మెయిన్ ఫీచర్

భయం వీడితే... విజేత మీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసులో కూర్చుని ఆనందరావు కునికిపాట్లు పడుతున్నాడు. చిన్న చప్పుడైతే చాలు కళ్లు తెరిచి పనిలో పడుతున్నాడు. నాలుగు లైన్లు కంపోజ్ చేస్తున్నాడో లేదో మళ్లీ కళ్లు మూతలుపడుతున్నాయి. సాధారణంగా ఆఫీసు పనిలో ఉన్నపుడు పని తప్ప మరో ధ్యాసలేని ఆనందరావుకు ఇంతలా కునికిపాట్లు రావటానికి కారణమేమిటంటే ఆయన కొడుకు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నాడు. ఆ పిల్లాడ్ని రాత్రి 12 గంటలదాకా చదివించాలంటే కొడుకుతో పాటు ఆనందరావు కూడా నిద్ర మేల్కొని కూర్చుంటున్నాడు. అసలు సంగతి అందరికీ ఎరుకే కాబట్టి ఆనందరావు కునికిపాట్లను తోటి ఉద్యోగులు పట్టించుకోవటం లేదు. నిజమే ఇది పరీక్షల సీజన్. పిల్లలకే కాదు పెద్దలకు కూడా. ఎందుకంటే వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివిస్తుంటే ర్యాంకు రాకపోతే తోటివారి ఎదుట అవమానకరం. ర్యాంకుల చట్రంలో పిల్లల్ని ఇరికించేసి సానపట్టకపోతే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేని పరిస్థితి. అందుకే ‘‘నేను నిద్రపోను.. నిన్ను నిద్రపోనివ్వనూ’’ అన్నట్లుగా ఆనందరావులాంటి తల్లిదండ్రులు రాత్రంతా జాగారం చేస్తున్నారు.
పరీక్షలు అనగానే టీవీల్లో జాతకాలు చెప్పేవారు, కౌనె్సలర్లు ఒకరేమిటి అందరూ కూడా తమ శక్తి మేరకు దండుకునేందుకు అరటికాయ ఒలిచి చేతిలో పెట్టినట్లు ఈ మంత్రం జపించండి, ఇలా చదవండి ర్యాంకు గ్యారంటీ అంటూ ప్రచార జోరు ఆరంభించేశారు.
తల్లిదండ్రుల ఒత్తిడి, ఈ ప్రచార జోరు చూస్తుంటే సహజంగా పిల్లలకు పరీక్షలంటే ఒక రకమైన భయం ఏర్పడుతోంది. దీంతో పరీక్ష రాయాలంటేనే భయం. నిశ్శబ్ధమైన పరీక్ష హాలు..చండశాసనుడులాంటి ఇన్విజిలేటర్, చక చక రాసేస్తున్న ఇతర విద్యార్థులు.. ఇలా ఓ ఊహా చిత్రం వారి మనసులో మెదులుతుంది.
ఒక్కసారిగా ఇలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే ఇక పరీక్షహాలులో పెన్ను మొరాయిస్తుంది. దీంతో పరీక్ష సరిగా రాయలేక పోయినట్లు తోటి విద్యార్థుల హేళన, తల్లిదండ్రుల తిట్ల దండకం మనసులో మెదిలి చాలా మంది సున్నిత హృదయులు ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తున్నాం. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు. అది మన మనసులోనే ఉంది.
పరీక్షలంటే భయపడకూడదు అని చెప్పుకుంటే సరిపోదు. మనసు భాష మనసుకే అర్ధమవుతోంది. ముందు మీ మనసులో అందమైన పూదోటను ఊహించుకోండి. అపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఆ తరువాత పరీక్ష హాలులో మీరు చకచక రాస్తున్నట్లు, మిమ్మల్ని చూసి తోటి విద్యార్థులు, ఇన్విజిలేటర్ కూడా ఆశ్చర్యపోయినట్లు, మంచి ర్యాంకు సాధించిన మిమ్మల్ని మీడియా ఇంటర్యూ చేస్తున్నట్లు ఊహించుకున్నారంటే మీలో పరీక్ష అంటే ఉండే కొదిదపాటి భయం కూడా పోతుంది.
అపుడు చాలా తేలికగా రాయగలుగుతారు. ఇలా దాదాపు నిద్రకు ఉపక్రమించే ముందు ఊహించుకుంటే పరీక్షలంటేనే భయం పోయి క్రియాత్మకంగా పరీక్ష రాయగలుగుతారు. పరిశుద్ధమైన మీ హృదయానే్న నమ్ముకుంటే అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఎవరో ఏదో చెప్పారని వాటన్నింటినీ నమ్మేస్తే మీ హృదయాంతరంలో ఉండే లక్ష్యం గతి తప్పుతోంది. ‘‘ఇతరులను చంపటానికి కత్తులు అవసరం. ఆత్మహత్య చేసుకోవటానికి ఓక సూది చాలు. అలాగే ఇతరులకు చెప్పటానికి అధిక ధీశక్తి, పాండిత్యం అవసరం. కానీ నీకు నీవే ఆత్మబోధ చేసుకోవటానికి ఇవేమి అవసరం లేదని గుర్తించుకోవాలి. హృదయ ప్రేరణను అనుసరించటం వల్ల తప్పులు తక్కువగా జరుగుతాయి. ఈసత్యాన్ని ప్రతిఫలించటానికి శ్రేష్టమైన అద్దమే విశుద్ధ హృదయం అని గ్రహించండి. నిజానికి మనల్ని బాధించేది మన వెఫల్యం కంటే ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచన.
ఇలాంటి ఆలోచన మనలో ఆత్మన్యూనతా భావానికి లోనుచేసి మరింత కృంగదీస్తుంది. మన గురించి మనం ఆలోచించుకుంటే ఈ సమస్యే ఉండదు. మన మీద మనకు అభిమానం ఉండాలి. జీవన పాఠాలు నేర్పేవి వైఫల్యాలేనని గ్రహించండి. పరీక్ష ఫెయిలైనంత మాత్రాన జీవితంలోనే విఫలమయ్యామని అనుకోవడం బలహీనత. పరీక్షల్లో విఫలమవ్వడమనేది చాలా చిన్న విషయం. కష్టాలు ఎదురైనా అధైర్యపడకుండా ఆత్మశక్తితో అభివృద్ధిపథంలో నడిచేవాడు ఎన్నటికైనా జీవితంలో విజయాన్ని సాధిస్తాడు.