మెయన్ ఫీచర్

గిరిజనులు హిందువులు కారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతాలు, కులాల పేరుతో ప్రజలను విభజించి సుదీర్ఘకాలం భారత్‌లో తమ పాలనను, దోపిడీని సాగించిన బ్రిటిష్ పాలకులు దేశం వదిలి 70 ఏళళు దాటినా, ఇంకా వారి మానసపుత్రుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఎటువంటి భౌగోళిక, చారిత్రక నేపథ్యం లేకుండా మతం ఆధారంగా దేశ విభజనకు పాల్పడి, సరిహద్దులలో నిత్యం విద్రోహ చర్యలు కొనసాగేటట్లు చేయడంలో బ్రిటిష్ వారు విజయం సాధించారు. దేశ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వవలసి రావడంతో ఇతర అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఉదాసీనత తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా మరో కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. 2021లో జరిగే జనాభా గణాంకాల సమయంలో 11 కోట్ల మంది గిరిజనులను హిందువులు గా కాకుండా, వివిధ స్థానికంగా గల ఆరాధనా పద్ధతు లను బట్టి వేర్వేరు మతాలుగా నమోదు చేయాలనే వాదన ఒకదానిని లేవదీస్తున్నారు. గిరిజనులను హిందువుల నుండి దూరం చేయడం కోసం బ్రిటీష్ వారి కాలంలోనే పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు అటవీ ప్రాంతాలకు పంపి, పెద్ద ఎత్తున మత మార్పిడులు సాగించి, హిందువులకు వారిని దూరం చేయడానికి ప్రయత్నించారు. నేడు ఈశాన్య రాష్ట్రాలలో చెలరేగిన తీవ్రవాద కార్యకలాపాలు అన్నింటికీ ఈ ప్రయత్నాలే మూలం.
తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించింది మధ్య ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా రవి శంకర్ శుక్లా. నేటి ఛత్తీస్‌ఘర్‌లో ఉన్న అటవీప్రాంతం జష్పూర్ వెళ్ళినప్పుడు క్రైస్తవ మిషనరీల ఆగడాలను ప్రత్యక్షంగా చూసారు. స్థానిక గిరిజనులు భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడాన్ని చూసారు. దానితో గిరిజనులను వారి ప్రభావం నుండి తప్పించడం కోసం ఆర్.కె. దేశపాండే అనే అధికారిని పంపారు. ఆయన ముఖ్యమంత్రి ప్రదవి నుండి వైదొలగ గానే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రైస్తవ మిషనరీలు వత్తిడి తీసుకొచ్చి ఆ అధికారిని బదిలీ చేయించారు.
దానితో ఆ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం స్థాపించి, గిరిజనులను దేశ విద్రోహ ప్రచారానికి దూరంగా ఉంచడం ప్రారంభించారు. ఆయనే తదుపరి కాలంలో బాలాసాహెబ్ దేశపాండేగా పేరొందారు. నేడు ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గిరిజనులలో జాతీయ భావాలను పెంపొందింప చేస్తూ, వారి సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, ఆర్థ్ధిక వికాసానికి పలు కార్యక్రమాలు జరుపుతున్నారు.
గిరిజనులు హిందువులు కారంటూ జరుపుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా వాస్తవానికి గిరిజనులే అసలైన హిందువులని కళ్యాణ్ ఆశ్రయం జాతీయ నాయకులు రామచంద్రయ్య స్పష్టం చేశారు. భారతదేశం మొత్తం ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేదని, అందుకనే భారతీయుల సంస్కృతిని అరణ్య సంస్కృతి అనేవారని గుర్తు చేశారు. రామాయణం, మహాభారత వంటి చరిత్రలు అన్నీ అటవీ ప్రాంతాల ఆధారంగా జరిగినవే కదా అన్నారు. క్రమంగా అడవులలో కొన్ని కుటుంబాలు చెట్లను నరికి ఇళ్ల్లు వేసుకోవడంతో గ్రామాలు రావడం, గ్రామాలు పెద్దవి అవి పట్టణాలుగా, నగరాలుగా పెరగడం జరిగాయని వివరించారు.
వాస్తవానికి హిందూ అనే పదం ఎప్పుడూ ఒక మతంగా భావించము. ఈ ప్రాంతంలోని ప్రజల జీవన శైలి, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక మూలాలకు సంబంధించిన పదం అది. దైవం, విగ్రహారాధన పట్ల విశ్వాసం లేని వారు కూడా హిందువులలో ఉన్నారు. ముక్కోటి దేవతలు ఉన్నారని, ఎవ్వరినైనా ఆరాధింప వచ్చని, ఆరాధింపక పోయినా ఫర్వాలేదని చెప్పే ఇటువంటి విశాలమైన జీవన విధానం మరెక్కడా కనిపించదు. అయితే ఒకే గ్రంథ, ఒకే దేవదూత, ఒకే మతం, ఒకే ప్రబోధం అంటూ భిన్నత్వ ఆలోచనలని ప్రశ్నించే వారు నేడు గిరిజనులు హిందువులు కాదనే వివాదం లేవదీస్తున్నారు.
ఒక విధంగా చూస్తే ధార్మిక విలువలు, నైతిక ప్రవర్తనలు ఇప్పటికే సజీవంగా, మరింత ధృడంగా గిరి జనులలోనే కనిపిస్తుంటాయి. ఒక వంక క్రైస్తవ మిషనరీ లు, మరో వంక జిహాదీ బృందాలు వారిని మత మార్పిడిలకు గురిచేయడం ద్వారా భారతీయ సమాజాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం దశాబ్దాలుగా ఎన్ని కుట్రలు జరుపుతున్నా ఎక్కువగా విజయం సాధించలేక పోతున్నాయ. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకుల అణచివేత చర్యలను మొదటగా ప్రశ్నించి, వారిపై పోరాటానికి కాలు దువ్వినది దేశంలోని వివిధ ప్రాంతాలలో గల గిరిజన నాయకులే కావడం గమనార్హం. తీవ్రమైన ప్రతిఘటన ఉద్యమాలు మొదటగా అటవీ ప్రాంతాల నుండే ప్రారంభం అయ్యాయి.
శ్రీరాముడు, శివాజీ, రాణాప్రతాప్ వంటి వీరులు గిరిజనులను సమీకరించుకొనే అజేయమైన సైన్యాలను నిర్మించారు. మన ప్రాంతంలో మన్యవీరుడిగా పేరొందిన అల్లూరి సీతారామరాజు గిరిజనులను సమీకరించే బ్రిటిష్ వారిపై వీరోచిత పోరాటాలు జరపడాన్ని చూసాము. ఇతిహాసాల కాలం నుండి భారతీయ ఆత్మతతో మమేక మవుతూ వస్తున్న గిరిజనులను హిందువులు కారంటూ విద్రోహపూర్వక వాదనలు లేవదీయడం దేశంలో విభజన వాదాలను రెచ్చగొట్టడం ద్వారా, దేశాన్ని బలహీనం చేసే ప్రయత్నంలో భాగంగానే భావించవలసి ఉంటుంది.
గిరిజనులకు మైదాన ప్రాంతాల ప్రజలలో వలే ఆధునిక విద్య అంతగా ఉండక పోవచ్చు. కానీ ప్రకృతికి దగ్గరలో సహజమైన జీవనం గడుపుతున్నారు. సాంప్ర దాయ విధానాలపై వారికి ఉన్న అవగాహన మహోత్తర మైనది. ప్రతి చెట్టులోని ఔషధాన్ని గుర్తించాలి అన్నా, గాలివాటు చూసి వర్షాలు, తుఫాన్‌లను ముందే గుర్తించా లి అన్నా వారి మేథస్సు అపారం.
ఎక్కడైతే విద్రోహ చర్యలను ప్రతిఘటిస్తున్నారో, మత మార్పిడులకు నిరాకరిస్తున్నారో, హింసాయుత పోరాటా లకు విముఖంగా ఉంటున్నారో అటువంటి చోట వారిపై హింస చెలరేగుతున్నది. తీవ్రవాదులు, మావోయిస్టులు వారిని బందీలుగా చేసుకొని తమ రాజకీయాలను వ్యాపింప చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న చోట ప్రభుత్వం కార్యకలాపాలు ఏవీ జరుగకుండా, గిరిజనులు చదువుకోకుండా అడ్డుకోవడం పలుచోట్ల చూస్తున్నాము.
బ్రిటీష్ వారి హయాంలోనే సిక్కులు, జైనులను హిందువులని కాకుండా, ప్రత్యేక మతాలుగా విభజిం చడం ద్వారా ఒక చిచ్చుపెట్టారు. వాస్తవానికి హిందువు లపై పరాయి శక్తుల నుండి జరుగుతున్న దాడులను ఎదుర్కొని, వారికి రక్షణ కవచంగా ఏర్పడినవారే సిక్కులు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరు అంటూ సిఖ్‌లను ఏర్పాటు చేశారు. ఒకే కుటుంబంలో ఒక సభ్యుడు సిఖ్‌గా ఉంటే, మిగిలిన వారంతా హిందువులుగా ఉండేవారు. అటువంటిది దానిని ఒక ప్రత్యేక మతంగా చూపుతున్నారు. నేడు గిరిజనులను సహితం ఆ విధంగా విభజించాలనే కుట్ర జరుగుతున్నది.
హిందువులు బలోపేతంగా ఉంటే తమ విద్రోహ కార్య కలాపాలు సాగవని వీరందరి భయం. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక పరిస్థితుల కారణంగా మన దేశంపై యుద్ధాలు జరిపి లేదా ఇక్కడ మతమార్పిడిలకు పాల్పడి భారతదేశాన్ని బలహీనం చేయలేమని గ్రహించారు. ప్రచ్ఛన్న యుద్ధంగా ఉగ్రవాదాన్ని ఆయధంగా ఉపయోగించడం కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితులు కనబడటం లేదు. అందుకనే ఇప్పుడు గిరిజనులను హిందువులకు దూరం గా చేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగుతున్న నిరసనలు సహితం ఈ సందర్భం గా ఒక వినూత్న ప్రయోగాన్ని వెల్లడి చేస్తున్నాయి. దేశ విభజన కాలంనాటి పొరపాట్లను సరిచేయడం కోసం, దాదాపు జాతీయ ఏకాభిప్రాయం ఉన్న ఈ చట్టం విషయంలో అర్థం లేని వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా లేవదీస్తున్నారు. ఒక మతం వారికి పౌరసత్వాన్ని రద్దు చేయడం కోసమే దీనిని తీసుకు వచ్చారనే దుష్ప్రచారం చేస్తున్నారు.
ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించడం ద్వారా రాజకీయ పన్నాగాన్ని దిగుతున్నారు. చివరకు చలిలో పిల్లలను సహితం నిరసనలకు తీసుకు వచ్చి, దారుణమైన నేరాలకు పాల్పడుతూ తమ దేశ విద్రోహకార ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లడం కోసం సరికొత్త భూమిక ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా వ్యూహా త్మకంగా జరుగుతున్నట్లు భావించవలసి వస్తున్నది.
మత ప్రచారం తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వాదించేవారు, అదే రాజ్యాంగం ప్రలోభాలు చూపి మత ప్రచారం జరపడాన్ని అంగీకరించదని మరచి పోతున్నారు. దైవం పట్ల ఎవ్వరు విశ్వాసం మార్చుకున్నా అభ్యంతరం ఉండటం లేదు. కానీ మత మార్పిడి పేరుతో ఈ దేశం పట్ల వారి అంకితభావం కూడా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం అటువంటి ప్రయత్నాలు ఈశాన్య రాష్ట్రాలలో కొంతమేరకు విజయం సాధించడం కారణంగా అక్కడ తీవ్రవాద విభజన ఉద్యమాలు చెలరేగడాన్ని చూసాము. వినూత్న రూపాలలో దేశ సమగ్రతను కాటేయడం కోసం వస్తున్న ప్రమాదాలను గుర్తెరికి తగు జాగ్రత్త వహించాలి.

- చలసాని నరేంద్ర