మెయిన్ ఫీచర్

బంధవిముక్తి..పరమశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అధిష్ఠాన నిరూపణము
349.
ఏతత్త్రితయం దృష్టం సమ్యగ్రజ్జుస్వరూపవిజ్ఞానాత్‌
తస్మాద్వస్తుసతత్త్వం జ్ఞాతవ్యం బన్ధముక్తయే విదుషా॥
రజ్జుస్వరూపమును యథాతథముగా తెలుసుకొనుటవలన అజ్ఞాన కారణంగా రజ్జువుయందు కలిగిన ఆవరణ (అధ్యాస) నివృత్తి, సర్పమనే అపోహ, తద్భ్రాంతివలన పొందిన భయాందోళన అనే మూడునూ ఎట్లు అంతమైనవో ఇచ్చట పునఃఉద్ఘాటించబడినవి. బంధవిముక్తిని ఆశించే విద్వాంసుడు, సమ్యగ్విచారణతో క్షుణ్ణముగా ఆత్మానాత్మల వస్తుతత్త్వాన్ని తెలిసికొనవలెను. యథార్థజ్ఞానము కలగనిదే కైవల్యసిద్ధి లభించదు.
350. అయో‚గ్నియోగాదివ సత్యమన్వయా
న్మాత్రాదిరూపేణ విజృమ్భతే ధీః
తత్కార్యమేతత్త్రితయం యతో మృషా
దృష్టం భ్రమస్వప్నమనోరథేషు॥
కొలిమిలో మండుతున్న అగ్నిసంబంధముతో ఇనుప వస్తువులు ప్రకాశించే గుణము లేకపోయినా మండుతున్నట్లు కన్పించును. అదే విధముగా, జడరూపమైన బుద్ధిలో ఆత్మ ప్రతిబింబము ప్రసరించగా బుద్ధి, ప్రమాతృ, ప్రతితి, ప్రమేయమనే త్రిపుటి రూపంలో విజృంభిస్తున్నది. బుద్ధి, ప్రమాతృ కాజాలదు. ఎందువలననగా, బుద్ధికి స్వతఃసిద్ధముగా తెలిసికునే శక్తిలేదు. ఆత్మశక్తితోనే బుద్ధి ప్రకాశవంతవౌతున్నదని ఇంతకు పూర్వము కూడ తెలియజేయడమైనది. భ్రమ ఉత్పన్నవౌటకు, స్వప్నములోని అనుభవములకు, ఊహస్రవంతికి, (మనోరథములకు) బుద్ధే కారణము. ఆత్మ ప్రతిబింబముతో ప్రకాశవంతమై బుద్ధిగుహలో జరుగుతున్న కార్యము అవాస్తవికము కేవలము మృష.
351. తతో వికారాః ప్రకృతే రహంముఖఆః
దేహావసానా విషయాశ్చ సర్వే
క్షణే‚ న్యథాభావిన ఏష ఆత్మా
నోదేతి నాప్యేతి కదాపి నాన్యథా॥
బుద్ధియొక్క కార్యములు మిథ్యారూపములు. అహంకారము మొదలు స్థూలదేహము వరకు సమస్తము ప్రకృతి వికారములే. వేటికిని నిత్యత్వములేదు. పరిణామము చెందే స్వభావము కలవే. ఆత్మ ఒక్కటే సద్వస్తువు; వికార రహితము ఎట్టి పరిణామములు చెందదు మరియు జనన మరణములు లేనిది. అందువలన, సద్వస్తువులవలె జగత్తులో భాసిస్తున్న అసద్వస్తువులన్నిటినీ మిథ్యగానే పరిగణించవలెను. విరము పొందునవి, నాశనమయేవి సత్పదార్థములు కావు.
352. నిత్యాద్వయాఖన్దచిదేకరూపో
బుద్ధ్యాది సాక్షీ సదసద్విలక్షణః
అహంపద ప్రత్యయ లక్షితార్థః
ప్రత్యక్సదావన్దఘనః పరాత్మ॥
నిత్యము, అద్వితీయము, అఖండ జ్ఞాన స్వరూపము, బుద్ధ్యాదులకు సాక్షీభూతము, సత్-అసత్తులకు విలక్షణమైన ప్రత్యగాత్మ, అహం ప్రత్యయముతో (నేను అని) లక్షణావృత్తిచే నిర్దేశింపబడుతున్న సదానంద ఘనమైన పరమాత్మ స్వరూపము.
జీవాత్మ స్వరూప లక్షణములు తొలుత శ్లో.295 మరియు 296లో వివరించబడినవి.
353 ఇత్థం విపశ్చిత్ సదసద్విభాజ్య
నిశ్చిత్య తత్త్వం నిజబోధ దృష్ట్యా
జ్ఞాత్వా స్వమాత్మాన మఖన్డబోధం
తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి॥
విజ్ఞానవంతుడు తన విచారణశక్తితో సద్రూపమైన ఆత్మను, అసత్పదార్థములైన దేహాదలనుండి స్వానుభవముతో వేరుపరచే సమర్థతను పొందుతాడు. అజ్ఞానము శేషరహితంగా నశించగా, ఆత్మ యథార్థ స్వరూపమును తెలిసికొని, అఖండ జ్ఞాన స్వరూపమైన తన ఆత్మను స్వయముగా దర్శించుకొని, మోక్ష ప్రతిబంధకములైన సమస్త వాసనలనుండి ముక్తుడై, పరమశాంతిని అనుభవించును.
సమాధి నిరూపణము
354.
అజ్ఞాన హృదయగ్రనే్థ ర్నిశే్శషలయస్తదా
సమాధినా‚ వికల్పేన యదా‚ ద్వైతాత్మదర్శనమ్‌॥
నిర్వికల్ప సమాధిలోనుండగా, ఎప్పుడు అద్వైతభావనతో ఆత్మసాక్షాత్కారవౌనో, అప్పుడు అజ్ఞానమునకు కారణమైన హృదయగ్రంధి విడిపోయి, పరబ్రహ్మములో లయమైపోవును.
355. త్వమహ మిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్
ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే
ప్రవిలసతి సమాధావస్య సర్వో వికల్పః
విలయన ముపగచ్ఛేద్వస్తు తత్త్వావధృత్యా॥

ఇంకా ఉంది