మెయిన్ ఫీచర్

సత్వగుణంతో అహం నాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
నిర్వికల్ప సమాధి స్థితిని పొంది అహంకారమును శీఘ్రముగా నశింపచేసికొనుట అంత సులభముకాదు. అందుచేత, బాహ్యదృష్టిగల పండితులకు కూడ అది అసాధ్యమని చెప్పబడినది.
344.
అహంబుద్ధ్యేవ మోహిన్యా యోజయిత్వావృతేర్బలాత్‌
విక్షేపశక్తిః పురుషం విక్షేపయతి తద్గుణైః॥
ఆత్మ నిర్వికారి, గుణరహితము. కాని అహంకారము, బుద్ధితో సంబంధము ఏర్పరచును. మాయారూపమైన ఆవరణశక్తి కారణముగా, విద్యావంతులలోను మోహము ఉత్పన్నమై తామసప్రవృత్తి చలరేగును. ఆవరణశక్తి వ్యాప్తిచెందగా రజోగుణరూపమైన విక్షేపశక్తి కోరికలను, సంకల్పాదులను రెచ్చగొట్టి జగద్భావమును పెంచును. ఈ విధముగా ప్రబలిన అహంకారము (అంతఃకరణ), జ్ఞానస్వరూపమైన ఆత్మను మఱుగుపరచును.
345. విక్షేపశక్తి విజయో విషమో విధాతుం
నిశే్శష మావరణశక్తి నివృత్త్యభావే
దృగ్‌దృశ్యయోః స్ఫుటపయోజలవద్విభాగే
నశే్యత్తదావరణ మాత్మని చ స్వభావాత్‌
నిస్సంశయేన భవతి ప్రతిబన్ధశూన్యో
విక్షేపణం న హి తదా యది చేన్మృషార్థే॥
ఆవరణశక్తి దేహములో వ్యాప్తిచెందగా, విక్షేపశక్తి దృఢమై విజయవంతవౌను. అందువలన, ఆవరణశక్తికి మూలమై తామసగణ ప్రవృత్తిని ప్రబలనీయక నిరోధించుకొనుటకే సాధకుడు యత్నముచేయుట ప్రధాన కర్తవ్యము. పాలు-నీరు కలిసిపోగా నీరును పాలనుండి వేరుచేయు లక్షణము కొన్ని హంసజాతులకు స్వభావసిద్ధముగా ప్రాప్తించును. అందువలన వాటికి మాత్రమే అది సాధ్యముకాని ఇతరులకు అసాధ్యము. ఆత్మ-అనాత్మలు, దృక్-దృశ్యములవలె పరస్పర విరుద్ధ్ధర్మములు కలవి. తామస రజోగుణముల ఆవరణ, విక్షేప శక్తులు ప్రబలిఉన్న స్థితిలో విద్యావంతులకు కూడ వాటిని వేరుపరచ శక్యము కాదు. తత్త్వజ్ఞానోపార్జనతో, సత్త్వగుణ సంపన్నులు అహంకార రహితులై, పరమహంసలవలె ఆత్మానాత్మలను వేరుపరచేశక్తిని సాధింతురు. మిథ్యాభూతమగు అనాత్మక విషయములందు మనస్సును ఎన్నడూ పోనీయక నిగ్రహించుకొనువారు మాత్రమే ఆత్మవేత్తలగుట సాధ్యము.
346. సమ్యగ్వివేకః స్ఫుటబోధజన్యో
విభజ్య దృగ్ దృశ్యపదార్థతత్త్వమ్‌
ఛినత్తి మాయాకృతమోహబన్ధం
యస్మాద్విముక్తస్య పునర్నసంస్కృతిః॥
సత్యానే్వషి సద్గురువునాశ్రయించి, వాని సుస్పష్టబోధనలతో ఛిన్నసంశయుడై, సమ్యక్‌జ్ఞానమును పొందును. ఆత్మానాత్మల యథార్థతత్త్వమును ఆకళించుకొనిన జ్ఞానవంతునకు, దేహమందు, ప్రపంచమందు మోహము నశించును. చిత్తశుద్ధితో ఆత్మానాత్మలను వేరుపరచే యోగ్యత సాధించి, ఆత్మనిష్ఠాపరాయణుడై సంసార బంధమును ఛేదించి మోక్షమును పొందును.
347. పరావరైకత్వవివేకవహ్నిః
దహత్య విద్యాగహనం హ్యశేషమ్
కిం స్యాత్ పునః సంసరణస్య బీజ
మద్వైతభావం సముపేయుషో‚ న్య॥
జీవేశ్వరుల ఏకత్వమును, అనగా పరుడైన ఈశ్వరుడు, అపరుడైన జీవి అభిన్నమనే నిర్ద్వంద్వ భావనతో పొందిన జ్ఞానము, అవిద్య అనే అరణ్యమును దహించివేయును. అద్వైతభావముతో బ్రహ్మైక్యత చెంది, ఆత్మసాక్షాత్కారము పొందిన బ్రహ్మజ్ఞానిలో సంసార బీజము నశించిపోవును. పునరావృత్తనమునకు హేతువైన సంసార బీజము నశించగా పునర్జన్మ ఉండదు.
‘‘సో‚ హం’’ ఇత్యాది శ్రుతివచనములపై ఆధారితమైనదే ‘‘జీవో న అపరః’’అనే అద్వైత వేదాంత సిద్ధాంతము. జీవేశ్వరుల ఏకత్వమును నిర్దేశిస్తున్న తైత్తరీయోపనిషత్తు, పరమాత్మను ఇసుమంత దూరము కూడా చేయవద్దని హెచ్చరిస్తున్నది (తై.ఉ.2-7). దీనినే తొలుత శ్లో.330లో ప్రస్తావించడమైనది.
348.
ఆవరణస్య నివృత్తి ర్భవతి చ సమ్యక్పదార్థదర్శనతః
మిథ్యాజ్ఞాన వినాశః తద్విద్విక్షేపజనిత దుఃఖ నివృత్తిః॥
సత్పదార్థమైన ఆత్మసాక్షాత్కారముతో మిథ్యారూపమైన దేహాత్మభావనకు కారణమైన తమోగుణముయొక్క ఆవరణశక్తి మరలిపోవును. అదే విధముగా, దుఃఖహేతువైన విక్షేపశక్తి కూడ అంతమగును.
‘‘రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమసః’’్ఫలం (రజోగుణము యొక్క ఫలము దుఃఖము, తామస గుణముయొక్క ఫలము అజ్ఞానము అని స్మృతి బోధిస్తున్నది (్భ.గీ.14-16).
ఇంకా ఉంది