనంతత్వహాని- వేద విరుద్ధము- అసత్యవాదిత్వము ఈ మూడున్నూ మేలుచేసేవి, శ్రేయస్కరమైనవి ఎంత మాత్రము కావు. అవి స్వానుభవమునకు సహితము విరుద్ధము. శిష్యా! వాటిని విడచిపెట్టుము.
235. ఈశ్వరో వస్తుతత్త్వజ్ఞో న చాహం తేష్యవస్థితః
న చ మత్‌స్థాని భూతానీత్యేవమేవ వ్యచీకథత్‌॥
సర్వజ్ఞుడైన ఈశ్వరుడు (కృష్ణ్భగవానుడు) భగవద్గీతలో ఉపదేశించిన వాక్యములే ఈ శ్లోకంలో ఉల్లేఖించబడినవి. ‘‘మత్‌స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః’’ (ఈ సమస్త ప్రాణి సమూహము నాయందున్నది; కని వాటియందు నేను లేను- భ.గీ.9-4). ఇలా ముందుగా ప్రకటించి, తదనంతరము ఇట్లు బోధించెను ‘‘న చ మత్‌స్థాని భూతాని పశ్యమే యోగ మైశ్వరమ్’’ (నేను ఆ భూతములందు చేరిన వాడను కాను. నా మహిమను నా స్వస్వరూపమును నీవు తెలిసికొనుము- భ.గీ.9-5).జగత్సర్వమునకు బ్రహ్మమే అధిష్ఠానము. పరమాత్మ సర్వాత్మకము, సర్వవ్యాపి. అందువలన, సర్వప్రాణులందు ఆ ఆత్మయే ఉన్నది. అయిననూ, జగత్తు పరమాత్మకు అధిష్ఠానము కాజాలదు. ఏమన, జగత్తు పరమాత్మలో ఒక అంశము మాత్రమే.
‘‘విష్ట్భ్యాహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్’’ (్భ.గీ.10-42) పరమాత్మ పరిధులు లేనిది. అందువలనే, ‘్భమా’ ‘కృత్స్నము’ అనంతము అని చెప్పబడినది. ఈశ్వరస్వరూపమైన కృష్ణ్భగవానుని బోధనలో ‘‘న చాహం తేష్వవస్థితః’’ అనే వాక్యము అధిష్ఠానంపై ఆరోపితమైన ప్రపంచం. బ్రహ్మాభిన్నమనే స్పష్టం చేస్తున్నది.
236. యది సత్యం భవేద్విశ్వం సుషుప్తావుపలభ్యతామ్‌
యన్నోపలభ్యతే కించి దతో‚ సత్ స్వప్నవన్మృషా॥
ప్రపంచము మిథ్యకాక సత్యమైనచో సుషుప్తిలోను దాని అనుభవము కలగాలి. కాని జాగ్రదవస్థ, స్వప్నావస్థలలో మాత్రమే ప్రపంచము దృశ్యవౌతున్నది మరియు దాని అనుభవము పొందబడుతున్నది. స్వప్నానుభూతి యథార్థమైనది కాదు, కేవలము మిథ్య. జాగ్రదవస్థలో పొందుతున్న ప్రాపంచిక అనుభూతికి నిత్యత్వములేదు. నిత్యత్వము లేని అసద్వస్తువులు కల్పితములు. అందువలన, జగత్ మిథ్య అని నిర్ధారించుకొనుటయే యుక్తము.
237. అతః పృథజ్నాస్తి జగత్పరాత్మనః
పృథక్ప్రతీతిస్తు మృషా గుణాహివత్‌
ఆరోపితస్యాస్తి కిమర్థవత్తా‚
ధిష్ఠాన మాభాతి తథా భ్రమేణ॥
ప్రపంచమునకు ఆధారభూతము పరమాత్మ. జగత్కర్త, సత్యస్వరూపము, సర్వాధిష్ఠానమైన బ్రహ్మముపై ఈ ప్రపంచము ఆరోపితమైనది. సర్పము ఆధార భూతమైన త్రాడుపై ఆరోపితము అవగా, అది కేవలము భ్రాంతియని ఎట్లు నిర్థారిం పబడినదో అట్లే జగత్తు మిథ్యయని నిశ్చయింపబడుతున్న ది.
ఆరోపితమైన వస్తువు అసత్యమగుటచే ప్రయోజన రహితము కదా! అందువలన, సర్వాధారమైన బ్రహ్మమొక్కటే సత్య ము, తదారోపితమైన సకల దృశ్యరూప ప్రపంచమూ మిథ్య.
238. భ్రాన్తస్య యద్యద్భ్రమతః ప్రతీతం
బ్రహ్మైవ తత్తద్రజతం హి శుక్తిః
ఇదంతయా బ్రహ్మ సదేవ రూప్యతే
త్వారోపితం బ్రహ్మణి నామమాత్రమ్‌॥
భ్రాంతి చెందిన వ్యక్తికి ప్రపంచము బ్రహ్మస్వరూపమని తెలియదు. ముత్యపు చిప్పలో ఉన్నది వెండి కాదు అనే జ్ఞానము కలిగేవరకు ముత్యపు చిప్పలో మెరుస్తున్నది వెండియనే భ్రాంతి కలుగును. వెండి అనే పదార్థము ముత్యపుచిప్పపై ఆరోపితమైన కారణంగా ఈ భ్రాంతి కొనసాగును.
ఎప్పుడైతే ముత్యపుచిప్పలో మెరుస్తున్నది ఆరోపితము తప్ప యథార్థముకాదు అనే జ్ఞానము కలుగునో, అప్పుడు భ్రాంతి తొలగిపోవును. అదే విధముగా ప్రపంచము బ్రహ్మముపై ఆరోపితమైనది. యథార్థతః బ్రహ్మకు భిన్నమైన అస్తిత్వము(ఉనికి) ప్రపంచమునకు లేనే లేదనే జ్ఞానము కలిగినప్పుడు కార్యరూపములో గోచరిస్తున్నదంతయూ కేవలము నామమాత్రమే, బ్రహ్మమే సత్యమని అవగతవౌను. ముందు ఉల్లేఖించిన (శ్లో.230) ‘‘వాచారంభణం వికారో నామధేయమ్’’అనే శ్రుతియే దీనికి నిదర్శనము.
ఇంకా ఉంది