మెయిన్ ఫీచర్

విజయం సాధించండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం మనసులో ఏది మనోసిద్ధితో అనుకుంటే అది సాధించే సత్తా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్య దశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెళ్లండి, చిన్ననాటి జ్ఞపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ! పాఠశాలలో జెండా పండగ రోజు నిర్వహించిన ఆటల పోటీలల్లో బహుమతిని సాధించిన తీయని జ్ఞాపకాలు మరువలేనివి. తరగతిలో మంచి మార్కులు సాదించడం, ఉద్యోగిగా ఉత్తమ అవార్డును సొంతం చేసుకోవడం- ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మన జీవితంలో చూసి ఉంటాం. విజయాల వల్ల డబ్బు, గౌరవం, పేరు ప్రతిష్ఠలు, కష్టానికి తగు ప్రతిఫలం సాధించామన్న తృప్తి కలుగుతాయి.
ప్రతి మనిషిలో వుండే ఆలోచన ఒక్కటే- విజయం సాధించాలి. అందరికీ విజయం సిద్ధిస్తుందా.. ఓటమి ఎదుర్కొనేవారు ఎవరూ విజయం అనే పదాన్ని గంభీరంగా ఉచ్చరించగానే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా.. ఈమధ్య తెలంగాణలో విఆర్‌ఓ ఉద్యోగం కోసం నిర్వహించిన రాత పరీక్ష కోసం 11 లక్షల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ విజయం చెంతకు వస్తుందా.. అందరిలో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంటుంది. ఉద్యోగాలకోసం, పైచదువులలో ఉన్నత అవకాశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలలో విజయం సాధించాలంటే ఏం చేయాలి.. ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి రోజుకు వున్న 24 గంటల్లో 20 గంటలపాటు తీవ్రంగా శ్రమించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. విజయం అంత సులభంగా లభించకపోవచ్చు కాని అసాధ్యమైందేమీ కాదు. కఠోర దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సరే మన సొంతం అవుతుంది.
లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి
విజయ సాధనలో ప్రధానమైనది ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించాలి. ఒకటి లేదా రెండు రోజులు ప్రయత్నిస్తే విజయం లభించడం కష్టం. లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అంతమాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి నుండి కూడా విజయం సాధించడానికి కావలసిన మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం సాధన దిశగా ముందడుగులు వేస్తూ ఉండాలి.
దృఢ సంకల్పం
ఎల్లప్పుడూ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి వుండాలి. మన మనసులో బలంగా నిర్ణయించుకోవాలి, విజయం సిద్ధించేవరకు వెనకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సాధ్యమైనంత మేరకు విజయం కోసం కష్టపడాలి. లక్ష్య సాధనకోసం నిరంతరం తపిస్తూ మన కృషి మనం చేస్తూ ఉండాలి.
భయాన్ని అధిగమించాలి
చాలామందిలో అమ్మో ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది. గతంలోని ఓటమిలు, వైఫల్యాలు మన మనసును భయపడేలా ఆలోచనలు వస్తూ వుంటాయి. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనుక దాగివున్న రహస్యాలను అవగాహన చేసుకోగలిగితే మనలో దాగివున్న సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో భయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఓటమికి భయపడాల్సిన పని లేదు. ఓటమితోటి విజయానికి మెట్లను ఏర్పరచుకోగలిగే స్థాయికి ఎదగాలి.
పట్టుదల, కృషి
ఇతరుల యొక్క వైఫల్యాలు మన విజయానికి గుణపాఠాలుగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క వైఫల్యాలపై తక్కువ ఆలోచించడం చేయాలి. ఆ వైఫల్యం వెనుక దాగి వున్న కారణాలను పరిష్కార మార్గం కోసం ఎక్కువగా కృషి చేయాలి. ఇతరులను నిందించడం మానేయాలి. మనలోని శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ లక్ష్య సాధనకోసం కృషి చేయాలి.
ప్రోత్సహించుకోవాలి
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి వుంటారు. మనలో వున్న నైపుణ్యాలను మనకు మనముగా ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మనలో లేని నైపుణ్యాలను ఇతరులలో గమనించినపుడు అసూయ పడకుండా మన మనసుకు తగు సూచనలను జారీ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో వున్న సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని దృఢపరచుకోవాలి.
ఇపుడే ప్రారంభించాలి
విజయ సాధనలో చివరి ప్రయత్నం అనే మాట దరిచేరనీయకూడదు. విజయం సాధించడానికి పనిని ప్రారంభించడానికి నిర్దిష్ట సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో పనిని ఈ సమయంలోనే ఇపుడే ప్రారంభించాలి. సరైన మార్గదర్శకత్వం కోసం ఒక్క మెంటారును ఎంచుకోవాలి.
విశ్రమించరాదు
లక్ష్యసాధనలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకోవాలి. సాధించిన వ్యక్తుల యొక్క స్టోరీలను చదవాలి. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. లక్ష్యసాధనకు ప్రణాళికలను ఏర్పరచుకోవాలి. అభ్యాసనను తీవ్రతరం చేయాలి. ఫలితం గురించి ఆలోచనలు చేయకూడదు. విజయ సాధన కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకుండా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళితే విజయం సొంతం అవుతుంది. ఎన్ని రకాల అపజయాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు. మిమ్మల్ని చూసి విజయం కూడా భయపడి మీ దగ్గరకు చేరేలా పట్టుదలతో కృషిచేయండి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321