మెయిన్ ఫీచర్

జ్యోతి స్వరూపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
పరబ్రహ్మ నిరూపణము
239. అతఃపరం బ్రహ్మ సదద్వితీయం
విశుద్ధ విజ్ఞాన ఘనం నిరంజనమ్‌
ప్రశాస్త మాద్యన్తవిహీన మక్రియం
నిరన్తరానన్దరస స్వరూపమ్‌॥
ముందు శ్లోకములలో సందర్భోచితముగా ప్రస్తావించిన పరమాత్మ లక్షణములు, ఈ శ్లోకములో పునరుద్ఘాటించబడినవి. పరబ్రహ్మము సత్పదార్థము, కావున త్రికాలాతీతము. బ్రహ్మమొక్కటే (స ఏకః), అద్వితీయము, తల్లక్షణములుగల ఇంకొక పదార్థము లేదు. బ్రహ్మము ఆద్యంతములు లేనిది, జనన మరణములు లేనిది, పరిపూర్ణ జ్ఞాన స్వరూపము, ప్రశాంతమైనది, దోషరహితము, క్రియాశూన్యము మరియు నిరంతరము ఆనంద రసానుభూతి పొందే చిదానంద స్వరూపము.
240. నిరస్తమాయాకృతసర్వభేదం
నిత్యం ధ్రువం నిష్కల మప్రమేయమ్‌
అరూప మవ్యక్త మనాఖ్య మవ్యయం
జ్యోతిః స్వయం కించి దిదం చకాస్తి॥
ఈ శ్లోకములో పరమాత్మ లక్షణములు మరికొన్ని బోధించబడినవి. నిర్గుణ పరబ్రహ్మము మాయావృత్తముకాదు. ఈశ్వరుడు లేక హిరణ్యగర్భుడే మాయాస్వరూపము. పరమాత్మ కూటస్థము అనగా ఎట్టి మార్పులుచెందక స్థిరముగా ఒకేవిధముగా ఉండేది. నిరవయవి, ఇంద్రియాదులు, శరీరములేనిది అందువలనే నిష్కలం అని నిర్దేశింపబడింది.
అవ్యక్తము మరియు ఊహాతీతము. మనోబుద్ధులు తదితర ఇంద్రియములతో ప్రాణులకు అగ్రాహ్యము. ‘‘యతో వాదో నివర్తంతే అప్రాప్య మనసా సహ’’అనే శ్రుతే నిదర్శనము (తై.ఉ.2-4-1). రూపహితము, నామాది చిహ్నములు లేనిది. వృద్ధిక్షయములు లేనిది, ఎన్నడూ నశించనిది కాబట్టి అవ్యయము. స్వయముగా భాసించేది, సూర్యచంద్రాదులను సహితము ప్రకాశవంతము చేస్తున్నది. అందుచేతనే, పరమాత్మ, ‘జ్యోతిషాం జ్యోతి’ అని వర్ణింపబడినది.
241. జ్ఞాతృ జ్ఞానజ్ఞేయ శూన్య మనన్తం నిర్వికల్పకమ్
కేవలాఖండ చిన్మాత్రం పరం తత్త్వం విదుర్బుధాః॥
తెలిసికునే వాడు (జ్ఞాత), తెలిసికున్న విషయము (జ్ఞానము), తెలియదగనది (జ్యేయం), అనే త్రివిధ భేద రహితమైనది పరమాత్మ దేశకాలాది పరిమితులు ఏవీ లేనిది, అందువలన అనంతము. భేద రహితము, సంకల్పవికల్ప శూన్యము కావున నిర్వికల్పము. ఏకమాత్ర అఖండ జ్ఞాన స్వరూపమైన పరమాత్మతత్త్వమును, బుధులు (పండితులు), జ్ఞానులు మాత్రమే ఎఱుగుదురు.
242. అహేయ మనుపాదేయం మనోవాచామగోచరమ్‌
అప్రమేయ మనాద్యన్తం బ్రహ్మ పూర్ణం మహన్మహః॥
బ్రహ్మము ఆత్మస్వరూపముగా ఎన్నడూ నిరాకరింపబడనిది. వస్తుత్వము లేని కారణంగా పరిగ్రహింపబడ నిది. మనో వాక్కులకు అతీతము. ఊహకందనిది, మాటలతో వ్యక్తముచేయబడనిది. తెలిసికొన శక్యముకానిది. ఆద్యంతములులేనిది. పరిపూర్ణమైన ఈ పరబ్రహ్మమే అత్యంత తేజస్సుతో జగత్సర్వము ను తేజోమయ ము చేయుచూ, సర్వభూతములం దు ప్రత్యగాత్మగా ప్రకాశిస్తున్నది.

మహావాక్కు విచారణ
243. తత్త్వం పదాభ్యా మభిధీయమానయో.
బ్రహ్మాత్మనోః శోధితయోర్యదిత్థమ్‌
శ్రుత్యా తయోస్తత్త్వమసీతి సమ్య
గేకత్వమేవ ప్రతిపాద్యతే ముహుః॥
‘తత్’ పదముతో పరమాత్మను, ‘త్వం’ పదముతో జీవాత్మను నిర్దేశించి, అనేక పర్యాయములు ఛాందోగ్యోపనిషత్తులో ‘‘తత్త్వమసి’’ (ఆ పరమాత్మయే నీవు)అని పలు దృష్టాంతములతో జీవేశ్వరుల ఏకత్వము స్పష్టమగుటకు బోధింపబడినది. ‘తత్త్వమసి’అనే ఈ ఛాందోగ్య మహావాక్యము, అద్వైతమును ధృవీకరించుటకు, బ్రహ్మాత్మ భావన పెంపొందించుటకు విశేషంగా వాడబడుతున్నది. రానున్న శ్లోకములలో ఈ ఏకత్వము విశదీకరింపబడినది.
244. ఐక్యత తయో ర్లక్షితయో ర్న వాచ్యయో
ర్నిగద్యతే‚ న్యోన్య విరుద్ధ్ధర్మిణోః
ఖద్యోతభాన్వో రివ రాజభృత్యయోః
కూపాంబురాశ్యోః పరమాణుమేర్వోః॥
జీవేశ్వరుల అభిన్నతను లక్షణలో ఏకత్వమున్నందువలన ఆ విధముగా బోధింపబడుతున్నది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మానవుడు అల్పజ్ఞుడు. మిణుగురు పురుగు యొక్క ప్రకాశము అత్యంత స్వల్పము, సూర్యుని తేజోశక్తి అపరిమితము. అట్లే రాజు పాలకుడు, ప్రభువు అధీనములో సేవ చేసేవాడు భృత్యుడు. బావి పరిధి బహుస్వల్పము, సముద్రము అపారము. సూక్ష్మమైన పరమాణువు మేరుపర్వతముతో సరితూగదు.
ఇంకా ఉంది