మెయిన్ ఫీచర్

ఎంపిక చేసుకునే ఆహారమే.. రాబడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోషకాహార లోపాలు మానవాళికి అనేక రకాల చెడును చేస్తాయి. ఆహారం సమపాళ్ళలో లేకపోతే బాల్యం నుంచి వయోజనుల వరకు అందరికీ నష్టమే.. మన దేశంలో ఎదుగుదల ఆగిపోయి గిడసబారిన పిల్లల శాతం 1980వ దశకంలో 66.2 శాతం ఉండగా, ఇప్పుడది 35 శాతానికి తగ్గిపోయింది. గడచిన కొన్ని దశాబ్దాలలో ప్రతి ఏటా 1 శాతం చొప్పున తగ్గుతూ పోవడంవల్ల ఇపుడు ఆ స్థాయికి చేరింది. పిల్లల్లో పౌష్టికాహారం తగ్గుదల వల్ల వృద్ధి లోపాలు రెండు రకాలు. వారి వయస్సుకు అనుగుణంగా ప్రమాణాల మేరకు పొడుగు పెరగకుండా గడిసబారిపోవడం మొదటిది. వారి ఎత్తుకు సరితూగే విధంగా ఉండాల్సినంత బరువు ఉండకుండా పీలగా ఉండటం రెండవది. ఇపుడు పిల్లలు పొడుగు పెరగకపోవడం, తగినంత బరువు లేకపోవడం మన దేశం ఎదుర్కొంటున్న ప్రజారోగ్యానికి సంబంధించిన ఆందోళనకర అంశాలు కాగా మరోవైపు పిల్లల్లో వయసుకు మించిన అధిక బరువు ఉండటం ఇండియాలో మహమ్మారిలా వ్యాపిస్తోంది. దానివల్ల మధుమేహం, హృద్రోగం వంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. భారతదేశంలో 2016 సంవత్సరంలో జరిగిన మరణాలలో 28.1 శాతం మంది హృద్రోగాలవల్లనే మరణించగా మరో 14.1 శాతం మంది అనారోగ్యం, అంగవైకల్యంవల్ల పూర్ణారోగ్యంతో లేక రోగాలతో తీసుకుంటూ ఉండి లేక చిన్న వయసులో చనిపోవడం జరిగింది. రెండింటిలో కూడా గుండెటువల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గుండెపోటువల్ల 61 శాతం మంది మరియు చాలాకాలం తీసుకొని ఆఘాతంవల్ల 25 శాతం మంది మరణించారు. ఇక రిస్క్ విషయానికి వస్తే అనారోగ్యకర ఆహారంవల్ల రక్తపోటు పెరుగుదలకు, రక్తంలో చక్కెర శాతం పెరగడానికి, కొవ్వు శాతంలో వ్యత్యాసాలు, ఊబకాయం మరియు గుండెపోటు వచ్చే రిస్క్ పెరగడం, అఘాతాలు మరియు మధుమేం వంటి ఇబ్బందులకు దారితీస్తుందని 2016లో రోగ లక్షణాలపై జరిగిన విశే్లషణలో తేలింది.
బాల్యంలో గిడసబారిపోవడం, పెద్దయ్యక మధుమేహం, హృద్రోగం వంటివి చాలా భిన్నమైనవి అయినప్పటికీ ఇద్దరి సమస్యలకు మూలం కూడా తీసుకునే ఆహారమే. వాటి పుట్టుక ఒకే విధమైంది.
పళ్ళు, కూరగాయలు తక్కువగా తీసుకోవడంవల్ల విటమిన్లు, ఖనిజాల వంటి సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడుతుంది. పిల్లలు గిడసబారిపోవడం మరియు వయోజనులలో మధుమేహం, శోథ, తాపం, వ్రణాల వంటి ప్రతిఘాతుక సమస్యలకు దారితీయడానికి, గుండె జబ్బులు రావడానికి సూక్ష్మ పోషకాల లోపమే కీలకం. పిల్లలు ఏపుగా ఎదగడానికి మరియు గిడసబారిపోకుండా అడ్డుకోవడానికి, జీవన చక్రంలో రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు లేకపోవడం, తగ్గిపోవడం జరిగితే ఏపుగా ఎదుగుదల, రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడటంపై ప్రభావం చూపుతుంది. దానివల్ల పత్యక్షంగా జీవనక్రియ సంబంధమైన అంశాలపైన లేక పరోక్షంగా శరీరంలో శోథ, మంట పెరుగుతాయి. అది వాపులు, నొప్పులకు దారితీస్తుంది. అంతేకాక ఆహారంలో పళ్ళు, కూరగాయలు తీసుకోవడం తగ్గిపోతే గ్రహణశక్తి, నేర్చుకునే శక్తి మరియు జ్ఞాపకం ఉంచుకోవడంపై ప్రభావం పడుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే పళ్ళు, కూరగాయలు, పప్పులు / పలుకులు, పూర్ణ ధాన్యాలలో వున్న సూక్ష్మ పోషకాలు మరియు పాదప పోషకాలు ఎన్నో జీవక్రియ సంబంధ అంశాలపై ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాక ఆహార నాళాలలో సూక్ష్మ జీవులను నియంత్రించడం ద్వారా శరీరంలో శోథ, మంటను అదుపులో ఉంచుతాయి. మధుమేహం వంటి అనేక సమస్యల పుట్టుకకు శరీరంలో మంట మూలం. మనం తీసుకునే ఆహారంవల్ల సూక్ష్మజీవులు త్వరత్వరగా మారిపోతుంటాయి. అంటే మనం తీసుకునే ఆహారం, వాటిని పూర్తిగా ప్రభావితం చేస్తుందన్నమాట. జన్యువుల వైఖరిని మరియ జీవక్రియ పద్ధతులను పేగులలో వుండే సూక్ష్మజీవులు నియంత్రిస్తాయి. పళ్ళు, కూరగాయలు, పప్పులు/ పలుకులు మరియు పాలు / పెరుగు / పులియబెట్టిన కూరగాయలు వంటి పులిసిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తగిన మోతాదులో తీసుకున్నట్లయితే ఆహార నాళాలలో శరీర వృద్ధికి, వికాసానికి తోడ్పడే సూక్ష్మజీవులు పెరిగి మంచి భౌతిక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. పళ్ళు, కూరగాయలు మరియు కాయల నుంచి సూక్ష్మ పోషకాలకు మంచి వనరులు. వాటినుంచి యాంటీ ఆక్సిడెంట్స్, పాదప పోషకాలు, పీచు మరియు జీవక్రియకు తోడ్పడే సమ్మేళనాలు కూడా ఉత్పన్నమవుతాయి. మంచి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వయోజనులు ప్రతి రోజు 500 గ్రాములు, ఏడాది నుంచి ఆరేళ్ళ మధ్య వయసుగల పిల్లలు రోజుకు 200 నుంచి 250 గ్రాములు పళ్ళు, కూరగాయలు తినాలని భారత వైద్య పరిశోధనా మండలి- జాతీయ పౌష్టికాహార సంస్థ సిఫార్సు చేస్తున్నాయి. అయితే దేవంలో అధిక సంఖ్యాకులు రోజుకు సిఫారసు చేసిన స్థాయికన్నా తక్కువ మొత్తంలో పళ్ళు, కూరగాయలు తీసుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలకు చెందిన పిల్లలు తీసుకునే పళ్ళు, కూరగాయలు మొత్తం సిఫార్సు చేసిన స్థాయితో పోల్చినపుడు చాలా తక్కువగా తీసుకుంటున్నారని జాతీయ పోషకార సంస్థ జరిపిన సర్వేలు సూచిస్తున్నాయి.
ఒకటి నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల గ్రామీణ ప్రాంతాల పిల్లలు రోజుకు 50 గ్రాములకన్నా తక్కువ పళ్ళు, కూరగాయలు తీసుకుంటున్నారు. వారితో పోల్చినపుడు పట్టణాలకు చెందిన పిల్లల పరిస్థితి కొంత మెరుగ్గా వున్నప్పటికీ వారుకూడా సిఫారసు చేసిన స్థాయికన్నా తక్కువ మొత్తంలో పళ్ళు, కూరగాయలు తీసుకుంటున్నారు. గ్రామీణ వయోజనులు కూడా రోజుకు 160 గ్రాములకన్నా ఎక్కువ పళ్ళు, కూరగాయలు తీసుకోవడం లేదు. పట్టణాలలో నివసించే వయోజనులు కూడా రోజుకు కేవలం 185 గ్రాముల పళ్ళు, కూరగాయలు తింటున్నారని జాతీయ నమూనా పరీక్షల సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాలు సూచిస్తున్నాయి. ఊహించిన విధంగానే అనారోగ్యకర ఆహారం, ఆహారంలో వైవిధ్య లేమివల్ల అసంక్రమిత వ్యాధులే కాకుండా ఊబకాయం, అధిక బరువు వంటివి కూడా అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాలలో కూడా పెచ్చుపెరిగిపోతున్నాయి. అసంక్రమిత వ్యాధులు పెరగడంతోపాటు, నిరంతర రక్తహీనత మరియు అధిక స్థాయిలో గిడసబారడం వంటివి మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల జరుగుతుంటాయి. భారతావని జనాభాలోని పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాలు (ఖర్చు భరించగలిగిన పేదవారు) మధుమేహం, గుండెపోటు, అఘాతలు, క్యాన్సర్ మొదలగు అసంక్రమిత వ్యాధుల బారిన పడే ప్రమాదం వుంది.
తగినన్ని సూక్ష్మ పోషకాలు మరియు నాణ్యమైన ప్రొటీన్లు మరియు కొవ్వును పొందడానికి ఐసిఎంఆర్- ఎన్‌ఐఎన్ సిఫార్సుల మేరకు రోజుకు కనీసం 8నుంచి 10 ఆహార శ్రేణులకు చెందిన (ఆహార వైవిధ్యం) పదార్థాలను తినాలి. రోజూ మనం పొందే కేలరీలలో కనీసం 30 వాతం వరకు పళ్ళు, కూరగాయలు, పప్పులు / పలుకులు మరియు పులియబెట్టిన పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. ఆహార వైవిధ్యం పాటించడంవల్ల సూక్ష్మ పోషకాలతోపాటు అత్యవసరమైన అమీనో ఆమ్లాలు, అత్యవసర కొవ్వు ఆమ్లాలు పిల్లలలో మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మరియు వృద్ధికి తోడ్పడుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం కుటుంబ ఆదాయాన్ని పెంచడమే కాక (అనారోగ్యం తగ్గుదలవల్ల) స్థూల దేశీయోత్పత్తిని కూడా పెంచుతుంది.
అంతేగాక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహార వైవిధ్యం పళ్ళు, కూరగాయలు, పలుకులు, పులిసిన పాల ఉత్పత్తులు లేని అనారోగ్యకర భోజనం వల్ల అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు (లోపలినుంచి కొవ్వు) పేరుకుపోతుంది. సాధారణ జీవ పదార్థ సూచిక వున్నవారిలో కూడా లోపల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. కాలేయం దగ్గర కొవ్వు నిక్షేపాలు, కడుపులోని అవయవాల చుట్టూ కొవ్వుకణజాలం (లోపలి నుంచి కొవ్వు) పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల అధిక బరువు, ఊబకాయం కన్నా ఎక్కువగా అసంక్రమిత వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక్కడ స్పష్టమవుతున్న అసంబంధమైన అంశం ఏమిటంటే ఆరోగ్యకర ఆహారానికి దూరంగా ఉండటంవల్ల లోపలి నుంచి కొవ్వు పెరగడం, బాల్యంలో ఎదుగుదల లేకుండా గిడసబారిపోవడం, రక్తహీనత, అసంక్రమిత వ్యాధుల ముప్పు వంటివి పొంచి ఉంటాయి.
- డా. ఆర్. హేమలత
డైరెక్టర్, భారత వైద్య పరిశోధనా మండలి