మెయన్ ఫీచర్

సామ్రాజ్యవాదం రోగం కుదిర్చిన కాస్ట్రో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకోవాలంటే, ఎదుటివారిపై బురదజల్లి నిరంకుశుడని, నియంతని, నరహంతకుడని ప్రచారం చేస్తే చాలు- ఉన్న ఫళంగా మానవీయతగల మంచివారుగా మారిపోవచ్చు! ఇలాంటి విష ప్రచారంతోనే సద్దాంను, గఢాఫీని చంపిన అమెరికా హ్యూగ్ చావెజ్‌ను రోగగ్రస్తుడిగా మార్చి చంపింది. ఆరు దశాబ్దాలుగా క్యూబా పాలకులపై ఇలాంటి ప్రచారమే సాగిస్తున్నది కూడా! అమెరికాకు క్యూబా 90 కి.మీ. దూరంలోనే వుందన్నది మర్చిపోవద్దని జాన్‌ఎఫ్ కెనడీ హెచ్చరిస్తే, అమెరికా కూడా అంతే దూరంలో వుందన్న విషయాన్ని గుర్తంచుకోవాలని ధిక్కార స్వరం వినిపించడం ఒక్క ఫిడెల్ కాస్ట్రోకే సాధ్యమైంది.
ఓ హోచిమిన్, ఓ చేగువెరా, ఓ చావెజ్, ఓ సద్దాం, ఓ గఢాఫిల మేలు కలయికగా, పంచలోహంగా ఎదిగిన శక్తి, నిండైన వ్యక్తిత్వమున్న ఫిడెల్ కాస్ట్రో అంటే దోపిడిదార్లకు సింహస్వప్నమే! మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి, ఎదురొడ్డి నిలిచిన స్టాలిన్, మావోల తర్వాత అంతే ఎత్తుకు ఎదిగి, అయిదు దశాబ్దాలపాటు ఐసన్ హోవర్ నుంచి ఒబామా దాకా అమెరికాను ఏలిన 11 మంది అధ్యక్షులను, వీరిని నియంత్రించే సిఐఎలను కంటికి కునుకులేకుండా చేసిన ధీశాలి ఫిడెల్ కాస్ట్రో.
కరేబియన్ సముద్రంలో గుంటూరు జిల్లా అంత (109,820 చ.కి.) వైశాల్యంతో, కోటి 12 లక్షల జనాభాతో భారతదేశ సముద్ర మార్గ అనే్వషణలో అమెరికాతోపాటు 1498లో కొలంబస్ గుర్తించిన ఓ చిన్న ద్వీపమే క్యూబా! 1902లో అమెరికానుంచే స్వాతంత్య్రం పొందినా, అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాలే 1959వరకు క్యూబాను వ్యవసాయ పరంగా, మానవాభివృద్ధి పరంగా, సామాజికంగా ఎదగనీయకుండా చేసాయి. రాగి, నికెల్, ఇనప ఖనిజాన్ని దోచుకునేలా చేసాయి. ఇలా ఆర్థికంగా చితికిపోవడానికి కారకుడైన బాటిస్టా ప్రభుత్వాన్ని సాయుధ తిరుగుబాటుతో కూలదోసి జనవరి 2, 1959లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఫిడెల్ దేశాన్ని నిరుద్యోగ రహిత దేశంగా మార్చడమే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యాన్ని అందించే దేశంగా తీర్చిదిద్దాడు. దేశ భూభాగంలో 30 శాతాన్ని వ్యవసాయానికి వినియోగిస్తూ 20శాతం ప్రజలు ఆధారపడేలా చేసి, జిడిపిలో 10 శాతం వాటాను అందిస్తూ, ప్రపంచంలోనే ‘చక్కెర గినె్న’గా గుర్తింపుతెచ్చాడు. పొగాకు, కాఫీ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసి విదేశీ మారకాన్ని దేశాభివృద్ధికి వినియోగించాడు.
దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే అమెరికాకు చెందిన అన్ని సంస్థల్ని, ఆస్తుల్ని జాతీయం చేసి బాటిస్టా ప్రభుత్వం లాక్కున్న భూముల్ని తిరిగి పేదలకు అందించి, వారి హక్కులకు చట్టబద్ధత చేకూర్చాడు. వ్యవసాయాన్ని సామూహిక వ్యవసాయ రంగంగా మార్చివేసాడు. ప్రభుత్వ రంగంలోనే చిన్నపాటి పరిశ్రమల్ని, వ్యవసాయ, కాఫీ క్షేత్రాల్ని ఏర్పాటు చేసి కార్మిక వర్గాన్ని ప్రభుత్వ రంగంలోనే వుంచాడు. అమెరికాకు ఆగ్రహాన్ని తెప్పించిన ఈ చర్యలు క్యూబాపై ఆర్థిక ఆంక్షలకు దారి తీసింది. అనేక ఇబ్బందుల్ని కల్గించింది. రష్యా, వియత్నాం, వెనిజులా లాంటి సోషలిస్టు దేశాల సహకారంతో నిలదొక్కుకున్న క్యూబా ప్రపంచ అనారోగ్య సవాళ్ళనే అధిగమించి క్యాన్సర్ లాంటి మహమ్మారికి వ్యాక్సిన్‌ను గుర్తించే స్థాయికి ఎదిగింది. క్లినికల్ ట్రయల్స్‌లో వున్న ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రపంచ ఆరోగ్య స్వరూపమే మారిపోవచ్చు! ఇంత చిన్న దేశం ఆరోగ్యంపై సారించిన దృష్టి ప్రపంచ ఆరోగ్య సంస్థనే ఆశ్చర్యపరిచింది. భారత్ ఎదుర్కొంటున్నట్లే క్యూబా పిల్లల్లో, స్ర్తిలలో పోషకాహార లోపాల్ని ఎదుర్కొంటూ, ప్రసూతి, శిశుమరణాల్ని 60 శాతం (60%)కు పైగా కల్గి వుండేది. ఉన్న కాస్త జనాభా రోగగ్రస్తంగా మారితే, ప్రజల రెక్కల కష్టమంతా వైద్యానికే ధారపోసి, అందునా అమెరికాపైనే ఆధారపడితే, ఏ గతిన కూడా క్యూబా అభివృద్ధి చెందదని భావించిన ఫిడెల్ ముందుగా విద్య, వైద్యంపై దృష్టి సారించాడు. ప్రభుత్వమే బాధ్యత వహించి, వంద శాతం అక్షరాస్యతను సాధించడమే కాదు, దాదాపు అందరు పట్ట్భద్రులయ్యేలా చూసాడు. వైద్య కళాశాలల్ని విస్తృతంగా ఏర్పాటు చేసి, వేలాదిమందిని ప్రజావైద్యులుగా తీర్చిదిద్దాడు. నర్సుల్ని తయారు చేసి ‘చికిత్సకాదు- నివారణ...’ ప్రధానమనే నినాదంతో ప్రతీ 170 పౌరులకు ఒక డాక్టర్ చొప్పున, ప్రతీ 128మందికి ఒక నర్సు వుండేలా చేశాడు. ప్రపంచంలో ఓ ఆరోగ్యకరమైన దేశంగా ఎదిగించాడు.
అంతర్యుద్ధ కాలంలో వెనిజులాకు, ఇథియోపియాకు, అంగోలాకు వేలాది మంది డాక్టర్లను పంపించి ప్రజలకు వైద్యసేవలందించాడు. ప్రకృతి విపత్తుల సందర్భంగా ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకుకూడా వైద్య బృందాన్ని పంపి ఆయా దేశాల ప్రజల మన్నల్ని పొందేలా చేసాడు. 2005లో పాకిస్తాన్, కాశ్మీర్ ప్రాంతంలో వచ్చిన భూకంపం సందర్భంగా పాకిస్తాన్‌కు ముందుగా 50 మంది డాక్టర్లను పంపి బాధితులకే కాక, సాధారణ ప్రజలకు కూడా వైద్యాన్ని అందించి, దీర్ఘకాలిక రోగాల్ని నయం చేసేలా చూసాడు. ఇలా 7 నెలల కాలంలో పాకిస్తాన్‌కు చేరిన క్యూబా డాక్టర్ల సంఖ్య 2,500 మంది అంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఈ డాక్టర్ల బృందానికి క్యూబా స్వాతంత్య్రం కోసం పోరాడిన అమెరికాకు చెందిన హెన్రీ రీవె పేరున ‘హెన్రీ రీవె బ్రిగెడ్’అని నామకరణం చేసిన ఫిడెల్, ది ఓల్డ్‌మన్ అండ్ సీ (్జజూ ఘశ డళ్ఘ) నవలకు నోబుల్ బహుమతి గ్రహించిన హెమ్మింగ్‌వే అనే అమెరికా రచయిత పేరుననే షెల్‌ఫిష్ రక్షణ ఫెస్టివల్‌ను కూడా జరపడం గమనార్హం!
మానవ వనరులను సద్వినియోగం చేయడంలో ప్రపంచ దేశాలన్నీ క్యూబా నుంచి నేర్చుకోవాల్సిందే! సంవత్సర సంవత్సరానికి నిరుద్యోగ సమస్యను అధిగమిస్తూ 2015నాటికి 2.4 శాతానికి, 2016నాటికి 2.3 శాతానికి తగ్గించుకుంటూ రావడం జరిగింది. 68.23 బిలియన్ల డాలర్ల జిడిపితో, 6,052 డాలర్ల తలసరి జిడిపి ఆదాయంతో, 18,520 డాలర్ల తలసరి ఆదాయంతో క్యూబా సంతోషంగా ఉంటున్న దేశాల సరసన నిలదొక్కుకున్నది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, ఈ ఆదాయం అతి తక్కువగా కనపడినా, నాణ్యతతో కూడుకున్న విద్య, వైద్యం ఉచితమే కాక, జీవన ప్రమాణాల్లో ఉన్నత స్థాయిలో వుండడం సంపదలన్నీ ప్రభుత్వ రంగంలోనే వుండడంతో ఎలాంటి చీకు చింతాలేకుండా క్యూబన్లు ప్రపంచ స్థాయిలో తలెత్తుకొని బతికేలా చేసిన ఘనత ఫిడెల్‌దే!
ఎలాంటి ఉచితాలకు తావివ్వకుండా, ప్రజల లెక్కల్నే పెట్టుబడిగాపెట్టి, మేధోసంపత్తిని జాతీయ సంపదగా భావించి, ఎలాంటి దోపిడికి అవకాశం లేకుండా, కుటుంబ రాజకీయాలకు తావులేకుండా (రౌల్ కాస్ట్రో స్వంత తమ్ముడే అయినా, ఫిడెల్‌తో మొదటినుంచి పోరాటంలో వున్నాడు), దాదాపుగా అప్పులు లేకుండా, ఉన్నా దేశ ఉత్పత్తితో, ముఖ్యంగా ఫార్మా రంగ ఆదాయంతో తీర్చే సత్తాగల దేశం క్యూబా. అమెరికా పెత్తనాన్ని అడుగడుగునా ఎదుర్కుంటూనే, 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో సంవత్సరానికి సరాసరి 64సార్లు హత్యాప్రయత్నాలు ఎదుర్కుంటూ తప్పించుకున్న ధన్యజీవి ఫిడెల్. స్వయాన భార్య మారిటా లోరెంజ్‌తోనే ఒప్పందం చేసుకొని, కోల్డ్‌క్రీంలో విషాన్ని కలిపి, ఫిడెల్ తాగే డ్రింక్‌లో కలిపేలా సిఐఎ చూసినా, కుట్రల్ని పసిగట్టి గుర్తించిన స్ఫురదృష్టిగల ఫిడెల్ గొప్ప మానవతావాది కూడా. విదేశాల్లో సేవలందించిన డాక్టర్లకు, నర్సులకు, సైనికులకు హవానా ఏర్‌పోర్టులో స్వయంగా స్వాగతం పలికేవాడు. ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలకు ఆత్మీయుడిగా అండదండలందించేవాడు.
1928 తర్వాత 2016లోనే అమెరికా అధ్యక్షులు క్యూబా నేలపై అడుగు పెట్టారంటే, అమెరికా గుండెల్లో ఫిడెల్ ఎలా నిద్రపోయాడో తెలుస్తున్నది. ఈ కంటగింపె ఫిడెల్ మరణం అమెరికాకు ఆనందాన్ని కల్గించింది. అమెరికాలో స్థిరపడిన క్యూబా పెట్టుబడిదారులు, ఏజెంట్లు సంబరాలు చేసుకునేలా ప్రోత్సహించి, నియంత మరణమంటూ ఘోషిస్తున్నది. యావత్ క్యూబానేకాదు, ప్రపంచవ్యాపితంగా ఫిడెల్ మరణానికి మానవీయ మనుషుల కన్నీరు అమెరికాకు కనిపించడం లేదు. అందుకే హవానాలో వివిధ దేశాల దౌత్య కార్యాలయాలపై ఆయా దేశాల జెండాలు అవనతం. అయినా, తలబిరుసుతో ఎగురుతున్న ఏకైక జెండా అమెరికాదే కావడం గమనార్హం! తిరిగి క్యూబాలో శాశ్వత స్థావరం ఏర్పాటుకై ఉవ్విళ్లూరుతున్న అమెరికాకు ప్రతి క్యూబన్ ఫిడెల్‌లా జవాబు చెపుతారనే విషయాన్ని గుర్తిస్తే, జెండా అవనతం కాక మానదు.
నెహ్రూ నుంచి, రాజీవ్ దాకా, పివి, మన్మోహన్‌లందరు క్యూబా పట్ల స్నేహసంబంధాల్ని కొనసాగించి, అవసరానికి ఆదుకున్నా ఫిడెల్ ఆలోచనా విధానం వీరెవ్వరికి అబ్బకపోవడం, ఈ దేశ ప్రజల అదృష్టమందామా....?

- జి.లచ్చయ్య సెల్: 94401 16162