మెయిన్ ఫీచర్

పఠనాసక్తిని పెంచేందుకు అలుపెరుగని పయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహనీయులంతా విలువైన పుస్తకాలలోని జ్ఞానాన్ని సంపాదించే తమని తాము తీర్చిదిద్దుకున్నారు. నేడు ఆధునిక టెక్నాలజీ యువతలో పుస్తక పఠనంపై మక్కువ పెంచలేకపోతుంది. ఫేస్‌బుక్‌లో పలకరింపులు, వాట్సప్‌లో భావాలను పంచుకోవటంతోనే కాలం గడిచిపోతోంది. మన చెంతనే ఉండే నేస్తం పుస్తకం. ఈ నేస్తాన్ని చేరువ చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు. దీని వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునే సత్తా మనలో కొరవడుతుంది. భారతీయులలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు, పుస్తకాన్ని చేరువ చేసేందుకు, జనం ఆలోచనలలో మార్పు తీసుకువచ్చే సంకల్పంతో ఆ ఇద్దరు యువతీ యువకులు కదిలారు. వారే శతాబ్ది మిశ్రా, అక్షయ రావత్రాయ్. వీరి ఆస్తి కేవలం ఓ మినీ వ్యాన్, నాలుగు వేల పుస్తకాలు. ఈ సంచార పుస్తక విక్రయ కేంద్రంతో ఇప్పటివరకు పదివేల కిలోమీటర్లు పయనించారు. పుస్తకాలను విక్రయంచి డబ్బు సంపాదించడం తమ ధ్యేయం కాదని, భారతీయులలో అంతరించిపోతున్న పుస్తక పఠనం విలువను తెలియజేసే సంకల్పంతోనే ఈ పయనం ఆరంభించామని వారు అంటున్నారు. 2015 డిసెంబర్‌లో ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి సంచార పుస్తక విక్రయ కేంద్రంతో ప్రయాణం ప్రారంభించారు. ప్రస్తుతం వీరు ఉత్తరప్రదేశ్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 2,000 పుస్తకాలు అమ్మామని చెబుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం వెళుతున్నారు. అక్కడ చదువుకున్నవారితో పుస్తక పఠనంపై మాట్లాడతారు. పుస్తకాలు చదివితేనే మనసులు తెరుచుకుంటాయని అర్థమయ్యేలా వివరిస్తారు. తమ ప్రయాణంలో అనేక విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయని వారు అంటున్నారు. ఓ టీచర్ తమతో మాట్లాడుతూ, తన 20 సంవత్సరాల అధ్యాపక వృత్తిలో 15-20 పుస్తకాలు మాత్రమే చదివానని, అది కూడా టీచింగ్‌కు సంబంధించిన పుస్తకాలేనని చెప్పటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. విద్యాబోధన చేసే టీచరే పుస్తక పఠనంపై ఆసక్తి చూపకపోతే ఆమె పిల్లల్లో ఎలాంటి మానసిక వికాసాన్ని కలిగిస్తుందని వీరు అంటున్నారు.
పాఠ్యపుస్తకాలకు సంబంధించిన దుకాణాలు మాత్రమే దేశంలో ఎక్కువగా నడుస్తున్నాయని, విలువైన గ్రంథాలున్న పుస్తకాల షాపులు క్రమంగా మూడపడుతున్నట్లు తమ ప్రయాణంలో గమనించామని వెల్లడించారు. చిన్న పట్టణాలలో సైతం ఒక్క లైబ్రరీ సైతం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజలు పుస్తకాలు చదవటానకి ఆసక్తి చూపటం లేదనేది అవాస్తమని, పుస్తకమే వారి వద్దకు చేరువ కావటం లేదని శతాబ్ది మిశ్రా అంటున్నారు. తాము విక్రయించే పుస్తకాల ధరల్లో దాదాపు 20-30 శాతం రాయితీ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ పయనంలో తాము ఎక్కువ ఖర్చులు కూడా పెట్టుకోవటం లేదంటున్నారు. వీరు ప్రయాణించే వాహనంలో విద్యుత్ సౌకర్యం లేదు, ఏసీలాంటి వసతి పెట్టుకోలేదు. సౌర శక్తితో వాహనంలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నామని వెల్లడించారు.
పుస్తక ప్రియులు ఎక్కువ మంది మాతృభాషలో ఉన్న పుస్తకాలను చదవటానికే ఇష్టపడుతున్నారని అన్నారు. కాబట్టి ప్రాంతీయ భాషా రచయితలు మంచి పుస్తకాలను పాఠకులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అక్షయ రావత్రాయ్ అంటున్నారు. 2014లో ఒడిశా రాష్టమ్రంతా పర్యటించామని, పాఠకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, ఈ స్పందన చూసిన తరువాతే దేశ వ్యాప్తంగా పయనిస్తున్నామని వెల్లడించారు. తమ వద్ద ఉన్న పుస్తకాల ఖరీదు అధికంగా లేదని, కేవలం రూ.200లకు మించి పుస్తకం ఖరీదు లేదని తెలిపారు. పుస్తకాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లినపుడే ప్రజా జీవనంలో వికాసం ఆరంభమవుతుందని అంటున్నారు. పేద ప్రజల జీవితాల గురించి ధనవంతులు రాస్తున్నారని, కాని పేద ప్రజలు తాము చేసే పని గురించి కనీస జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నారని, దీనికి కారణం శారీరక శ్రమకు అలవాటుపడుతున్నారే గానీ అక్షర జ్ఞానాన్ని సంపాదించటానికి మక్కువ చూపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని మార్పు తీసుకవచ్చేందుకు, పుస్తకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఈ చిరు సంకల్పం చేపట్టామని వెల్లడించారు. *