మెయిన్ ఫీచర్

చిన్నారుల్లో చిరునవ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్స్ వర్కర్లను చూస్తే ఈసడించుకుంటాం. అలాంటిది వారి పిల్లలకు ఈ సమాజంలో ఆదరణ లభిస్తుందా? పొట్టకూటి కోసం తల్లులు చేస్తున్న ఈ వేశ్యావృత్తి వారికి శాపంగా మారాల్సిందేనా? తల్లి బాటలోనే పిల్లలు కూడా వెళ్లాల్సిందేనా? కనీసం ఈ జనరేషన్ పిల్లలనైనా విద్యాదిశగా అడుగులు వేయిస్తే.. భావి భారత పౌరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించినట్లయితే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది కదా! ఇలాంటి ప్రశ్నలేన్నో లలితా నాయక్‌ను వేధించాయి. 54 ఏళ్ల ఈ సాధారణ మహిళ తన జీవితంలో సగం భాగం వేశ్యావాటికలోకి వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టి అమ్మా! మీ పిల్లలకు చదువు చెబుతాను. పంపండి అని వేడుకోవటంలోనే గడిచిపోయింది. అయినప్పటికీ నిరాశచెందకుండా పాతికేళ్లగా ఆమె చేసిన కృషికి ఈనాడు 65మంది పిల్లలకు తల్లయింది. వారి ఆలనా పాలనా చూస్తుంది. ఆమే సొసైటీ ఫర్ పార్టీసిపేటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కేంద్ర నిర్వాహకురాలు లలితా నాయక్. ఆమె చేస్తున్న సేవ ఆమె మాటల్లోనే..
ఉన్నత స్థానాల్లో తొలి బ్యాచ్ పిల్లలు
నేను ఢిల్లీలోని జి.బి రోడ్డులోని రెడ్‌లైట్ ఏరియాకు 1988లో వచ్చాను. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది అమ్మాయిలు ఈ వృత్తిలోకి దిగటం గమనించాను. దాదాపు నాలుగు వేల మంది ఈ రొంపిలో ఉన్నారు. అటువంటి సమయంలో ఆ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వారితో మాట్లాడుతుండేదాన్ని. వారిని ఆ వృత్తి నుంచి బయటకు రమ్మని వేడుకునేదాన్ని. హెచ్‌ఐవి తదితరు వాటి గురించి వారు నన్ను అడిగేవారు. ఇక తామెట్లాగూ ఈ వృత్తిని వదలి రాలేము. వచ్చినా ఈ సమాజం ఆదరించదు. కాబట్టి మా పిల్లలకు ఏదైనా చేయమని వారు నన్ను వేడుకున్నారు. అలా 1991లో జిబి రోడ్డులో ఈ కేంద్రాన్ని స్థాపించటం జరిగింది. అలా మొదలు పెట్టిన ఈ కేంద్రంలోకి తొలి బ్యాచ్‌గా వచ్చిన పిల్లలందరూ ఉన్నత చదువులు చదివి హెల్త్, హోటల్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
వసతి సౌకర్యంతో ఏర్పాట్లు
2012నాటికి ఈ పిల్లలలు ఇక్కడే ఉండేలా వసతి సౌకర్యాన్ని ఏర్పాటుచేయటం జరిగింది. ఎపుడైతే పిల్లలు నావద్దనే ఉండి చదువుకోవటం ప్రారంభించారో వారికి చదువుతో పాటు నైతిక, ధార్మిక విలువలను కూడా బోధిస్తూ వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తున్నాను. కనీసం ఈ జనరేషన్ అయినా ఈ వృత్తిలో వెళ్లకుండా సమాజానికి బాధ్యాతాయుతమైన పౌరులను అందించాలనేదే ఆశయం.
ఓ రోజు ఓ బాలిక పదవ తరగతి సిబిఎస్‌ఇ పరీక్షల్లో ప్రధమ ర్యాంకులో ఉతీర్ణులై ఆనందంగా నా వద్దకు పరుగు పరుగున వచ్చి ఆంటీ!ఈ రోజు నేనెంతో ప్రత్యేకంగా స్కూల్లో కనిపించానో తెలుసా! అని నన్ను ముద్దాడింది. ఇలా నా వద్దకు వచ్చిన పిల్లలను ఆనందంగా.. అందరి వలే చదువుతూ సమాజంలో ఎదగాలని తపన. వాస్తవానికి ఇక్కడి పిల్లలకు స్కూళ్లల్లో అడ్మిషన్ ఇవ్వటానికి చాలా యాజమాన్యాలు అంగీకరించవు. వేశ్యల పిల్లలని మిగతా పిల్లలు చులకనగా చూస్తారని, అంతేకాదు మా స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని, చెడ్డ పేరు వస్తుందని అంటారు. కాని వారిని ఒప్పించి పిల్లలు ఆయా స్కూళ్లలో బాగా చదివే పిల్లలుగా తీర్చిదిద్దిటానికి నిరంతరం తపన పడుతుంటాం. ఇప్పటి వరకు ఆడపిల్లలనే చదివిస్తున్నాం. మగపిల్లల్ని చదివించాలంటే నిధుల కొరత వెంటాడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఈ కేంద్రంలో 65 మంది పిల్లలు చేరారు. వీరిలో 55మంది పిల్లలు మా వద్దనే ఉంటారు. మిగిలినవారిని కూడా ఇక్కడ ఉంచమని వారి తల్లులను ఒప్పిస్తామనే విశ్వాసం ఉందని అంటున్నారు. ఇందులో 25మంది పిల్లల అవసరాలకు ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ద్వారా నిధులు అందుతున్నాయి. మిగిలిన పిల్లల కోసం నిధులు సమకూర్చుకోవటానికి ఇబ్బందులు పడుతున్నా వాటన్నింటిని అధిగమిస్తూ నా ప్రయాణం సాగుతుంది. 1991లో నేను కేంద్రాన్ని స్థాపించేటపుడు ఈ గది తాళాలు తీసుకున్నపుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాను. ఈ పాతికేళ్ల ప్రయాణంలో తీపి, పులుపు, చేదు అనుభవాల మైళ్లరాళ్లను అధిగమించి ముందుకు సాగుతున్నట్లు లలితానాయక్ వెల్లడించింది.
*