Others

అంధాల దంతసిరికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై ఏళ్లు పైబడిన స్వతంత్ర భారతంలో దంత వైద్యం మీద అవగాహన ఎంత దయనీయమైన స్థితిలో ఉందంటే- పన్ను అనవసరమైన అవసరం. ఉంటే ఆనందం లేకుంటే బ్రహ్మానందం. ‘‘పన్ను నొప్పి ఉంటేనే దంత వైద్యం అవసరం’’, ‘‘పన్ను నొప్పి పెడితే దానిని తీయించేసుకోటమే చికిత్స’’, ‘‘నొప్పి లేకపోతే అన్ని పళ్లు చాలా బావున్నట్లు లెక్క’’- ఇలా ఉంది గ్రామాల్లో వుండేవారి చాలామంది ఆలోచన. ఓసారి ఓ బాధితుడు తన పన్నులో చాలా నొప్పి ఉందని వచ్చాడు. చూసి, పుచ్చు తీసేసి రూట్ కెనాల్ చేశాను. తీసిన పురుగుని చూపించమన్నాడు, నేను అవాక్కయ్యాను. ‘‘పురుగేంటి’’ అని అడిగా. ‘‘పన్నుకి పురుగు పట్టి నల్లగయింది, పురుగు తీసేసుంటారుగా చూపించండి’’ అన్నాడు. ఇదెవరు చెప్పారని అడిగా. కిందటిమారు ఎక్కడికో వెళితే వాళ్లు పన్నులోంచి పురుగుని తీసి చూపించారట. అలా ఉండదు, పన్నుకి పుచ్చు పడుతుంది, పురుగు పట్టదు. పుచ్చు క్రిముల వల్ల పడుతుంది అని విడమరచి చెప్పా. ససేమిరా ఒప్పుకోలేదు. పురుగు చూపిస్తేనే నమ్ముతానన్నాడు. ‘‘కిందటిసారి వాళ్లు పురుగు చూపించారు, మీరు చూపట్లే, మీ చికిత్స తప్పని ఆరాతీశాడు’’. ఇలా లాభం లేదని తనని ఓ మాట అడిగా ‘‘కిందటిసారి పురుగు తీసేస్తే పన్నులో నొప్పి రాదుగా ఎందుకు వచ్చింది?’’ తను జవాబివ్వలేకపోయాడు. నాకు తన మీద జాలేసింది. ఎంత సులువుగా ఎవరేం చెపితే జనాలు అది నమ్మేస్తారనిపించింది. తనకి పూసగుచ్చినట్టు పుచ్చంటే ఏంటి, ఎలా వస్తుందన్నది వివరించా. తనేం మాట్లాడలేదు, బహుశా అర్థమయిందనుకుంటా. తనకి భరోసా ఇవ్వడానికి ‘‘ఈసారి నీకా పన్నులో నొప్పివస్తే నువ్వు కట్టిన పూర్తి డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తా’’ అన్నా. నవ్వి సరే అన్నాడు. ఇలా ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తున్నారా? ఇది మన భాగ్యనగరం కథ.
పన్నులోంచి పురుగు తీసే పెద్ద మనుషులు మన హైదరాబాలోనే ఉన్నారు. ఇంటింటికీ ఇంటర్‌నెట్ ఉండే హైదరాబాద్‌లో ఈ తీరైతే, ఇక కరెంటు కూడా సరిగా లేని గ్రామాలలో ఏ తీరై ఉంటుందో ఊహించవచ్చు. మన అవగాహన బట్టి మన ఆలోచన ఉంటుంది. మన ఆలోచన బట్టి మన నడవడి వుంటుంది. మనిషిలో సమస్య ఉంటే చికిత్స చేయగలం, కాని మన ఆలోచనా విధానమే ఓ సమస్య అయితే అది సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. అందుకే దంత వైద్యంపై అవగాహన పెంచుకోవాలి.
పళ్లలో నొప్పి లేకపోతే అన్ని పళ్లు బావున్నట్టే
ఇది చాలా పెద్ద పొరపాటు. మనం ఊరు దాటి కారులో బయటికెళితే కారు బాగా ఉందా లేదా అని ఓసారి మెకానిక్ వద్ద చూపించుకుంటాం. ఏడాదికొకసారి మనం నడిపే బండిలో ఏ సమస్య లేకపోయినా సర్వీస్‌కిస్తాం. మరి పళ్లని ఏడాదికోసారి దంత వైద్యుడికి ఎందుకు చూపించుకోము? దంత వైద్యశాస్త్రం ప్రకారం ఏడాదికోసారి దంతవైద్యుడిని కలిసి, చూపించుకొని, పళ్ల క్లీనింగ్ చేయించుకోవడం ఉత్తమం. అలా చేస్తే మీకు కనిపించని, అనిపించని ఎన్నో సమస్యలను మొదట్లోనే నివారించుకోగలం. ప్రతి పన్నుకి నొప్పి రావాలన్న రూల్ లేదు. పన్ను నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అనుభవించిన వాళ్లని అడగండి, చెబుతారు. అలాంటి పంటినొప్పులని అరికట్టగలుగుతాం. సమస్య పెద్దదిగా కాకుండా ఆపగలుగుతాం. ఓసారి ఆలోచించండి.
పన్నులో నొప్పి వస్తే తీసేయాలి..
ఇది మరో పెద్ద దురాలోచన. 1960లో అలా చేసేవారేమో. ఇప్పుడు మాత్రం ఏం చెయ్యలేని, అత్యవసర పరిస్థితులలో తప్పితే ఏ పన్నుని (జ్ఞానదంతం తప్ప) తీయం. పన్ను తీయడం దంత వైద్య శాస్త్రం ప్రకారం వ్యతిరేకం. పళ్లులేని వారు ఓ రకమైన వికలాంగులతో సమా నం. పన్ను తీసేయాలన్న ఆలోచన తొలగించుకోండి, సలహా ఇవ్వడం మానుకోండి.
పళ్లు తోమడం, పుక్కిలించడం
ఓ పెద్దమనిషి తను చల్లని పదార్థాలు తాగితే తన పళ్లు ‘జిల్’ అంటున్నాయన్న సమస్యతో వచ్చాడు. పైగా, ‘‘నేను రోజుకి పది నిమిషాలు పళ్లు తోముతా సార్’’ అని గర్వం గా చెప్పాడు. పళ్లు అంతసేపు తోమితే అరిగిపోతాయి. పళ్లు రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు తోమద్దు. పళ్లు తోమడంతో పాటు పుక్కిలించడం చాలా మంచిది. పళ్లు తోమటం ఇల్లుని ఊడ్వడం లాంటిది. ఊడిస్తే దుమ్ము పోయినట్టు పళ్లు తోమితే పం టికి అంటి వున్న, సందుల్లో ఇరుక్కున్న తిండి పదార్థాలు పోతాయి. పుక్కిలించడం ఇంటి ని ఫినాయిల్‌తో తుడవడం లాంటిది. దానివల్ల క్రిములు (మన పుచ్చుకు కారణమైనవి) నశిస్తాయి. పుక్కిలించే మందుని పుక్కిలించడం మహామంచిది. ఖరీదనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలించండి.
పిల్లలలో అవగాహన
మనకెట్లానో అవగాహన తక్కువ, మనం సరైన విధానాల్ని తెలుసుకొని పిల్లల్లోనైనా ఆ అలవాట్లను పెంపొందిద్దాం. ఓ సంవత్సరం నిండిన పిల్లలనుంచి ఈ అలవాట్లను ప్రోత్సహిస్తే మంచిది. వారిని బలవంతపెట్టకుండా వారికే బ్రష్ ఇచ్చి మీ ముందు నించోబెట్టి మీరు మీ పళ్లని తోమండి. వాళ్లు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. మెల్లిగా వాళ్లు తోమడం మొదలుపెడతారు. కొంచెం పెద్దయ్యాక పళ్లు తోమితే తప్ప వారితో మాట్లాడడం కాని, పాలు, టిఫిన్ ఇవ్వడం లాంటివి చెయ్యకండి. క్రమంగా క్రమశిక్షణ అలవాటు చేయండి.
ఓసారి ఓ పధ్నాలుగేళ్ల కుర్రాడు స్కూల్ పిక్నిక్ అని వేరే ఊరు వచ్చాడు. ఉదయానే్న నిద్రలేచి రూమ్ బయటికి పరుగులు తీశా డు. ఎప్పటికీ రాకపోయేసరికి వాళ్ల మాష్టారు ఎక్కడికెళ్లాడని అందరినీ అడగసాగాడు. తనకి తెలిసిందేంటంటే, ఆ పిల్లవాడు కొత్త ఊరులో కిరాణా షాపుని వెతుక్కుంటూ పోయాడు. కాసేపయాక హోటల్ కింద ఆ పిల్లవాడు కనబడగానే వాళ్ల మాష్టారు ‘ఎక్కడికెళ్లావురా?’ అని అడిగాడు. ‘షాపుకని’ సమాధానమిచ్చాడు ఆ పిల్లవాడు. ‘‘ఇంత పొద్దునే్న నిద్రలేవగానే షాపుకెందుకు? అంత ఆపుకోలేని అవసరం ఏంటో? సిగరెట్ తాగటానికా? చాక్లెట్ తినడానికా?’’ అని మందలిస్తూ అడిగాను. ఆ పిల్లవాడు జేబులోంచి టూత్‌బ్రష్ తీసి ‘తెచ్చుకోవడం మర్చిపోయా, పళ్లు తోమకుండా నేను ఎవరితోను మాట్లాడను మాష్టారుగారు’’ అని సమాధానమిచ్చాడు. తన తల్లిదండ్రులు ఆ అలవాటుని అంతలా తన మనసులో నాటారు. అందమైన నవ్వుతో, అన్ని కొరకగలిగే శక్తితో ఆనందంగా ఉండవచ్చు.
**
-డా. రమేష్ శ్రీరంగం,
సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డా. రమేష్ శ్రీరంగం, సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com సర్జన్, ఫేస్ క్లినిక్స్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్