మెయిన్ ఫీచర్

సాధికారితే శ్వాసగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక స్థిరత్వం, సాధికారిత కోసం అడుగులు వేసేందుకు సామాన్య గృహిణులు తపన పడుతుంటారు. ఇందుకోసం వ్యాపార ఆలోచనల దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారం చేయాలనే లక్ష్యం ఉంటే చాలు విజయం సాధించటం సులువు అని నిరూపిస్తున్నారు ఈ ఇరువురు మహిళలు. వనజ ఆయుర్వేద అగరబత్తీ తయారీదారురాలు, జయమని తాటి మొవ్వతో
గృహోపకరణాలు తయారుచేస్తోంది. తమ కాళ్ల మీద తాము నిలబడి మరికొందరికీ ఉపాధి కల్పిస్తున్నారు.
సాధారణ గృహిణులైన ఈ ఇరువురు మహిళలు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటూ సాధించిన వ్యాపార విజయం.
స్ఫూర్తినింపే వారి అనుభవాలు పంచుకుందాం..
**
బతుకు ‘సుగంధ’ భరితమే!

వనజది మధ్యతరగతి కుటుంబం. కడప జిల్లా, సాయినగర్ సొంతూరు. డిగ్రీ వరకు చదువుకున్నది. ఇద్దరు కుమార్తెలు. భర్త ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. గృహిణిగా ఉంటూనే కులవృతె్తైన చేనేత వర్క్‌ను చేస్తుండేది. ఆదాయం సరిపోయేదికాదు. దిగులు అవహించేది. అయినా నిరాశ, నిస్పృహలు పనికిరావని తనకు తాను సమాధానపరుచుకుంది. చేనేత వర్క్ చేస్తూనే, భర్త శ్రీనివాస్ ప్రోత్సాహంతో కుటీర పరిశ్రమలైన రసం, మిరప, టీ పొడులు, పచ్చళ్ళు తయారు చేసి విక్రయించేది. లాభాలకు ఆశపడలేదు. ఖర్చులకు తగ్గట్టు ఆదాయం వచ్చేది. అయినా, ఏదో సాధించాలనే పట్టుదల ఆమె మెదడను తొలిచేది. అంతే.. భర్తతో చిన్న అగరబత్తీల పరిశ్రమ పెడదామని మనసులోని మాట చెప్పింది. అందరిలాగా కాకుండా విభిన్నంగా వనమూలికలతో తయారు చేద్దామని.. సరికొత్త ఆలోచనలకు పదును పెట్టింది. భర్త భుజం తట్టడమే కాకుండా 2009లో బెంగళూరు వెళ్ళేటప్పుడు అక్కడ అగరబత్తీల సంగతిని తెలుసుకున్నారు. కొంత ముడిసరుకును తెచ్చారు.
నిజానికి మాకు ఎలా తయారు చేయాలో తెలీదు. పైగా ఆర్థిక సమస్యలు. సాయిసేవా పొదుపు సంఘంలో ఉండడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాను. ఇద్దరం పట్టువదలకుండా ప్రయోగాలు చేశాం. శ్రీనివాస్ సైన్స్ పట్ట్భద్రుడు కావడంతో కలిసొచ్చింది. వివిధ రకాల వనమూలికలను పొడిగా తయారు చేసి, వివిధ రకాలుగా మిళితం చేసి, వెలిగించి, సువాసన ను తెలుసుకునేవాళ్ళం. అలా దాదాపు 25నుంచి 30 వరకూ ప్రయోగాలు చేశాం. అన్నింటినీ ఓ పుస్తకంలో రాసుకునేవాళ్ళం. దాదాపుగా పదేళ్ళు పట్టింది. చివరకు ఆయుర్వేదంలో ఓ మూడింటిని ఎన్నుకున్నాం. అలాగే, తేలికైన రసాయినాల (సెంటెడ్)తో మరో మూడింటిని రూపొందించాం. ఈ ఆరింటి వల్ల ఆరోగ్యానికి హాని ఉండదు. వనమూలికలైన చందనం, తుంగముస్తలు, సాంబ్రాణితో ‘చందన ఆయుర్వేద అగరబత్తి’, ఆవునెయ్యి, ఆవుపేడ, హోమంలో వినియోగించే పదార్థాలు, వనమూలికలతో ‘హవన్ ధూప్’, కోస్టు, మర్మమం, ధమనం వనమూలికలతో ‘ఆయుర్వేద బత్తి’ని తయారు చేశాం. సెంటెడ్‌లో చందనం, జాస్మిన్, గులాబ్ పేర్లతో తయారుచేశాం. పచ్చళ్ళు అమ్మినట్టే ఇరుగు, పొరుగు వారికి, ఊర్లో వీటిని అమ్మగలిగాం. పావుకిలో నుంచి ప్యాక్ చేస్తున్నాం. మంచి ఆదరణ వచ్చింది. మార్కెట్‌లో ఈ రకం కొత్తగా ఉండడం, మనసుకు ప్రశాంతత కలిగించే సువాసనలు వెదజల్లుతుండడంతో ఆ నోటా ఈ నోటా ఊరురా తెలిసింది. మార్కెట్ పెరిగింది. ఇంటిల్లిపాది కాకుండా మరో పదిమంది వరకూ పనివాళ్ళను పెట్టుకున్నాం. దీని వల్ల వారికీ ఉపాధి కలుగుతుండడం నా కెంతో సంతోషంగా ఉంది. మార్కెట్‌ను విస్తరించాలన్న పట్టుదలతో కడప డిఆర్‌డిఎ, కృషి విజ్ఞాన కేంద్రం, ఐకెపి అధికారులకు సంప్రదించాం. ప్రశంసించి, సహకరించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు మా అగరబత్తీల సువాసనలు వెళ్తున్నాయి.
ఏడాదికి సుమారు అయిదు లక్షల వరకూ టర్నోవర్ జరుగుతుంది. ఒడిశా, కోల్‌కతా, రాజస్తాన్, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఖాతాదారులు ఉన్నారు. వనమూలికలతోనే ‘పూర్ణ’ అనే స్నానపు సబ్బును విడుదల చేశాం. కలబంద, తులసి, వట్టివేలు, కొబ్బరినూనె, నిమ్మగడ్డి నూనెతో తయారు చేశాం. ప్రతీ ప్యాక్ వంద గ్రాములు ఉంటుంది. అలాగే కొబ్బరి పీచు, వనమూలికల వేర్లతో శరీరాన్ని రుద్దుకునే వస్తువును కూడా తయారుచేశాం. వీటిని మార్కెట్ చేస్తునే ఈ కుటీర పరిశ్రమను మరింతగా విస్తరించాలనుకుంటున్నాం. మరో పది వరకూ ఉపాధి కలిగించడమే పుణ్యంగా భావిస్తూ ముందడుగు వేస్తున్నా.
**
భలేభలే తాటి మొవ్వు పువ్వులు

ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడిని కొట్టిపారేస్తూ.. సాటి స్ర్తీ సాధికారిత కోసం ఒకరికొకరు సాయం అందించుకుంటారు. ఈ మహిళా సంఘం సభ్యులు. విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన ఇందిరా ప్రియదర్శిని మహిళా సంఘం సభ్యురాలు వి.జయమని కూడా తోటి సభ్యుల సహకారంతో తలచిన కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. పర్యావరణంపై అమితప్రేమ గల ఈ సంఘం సభ్యులు ప్రకృతికి హాని తలపెట్టకుండా గృహోపకరణాలను తయారు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వల్ల కూలుతున్న తాటిచెట్ల నుంచి మొవ్వును తీసి, దాంతో గృహానికి అవసరమైన వస్తువులు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరికి ఖాదీ కమిషన్ శిక్షణ ఇచ్చింది. ద్వారాలకు వేలాడే పువ్వులు, ఇతర ఇంటి అలంకరణ సామగ్రి, స్కేల్ బాక్సు, టివీ రిమోట్, సబ్బు పెట్టెలు, వివిధ రకాల బుట్టలతోపాటు స్నా నం సమయంలో శరీరానికి రుద్దుకునే బీరకాయతో తయారు చేసిన పీచును విక్రయిస్తున్నారు. అంతేకాదండోయ్.. కళాత్మకతకు ఉట్టిపడేలా ఉండి, కనులకు ఆనందం కలిగించేలా ఈ కళాకృతుల కు సహజ రంగులు పూ స్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. గోరింటాకు, లేత టే కు చిగుళ్ళు, పటిక, ఉప్పు, పసుపు, కరక్కాయ, ఉల్లిపొట్టు, దానిమ్మ తొక్కలను కలిపి, వివిధరం గులు తయారు చేసి, ఆయా వస్తువులను అద్దుతున్నారు. ఈ రంగుల వల్ల ఆరోగ్యానికి ఎటువం టి హాని ఉండదని జయమని తెలిపారు. ప్రభుత్వం, స్నేహితుల సహకారంతోపాటు ఉత్తమమైన ఆలోచనలకు తమ పట్టుదలను కలిపితే ఎవరైనా తమ కాళ్ళమీద తాము నిలబడొచ్చని ఇందిరా ప్రియదర్శి సంఘం సభ్యులు నిరూపిస్తున్నారు.
**

చిత్రాలు..వనజ ,జయమని

- గున్న కృష్ణమూర్తి