మెయిన్ ఫీచర్

తెరుచుకోని నోటికి చికిత్స అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తినీ సన్నగా ఉండడం వరం, ఏం తినలేక సన్నగా కనబడినా, బలహీనంగా ఉండడం సమస్య. ఈ సమస్యకి కారణం తినడం ఇష్టం లేకపోవడం కావచ్చు లేక తినలేకపోవడం కావచ్చు. మనం రెండో దానిమీద శ్రద్ధ వహిస్తే, తినలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నా, ముఖ్యమైనవి మాత్రం ఇవి-
1.పళ్లు పూర్తిగా లేకపోవడం
2.పంటి నొప్పి
3.నోరు తెరవలేకపోవడం
4.దవడ ఎముక విరిగినపుడు
పళ్లులేని ముసలివారు తినడానికి పడే తిప్పలు మనం ఇంట్లో కళ్లారా చూస్తూనే ఉంటాం. పంటినొప్పి ఉంటే ఇక కొరకడం, తినడం ఎంత నరకమో అనుభవించినవారిని అడిగితే వివరిస్తారు. దవడ ఎముకలు విరిగితే తినడం ఎంత ఇబ్బందో కిందటివారం చెప్పుకున్నాం. ఇపుడు నోరు తెరచుకోలేక తినలేని సందర్భాలేంటో చూద్దాం.
అదేంటీ నోరు తెరచుకోకపోవడం అని ఆశ్చర్యపడుతున్నారా? మన దేశంలో ఉద్యోగం లేని వారి సంఖ్య, పెళ్లికానివారి సంఖ్యతోపాటు, నోరు తెరచుకోలేని వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతుంది. ఓసారి పన్ను నొప్పి ఉందని ఓ పేషెంట్ మా క్లీనిక్‌కి వచ్చాడు. మా పళ్ల డాక్టరు అతని పన్నుని పరీక్షించడానికి అతన్ని నోరు తెరవమని అడిగింది. పది మిల్లీమీటర్లు కూడా నోరు తెరవలేని అతన్ని ఇంకా తెరవండి, ఇంకా తెరవండి అని ప్రోత్సహించింది. ‘‘ఇంతకన్నా ఎక్కువ నా నోరు తెరచుకుంటే ఆనందంగా నాకు ఇష్టమైన పానీపురి తినేవాడ్ని మాడమ్, ఎనిమిదేళ్లయింది పానీపురి తిని, ఇంతకుమించి తెరుచుకోదు’’ అది దిగాలుగా చెప్పాడు.
ఇలాంటి నోరు తెరవలేనివారిలో పంటి చికిత్స చెయ్యడం చాలా కష్టం. డెంటిస్టులు వాడే పరికరాలు నోట్లోకి వెళ్లినపుడే పంటికి కాని, చిగుళ్లకి కానీ చికిత్స చెయ్యగలం. వెళ్లనపుడు చికిత్స చెయ్యడం సాధ్యం కాదు. ఇలా నోరు తెరుచుకోలేకపోవడానికి కారణాలు మూడు ముఖ్యమైనవి:
1.దవడ ఎముక విరిగినపుడు
2.ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ (బుగ్గలు గట్టిగా మారడం)
3.టిఎమ్‌జె యాంకిలోసిస్ (కింది దవడ పైదవడతో అతుక్కుపోవడం)
వీటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం
దవడ ఎముక విరిగినపుడు: దాని గురించి కిందటివారమే ప్రస్తాంవించాం.
ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్: ఇది చదవడానికే ఇంత కష్టంగా ఉంటే దీనిని అనుభవించడం ఇంకెంత కష్టమో ఊహించండి. దీని అర్థం సామాన్య భాషలో చెప్పాలంటే నాజుగ్గా, మెత్తగా సాగేలా ఉండే మన బుగ్గలు గట్టిగా సాగకుండా మారిపోతే దాన్ని ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. బయటనుంచి బుగ్గ చర్మం మామూలుగా ఉంటుంది కానీ నోట్లోంచి బుగ్గల్ని వేళ్లతో తాకితే గట్టిగా, సాగకుండా ఉంటాయి. రబ్బర్ బ్యాండ్‌లా సాగాల్సిన బుగ్గలు తాడులా సాగకుండా ఉండడంవల్ల వీరిలో నోరు తెరుచుకోదు. ఇలా ఒకవైపు ఉండవచ్చు, ఇరువైపులా ఉండొచ్చు.
ఈ ఒఎస్‌ఎమ్‌ఎఫ్ ఎవరిలో ఎందుకు వస్తుంది
గుట్కా, తంబాకు తినేవారిలో ఇది వస్తుంది. గుట్కా తంబాకు లాంటివి వ్యసనాలు. వ్యసనాలు మన మెదడుని తాత్కాలికంగా ఉత్సాహపరిచినా మన శరీరాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇష్టం లేని ఓ ఆడ, మగా ఎలా కలిసి ఉండలేరో, బలవంతంగా కలిసి ఉంచడానికి ప్రయత్నిస్తే ఎటువంటి చెడు సంఘటనలకి అది దారితీస్తుందో అలానే మన శరీరానికి నచ్చని పదార్థంతో దాన్ని కలిపి ఉంచే ప్రయత్నం చేస్తే అప్పుడది ఇలాంటి సమస్యకి దారితీస్తుంది.
అందరూ గుట్కా ఇంకా తంబాకు బుగ్గ మధ్యన పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న చోట మన బుగ్గ లోపలి భాగానికి చికాకు కలుగుతుంది. పెట్టి పెట్టి ఆ స్థలం చికాకుకి చిరునామాగా మారుతుంది. సహనం ఉన్నంతవరకు ఎవరైనా దేన్నైనా భరిస్తారు. ఒక్కసారి సహనం నశిస్తే తిరగబడతారు. మన శరీరం కూడా అంతే. సహనంతో మన బుగ్గ కొన్ని ఏళ్లు ఆ గుట్కాని, తంబాకు భరిస్తుంది. అప్పటికీ వ్యసనాన్ని కొనసాగించే వారిలో బుగ్గ ఆ చికాకును భరించలేక గట్టిగా, మందంగా మారిపోతుంది. కొన్ని వారాల్లో లేక నెలల్లో గుట్కా లేక తంబాకు తినడంవల్ల ఇలా జరగదు. కొన్ని ఏళ్లు తినడంవల్ల ఇలా జరుగుతుంది. చాలామందిలో గుట్కా తంబాకు పెట్టిన బుగ్గకే ఇలా జరుగుతుంది. కొద్దిమందిలో మాత్రం వాటి రసాలవల్ల రెండు బుగ్గలు గట్టిగా మారిపోతాయి.
దీనికి చికిత్స
నోరు సాధారణంగా 40-45 మిల్లీ మీటర్లు తెరుచుకుంటుంది. అంటే మన చేతి మూడు వేళ్ల వెడల్పంత (బొటన ఇంకా చిటికినవేలు కాకుండా). ఈ మూడు వేళ్లు మన పై ఇంకా కింది ముందు పళ్ల మధ్యలోంచి సునాయాసంగా వెళ్లగలగాలి. అలా వెళ్లలేని పక్షంలో నోరు తక్కువ తెరచుకుంటున్నట్లు లెక్క.
నోరు తక్కువ తెరచుకుంటున్న వారిలో మొదట ఎంత తెరుచుకుంటుందో పరీక్షించాలి. బుగ్గని నోట్లోంచి వేలుతో తాకి ఎంతమేరకు గట్టిపడిందో పరిశీలించాలి. వెనుక బుగ్గ మాత్రమే గట్టిపడిందా లేక బుగ్గ ముందు భాగం కూడా గట్టిగా ఉందా, ఒక బుగ్గా లేక రెండు బుగ్గలూ గట్టిపడ్డాయా అన్నది నిర్థారణ చేసుకోవాలి.
ఈ చికిత్స చేసుకునేముందు ప్రతి రోగి గ్రహించాల్సిన అతి ముఖ్యమైన గమనిక ఏంటంటే గుట్కా, తంబాకు తినడం మానకపోతే ఏం చేయించుకున్నా సరైన ఫలితం ఉండదు. అది మానడం ఈ చికిత్సలో మొట్టమొదటి ప్రధాన ఘట్టం.
నోరు తెరుచుకోవడం కొద్దిగానే తగ్గినపుడు (ఒకటిన్నర లేక రెండు వేళ్ళు నోట్లోకి వెళ్ళగలిగిన వారిలో) బుగ్గకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది వారం - వారం అలా 4 నుంచి 6 వారాలు ఇప్పించుకొని, ఏక కాలంలో నోటికి సూచించబడిన వ్యాయామాలు చెప్పిన విధంగా చేయాల్సి వస్తుంది.
నోరు తెరవడం బాగా తగ్గిపోయినపుడు (ఒక వేలు కూడా సరిగ్గా నోట్లోకి పోని వారిలో), ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది. గట్టిగా మారిన బుగ్గని కోసి సాగేలా చేసి తిరిగి గట్టిగా మారకుండా చర్మాన్ని కానీ, కండని కాని బుగ్గకి పెట్టి కుడతారు. చర్మాన్ని ముక్కుకి ఇరువైపులనుంచి తీసుకుంటారు. కండ అవసరమైతే నుదుటి పక్క్భాగం నించి తీసుకుంటారు. ఆపరేషన్ అయిన మూడు వారాలకి నోటి వ్యాయామాలు చెప్పిన విధంగా చేయాల్సి వస్తుంది.
3.టిఎమ్‌జె యాంకిలోసిస్
వాడుక భాషలో చెప్పాలంటే కింది దవడ కదిలే కీలు పైదవడతో అతుక్కుపోతుంది. నోరు ఒక్క మిల్లిమీటర్ కూడా తెరుచుకోదు. ఇది ఎదిగే వయసులోని పిల్లలకు అయితే నోరు తెరుచుకోకపోవడంతోపాటు, మొహం కూడా సరైన రీతిలో పెరగదు. కింది దవడ గడ్డం చాలా వెనక్కి ఉంటుంది. పై ఇంకా క్రింది పళ్లు సరైన రీతిలో కలుసుకోవు. పూర్తిగా ఎదిగిపోయిన పెద్దవారిలో అయితే వారి మొహంలో ఎలాంటి మార్పు వుండదు. నోరు ఒక్కటే తెరుచుకోదు.
దీనికి కారణాలు
యూ ళళఔఒ ళజ్పళూక
ప్రమాదంలో కింది దవడ కీలుకి దెబ్బ తిగిలి రక్తం గడ్డ కట్టినా లేక కీలు ఎముక విరిగినా ఇలా అతక్కుపోయే ప్రమాదం ఉంది.
చికిత్స
వీరికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది. పై ఇంకా క్రింది దవడ అతుక్కుపోయిన కీలు దగ్గర ఎముకని కోసి ఖాళీ స్థలాన్ని సృష్టించాలి. మళ్లీ తిరిగి ఆ ఖాళీ స్థలంలోకి ఎముక పెరగకుండా ఏదైనా అడ్డుపెట్టాలి.
ఎదిగే పిల్లల్లో అయితే ఛాతి నుంచి పక్కటెముకని తీసుకుని పెట్టాలి. దీనివల్లమొహం పెరుగుదల మామూలుగా జరుగుతుంది. పూర్తిగా ఎదిగిన వారిలో అయితే స్టీల్ లేక టిటానియమ్ కీలు పెట్టాల్సి వుంటుంది. ఆపరేషన్ అయిన మూడు వారాలకి నోటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం వుంది.
ఓసారి యాభై ఏళ్ళ అతన్ని అతని భార్య నా దగ్గరికి తీసుకొచ్చింది.
భర్తకి పన్ను తియ్యాలని చెప్పింది. సన్నగా ఉన్న అతని నోరు అయిదు మిల్లీ మీటర్లు కూడా తెరుచుకోవట్లేదు. అందుకే అందరూ పన్ను తియ్యడం కష్టం అని పంపేస్తే వాళ్లు నా దగ్గరికి వచ్చారు. నేను అతని భార్యకి వివరంగా ఆమె భర్త నోరు తెరుచుకోలేకపోవడం గురించి చెప్పి ముందు దానికి చికిత్స చెయ్యాలని చెప్పా. ఇరవై ఏళ్లుగా తెగ గుట్కాలు తిని తిని గత అయిదేళ్లుగా నోరు తెరుచుకోవడం క్రమేపి తగ్గిందని చెప్పింది.
నోరు బాగా తెరుచుకునే రోజుల్లో బాగా తినేవాడట. నోరు మూసుకుపోయినప్పటినుంచి తినడం తగ్గిపోయిందట. తిండి లేకపోవడం నించి శరీరం క్షీణించి అస్థిపంజరంలా తయారయేదని అంది.
గుట్కా తంబాకు వాడేవారి జీవితాల శేషజీవితం ఇలానే వుంటుంది. అందుకే గుట్కా, తంబాకు వాడడం ఆపండి.. ఆపించండి.

చిత్రం బుగ్గలు గట్టిగా మారటం వల్ల నోరు తెరుచుకోలేక పోవటం

-డా. రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్