ఐడియా

రకరకాల బీమా.. మహిళకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలపట్ల వివక్షను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను వారి ముంగిట నిలిపాయి. చట్టాల, పథకాల అమలులో కొంతవరకు లోపాలున్నా.. ఉన్నత ఆశయాలకు, ఆదర్శాలకు ఇవి అద్దంపడుతూనే వున్నాయి.
అభయహస్తం
గ్రామీణాభివృద్ధి పరిధిలోని డ్వాక్రా సంఘాలకు ఉపకరించే పథకమిది. 60 ఏళ్ళు నిండిన మహిళలకు పింఛన్లు పొందేలా రూపొందించిన ఈ పథకంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి సంఘ సభ్యురాలు అర్హురాలే. వెలుగు, మెప్మా ద్వారా రోజుకు రూపాయి వంతున ఏడాదికి రూ.365 చెల్లించాలి. 60 ఏళ్ళు నిండగానే ఏటా నెలకు రూ.వెయ్యి పింఛను పొందవచ్చు. దాంతోపాటు వారి పిల్లలకు రూ.100 వార్షిక ఉపకార వేతనాలు అందిస్తున్నారు.
పొదుపు.. రుణాలు
గ్రామీణ పేదరికం నిర్మూలన సంస్థ (సెర్ప్) బ్యాంకు లింకేజి, స్ర్తినిధి, ఎస్‌జిఎస్‌వై, ఉన్నతి కింద రుణ సౌకర్యం అందిస్తున్నాయి. పది మంది కంటే తక్కువ కాకుండా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి ఈ రుణాలు పొందవచ్చు. బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి ఏడు నెలల క్రమపద్ధతిలో పొదుపు చేస్తూ బ్యాంకు లింకేజి రుణాన్ని రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది.
జననీ సురక్ష
ప్రతి పేద మహిళకు ప్రభుత్వాసుపత్రిలో సురక్షిత ప్రసవంతో పాటు ఆర్థికంగా లబ్ధిపొందేందుకు ఈ పథకం దోహదపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో ఉచిత వైద్యంతోపాటు నగరాల్లో అయితే రూ.600 గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వంతున అందిస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది లబ్ధిపొందుతున్నారు.
పిండ దశలోనే ప్రత్యేక చట్టం..
ఆడపిల్లలను మొగ్గలోనే తుంచేయకుండా ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రీకాన్సిష్టన్ ప్రినేటర్ డయాగ్నిస్టిక్ టెక్నికల్ యాక్ట్ -1994. నిషేధిత లింగ నిర్థారణ చట్టాన్ని ఉల్లంఘించినవారికి రూ.5 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
స్ర్తి నిధి..
జీవనోపాధుల కల్పనలో భాగంగా ప్రతి సంఘంలోని ఒక సభ్యురాలికి రూ.లక్ష బ్యాంకు రుణం ఈ పథకంలో అందనుంది. తీసుకున్న రుణాల్లో ప్రతి నెలా బ్యాంకుల్లో చెల్లిస్తున్న మేరకు సంఘాలను ఎ, బీ శ్రేణులుగా గుర్తించి ఈ రుణా లు ఇస్తున్నారు. సంఘ రుణ పత్రం, వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్షవరకు రుణం పొందిన సభ్యురాలికి నెలకు రూ.1.16 వడ్డీ పడుతుంది.
జనశ్రీ బీమా యోజన
డ్వాక్రా సంఘాల్లో సభ్యులు ఏటా రూ.110 చెల్లిస్తే ఆమెతోపాటు, నామినీ వరకు ఈ పథకంలో రూ.లక్ష బీమా ఉంటుంది. దాంతోపాటు వారి కుటుంబాల్లోని 9, 10 తరగతులతోపాటు ఇంటర్, ఐటిఐ చదివే విద్యార్థులకు ఏటా రూ.1200 ఉపకార వేతనం అందిస్తున్నారు.
గృహహింస, నిర్భయ చట్టాలు..
మహిళలపై పెరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాలపై పలు చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. వరకట్న వేధింపులపై అవసరమైన ఆధారాలతో 498(ఎ) నమోదుచేస్తే న్యాయస్థానాల్లో మహిళలకు తగిన న్యాయం చేకూరుతుంది. 2002లో గృహహింస చట్టాన్ని ప్రవేశపెట్టారు. డీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న దారుణమైన సంఘటన తర్వాత 2012లో నిర్భయ చట్టం తీసుకొచ్చారు.

- నీలిమ సబ్బిశెట్టి