మెయిన్ ఫీచర్

జోరుమీదున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు-
ఏయే హీరోలు ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏడాదిలో ఎన్ని సినిమాలు చేస్తున్నారన్న? ప్రశ్నలు ఉద్భవించేవి. గత కొనే్నళ్లుగా పరిస్థితి మారింది. టాప్ రేంజ్‌కు చేరిన హీరోలంతా తాపీగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి ఒకటో రెండో టార్గెట్ చేసుకుని -స్క్రీన్స్‌కు వస్తున్నారు.
ఒకప్పటి ఆ ఒరవడిని- ఇప్పుడు
హీరోయిన్లు అందుకున్నారు. ఫలానా హీరోయిన్ చేతిలో అచ్చంగా ఈ ఏడాది ఐదారు ప్రాజెక్టులున్నాయని చెప్పుకునే రేంజ్ చూపిస్తున్నారు. చేస్తున్న ప్రాజెక్టు పెద్దదా? చిన్నదా? అన్న ప్రశ్నలకు తావులేకుండా -ఏకబిగిన సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోయిన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అందచందాలు, అంతకుమించి పెర్ఫార్మెన్స్‌తో తామేంటో నిరూపించుకున్న సీనియర్లు, ఫ్రెష్ హీరోయిన్లు ఈ ఏడాది మంచి ఊపుమీదే కనిపిస్తున్నారు.

లెక్కపెట్టడానికి లెక్కలేనంతగా తెలుగు తెరకు హీరోయిన్లు వస్తున్నా -కెరీర్‌ను టాప్‌గేర్‌లో పరిగెత్తిస్తున్నది కొంతమందే. సీనియర్లుగా హవా కొనసాగిస్తున్న వాళ్లు కొందరైతే, ఒకట్రెండ్ చిత్రాలతోనే కెరీర్‌కు టాప్‌గేర్ వేసినోళ్లు ఇంకొందరు. ఈ జాబితాలోవున్న హీరోయన్ల కెరీర్ ప్లాన్ -కొత్త ఏడాదిలో కాస్త గట్టిగానే కనిపిస్తోంది. క్యాలెండర్ మారగానే కొత్త లక్ష్యాలు పెట్టుకుని ఏదో సాధించేస్తామంటూ ప్రగల్ఫాలు పలికేవాళ్లను పక్కనపెడదాం. -వేసుకున్న ప్రణాళికలు, నిర్దేశించుకున్న లక్ష్యాలతో ముందుకు దూసుకెళ్లేందుకు ఉత్సుకత చూపుతున్న వాళ్లను ప్రస్తావిస్తే..
**
సౌత్‌లో కుదురుకుని -నార్త్‌లో కెరీర్‌ను పరిగెత్తించేందుకు ప్రణాళికలు వేసే హీరోయిన్ల సంఖ్య తక్కువేం కాదు. కానీ, సౌత్‌లో అరంగేట్రం చేస్తూనే.. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ పట్టేసిన బ్యూటీగా -మెహ్రీన్ కౌర్‌ను ప్రస్తావించాలి. ఆ ధైర్యంతోనే ‘2017లో ఇరగదీయడం ఖాయం’ అని తనకొస్తున్న పాత్రల మీద ఒట్టేసి మరీ చెబుతోంది. కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో పరిచయమైన మెహ్రీన్ -ఒక్క సినిమాలో చూపించిన టాలెంట్‌తో ఏడు ప్రాజెక్టులు పట్టేసింది. నిజానికి -ఇప్పటికే కుదురుకున్న హీరోయిన్లకంటే మెహ్రీన్ టాప్ స్పీడ్‌లో, వెరీ బిజీగా ఉంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని.. టాలీవుడ్ -కోలీవుడ్ మధ్య చక్కర్లు కొడుతూనే బాలీవుడ్‌కూ పరుగులు పెడుతోంది. ఏడు ప్రాజెక్టులను గ్యాప్ లేకుండా చేసేసేందుకు మెహ్రీన్ ప్రణాళికలు సిద్ధం చేసిందట. అందుకనుగుణంగానే కసికొద్దీ పని చేస్తోందని అంటున్నారు. బాలీవుడ్ క్రేజీ మూవీ ‘్ఫలౌరీ’లో కీలకమైన పాత్రకు సైన్ చేసిన మెహ్రీన్ -ఈ సినిమాతో అక్కడా మంచిపేరు వస్తుందని ఆశిస్తోంది. సినిమాలో పంజాబీ పిల్లగా అలరిస్తానని, ఆ పాత్రతో బాలీవుడ్‌లో తనకు పర్మనెంట్ ప్లేస్ దొరకడం ఖాయమని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇక తెలుగు తమిళంలోనూ మెహ్రీన్ సినిమాలు తక్కువేం లేవు. వరుణ్‌తేజ్, సాయిధరంతేజ్, శర్వానంద్, సందీప్‌కిషన్.. లాంటి కుర్ర హీరోలతోపాటు మాస్ మహరాజా రవితేజ సరసనా ఛాన్స్ పట్టేసింది. సందీప్‌కిషన్‌తో చేస్తున్న ద్విభాషా చిత్రంతో కోలీవుడ్‌లోనూ అరంగేట్రం చేయనుంది. ‘కెరీర్ ప్రారంభించిన దశలోనే మూడు భాషల ఇండస్ట్రీల మధ్య చక్కర్లుకొట్టే గొప్ప చాన్స్ వచ్చింది. ఇది నా అదృష్టం ఒక్కటే కాదు, టాలెంట్ కూడా’ అని నమ్మకంగా చెబుతోంది మెహ్రీన్.
**
థర్టీ ప్లస్ తరువాత కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన నయనతారకు -ప్రస్తుతం సౌత్‌లో పోటీ హీరోయిన్ లేదనడం అతిశయోక్తి కాదు. కొన్ని క్యారెక్టర్లకు తన పెర్ఫార్మెన్స్‌తో బలం చేకూర్చడమే కాదు, కొన్ని పాత్రలకు ఆమె మాత్రమే న్యాయం చేయగలదన్న పేరు తెచ్చుకుంది. ఇటు స్టార్ హీరోలతో కెమిస్ట్రీ పండిస్తూ, అటు మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తూ... కుర్ర హీరోలతోనూ జతకడుతూ దూసుకెళ్తోంది మలయాళ కుట్టి. గత ఏడాది నాలుగైదు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నయన్, ఈ ఏడాది అరడజను భారీ చిత్రాల్లో నటిస్తోంది. తాజా లెక్కలు ప్రకారం నయన్ ఐదు ప్రాజెక్టులకు సైన్ చేసినట్టు సమాచారం. తాజాగా మరో భారీ ప్రాజెక్టుకూ కాల్షీట్లు ఇచ్చినట్టు వినికిడి. అదీ, మహిళా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ నయన్‌ను లీడ్ రోల్‌లో పెట్టి చిత్ర నిర్మాణానికి సిద్ధమైందట. ఈమధ్య ఎక్కువగా కొత్త, అప్‌కమింగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న నయన్.. ఈసారి భరత్ కృష్ణమాచారి అనే డెబ్యూ డైరెక్టర్‌తో సినిమాకు ఓకే చెప్పింది. ఇదొక థ్రిల్లర్ మూవీ అని, షూట్ మొత్తం యూరోప్‌లో చిత్రీకరిస్తారని వినికిడి. నయన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇదే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగానూ చెబుతున్నారు. గత ఏడాది మాయ (తెలుగులో మయూరి)తో మంచి టాక్ అందుకున్న నయన్‌కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుసకడుతున్నాయి. ఆల్రెడీ ‘డోర’ హార్రర్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. దీంతోపాటు ఆమె ఖాతాలో నాలుగు సినిమాలున్నాయి. నయన్ జోరు చూస్తుంటే ఇంకో రెండు మూడేళ్లు తిరుగులేనట్టేనని చెప్పక తప్పదు.
***
అందరికీ కలిసొచ్చిన ‘బాహుబలి’ ప్రాజెక్టు -తమన్నాకు మాత్రం పెద్దగా పేరు తెచ్చిందేమీ లేదు. బాహుబలి ప్రాజెక్టులో ఉన్న వాళ్లందరికీ ఎంతొకొంత లాభం చేకూరినా -తమ్మూ బేబీ మాత్రం కూరలో కరివేపాకులా మిగిలిపోయింది. తమ్మూ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేకపోవడంతో -స్టార్‌లా దూసుకుపోతుందనుకున్న కెరీర్ ఒక్కసారిగా చల్లబడిపోయింది. అందుకే తమ్మూకి బాహుబలి తరువాత చెప్పుకోతగ్గ చాన్స్‌లు పడలేదు. పైగా -్భరీ అంచనాలతో వచ్చిన అభినేత్రి ఘోరంగా విఫలమైంది. అభినేత్రితో ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయం సాధిస్తానని ఆశించిన భాటియాకి చుక్కెదురైంది. తప్పని పరిస్థితుల్లో అవకాశాల కోసం స్కిన్ షోని ఆశ్రయించినా -అడపాతడపా అవకాశాలే తప్ప కెరీర్‌కు భరోసానిచ్చే ప్రాజెక్టు ఒక్కటీ పడలేదు. పెద్ద సినిమాల్లో అవకాశాలు కరవై, విశాల్‌లాంటి హీరోలతోనే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. చివరకు విశాల్ చిత్రంలోనూ తమన్నా ఎక్స్‌పోజింగ్‌నే నమ్ముకుందంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. చేసిన హీరోయిన్లతోనే మళ్లీ మళ్లీ చేస్తున్న సీనియర్ హీరోలు సైతం, డేట్స్ ఖాళీ ఉన్నాయని చెబుతున్నా తమన్నాను పట్టించుకోవడం లేదట. రెండుమూడు ప్రాజెక్టులు చేతిలోవున్నా -మిల్కీ బ్యూటీకి గొప్ప బ్రేక్ దొరికే సినిమాలైతే లేవనే చెప్పాలి. తమిళంలో రీమేక్ అవుతున్న ‘క్వీన్’, ‘అన్బవన్...’, ‘యెన్ ఎండ్రు కాదల్ ఎక్బెన్’, ‘మెరిసల్’ వంటి ప్రాజెక్టులు వర్కవుటైతే మిల్కీ బ్యూటీ ఇమేజ్‌కు మాత్రం డామేజ్ ఉండదని అనుకోవచ్చు.
***
గ్లామర్ భామ త్రిష కెరీర్ మళ్లీ ఫాంలోకి వచ్చేసింది. జెట్ స్పీడ్‌తో సాగుతోంది. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పూర్తిచేసిన త్రిష -తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి కథల ఎంపిక, పాత్రలు అందిపుచ్చుకునే విషయంలో విభిన్నత, వైవిధ్యాన్ని ప్రదిర్శిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అరడజనుకు పైగా కొత్త ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. వీటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్టులూ ఉండటం గమనించాల్సిన విషయం. విజయ్ సేతుపతితో కెమిస్ట్రీ పండించేందుకు ‘96’ టైటిల్‌తో వస్తున్న చిత్రానికి సైన్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుగా ‘1818’ టైటిల్‌తో వస్తున్న మరో చిత్రంలోనూ చెన్నై చిన్నదానికి చాన్స్ దొరికింది. మైండ్ డ్రామా కానె్సప్ట్‌తో రితున్‌సాగర్ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రాన్ని -తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. 2008లో ముంబై దాడుల నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు చెబుతున్నాడు. కథనంలో ఎక్కడా స్పీడ్ తగ్గకుండా ఆద్యంతం ఆసక్తిగాసాగే స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అంటున్నాడు రితున్‌సాగర్. సో.. త్రిషకు ఇదో గొప్ప చాన్స్ కావొచ్చు.
***
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ జోరు మామూలుగా లేదు. ఒక్క ఏడాదిలో టాలీవుడ్‌లో హ్యాట్రిక్ అందుకుంది. చేస్తున్న ప్రాజెక్టు రిజల్ట్‌తో సంబంధం లేకుండా -రకుల్‌కు డిమాండ్ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో.. బన్నీతో సరైనోడు.. ఏడాది చివర్లో రామ్‌చరణ్‌తో ధృవ.. ఇలా పెద్ద హీరోల వరుస ప్రాజెక్టులతో రకుల్ రేంజ్ పెరిగిపోయిందని అంటున్నారు. ఈ బ్యూటీ ఈ ఏడాదీ ఇదే ఊపు కంటిన్యూ చేయబోతోందన్న టాక్ ఉంది. న్యూ ఇయర్ ఆరంభంలోనే చేయబోతున్న ప్రాజెక్టుల్లోని కొత్త పోస్టర్లతో రకుల్ హంగామా నడిచింది. వీటిలో మెగా మూవీస్ సందడే ఎక్కువగా ఉంది. తాజాగా సాయిధరంతేజ్ లేటెస్ట్ మూవీ ‘విన్నర్’లో చేయబోతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా గ్లామర్ సప్లయి విషయంలోనూ రకుల్ ఏమాత్రం మొహమాటం చూపటం లేదు. ప్రాజెక్టు ప్రాజెక్టుకూ గ్లామర్ డోస్‌ను పెంచుతూ -తన దరిదాపుల్లో ఎవరూ లేకుండా చూసుకుంటోంది రకుల్. ఇప్పటికే నాలుగైదు ప్రాజెక్టులకు సైన్ చేసిన ప్రీత్‌సింగ్ -ఈ ఏడాదీ సక్సెస్ రేట్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని అంటున్నారు.
**
అందం చందం ఆహార్యం.. వీటన్నింటికీ మించి పెర్ఫార్మెన్స్. ఈ క్యాలిటీలతో చిత్ర పరిశ్రమకు ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు దొరుకుతారు. ఈ క్యాటగిరీలో ఈసారి -మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌ను చేర్చాలి. అచ్చమైన తెలుగు పిల్లలా మురిపిస్తున్న కొత్త హీరోయిన్‌లా ఆమెకు క్రెడిట్స్ దొరికాయి. వరుసగా పల్లెటూరి పిల్ల క్యారెక్టర్లు చేయడం, తాజాగా శర్వానంద్‌తో ‘శతమానంభవతి’లోనూ తెలుగుదనాన్ని రుచి చూపించటంతో.. టాలీవుడ్‌లో పక్కింటి పిల్ల మార్కులు కొట్టేసి -అందివస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో వేటిని ఎంపిక చేసుకోవాలన్న బిజీలో పడింది అనుపమ. కుర్ర హీరోలతోనే కాదు, స్టార్ హీరోల సరసనా అనుపమను ఎంపిక చేసుకునేందుకు మూవీ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నట్టు వినికిడి. సో.. అనుపమకు అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం.
**
శ్రీమంతుడు సక్సెస్ తరువాత శృతి కెరీర్ పరుగే అనుకున్నారు. కానీ -అంత సీన్ లేదు. అలాగని అవకాశాల కోసం వెంటబడే క్యారెక్టర్ శృతితి కాదు. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూసకుంటూనే -కాంబినేషన్స్ విషయంలో షాక్ ఇవ్వడం శృతికి అలవాటే. ప్రస్తుతం ‘బెహెన్ హోగీ తేరీ’ చిత్రంలో రాజ్‌కుమార్‌రావ్‌కు జోడీగా కనిపించబోతున్న ఈ సౌత్ బ్యూటీ, స్క్రిప్ట్‌లో ఫ్రెష్‌నెస్ చూసే ఓకే చెప్పానంటోంది. రియల్ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు ఎదురైతే -ఎంత సింపుల్‌గా హ్యాండిల్ చేస్తామో అంత ప్యూర్‌గా సినిమా ఉంటుందని ప్రామిస్ చేస్తోంది కూడా. తన క్యారెక్టర్‌ను ఫన్నీగానే కాదు సెన్సిటివ్‌గానూ తీర్చిదిద్దారట. కొత్త కాంబినేషన్స్ ట్రై చేయడంలో తనకు థ్రిల్ ఉంటుందన్నది శృతి ఎప్పుడూ చెప్పే మాట. అంచనాలను బ్రేక్ చేస్తూ ఆడియన్స్‌కు కొత్తదనం అందించడమే తన ఉద్దేశ్యంగా చెబుతోంది చెన్నై బ్యూటీ. ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న శృతి.. సూర్య సరసన సింగం 3, పవన్ సరసన ‘కాటమరాయుడు’ చిత్రాల్లో అలరించబోతోంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులూ చర్చల దశలో ఉన్నాయట.
**
బబ్లీ బ్యూటీ హన్సిక సైతం ఈ ఏడాది ఇటు తెలుగు, అటు తమిళంలో బిజీగానే కనిపించబోతోంది. ‘లక్కున్నోడు’ చిత్రంతో తన లక్కును టెస్ట్ చేసుకోబోతున్న హన్సిక -తెలుగులో ‘దుర్గ’ చేయబోతోంది కూడా. బోగన్, నైట్టైమన్నన్ చిత్రాలతో తమిళంలోనూ హన్సిక ప్రాజెక్టులు చేయనుంది.
***
‘నేను శైలజ’తో అమాంతం ఫేస్‌వాల్యూ పెంచేసుకున్న కీర్తి సురేష్ -కొత్త హీరోయిన్లలో టాప్‌రేంజ్‌కి చేరిపోవడం ఖాయమన్న అంచనాలు వెలువడ్డాయి. బ్యూటీకి తగిన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదన్న టాక్‌తో -కీర్తి ఖాళీలేకుండా బిజీ అయిపోతుందని అనుకున్నారు. కానీ -ఊహించినంత రేంజ్‌కి కీర్తి కెరీర్ చేరుకోలేదు. ఫ్రెష్ జనరేషన్ హీరోయిన్లలో గ్యాప్‌లేకుండా సినిమాలు పడుతున్నా -కీర్తికి పెద్ద సినిమాలు పడతాయన్న అంచనాల ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం నానితో ‘నేను లోకల్’ అంటూ వస్తున్న కీర్తి -‘ఐనా ఇష్టం నువ్వు’ తెలుగు ప్రాజెక్టులోనూ, విజయ్‌తో కలిపి మూడు తమిళ చిత్రాలు చేయబోతోందట. అయితే, ఈ ఏడాది టాలీవుడ్‌లో కీర్తికి మంచి ఆఫర్లే వచ్చిపడొచ్చన్న అంచనాలు లేకపోలేదు. ఇక ఇమేజ్ తగ్గిన అనుష్క, రెజీనా, రాశిఖన్నా, సురభిలాంటి హీరోయిన్లూ ఎంత కాదనుకున్నా రెండు మూడు ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇక చిరుతో జత కట్టి ‘కుమ్ముడు’ చూపించిన కాజల్ అగర్వాల్‌కు కొత్త తెలుగు ప్రాజెక్టులు దొరకలేదు. ‘150’ వర్కవుటైంది కనుక -వరుస చాన్స్‌లు వచ్చే అవకాశాలు లేకపోలేదు. తెలుగు స్క్రీన్‌పై కనిపించడానికి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నా -తమిళంలో కాజల్‌కు వరుసగానే పడుతున్నాయి. తమిళంలో గరుడ, తల 57, కన్నడంలో తథాస్తు, ఏకె 97 చిత్రాలతో కాజల్ బిజీగానే కనిపిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణితో దాదాపు సెకెండ్ ఇన్నింగ్స్ ఫ్రెష్‌గా మొదలెట్టిన శ్రీయాశరణ్‌కూ సీనియర్ల సరసన చాన్స్‌లు వచ్చే అవకావం ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తన్నాయి. సో.. ఈ ఏడాది హీరోయిన్లకు పండగే పండగన్న మాట.

చిత్రాలు..కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్, తమన్నా భాటియా, శృతి, నయనతార, త్రిష

-రాణీప్రసాద్