మెయిన్ ఫీచర్

ముష్కరులపై మడమ తిప్పని పోరాటం -- సర్యా మహిళల తెగువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని అక్కడి మహిళలు ఎదురు చూడరు!
ఎందుకంటే నిత్యం జీవన్మరణ పోరాటమే.
తమను తామేకాదు గ్రామాన్ని సైతం రక్షిస్తూ ముష్కరలపై మడప తిప్పని పోరాటం చేస్తున్నారు!
వారే.. జమ్మూ కాశ్మీర్‌లోని సర్యా గ్రామ మహిళలు. ఎ.కె. 47 తుపాకులు, రైఫిళ్లు, 56 కాలిబర్ రివాల్వర్లను తేలిగ్గా ఉపయోగించగలసత్తా కలవారు. సర్యా గామం జమ్మూ కాశ్మీర్‌లోని ఇం డో పాక్ లైన్ కంట్రోల్‌కు అత్యంత దగ్గరలో ఉంటుంది. ఈ కారణంగా అక్కడ తరచూ పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతుంటాయి. ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని కాపలాకాస్తున్నా.. పాక్ నుండి ఇండియాలోకి అక్రమంగా జొరబడేవారి వల్ల దేశంలో అల్లకల్లోలం చెలరేగటం సర్వసాధా రణ మైంది. 1990లో పాక్ నుండి భారత్‌లోకి అక్రమంగా వంద లాదిమంది టెర్రరిస్టులు సర్యా గ్రామంలో కాలు పెట్టి గ్రామాన్ని రణరంగంగా మార్చేసి భారత్‌లోని వివిధ ప్రదేశాల వైపు సాగిపోయారు. పోనీ మిగిలిన ప్రదేశాలను వదిలేసి ఇక్కడ కాపలా కాయాలంటే అది రక్షణ దళాలకు తలకు మించిన పని కావడంవల్ల మిలటరీ దళాలు బాగా ఆలోచించి సర్యా గ్రామంలో నివసించే పలువురు మహిళలతో సమాలోచనలు జరిపారు.
మగవారు రోజువారీ పనుల్లోకి వెళ్లిపోతే ఇంటివద్ద మహిళలే ఉంటారు కనుక వారికి శిక్షణ ఇవ్వాలని, తమ గ్రామాన్ని వంతులవారీగా వారే రక్షించుకునేటట్లు తీర్చిదిద్దితే సమస్య పరిష్కారం అవుంతుందని ఆలోచించి గ్రామంలోని వారి తో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. పాక్ నుండి అక్రమంగా భారత్‌లోకి చొరబడే వారి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు గ్రామంలోని మహిళలకు ఆయుధాలు ప్రయోగించడంలోను, వైర్‌లెస్ సెట్లను ఉపయోగించడంలోను శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అయితే దీనికి సర్యా గ్రామంలోని పురుషులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.టెర్రరిస్టులు, ఉన్మాదులతో మేమెలా పోరాడగలం? ఆ పని మీది కదా అన్నారు.
ఆ సమయంలో ఒక ధీర లేచి నిలబడింది.అంతా ఆమెవైపే చూశారు.
ఆమె ఎవరో కాదు గ్రామానికి చెందిన రేనూబాల. ప్రాథమిక విద్య పూర్తిచేసి తల్లిదండ్రులు ఇక వివాహం చేసేద్దాం అనుకుంటన్న రేనూబాల మాట్లాడుతూ- ‘మేము శిక్షణ తీసుకుంటాం. మా గ్రామంలోకి పాక్‌కు చెందిన పురుగును కూడా అడుగుపెట్టనీయం’ అంటూ దృఢ సంకల్పంతో అధికారులకు తెలిపింది.
ఆమె అలా ప్రకటించగానే అప్పటి వరకు వౌనంగా
చూస్తున్న మిగిలిన మహిళలంతా ‘అవును.. మా గ్రామాన్ని మేము రక్షించుకుంటాం.. భారత్‌మాతాకీ జై’ అంటూ పెద్దపెట్టున నినదించారు. మహిళల్లో పెల్లుబికిన ఈ చైతన్యానికి, తెగువకు మిలటరీ అధికారులు సంతోషించి మొత్తం 450 మం దిని ఎంపిక చేశారు. వారందరికీ నాయకురాలిగా రేనూబాలను నియమించి తుపాకులు పేల్చ డం, వైర్లెస్ సెట్లలో కాంటాక్ట్ చేసి మిలటరీ అధికారులతో ఎలా సంభాషించాలో నెల రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
దుర్బేధ్యంగా సర్యా
ఇప్పుడు రేనూబాల నాయకత్వంలో మొత్తం 450 మంది మహిళలు విలేజ్ డిఫెన్స్ కమిటీగా ఏర్పడి సర్యా గ్రామాన్ని దుర్బేధ్యంగా తయారుచేశారు. ఉదయం ఆరు నుండి రెండువరకు ఒక బృందం, రెండు నుండి ఎనిమిదివరకు మరొక బృం దం, రాత్రి ఎనిమిది నుండి మర్నాడు తెల్లవారి ఎనిమిది వరకు ఇంకొక బృందం సర్యా గ్రామం చుట్టూ దడిలా కాచుకుని పాక్ నుండి చీమ కూడా చొరబడకుండా కాపు కాస్తున్నారు.
ఎప్పుడైతే రేనూబాల నాయకత్వంలో ఈ విధం గా రక్షణ వలయం ఏర్పాటు చేయబడిందో ముష్కరుల కార్యకలాపాలకు చెల్లుచీటి పడింది. ఆ ప్రయత్నంలో ఎంతోమంది పాక్ తీవ్రవాదులు, టెర్రరిస్టులు సర్యా మహిళల చేతిలో చావుదెబ్బతిన్నారు. అప్పటినుండి వారు తమ ప్రయత్నాలు విరమించుకున్నారు.
ఇది తమకు లభించిన అదృష్టం
దీని గురించి రేనూబాల మాట్లాడుతూ పాక్ టెర్రరిస్టులను తమ గ్రామంలోకి అడుగుపెట్టనీయకుండా నిలువరించే బృహత్తర కార్యంలో పాల్గొనే అదృష్టం తమకు కలిగిందని, భారతమాతకు సేవ చేసుకునే ఒక అపురూపమైన కార్యక్రమంలో మిలటరీ అధికారులకు చేదోడు వాదోడుగా నిలవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపింది.
ఇదొక స్ఫూర్తిగా మారి నేడు విలేజ్ డిఫెన్స్ కమిటీలో సభ్యులు కానివారు కూడా గ్రామ రక్షణకు తమ వంతు పాటుపడుతున్నారని తెలిపింది.

- నీహారిక