మెయిన్ ఫీచర్

ఇదీ మన ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932, ఫిబ్రవరి 6న విడుదలైన సందర్భంగా...
*
87ఏళ్ల ఘన చరిత్ర -తెలుగు సినిమాది. ఇందులోని ప్రతి పుటా ఆసక్తిదాయకం. ఎంతోమంది కళాకారులు, కృషీవలుల సృజనాత్మకత, మేధా సంపత్తులకు ఇది నిలువెత్తు రూపం -నేటి తెలుగు సినీ పరిశ్రమ. 1931లో హెచ్‌ఎమ్ రెడ్డి నిర్మించిన మొదటి టాకీ చిత్రం- భక్తప్రహ్లాద నుంచి నేటివరకూ తెలుగు సినీవనంలో
విరిసిన చిత్ర కు-సుమాలు లెక్కలేనన్ని. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి దశకం ఒకింత ప్రాముఖ్యత సంతరించుకుంది. మనదేశంలో హిందీ సినిమా పరిశ్రమ తర్వాత.. అంతగా విస్తరిల్లింది తెలుగు పరిశ్రమే. సినిమా ఉన్నతికి విశేష సేవలందించిన ఎంతోమంది అందుక్కారణం. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని దగ్గరనుంచి దాసరి నారాయణరావు, విశ్వనాథ్,
చిరంజీవిల వరకూ.. ఆ తరువాతి వరసక్రమంలోనూ ఎందరో మహానీయులు తెలుగు కళాభారతి ఉన్నతికి కృషి చేసినవారే.. చేస్తున్నవారే.
తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 1873లో జన్మించారు. తెలుగు సినిమా చరిత్ర వైతాళికుడు కూడా. తన పద్దెనిమిదేళ్ల వయసులో మద్రాసు నగరంలో ఫొటోగ్రఫీ నేర్చుకున్న వెంకయ్య- 1910నాటికల్లా ఇంపోర్టెడ్ మెగాఫోన్‌తో 400 అడుగుల నిడివి ఫిల్ములను రూపొందించి చూపరులను అబ్బురపర్చాడు. మూకీ చిత్రాల యుగంలోనే వెంకయ్య తను నిర్మించిన చిత్రానికి శబ్దాన్నీ కూర్చాడు. వాటిని ఐదవ కింగ్‌జార్జి ఎదుట ప్రదర్శించి మన్నన అందుకున్నాడు. తనకుతాను టూరింగ్ టెంట్‌ను సమకూర్చుకున్న వెంకయ్య -లభించిన ప్రోత్సాహంతో మద్రాసు హారిస్ రోడ్‌లో గెయిటి థియేటర్ (1912)ను నిర్మించారు. మద్రాసులో నిర్మించిన తొలి సినిమా థియేటర్ అదే. 1914లో -మింట్ వీధిలో క్రౌన్ థియేటర్, పరశునాక్కమ్‌లో గ్లోబ్ థియేటర్ (ఇదిప్పుడు రాక్సీ అనబడుతోంది)ను వెంకయ్య నిర్మించారు.
తన కుమారుడు ప్రకాష్‌ను సినిమాటోగ్రఫీ నేర్చుకోమని ఇంగ్లండ్ పంపటం వెంకయ్యకు సినీ నిర్మాణంపట్ల ఉన్న శ్రద్ధాసక్తులకు నిదర్శనం. ‘స్టార్ ఆఫ్ ఈస్ట్’ పేరిట స్టూడియో నిర్మించారు వెంకయ్య. 1921లో నిర్మాణం పూర్తి చేసుకున్న ‘్భష్మ-ప్రతిజ్ఞ’ (తెలుగు) మద్రాసులో నిర్మించిన తొలి మూకీ చిత్రంగా ప్రసిద్ధికెక్కింది. దర్శకుడు ప్రకాశ్ భీష్మగా, తమిళ నటుడు ఎ నారాయణన్ కృష్ణుడిగా, సూరి సుబ్బారావు దశరాజుగా, నెలా ఆస్టిన్ అనే ఆంగ్లేయుడు శంతనుడిగా, సెగ్లీకాస్టెల్లీ అనే ఆంగ్ల యువతి గంగగా ఈ చిత్రం నిర్మితమైంది. ఇందులో దిగ్గజ దర్శకుడు సి పుల్లయ్య కూడా చిన్న పాత్ర ధరించారు. ‘్భష్మ-ప్రతిజ్ఞ’ తర్వాత గజేంద్రమోక్షం, నందనార్, మత్స్యావతారం మొదలైన చిత్రాలకు ప్రకాశ్ దర్శకత్వం వహించారు అంతేకాదు, ఆ సినిమాల నిర్మాణంతో తెలుగు పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
తెలుగు సినిమా చరిత్రకు పునాదివేసిన వెంకయ్య కుమారుడు సూర్యప్రకాశ్. తండ్రి ఆశయాలకు సాకారత కల్పిస్తూ తెలుగు సినీ దర్శకులకు మార్గదర్శి అయ్యారు. తండ్రి నిర్మించిన భీష్మ-ప్రతిజ్ఞలో హీరోగా నటించి నిర్మించి.. తెలుగు సినీ హీరోలకు బాటలు వేశారు. తన విజ్ఞానాన్ని, సినీ నిర్మాణంపట్ల తనకున్న అపారమైన జ్ఞానాన్ని కుమారుడు ప్రకాశ్‌కు వదిలి.. 1949లో వెంకయ్య కన్నుమూశారు. ఈ తెలుగు సినీ పితామహుడి పేరిట రఘుపతి వెంకయ్య అవార్డు అన్న ప్రతిష్టాత్మకమైన అవార్డును స్థాపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మహనీయుడికి ఏటా నివాళులర్పిస్తుంది.
గోడమీద మాంత్రికుడు
తెలుగు సినీ చరిత్రలో ఉద్గ్రంధాలుగా చెప్పబడే సి పుల్లయ్య, వైవి రావులను తెలుగు సినీ పరిశ్రమలకు పరిచయం చేసిన ఘనత ప్రకాశ్‌కే దక్కుతుంది. వీరిద్దరిరాకతో తెలుగు సినిమాలో విప్లవాత్మకమైన మార్పులు, ప్రయోగాత్మక చిత్రాలకు తెరలేపినట్టయ్యింది. కెమెరా మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న సి పుల్లయ్య కాకినాడ పరిసరాల్లో ‘గోడమీద బొమ్మ’ పేరిట సినిమా నిర్మించి, ఆ సినిమాను తెరమీద కాకుండా గోడమీద ప్రదర్శించి సంచలనాన్ని సృష్టించారు. తను నిర్మించిన మరో సినిమా.. ఒక తెలుగువాడు తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం ఈ -్భక్తమార్కండేయ. ఇందులో సి పుల్లయ్య యముడిగా నటించగా, కాకినాడ రాజరత్నం (పరిచయం కథానాయక) మార్కండేయుడి తల్లిగా, మద్దురి బుచ్చన్నశాస్ర్తీ ‘మృకండ మహర్షిగా’ నటించారు. ఈ సినిమా 1925 డిసెంబర్‌లో విడుదలైంది. కాకినాడలోని ఒక సినిమా థియేటర్ నిర్మించారు. ఇప్పటికీ ఆ సినిమా థియేటర్ ఉండటం విశేషం.
టాకీయుగం ఆధ్యుడు
1931 నవంబర్ 1న మొదలైన టాకీ యుగానికి ఆద్యుడు హెచ్‌ఎమ్ రెడ్డి. ఈయన నిర్మించిన ‘్భక్తప్రహ్లాద’ సినిమా ద్వారా హిరణ్యకశిపుడు పాత్ర పోషించిన సుబ్బయ్యను కథానాయకుడిగా, సురభి కమలను కథానాయకిగా పరిచయం చేసి మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో కథానాయక నాయకిల జంటను ప్రవేశపెట్టారు. ఇదే సినిమా ద్వారా హాస్యరసాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఎల్‌వి ప్రసాద్, చిత్రపు నరసింహారావు హాస్య పాత్రలను పోషించిన ఈ చిత్రం బొంబాయిలో నిర్మితమైంది. తెలుగు సినీ నిర్మాణాన్ని బొంబాయి నుంచి మద్రాసు తరలించిన ఘనత మచిలీపట్నానికి చెందిన పివి దాసుకు దక్కుతుంది. ఇదే సమయంలో దాసు.. చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో బెజవాడ రాజరత్నం, కళ్యాణిలను పెట్టి ‘సీతాకళ్యాణం’ (1934) సినిమా నిర్మించారు. ఈ సమయంలో పురాణాల ప్రధాన ఇతివృత్తంగా ఎన్నో సినిమాలు నిర్మితమయ్యాయి. రంగస్థల నటుడు చిత్తూరి నాగయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య, సిఎస్‌ఆర్, కన్నాంబ ఈ పాత్రలకు జీవంపోశారు.
1936లో నిడమర్తి సూరయ్య దుర్గా సినీటోన్ స్టూడియో నిర్మించి కోడేరు రాజు, పుష్పవల్లిలతో ‘సంపూర్ణ రామాయణం’ సినిమా నిర్మించారు. ఇది తెలుగు గడ్డపై తీసిన మొదటి సినిమా. తర్వాత కొద్ది వ్యవధిలో రెంటచింతల, కమలాభాయిలతో ‘్భక్తజయదేవ’ నిర్మించారు. 1938లో మీర్జాపూర్ రాజా మద్రాస్‌లోని ఆళ్వార్‌పేటలో ఒక స్టూడియో నిర్మించి, జయాపిక్చర్ పేరుతో జరాసంధి సినిమా నిర్మించారు. తరువాత జయ స్టూడియో శోభనాచల స్టూడియోగా రూపాంతరం చెందింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంవలన సినిమాలు నిడివి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1945లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘పంతులమ్మ’, 1945లో తీసిన ‘స్వర్గసీమ’ కళాత్మక చిత్రాలు వొరవడికి పునాది వేసింది.
సంఘసంస్కరణల ప్రేరణ
అదే సమయంలో దేశం నలుమూలలూ వ్యాపించిన స్వాతంత్య్ర సంగ్రామపు సంఘ సంస్కరణోద్యమాల ప్రభావం తెలుగు సినిమానూ ప్రభావితం చేశాయి. ఆ సమయంలో విడుదలైన అనేక సినిమాలు దేశభక్తి, సాంఘిక ఇతివృత్తాలు ప్రధానాంశాలుగా వచ్చాయి. అవి భారత స్వాతంత్య్ర సమరపు రోజులు. అసమానత, మద్యపానం పట్టిపీడిస్తున్న రోజులు. అందుకే ఈ సమస్యలతో సాంఘిక చిత్రాలు తీశారు. 1936లో ప్రభల కృష్ణమూర్తి హీరోగా ‘ప్రేమ విజయం’ అనే సాంఘిక చిత్రాన్ని తీశారు.
తర్వాత కె సుబ్రహ్మణ్యం బాలయోగిని నిర్మించాడు. హెచ్‌ఎం రెడ్డి మద్యపానాన్ని దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి తీశారు.
నిరుద్యోగం ఇతివృత్తంగా 1939లో సి పుల్లయ్య ‘వరవిక్రయం’ తీస్తే, వితంతు వివాహాల సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని బియన్ రెడ్డి ‘వందేమాతరం’ తీశారు. వైవి రావు తీసిన ‘మళ్లీ పెళ్లి’, జమీందారీ రద్ద కోరుతూ రైతాంగ సమస్యలపై గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘రైతుబిడ్డ’, బియన్ రెడ్డి తీసిన సుమంగళి (1940).. ఇవన్నీ గొప్ప చిత్రాలుగా ఆనాటికీ ఈనాటికీ పరిగణింపబడుతున్నాయి.
అక్కినేని- నందమూరి
అక్కినేనిని ఘంటసాల బలరామయ్య పరిచయం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు తెరకు వీరి పరిచయం చాలా కాకతాళీయంగా జరిగింది. అక్కినేనిని రైల్వే ఫ్లాట్‌ఫారమ్ నుంచి వెండితెరకు తీసుకెళ్లిన ఘనత బలరామయ్యదే. ‘సీతారామజననం’ (1944)తో అక్కినేని తెలుగు సినీ పరిశ్రమలో తన శకాన్ని మొదలెట్టారు. ఐదేళ్ల తర్వాత ఎల్‌వి ప్రసాద్ పరిచయం చేసిన మరో హీరో -నందమూరి తారక రామారావు. ఆయన మొదటి సినిమా -మన దేశం. తెలుగు సినిమా పరిశ్రమకు మొదటిగా గాత్రాన్నందించింది ఎమ్మెస్ రామారావు. ఆ తర్వాత బాలరాజు సినిమాలో ఘంటసాల వెంకటేశ్వర రావు నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. తర్వాత కాలంలో తన గాత్రంతో తెలుగు సినీ రంగానికి
ఎంతో శోభను చేకూర్చారు. ఈయన తర్వాత వచ్చినవారిలో బాలసుబ్రహ్మణ్యం నేటికీ ప్రముఖ గాయకుడిగా కొనసాగుతున్నారు. ‘మల్లీశ్వరి’ (1951) ఘన విజయానికి కారణం సాలూరి రాజేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ఆ తర్వాత విడుదలైన పల్లెటూరి పిల్ల, సంసారం, దేవదాసులు గొప్ప హిట్టయ్యాయి.
స్వర్ణయుగం
‘సంసారం’ సినిమా హిట్ సాధించడంతో అక్కినేని మాత్రమే అటువంటి పాత్రలకు న్యాయం చేకూర్చగలరన్న నానుడి పడిపోయింది. ఈ సినిమా ద్వారా సావిత్రి చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. ఈమెకు ముందు భానుమతి, జి వరలక్ష్మి, అంజలీదేవి వంటివారు చలనచిత్ర సీమను శాసించారు. 1950-60 దశకాన్ని తెలుగు సినీ పరిశ్రమ స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఈ సమయంలో వచ్చిన సినిమాలు ‘స్ర్తి సాహసం’ (1950), పెళ్లిచేసిచూడు (1952), పక్కింటి అమ్మాయి, దేవదాసు, కన్నతల్లి (1953), దొంగరాముడు, అర్ధాంగి, అనార్కలీ, బంగారుపాప, రోజులుమారాయి (1955), మిస్సమ్మ (1956), మాయాబజారు, కుటుంబగౌరవం, పాండురంగ మహాత్యం, ఎంఎల్‌ఏ, తెనాలి రామకృష్ణ (1957), మాయింటి మహాలక్ష్మి (1959), మహాకవి కాళిదాసు (1960) ముఖ్యమైనవి.
పండిన హాస్యం
తెలుగు సినిమా హాస్యనటులలో ప్రముఖులు చిత్రపు, వంగర వెంకట సుబ్బయ్య, డా.శివరామకృష్ణ, లంక సత్యం, శివరావు, నల్లరామ్మూర్తి, బాలకృష్ణ, బి సీతారామ్, రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి, చదలవాడ, రాజబాబు ముఖ్యమైనవారు.
1970వ దశకం సినిమా రంగంలో జరిగిన ఎన్నో మార్పులకు ప్రత్యేక సాక్షి. ఈ దశకంలో ముఖ్యంగా తెలుగు సినిమా రంగంపై పాశ్చాత్య హిందీ సినీ ప్రభావం ఎక్కువగా వున్నాయని చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ స్థానంలో కలర్ ఫిల్మ్‌లు తయారయ్యాయి.
దిశమార్చిన దర్శకులు
1977లో విడుదలైన ‘అడవిరాముడు’ ఎంతోమంది దర్శకుల గమనాన్ని మార్చివేసింది. ఈ సినిమా ద్వారా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు కాలంలోనే అక్కినేని ‘క్లాస్’హీరోగా, నందమూరి ‘మాస్’ హీరోగా ముద్రపడ్డారు. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు సినీ హీరోలుగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు విడుదలయ్యాయి. ‘శంకరాభరణం’ తెలుగు ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్. ఈ ఘనత కె విశ్వనాథ్‌కు దక్కుతుంది.ఒ
1980 ఫిబ్రవరి 2న విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రం ఆ ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో సూపర్ హిట్ సినిమా. హైదరాబాద్ రాయల్ థియేటర్‌లో 216 రోజులు ప్రదర్శింపబడి అప్పట్లో రికార్డు సృష్టించింది.
ఎల్‌వి ప్రసాద్, తాతినేని ప్రకాశరావు, టి రామారావు, ప్రత్యగాత్మ వంటి దర్శకులు తర్వాత కె విశ్వనాథ్, దాసరి, జంధ్యాల, బాపు, రేలంగి నరసింహారావు, కోడి రామకృష్ణ, టి కృష్ణ వంటివారు తెలుగు సినిమాను కొత్త ఒరవడిలో నడిపించారు. ఆదుర్తి వారసుడిగా కె విశ్వనాథ్‌ను చెప్పుకోవచ్చు. బి నరసింగరావు ‘రంగులకల’ తెలుగు ‘ఆఫ్ బీట్స్’ సినిమాకు ప్రాణంపోసింది. 1960లో నిర్మితమైన సారధి స్టూడియోని 1962కు మద్రాసులో ముడి సరుకుల ప్రాబ్లం ఏర్పడటంతో చాలా బిజీ అవడంతో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు హైదరాబాద్‌కు తరలి వచ్చారు. దాంతో ‘సారథి స్టూడియో’ హైదరాబాద్‌లో పునర్నిర్మించారు. ఆ తర్వాత అన్నపూర్ణ, భాగ్యనగర్, రామకృష్ణ, పద్మాలయా స్టూడియోల నిర్మాణం జరిగింది. ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్‌సిటీ ఏర్పడింది. 1970-80 మధ్యకాలంలో దాసరి, రాఘవేంద్రరావు తమతమ బాణీల్లో హిట్ సినిమాలు అందించారు. అక్కినేని, నందమూరి, కృష్ణ, శోభన్‌బాబు తిరుగులేని హీరోలుగా చలామణి అవుతూవచ్చారు. అప్పట్లో హీరోయిన్‌గా వాణిశ్రీ నెంబర్‌వన్ స్థానంలోవుంటే, మిగతా స్థానాన్ని మంజుల, లత వంటివాళ్లు పూరించారు.
‘పదహారేళ్ల వయసు’తో శ్రీదేవి ట్రెండ్ మొదలైంది. సరిగ్గా అదే సమయంలో జయత్రయం రంగప్రవేశం చేశారు. జయప్రద, జయసుధ, జయచిత్రలు ఒక దశవరకూ జయప్రదమైన హీరోయిన్లుగా రాణించారు. ఆ తర్వాత ఉత్తర నాయికలు రంగప్రవేశం చేయడంతో హీరోయిన్లు ట్రెండ్ మారిపోయింది. హీరోయినే్ల వాంప్‌లైపోయారు. అర్థనగ్న నృత్యాలకు అలవాటయ్యారు. నటనకు ప్రాముఖ్యం తగ్గి గ్లామర్‌కు ఇంపార్టెన్స్ పెరిగింది.
తొలి సాంఘిక మూకీ
1931 మే 3న తొలి భారతీయ కథాచిత్రం మూకీ ‘రాజాహరిశ్చంద్ర’ విడుదలైన తర్వాత వరుసగా పురాణకథలే సినిమాలుగా వచ్చాయి. ఆ దశలో విదేశాల్లో సాంఘికాలు వస్తున్నాయని, మనమూతీస్తే ఎలా వుంటుందని ధీరన్ గంగూలి అనే దర్శకుడు మన దేశంలో తొలి సాంఘికం తీశాడు. 1921లో దాని పేరు ‘ఇంగ్లండ్ రిటర్న్‌డ్’. ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ పేరుతో ఆ చిత్రాన్ని కలకత్తాలో నిర్మించారు. సుశీలాదేవి అనే ఆమె ముఖ్య పాత్రధారిణి. కొన్ని పాత్రలు బ్రిటిష్‌వారు ధరించారు.

-కె శ్రీనివాసరావు