మెయిన్ ఫీచర్

జయహో... జనయిత్రి (8న మహిళా దినోత్సవం సందర్భంగా...)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల ప్రతిభ
పెద్ద రిజర్వాయర్‌లాంటిది
-హిల్లరీ క్లింటన్

మనిషి గౌరవాన్ని
కాపాడటంలోమహిళలు ఎలాంటి రాజీధోరణితో
వ్యవహరించరు.
-ఏంజెల్ మార్కెల్

మీరు ఏదైన చెప్పాలనుకుంటే మగవాళ్లను అడగండి. కాని మీరేదైనా చెయ్యాలనుకుంటే మాత్రం ఆడవాళ్లని అడగండి.
-మార్గరేట్ థాచర్

పిడికిలి తీయాలంటే
రెండు చేతులు
కదిలించాలి
-ఇందిరాగాంధీ

సాధికారిత..సమానత్వం దిశగా అడుగులు వేసే మహిళల గురించే ప్రస్తావించే సందర్భం ఇది. నేటికీ మేటి విలువలతో రాణిస్తున్న మహిళామణులు ఎందరో..ఇందులో భారతీయ మహిళ కూడా తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూనే ఉంది. విభిన్న రంగాల్లో భారతీయ మహిళలు మేలైన విజయాలనే సొంతం చేసుకున్నారు. వారి స్ఫూర్తి రేపటి ఆశతో ముందడుగు వేసే నేటి మహిళకి ఆదర్శం. వివక్ష, అసమానతల్లాంటివి వెనక్కి లాగుతున్నా తన జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్నా తరుణి.. పట్టుదలగా ముందుకు సాగిపోతోంది.
* ఎవరు చెప్పారు కార్ల తయారీ మాకు అసాధ్యమని అంటారు పూణెకు చెందిన సాచి కందేకర్. దేశ రాజధాని దిల్లీలో ఈమెతో పాటు మరో ఐదుగురు యువ ఇంజనీర్లు జతకలిసి మహీంద్ర బజా నాలుగు చక్రాల వాహన రూపకల్పనలో భాగస్వాములయ్యారు. వాహనాల మరమ్మతుల్లో తమదైన శైలి ప్రదర్శిస్తున్నారు.
* నేవీలో మహిళల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ తొలిసారిగా కోచి నావికాదళంలో హర్యానాకు చెందిన రాణిశర్మ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంబికా హుడా అనే ఇద్దరు యువతులు నేవిగేటర్స్‌గా ప్రవేశించారు.
* దిల్లీకి చెందిన డాక్టర్ రీతూ బియానీ.. తాను క్యాన్సర్ బారిన పడినప్పటికీ మృత్యుముఖం నుంచి బయటపడి మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌పై విస్తృత అవగాహన కల్పిస్తోంది. బియానీ చేపట్టిన చైతన్యం వల్ల దాదాపు లక్ష మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.
* చినుకలన్నీ కలిసి పెద్ద ప్రవాహమైనట్లు చిరు విరాళాలే పేదలకు కొండంత అండనిస్తాయని అంటారు ముంబయికి చెందిన మిథిలా బాల్సే. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కిమోథెరపీ తీసుకున్న రెండు వారాలకే మారథాన్ రన్‌లో పాల్గొనటమే కాకుండా ఇండియన్ క్యాన్సర్ సొసైటీ స్థాపించి క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలిచారు.
* ఆర్మీలో కొన్ని ఉద్యోగాలకే పరిమితమైపోతున్న మహిళలు నేడు తొలిసారిగా ఫైటర్ పైలట్స్‌గా ఆకాశాన్ని ముద్దాడబోతున్నారు. ఈమేరకు ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మహిళలను ఎంపిక చేసింది. మొదటి బ్యాచ్ శిక్షణ తీసుకుంటుంది. ఈ బ్యాచ్ జూన్ నుంచి విధులలోకి ప్రవేశించనున్నది.
* ఒరిస్సాకు చెందిన కల్పనాదాస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అంతకు ముందు బచేంద్రి పాల్ సాధించిన రికార్డును తిరగ రాశారు.
* హైదరాబాద్‌కు చెందిన సాజిదాఖాన్ తొలి ఆడియో మహిళా ఇంజినీర్‌గా ప్రసిద్ధి చెందారు. పేరొందిన సంగీత దర్శకుల ప్రశంసలు పొందిన మూడు పదుల ఈ యువతి రాజీవ్‌గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.
* ఐక్యరాజ్యసమితి మహిళా వివక్ష నిర్మూలన కమిటీ (సైడా) సభ్యురాలిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు ఇందిరాజైసింగ్. భారతీయ మహిళ దుస్థితిపై అంతర్జాతీయ వేదికపై తన గళం విప్పారు.
* అగ్ని-6 మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించటంలోప్రధాన భూమిక పోషించిన కేరళకు చెందిన టెస్సీ థామస్ మిస్సైల్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన తొలి మహిళా సైంటిస్ట్‌గా చెప్పవచ్చు.
* ఇంటి ముందు నుంచి రైలు వెళుతుంటే ప్రయాణికులకు తన చిట్టి చేతులతో టాటా చెప్పి మురిసిపోయే ముంతాజ్ ఖాజీ ఆసియాలోనే డీజిల్ ఇంజన్ రైలు నడిపే తొలి మహిళగా ప్రసిద్ధి చెందారు. పాతికేళ్ల తన కెరీర్‌లో ఏనాడూ తాను మహిళనని భయపడలేదని, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత ఉంటే అవే మహిళలకు శారీరకంగా దృఢత్వాన్ని అందిస్తాయని అంటారు. తాను ప్రతిరోజు రైలు నడిపే ముందు ‘‘ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా సాయం చేయమని’’ దేవుడ్ని ప్రార్థిస్తానని చెబుతారు.
* అన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళపై పురుషాహంకారపు దాడులు మాత్రం ఆగటం లేదు. ఇలాంటి దాడులకు బలవుతున్న యువతులకు ఆదర్శం లక్ష్మీ అగర్వాల్. ‘అన్నా’ అని సంబోంధించినా కనికరించని ఓ మానవ మృగం జరిపిన యాసిడ్ దాడిలో అందమైన ముఖం మాడిమసైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఏడు సర్జరీలు, రూ. 20 లక్షలు ఖర్చయినా రాని పాత ముఖం కోసం వెంపర్లాడకుండా ఆత్మన్యూనతా భావాన్ని వీడి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా ఉద్యమం లేవదీసింది. ఆమె చేసిన కృషి ఫలితమే నేడు మహిళలపై జరిగే యాసిడ్ దాడులపై అత్యున్నత న్యాయస్థానం, పార్లమెంట్‌లో సైతం చర్చకు దారితీసింది. ఇలాంటి యాసిడ్ బాధితులను వికలాంగులను గుర్తించి వారికి వర్తించే అన్ని సౌకర్యాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లక్ష్మీ అగర్వాల్ తన అంధవికారానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా యాసిడ్‌దాడి బాధితులతో ఫ్యాషన్ షోలు సైతం నిర్వహిస్తూ వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపుతుంది.
* అందమైన కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడులతో శాంతి కరువైన నేపథ్యంలో ఆ పచ్చటి లోయలో డాక్టర్ రువేదా సలామ్ అనే కుంకుమ పువ్వు వికసించి తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంపికైంది. వాస్తవానికి కాశ్మీర్‌వాసులకు దేశభక్తి లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తన విధి నిర్వహణలో ఆమె దేశభక్తిని చాటుకుంటున్నారు. ఐపీఎస్ రంగంలోనే కిరణ్‌బేడీ తరువాత కాంచన్ చౌదరి భట్టాచార్య దేశంలోనే రెండవ మహిళా ఐపీఎస్ అధికారిగా ప్రసిద్ధి చెందారు. ఆమె సేవలకుగాను ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.
* దొంగలు జరిపిన దాడిలో కాలు కోల్పోయినా కుమిలిపోకుండా వివేకానందుడి బోధనలతో జాగృతమై ఒంటికాలితో ఎవరెస్ట్ శిఖిరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుణిమ అనే ఆణిముత్యం ఎందరికో స్ఫూర్తి.
* బెంగాల్‌కు చెందిన స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఎంపికైన తొలి మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రసిద్ధిచెందారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి ఓ మహిళా ఐఎఎస్ అధికారిని సీఎం కార్యదర్శిగా నియమించుకోవటం ఆమె సమర్థతకు నిదర్శనం. అయితే ఈ ఐఏఎస్ అధికారిపై విమర్శల దాడి జరగకపోలేదు.
* అంతరిక్షంలోప్రయాణించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లో నిలిచిన కల్పనాచావ్లా దురదృష్టవశాత్తు ఆకాశంలోనే కనుమరుగైనా ఆమె అందించిన స్ఫూర్తితో ఎంతో మంది భారతీయ యువతులు అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 18 ఏళ్ల సతర్పన ముఖర్జీ నాసాకు ఎంపికయ్యారు. 2024లో అందాల జాబిలి వద్దకు వెళ్లే వ్యోమగాముల ఎంపికను నాసా ఇటీవల నిర్వహించగా రెండవ రౌండ్‌లో 44 మంది భారతీయులు నిలిచారు. ఇందులో 27 మంది యువకులు ఉండగా, 17 మంది యువతులు ఉండటం విశేషం. అలాగే ఫైనల్ ఎంపికలో ముగ్గురు భారతీయులు ఎంపికవ్వగా ఇందులో ఇద్దరు రితికాసింగ్, శారదాప్రసాద్ అనే యువతులు ఎంపికకావటం విశేషం.
* అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంలో రాష్టప్రతి భవన్‌లో జరిగిన సైనిక గౌరవ వందన కార్యక్రమానికి తొలిసారి ఓ మహిళా కమాండర్ నాయకత్వం వహించారు. ఆమె ఎవరో కాదు పూజాఠాకూర్. ఎయిర్‌ఫోర్స్‌లో 2000 సంవత్సరంలో ప్రవేశించిన పూజ విధి నిర్వహణలో లింగ భేదం ఉండదని, పురుష కమాండోలు నిర్వహించే విధులన్నింటినీ అంతే సామర్థ్యంతో తాము కూడా నిర్వహిస్తామని రుజువు చేశారు.
* ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ విభాగాలలో 300 మంది మహిళా అధికారులను నియమించటం నారీమణులు సాధిస్తున్న పురోగతికి తార్కాణం.
* పంజాబ్‌లో పుట్టిన పునీతాఅరోరా దేశం గర్వించదగ్గ ఆర్మీ అధికారులలో ఒకరిగా నిలిచారు. తండ్రి ఆమెను వైద్యురాలిని చేయాలని భావిస్తే, ఆర్మీ కాలేజీలో చదివిన పునీతా అరోరా పసివయసులోనే దేశభక్తిని నింపుకుని, ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి మహిళా కమాండర్‌గా ఎంపికై తన సత్తా చాటుకున్నారు. ఎన్నో టెర్రరిస్టు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. విధి నిర్వహణలో ఆమె చూపిన చొరవ, నిబద్ధతకు 15 అవార్డులు లభించటమే నిదర్శనం.
* ఆటలలోనూ తమ ప్రతిభా పాటవాలు చూపుతున్న సానియా, నైనా సెహ్వాల్, మిథాలి, మేరీకోమ్, సింధూ లాంటి యువ కెరటాలు భారతీయ పతాకాన్ని అంతర్జాతీయ వినువీధుల్లో ఎగురవేశారు. ఆరేళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ చేపట్టిన సానియా మూడు పదుల వయసు దాటకుండానే ఆమె సాధించిన విజయాలు, ప్రపంచ రికార్డులు అనితర సాధ్యమైనవని చెప్పవచ్చు.
* ఆర్థిక రంగంలోనూ అతివల అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. స్టాక్ ఎక్సేంజ్‌లో తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికైన చిత్రా రామకృష్ణన్, ఎస్‌బిఐ తొలి చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఎల్‌ఐసి తొలి మహిళ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా సంగ్వా, ఏక్సిస్ బ్యాంక్ తొలి ఎం.డి, సీఇఓ శర్మ, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్న ఐసిఐసి ఎండీ చందాకొచ్చిర్.. ఇలా ఆర్థిక రంగంలో మహిళలు తమదైన శైలిలో తమ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
* విదేశాలలో సైతం ప్రవాస భారతీయ మహిళలు వివిధ రంగాలలో తమదైన ముద్రవేసుకుని ముందుకు సాగుతున్నారు. గుజరాత్‌కు చెందిన సునీతావిలియమ్స్ ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసి రికార్డు సృష్టించారు. ఇందిరానూయి ప్రపంచ వ్యాపార రంగంలో ప్రతిభను చాటుకున్న నారీ. నిమ్రితా నిక్కి రాంధ్వా అమెరికాలో అతి పిన్నవయసులో ఎన్నికైన గవర్నర్. కమలాహర్రీస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్, బుకర్ ఫ్రైజ్ పొందిన కిరణ్ దేశాయ్ చండీగఢ్ వాసి. సితార్ ప్లేయర్ రవిశంకర్ కుమార్తె అనుష్క శంకర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సంగీత అభిమానుల్లో గుండెల్లో నిలిచారు. దుగ్గాల్ షీఫాలి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు రాజకీయ ఎత్తుగడలు నేర్పుతోంది. అమెరికా పరిపాలన విభాగంలో జార్జి ఘోష్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అతివలు సాధిస్తున్న అనితర విజయాలు మరెందరికో వెలుగు బాటలవుతున్నాయి. దేశ విదేశాలలో బయట ప్రపంచంలో విభిన్న రంగాలలో దూసుకుపోతున్నా .. గృహిణిగా తన బాధ్యతలను నిర్వర్తించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే..
*