మెయిన్ ఫీచర్

ముందుకు సాగిపో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం అంత తేలిక కాదు. అందులోనూ మహిళలకు మరింత కష్టసాధ్యం. ఒకపక్క కుటుంబ బాధ్యతలు, మరోపక్క సమాజంలో ఎదురయ్యే వివక్షాపూరిత ధోరణులు... కొన్నింటిని సమన్వయం చేసుకుని, మరికొన్నింటిని దీటుగా ఎదుర్కొని ఇష్టమైన రంగంలో ఉన్నత స్థితికి చేరడం గర్వకారణం. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణమూ విలువైనదే. ప్రతి రోజూ లెక్కించదగిందే. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఎదురవుతున్న సవాళ్లను దాటుకుని కొందరు అలవోకగా ముందుకు సాగుతున్నారు. కాలక్రమంలో ఓ ఏడాది ముగిసింది. మరో కొత్త సంవత్సరం ముందుకొస్తోంది. ఎన్నో విజయాలకు సాక్షిగా నిలిచిన 2016 కాలగతిలో కలిసిపోతోంది. మరిన్ని విజయాలను అందించేలా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం...
ఎన్నడూ లేనివిధంగా ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ చేజిక్కించుకుని భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ పటంలో రెపరెపలాడించిన సింధూ వంటి క్రీడాకారిణులు స్ఫూర్తిదాయకంగా నిలవగా.. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తొలిసారి హిల్లరీ క్లింటన్ మహిళా అభ్యర్థిగా నిలబడటమే కాకుండా నువ్వా నేనా అన్న రీతిలో గట్టి పోటీనిచ్చి చరిత్ర సాధకురాలిగా తన పేరును లిఖించుకుంది. మరో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రిటన్‌లో రెండవసారి థెరిస్సానే ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఇక మన దేశానికి వచ్చేసరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, రంగాలలో మహిళా లోకం తమదైన అడుగుల ముద్ర బలంగానే మోపింది. తమ శక్తిసామర్థ్యాలను, ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పారు.

సుష్మాస్వరాజ్ : నెట్‌జన్ల మనసు దోచుకున్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్. పాస్‌పోర్టు పారేసుకున్నా.. వీసా రాకపోయినా చిన్న మెసేజ్ పెడితే చాలు. వెంటనే స్పందించి సదరు బాధితుడి హృదయానికి ఓదార్పునివ్వటంతో పాటు వెంటనే సమస్య పరిష్కారం అవుతుందనే రీతిలో స్పందించారు. ఇలా సోషల్ మీడియాలో ఓ కేంద్రమంత్రి తన శాఖకు సంబంధించిన సమస్యలపై వెనువెంటనే స్పందించటం అనేది అరుదు. అలాంటి ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. కొంతమంది కారు, ఫ్రిజ్ పాడైందని మెసేజ్ పెట్టినా చెరగని చిరునవ్వుతో ఆప్యాయంగా ఇది తన పరిధిలోనిది కాదని సమాధానం ఇచ్చి వారి మనస్సు దోచుకుంది. విదేశాలలో సంక్షోభం తలెత్తినపుడు సౌదీ అరేబియా వంటి దేశాలలో నుంచి 10,000 మంది కార్మికులకు సహాయ సహకారాలను అందించి తన శాఖ బాధ్యతలను నిర్వహించారు. అందుకే ఆమె నేడు కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే వందలాది మంది కిడ్నీ మేమిస్తామంటూ ముం దుకు రావటం ఆమె ప్రజల హృదయాలను దోచుకున్నదనటానికి నిదర్శనం.
హజీ అలీ దర్గాలోకి ప్రవేశం
ముంబయి హజీ అలీ దర్గాలో ఎన్నో ఏళ్ల తదనంతరం మహిళలకు నవంబర్ 29న ప్రవేశం లభించింది. మహిళలకు ప్రవేశం లేదని 2012లో నిషేధం విధించగా.. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ చేసిన న్యాయపోరాటానికి విజయం లభించింది. నాలుగు వందల ఏళ్ల నుంచి మహిళలకు ప్రవేశ అర్హత లేని శనిసింగణాపూర్ ఆలయంలోని ప్రధాన విగ్రహానికి పూజలు నిర్వహించి రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కును తృప్తిదేశాయ్ కాపాడింది.
అలియాభట్ : బాలీవుడ్ నటి అలియాభట్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తన నటనతో వీక్షకుల మనస్సు గెలుచుకుంది. ‘ఉడ్తాపంజాబ్’లో ఆమె నటనకు ఉత్తమనటి అవార్డును రెండు పదుల వయసులో సొంతం చేసుకుంది. ‘డియర్ జిందగీ’లో బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్‌ఖాన్‌తో నటించింది. రాబోయే కాలంలో అలియాభట్ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుందని సినీ విశే్లషకుల అంచనా.
సన్నీలియోన్ : శృంగార తార సన్నీలియోన్ ప్రముఖ సోషల్ మీడియా గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన తారగా నిలిచింది. లలిత కళలు, ప్రేమ తదితర అంశాలపై ఆమె ఇచ్చిన సమాధానాలు సైతం నెట్‌జెన్ల మనసు దోచుకున్నాయి. మీ కలలు సాకారం చేసుకోవటానికి ఒక మహిళగా హక్కు ఉంది. అవి నిజం చేసుకోవటం మీ బాధ్యత అంటూ ఈ శృంగార మహిళాలోకానికి ఇచ్చిన పిలుపు సైతం ఆకట్టుకుంది. దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాల తరువాత బాలీవుడ్‌లో తనకంటూ ఓ మార్క్‌ను సంపాదించుకుంది.

వ్యాపార సామ్రాజ్యంలోనూ మహరాణులు

వ్యాపార సామ్రాజ్యంలోనూ అతివలు ఎవ్వరికీ తీసిపోని విధంగా తమ ప్రతిభాపాటవాలు చూపుతున్నారు. నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న వీరు వ్యాపారాన్ని నలుదిశలా విస్తరిస్తున్నారు. బయోకాన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కిరణ్ మజుందార్ మూడు నెలలకొకసారి తన సంస్థ షేర్లు, లాభాలను వెల్లడిస్తూ పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుంటూ తన సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈమె వ్యాపార దక్షతను గమనించిన భారత ప్రభుత్వం సైతం ‘పద్మశ్రీ’, పద్మభూషణ్’ అవార్డులను ఇచ్చి సత్కరించింది.
అరుంధతీ భట్టాచార్య : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా నియమితులైన అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 25వ స్థానంలో నిలిచింది. చీఫ్ జనరల్ మేనేజర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించిన అరుంధతీ భట్టాచార్య తన హయాంలో బ్యాంక్ కార్యకలాపాలను విభిన్న రూపాల్లో విస్తరించారు.
చందా కొచ్చర్ : ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన చందాకొచ్చర్ రిటైల్ బ్యాంకింగ్ రంగానికి ఒక రూపాన్ని తీసుకువచ్చిన మేటి మహిళ. ఫోర్బ్స్ ఆసియా 50మంది బిజినెస్ ఉమెన్ జాబితాలో 22వ స్థానాన్ని సంపాదించుకుంది.
ఇంద్రానూయ: అరవై ఒక్క సంవత్సరాల ఇంద్రానూరుూ అమెరికాలో భారత సంతతికి చెందిన కార్యనిర్వహణాధికారిణి. అమెరికాలో ఇండియన్-అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఫోరమ్‌లో ఉన్న 19 మంది సభ్యులలో ఈమె ఒకరు. పెప్సికొ తొలి మహిళా సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారతీయ వనిత. చెన్నైలోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్నతనంలో అమ్మ ఆడించిన ఆటలే ఆమెలో ఆత్మవిశ్వాసం పాదుగొల్పాయని చెబుతారు.

క్రీడారంగంలో..
దేశం గర్వించేలా యువ క్రీడాకారిణులు తమ శక్తిసామర్థ్యాలను చాటుకున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం కలగా మిగిలిన వేళ ఈ ఏడాది బ్యాట్మింటన్‌లో సిందూ సిల్వర్ మెడల్ సాధించింది. అలాగే సాక్షీమాలిక్ రజితం సాధించింది. భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలి మహిళా జిమ్నాస్టిక్‌గా దీపా కర్మాకర్ పాల్గొని ఆమె ప్రదర్శించిన ఆటతీరు యావత్ భారతావనిని ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత కష్టమైన ప్రాడునోవా విన్యాసాన్ని ప్రదర్శించిన ఆమె ఒలింపిక్స్ పతకం సాధించేందుకు కఠోర దీక్షతో సాధన చేస్తోంది.
రికార్డు తిరగరాసిన దీదీ
రాజకీయ రికార్డులను తిరగరాసిన మరో రాజకీయ మహిళానేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జాతీయ పార్టీ అయిన కాం గ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీని స్థాపించటమే కాకుండా తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాంగ్రెస్‌ను కట్టడి చేయటంలోనూ, ముప్పై ఏళ్ల వామపక్ష రాజకీయ కోటను బద్దలుకొట్టి రెండవసారి ముఖ్యమంత్రి అవ్వటం విశేషం.

తిమ్మక్క: తిమ్మక్క పర్యావరణ ప్రేమికురాలిగా ఈ ఏడాది నిలిచింది. దాదాపు తన 80 ఏళ్ల జీవితంలో ఎనిమిదివేల మొక్కలను నాటింది. కర్ణా టకలోని హులి కాల్ గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలు స్వచ్చంధ సంస్థను స్థాపించి సేవ చేస్తుంది. దేశంలో బాలిక పుట్టిన వెంటనే ఓ మొక్క నాటితే ఆమె పెరిగినట్లే మొక్క కూడా పెరుగుతుందని, ఫలితంగా పచ్చటి ప్రకృతి, పసిమొగ్గలను అక్కున చేర్చుకుంటామని చెబుతుంది.
అనురాధారాయ్ : ఢిల్లీకి చెందిన అనురాధారాయ్ గొప్ప నవలా రచయిత్రి. చిన్నతనం నుంచి రచనావ్యాసంగం అంటే మక్కువ చూపారు. ఆమె కలం నుంచి వచ్చిన నవలలన్నీ సంచలనమే. తొలి నవల ‘యాన్ అట్లాస్ ఆఫ్ ఇంపాజిబుల్ లాంగింగ్’ పుస్తకం పలు భాషల్లో అనువాదమైంది. ఆమె రాసిని రెండవ నవల ‘ది ఫోల్డెడ్ ఎర్త్’ ఎకానిమిస్ట్ క్రాస్‌వర్డ్ గెలుచుకుంది. ఇటీవల రాసిన ‘స్లీపింగ్ ఆన్ జూపిటర్’ నవలకు ‘మ్యాన్ బుకర్ 2015కు నామినేట్ అయిన తొలి భారతీయురాలు కావటం విశేషం.
సవాళ్లకు ఎదురీత
నిత్యం కాల్పుల మోతలతో దద్దరిల్లే జమ్మూ కాశ్మీర్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ముఫ్తీ తండ్రి మరణంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్ష బాధ్యతలను చేపట్టి పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజలతో ఉండే ఆమె సవాళ్లను అధిగమించి కాశ్మీర్‌లో పాలన సాగిస్తున్నారు.
విషాద వీచిక
రాజకీయాల్లోకి ఎంతోమంది నటీనటులు వచ్చారు. వెళ్లారు. కాని చరిత్ర సృష్టించిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దక్షిణాదిలో చిత్రపరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ఎంజీఆర్, ఎన్టీయార్ వంటి అగ్ర నటుల సరసన ఓ నటి నిలిచి అందరూ ‘అమ్మ’ అని నోరారా పిలుచుకునే పురుచ్చితలైవి జయలలిత మరలిరాని లోకాలకు వెళ్లిపోవటం ఈ ఏడాది చోటుచేసుకున్న విషాద ఘట్టం. ఓ ప్రాంతీయ పార్టీ అధినేత్రిగా రెండు దశాబ్దాలకు పైగా రాణించిన విజయలలిత జాతీయ రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగారు.