మెయిన్ ఫీచర్

శునకాల నేస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాకేష్ శుక్లా వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రవృత్తిరీత్యా కుక్కల నేస్తం. ఈ రోజుల్లో కుక్కలను పెంచాలని ఎవరు ఇష్టపడతారు. మక్కువగా ఉండేవారు ఒకటి లేదా రెండు కుక్కలను పెంచుకుంటారు. మహా అయితే ఐదారు కుక్కలను పెంచుకోవచ్చు. కాని రాకేష్ శుక్లా మాత్రం దాదాపు 735 కుక్కలకు తండ్రిగా మారాడు.
కర్నాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ ముందు ఓ కారు ఆగింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగగానే ఒక్కసారిగా వందలాది కుక్క లు అతనిపై ఎగబడ్డాయి. అతన్ని కరుస్తాయని అనుకుంటున్నారా..? అవన్నీ అతన్ని ఆప్యాయంగా నాకుతున్నాయి. మొరుగుతున్నాయి. వాటి ఆనందం అంతా ఇంతా కాదు. ఓ కుక్క మెడ మీదకు ఎక్కి కూర్చుంది. మరొకటి చెవిని నాలుకతో నాకింది. అతను కూడా వాటిని చీదరించుకోకుండా వాటితో మాట్లాడుతున్నాడు. కొన్నింటిని పేరుపెట్టి పిలుస్తున్నాడు. అతనే రాకేష్ శుక్లా.
వీధి కుక్కలే అధికం..
శుక్లా వద్ద అన్ని జాతుల కుక్కలు ఉన్నాయి. కాళ్లు విరిగి, జబ్బుపడ్డ.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల కుక్కలను సైతం ఎంతో అపురూపుంగా పెంచటం అతనిలోని జీవకారుణ్యానికి నిదర్శనం. వీటి కోసం మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి అందులో అన్ని రకాల వసతులు ఏర్పాటుచేశాడు. బొచ్చుకుక్క పిల్లల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటుచేశాడు. శుక్లా పెంచే వాటిల్లో ఎక్కువ వీధి కుక్కలే. మిగిలినవి యజమానులు వదిలేసినవి. ఇటీవలనే ఓ యజమాని చనిపోతే అతని వద్ద ఉన్న 22 కుక్కలను తీసుకువచ్చి పెంచుతున్నాడు. ఇలా ఎన్నో రకాల కుక్కలు ఉన్నాయి. వాటిని పసి పిల్లలను పిలిచినట్లు పిలుస్తూ ముద్దుచేస్తుంటాడు.
తొలి కుక్క పేరు కావ్య
శక్లా భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరిద్దరూ వారంలో నాలుగు రోజులు ఈ కుక్కల ఫామ్ హౌస్‌కు వచ్చి వాటి సంరక్షణ చూస్తుంటారు. వీటి కోసం పది మంది పనివాళ్లను సైతం నియమించాడు. ‘‘గత పదేళ్ల నుంచి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేశాం. లగ్జరీ కార్లలో తిరిగినా.. విలాసవంతమైన జీవితాన్ని గడిపినా రాని ఆనందం వీటి పెంపకం వల్ల వస్తుందని’’ అంటాడు శుక్లా. అతని జీవితంలోకి తొలిసారి ప్రవేశించిన కుక్క పేరు కావ్య. ఇది అతనిలోని జీవకారుణ్యాన్ని తట్టిలేపింది. దీన్ని ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటే భార్య ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇక అతని జీవితంలోకి ప్రవేశించిన రెండవ కుక్క లకీ. దీన్ని రెండు నెలల తరువాత ఇంటికి తీసుకువచ్చి పెంచటం ప్రారంభించాడు.
ఇలా వీధుల్లో వర్షాలకు తడిసి, బాధగా మొరుగుతున్నా.. జబ్బు చేసి బాధపడుతున్నా.. అలాంటి కుక్కలను దగ్గరకు తీసుకుని పెంచటం ప్రారంభించాడు. రోజురోజుకు కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో వీటి కోసం తనకు ఎంతో ఇష్టమైన మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించి పెంచటం ప్రారంభించాడు. ఇటీవల కాలంలో ఈ ఫామ్ హౌస్‌పై చుట్టుపక్కల వారు ఫిర్యాదులు చేయటం జరిగింది. దీన్ని మూసేయించటానికి ప్రయత్నించినా శుక్లా నిరాకరించాడు. వీటితోనే మా జీవితం అని అంటాడు.

200 కేజీల చికెన్, 200 కేజీల రైస్
ఈ కుక్కల కోసం ఫామ్ హౌస్‌లో పదిమంది పనివాళ్లు పనిచేస్తుంటారు. అంతేకాదు వీటి ఆహారం కోసం 200 కిలోల చికెన్, 200 కిలోల రైస్ వండుతారు. ఇవి ఆడుకోవటానికి విశాలమైన స్థలం, స్విమ్ చేయటానికి కావల్సిన కొలనులు ఏర్పాటుచేశాడు. ఫామ్ హౌస్ చుట్టూ ఎన్‌క్లోజర్స్, కంచె ఏర్పాటు చేశాడు. అవి చక్కగా ఉండటానికి అవసరమైన డెన్స్ ఉన్నాయి. వీటి ఆరోగ్యం కోసం వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నారు. ఈ ఫామ్ హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో కాళ్లు విరిగిపోయిన కుక్కలే ఉన్నాయి. వీటి కోసం రోజుకు రూ.50,000లు ఖర్చు చేస్తాడు.