మెయిన్ ఫీచర్

తల్లిపాలలో రక్తమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు తల్లిపాలు చాలా మంచివి. ఇవి పిల్లల ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలను అందిస్తాయి. కానీ రొమ్ముపాలలో ఉపయోగం లేని వాటిని కూడా మీరు గుర్తించేవి కొన్ని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకటి రొమ్ముపాలల్లో రక్తం కనిపించడం. దీని గురించి ఎక్కువగా బాధపడక్కరలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చాలామంది స్ర్తిలలో ఇది చాలా సహజంగా కనిపిస్తుంది. సాధారణంగా పాలలో రక్తం కొన్నిసార్లు తెలీకుండానే వెళ్ళిపోతుంది. అది అతి తక్కువ మొత్తంలో రావచ్చు. కొన్నిసార్లు రొమ్ముపాలు గులాబి, ఆరంజ్, ఎరుపు, ఊదా రంగులో కూడా మారడం చూడొచ్చు. ఆ రంగులో మార్పు అనేది పిల్లాడు రక్తాన్ని బయటకు ఉమ్మినప్పుడు లేదా పాలు బయటకు కారినప్పుడు మాత్రమే మనం గుర్తించగలము. ఆ సమయంలో భయం కలుగుతుంది. ఇది సాధారణమే కానీ ఒకసారి తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి. సరైన రోగనిర్ధారణ, మూల కారణం తెలుసుకోవాలి. ఈ సమయంలో డాక్టరు సలహాతో తల్లిపాలను కొనసాగించవచ్చు. రొమ్ముపాలలో రక్తం కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
చనుమొనలు పగలడం
చనుమొనలు పగలడం లేదా చనుమొనల్లో పుండు వల్ల రొమ్ముపాలలో రక్తం కనిపిస్తుంది. చనుమొనలు ఎలా పగులుతాయి అంటే.. సాధారణంగా తల్లిపాలు తల్లి, బిడ్డ ఇద్దరికీ అసౌకర్యంగా ఉండవు. కానీ బిడ్డ సరిగా పట్టుకోకపోతే, చనుమొనలు పగిలి నొప్పులు వస్తాయి. కొన్ని సందర్భాలలో రక్తం కూడా రావచ్చు.
రస్టీ పైప్ సిండ్రోమ్
పేరుకు తగ్గట్లుగా రస్టీ పైప్ నుండి వచ్చే నీరు రంగు మారుతుంది. అదేవిధంగా పాల రంగు బ్రౌన్ లేదా ఎరుపు రంగులోకి మారతాయి. పాలు కారినప్పుడు లేదా మీ బిడ్డ రక్తంతో కూడిన పాలను బయటికి పంపినప్పుడు మాత్రమే అది మనం గమనిస్తాం. అది కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఇది సాధారణంగా మొదటి కాన్పు సమయంలో జరుగుతుంది.
పాడైన క్యాపిల్లరీలు
కొన్నిసార్లు రొమ్ములో ఉండే చిన్న నాళాలు దెబ్బతినొచ్చు లేదా పగలొచ్చు. సాధారణంగా ఇది పాలు ఇచ్చే సమయంలో జరుగుతుంది. పిల్లాడికి పాలు తాగించకుండా పాలు తీయడం అంటే చేత్తో పాలు పిండడం వంటివి కాబట్టి పాలు పిండే సమయంలో రక్తనాళాలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
అంతర్గత పులిపిరిలు
కొంతమంది స్ర్తిలకు పాల నాళాల కింద నిరపాయమైన కణితిలు ఉంటాయి. వీటివల్ల కూడా రక్తస్రావం కావచ్చు. రొమ్ముపాలలో రక్తం ప్రవహించవచ్చు. సాధారణంగా చనుమొనలు లేదా దాని పక్కన చిన్న చిన్న గడ్డల పెరుగుదల ఉంటుంది. ఇలాంటివారు వెంటనే వైద్యుడిని సంప్రదించి వాటిని చూపించాలి. అవి ప్రాణాంతకం అవునో, కాదో నిర్ధారణ చేసుకోవాలి.
మస్తిటిస్
మస్తిటిస్ అనేది పాలిచ్చే సమయంలో వచ్చే సాధారణ రకమైన రొమ్ము ఇన్‌ఫెక్షన్. ఇది పాలు ఇవ్వకపోయినా లేదా పిల్లాడు పాలు సరిగా తాగనపుడు వస్తుంది. ఉద్యోగం చేసే స్ర్తిలు సాధారణంగా ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. ఇలాంటి కేసుల్లో పాలు ఇచ్చేటప్పుడు రక్తంతో కలుషితమైన పాలను గుర్తించవచ్చు.
ఫైబ్రోసిస్టిక్
ముప్ఫై సంవత్సరాలు పైబడిన స్ర్తిలలో ఇది సాధారణంగా కనపడుతుంది. ఇది ఒకటి లేదా రెండు రొమ్ముల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ముప్ఫై సంవత్సరాలు పైబడిన తరువాత బిడ్డకు జన్మనిచ్చే స్ర్తిలలో రొమ్ము పాలు రక్తంతో కలుషితమవ్వొచ్చు. ఇలాంటివారు వెనువెంటనే డాక్టరును సంప్రదించడం మంచిది.
అంతేకాదు చనుమొనలు వంపుతిరిగే వ్యాధి కూడా కావచ్చు. కానీ ఇది కేవలం రెండు శాతం మందిలో మాత్రమే కనిపించే అత్యంత సాధారణ వైద్య పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పాలల్లో రక్తం కలిసి కలుషితమవుతుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. రక్తంతో కలిసిన రొమ్ము పాలకు కారణాలను చూశారు కదా.. ఇలాంటి పరిస్థితి కనిపించిన వెంటనే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి. *