మెయిన్ ఫీచర్

నిష్కళంక భక్తి.. తిరుప్పావై పాశురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి, ధనుర్రాశిలో ప్రవేశించినపుడు వచ్చేది- ధనుర్మాసం.్ధనూరాశికి అధిపతి - బృహస్పతి. జ్ఞానప్రదాత ఈ మాసంలో అమ్మ గోదాదేవి స్వరూపాన్ని దిద్దుకుని తనంత తానుగా విల్లి పుత్తూరులోని విష్ణుచిత్తుని పూదోటలో పరిమళించింది. ఆ తల్లి గుబాళింపును తెలుసుకొని ఆనంద చిత్తంతో విష్ణుచిత్తుడు ఆ తల్లిని చేతుల్లోకి తీసుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ తల్లి విష్ణు చిత్తుని తండ్రిగా తలిచింది. తన తండ్రితో పాటు ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ మార్గోపదేశం చేయాలని సంకల్పించింది. మానవుల డోలా యమానమైన మనస్సును నిలకడ చేయడానికే తాను ప్రతిరోజు తులసి మాలలు కట్టి తాను ధరించి పెరుమాళ్ సేవకు పంపేది. ఇది తెలియని విష్ణుచిత్తుడు ఎంతో భక్తిగా పెరుమాళ్ కైంకర్యానికి వెళ్లేవాడు. కాని దివ్యతేజోమూర్తి మనకోసమే అవతరించి అమ్మ అనురాగాన్ని తండ్రి దయా ర్ద్రహృదయాన్ని లోకానికి తెలపాలి కదా అందుకే ఆ తల్లి ప్రతిరోజు తాను నాడు రేపల్లె గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతం చేయడానికి తన తోడి కన్యకలందరిని పోగుచేసింది. వారిని తోడు తీసుకొని రంగని దేవాలయానికి వెళ్లి ప్రతిరోజు రంగని అర్చించేది. తాను పాడిన తిరుప్పావై పాశురాలనుపాడేది. తన తోడివారిచేత పాడించేది. చివరకు ఓనాడు తండ్రి తీసుకెళ్లిన తులసిమాలలను అర్చకస్వాములు వెనుక్కు పంపించేశారు. విష్ణుచిత్తు మనసు కకావికలం అయంది. తాను మహాపరాధం చేశానని కలవరపడుతూ నిముషనిముషమూ ఆ వైకుంఠవాసునికి క్షమాప ణలు చెప్తూ కాలం గడిపాడు. మరుసటి రోజు యథావిధిగా అమ్మ గోదా తాను పూమాలల్లి తాను ధరించి చూచి మురిసి పెరుమాళ్ కు పంపించడం తండ్రి చూడనే చూచాడు. ఎంత అపరాథం జరిగిందని చెంపలు వేసుకుంటూ కన్నీరు ధారాపాతంగా కారుతుండగా తాను స్వయంగా పూలు తెంపి తులసి ఏరి మాలకట్టి పెరుమాళ్ తీసుకెళ్లగా ఎర్రనికళ్లతో తీక్షణంగా చూస్తూ ససేమిరా ఆ పూలమాలను ధరించలేదా పెరుమాళ్. మరింతగా దిగాలు పడిన విష్ణుచిత్తుని చూచి తన భక్తుల బాధను భరించలేని రంగస్వామి దర్శనమిఛ్చి విష్ణుచిత్తా చింతించకు. నాకు నీ తనయ అల్లి ధరించి ఇచ్చిన పూమాలలే నాకిష్టమైనవి. వాటినే నేను ప్రియంగా ధరిస్తాను. కనుక నీవు వాటినే తీసుకొనిరా అని చెప్పగా విస్తుబోయన విష్ణుచిత్తుడు అపారకృపాసాగరుడైన భగవంతుని నోరారా కీర్తిస్తూ తండ్రీ నా తనయ నీవే చేపట్టాలని మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. ఇక నీదే భారం అంతా నా తనయనే తులసి మాలలను నేను నీకు అర్పించుకుంటాను స్వామి అని చెప్పాడు. ఆ విష్ణుచిత్తుని మాట వినిన గోదాదేవి పరమానందంతో తండ్రి చెంతకు చేరి ఇక కాలవిలంబనమెందుకు తండ్రీ ఆ రంగడే నన్ను నిన్ను కరుణించాడు అని అనగా శ్రీరంగనికి శ్రీగోదా అమ్మకు అంగరంగవైభోగంగా కల్యాణం చేసి విష్ణుచిత్తుడు ఆనంద పరవశుడయ్యాడు. అందుకే ఆ సంగతినే స్మరించుకుంటూ ప్రతి ధనుర్మాసంలో కన్యకలందరూ గోదాపాశురాలను అనుసం ధానిస్తారు. వాకిళ్లను అందమైన ముగ్గులతో అలంకరించి స్వామి ఆగమానికి వేయ కనులతో ఎదురుచూస్తారు. నాటినుంచి కేవలం శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రశాయి ఆలయ ప్రాంగణంలోనే కాక ప్రతి వైష్ణవాలయంలోను తిరుప్పావై పాశురాలను అనుసంధానిస్తారు. గోదా కల్యాణాన్ని జరుపుతారు. మానవ జన్మనెత్తిన ప్రతివారు రంగని చేరుకోవడమే తమ లక్ష్యంగా తిరుప్పావైని భక్తిగా స్మరించుకుంటారు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన మూర్తి బృహస్పతి అమ్మనే. ఆ అమ్మే గోదాదేవి గోదాదేవి అనుగ్రహం కావాలంటే తిరుప్పావై అనుసంధానించడమే మార్గం.

- గున్న కృష్ణమూర్తి