మెయిన్ ఫీచర్

యోగసాధనతో జయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
367. అతః సమాధత్స్వ యతేంద్రియః సన్
నిరన్తరం శాస్త మనాః ప్రతీచి
విధ్వంసయా ధ్వాన్త మనాద్యవిద్యయా
కృతం సదేకత్వ విలోకనేన
తత్త్వజ్ఞానము పొందుటకు ఎల్లప్పుడు ఇంద్రియ నిగ్రహము కలవాడై నీవు ప్రశాంత మనస్సుతో ప్రత్యగాత్మలో నీ మనస్సును లయము చేసి, సత్స్వరూపమైన ఆత్మసాక్షాత్కారమును పొందుము. సంసార బంధమునకు కారణమైన అనాదియైన అవిద్య కార్యమైన అజ్ఞానాంధకారమును నాశనము చేసికొనుము. అజ్ఞానాంధకారము నశించగా నీవు బ్రహ్మజ్ఞానివై శోభిల్లెదవు.
368. యోగస్య ప్రథమం ద్వారం వాజ్నిరోధో పరిగ్రహః
నిరాశా చర నిరీహ చ నిత్య మేకాన్తశీలతా
యోగత్వ సిద్ధికి ప్రథమ ద్వారము వౌనమాచరించుటక, తదనంతరము శరీర స్థితిని నిల్పుకొనుటకు నియమిత ఆహారము స్వీకరించి ఇతర భోగసాధములన్నింటిని త్యజించి వైరాగ్య ప్రవృత్తిని అవలంభించుట అని ప్రస్తావించబడినది. యోగి కర్మలందు ఆసక్తిని విడచి, క్రియాశూన్యుడై, నిర్జన ప్రదేశములో ఏకాంత వాసము చేసిన బాహ్యవృత్తులో నిరోధమును తప్పక సాధించును.
369. ఏకాన్తస్థితిరింద్రియోపరమణే హేతుర్దమశే్చతసః
సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా
తేనానన్దర సానుభూతిరచనా బ్రాహ్మీ సదా యోగినః
తస్మాచ్చిత్తనిరోధ ఏవ సతతం కార్యః ప్రయత్నాన్మునేః
నిర్జన ప్రదేశములో వాసము, బాహ్యేంద్రియ వ్యాపారము ఊరడించుటకు (నివృత్తికి) కారణము. బాహ్యేంద్రియములైన వాగాది పంచ కర్మేంద్రియములు, శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రయముల నిగ్రహమే దమము. అంతరేంద్రియ నిగ్రహమైన శమము, అహంకారమును నశింపజేయును. శమదమాదులను యోగ సాధనతో జయించి, శాంతి చిత్తుడైన ఆత్మజ్ఞాన పరాయణుడు, బ్రహ్మనిష్ఠతో ఆనంద రసానుభూతిని నిరంతరము పొందును. అందువలన, బాహ్యేంద్రియ నిగ్రహముతో పాటు, చిత్త సంయమనము కొరకు వౌనస్థితిలో, మననములో నిమగ్నమై ఉండుటయే ముని కర్తవ్యము.
370. వాచం నియచ్ఛాత్మని తం నియచ్ఛ
బౌద్దౌ ధియం యచ్ఛ చ బుద్ధిసాక్షిణి
తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే
విలాప్య శాన్తిం పరమాం భజస్వ
వాగింద్రియమును మనస్సులో నిరోధించుటకు వౌనము పాటించుము. బుద్ధియందు, మనస్సును నిల్పి, బుద్ధినాశ్రయించి కేవలము సాక్షిగా వ్యవహరించే స్వస్వరూపమైన ప్రత్యగాత్మలో విలీనము చేయుము. తదనంతరము, నిర్వికల్ప సమాధి స్థితిలో పూర్ణాత్మను నిర్గుణ పరబ్రహ్మమందు లయము చేసి పరమశాంతిని ప్రసాదించే ముక్తిని పొందుము.
ఈ శ్లోకములో భగవత్పాదులవారు, మనోబుద్ధ్యాదుల నిగ్రహముతో పరమ శాంతిని ఎట్లు పొందసాధ్యమో శిష్యునకు బోధించుటకు, కఠోపనిషత్తులోని శ్రుతిని, స్వల్ప పద వ్యత్యసముతో అనుకరించడమైనది. శ్రుతి ఇట్లు విన్పిస్తున్నది-
‘యచ్ఛేద్‌వాఙ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని
జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్ తద్యచ్ఛేచ్చాంత ఆత్మని
ప్రాజ్ఞుడు వాక్కును మనస్సులో విలీనం చేసి, తదుపరి బుద్ధిని జ్ఞానస్వరూపమైన ఆత్మయందు విలీనము చేసి, అటుపైన ఆత్మను శాంత స్వరూపమైన నిర్గుణ పరబ్రహ్మమందు విలీనము చేయును.
371. దేహప్రాణేంద్రియ మనోబుద్ధ్యాదిభిరుపాధిభిః
యైర్యైర్వృత్తేః సమాయోగః తత్త్ధృవో‚ స్య యోగినః॥
372.
తన్నివృత్త్యా మునేః సమ్యక్ సర్వోపరమణం సుఖమ్‌
సందృశ్యతే సదానన్దరసానుభవ విప్లవః॥
దేహము, ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆనందమయ కోశము వీటిలో దేనితో అహంకారమునకు సంపర్కము కలిగినా, ఆ ఉపాధితో తాదాత్మ్య అనుబంధము ఏర్పడును. నీలపీతాదిపుష్పముల సంపర్కముతో, స్వచ్ఛమైన స్ఫటికపూస ఆ యా రంగులలో కన్పించునట్లు, అహంకారము వాటి ఆచ్ఛాదనతో తాదాత్మ్యము చెందుచున్నది. ఆ విధముగనే, ఉపాధి యొక్క ధర్మములు ఆత్మకు సంక్రమిస్తున్నవి. అందువలన, సమస్త క్లేశములనుండి విముక్తి పొందుటకు ఆత్మజ్ఞాన సాధకులైన మునులు, ముందుగా జడములైన ఆత్మేతరములను, సద్రూపమైన ఆత్మనుండి, వేరుపరచి వాటిని నిరాకృతి చేయవలెనని పునరుద్ఘాటింపబడినది.
ఇంకా ఉంది