మెయిన్ ఫీచర్

పరుగు... ఓ అద్భుత అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరుగు’ జీవితంలో అద్భుతమైన అనుభూతినిస్తుందంటారు మాజీ ఏఏస్ అధికారిణి రేచల్ ఛటర్జీ. మారథాన్ మహరాణిగా మారిని ఈ ఆరు పదులు దాటిన మాజీ ఐఏఏస్ అధికారిణి పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఆనాడు పాలనాధికారిణిగా తనదైన ముద్ర వేసుకుంటే ఈనాడు పరుగులో తనదైన సత్తా చూపుతూ నేటి యువతికి సవాల్ విసురుతున్నారు. ఆరవైలో ఇరవై వలే ఈ పరుగు ఏమిటీ అని అనుకుంటున్నారా? నిజమే కదిలే కాలు కామ్‌గా ఉండదు కదా! రేచల్ ఛటర్జీ కూడా పదవీ విరమణ చేసిన తరువాత హాయిగా పిల్లలతో కాలక్షేపం చేయకుండా గత పదేళ్లుగా లెక్కలేనన్ని మారథాన్‌లలో పాల్గొంటూ వయసు శరీరానికి రాలేదు అని నిరూపిస్తున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన మారథాన్‌లో 65 ప్లస్ క్యాటగిరిలో బంగారు పతకం సాధించారు. కేవలం ఐదు గంటల పాటు ఏకబిగువున పరుగుపెట్టి తన లక్ష్యాన్ని సాధించి విజేతగా నిలిచారు. పదవీ విరమణ తరువాత పరుగును ప్రాణపదంగా చేసుకున్న రేచల్ గత ఏడాది ఇదే మారథాన్‌లో పాల్గొని నాలుగు గంటల 54 నిమిషాలకు పూర్తిచేయగా.. ఈ ఏడాది మరో ఆరు నిమిషాలు పెరిగినా.. విజేతగా నిలిచారు. సరైన ప్రాక్టీసు చేయకపోవటం వల్లే ఆరు నిమిషాలు పెరిగిందని, మన శరీరాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉందంటారు. ఇలా రోజూ పరుగు ప్రాక్టీసు చేస్తే మానసిక దృఢత్వం వస్తుందని ఫలితంగా నిర్ణయాత్మకమైన ధోరణితో ఈ వయసులోనూ వ్యవహరించవచ్చంటారు.
**
మారథాన్ మహారాణి
రేచల్ చటర్జీ ఇప్పటి వరకు మూడు మారథాన్‌లలో పొల్గొని విజయం సాధించారు. ఆమె 60 ప్లస్ కేటగిరీలో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించటం విశేషం. 2013లో బెంగళూరులో జరిగిన 34వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 60ప్లస్ కేటగిరిలో పాల్గొని రెండు బంగారు పతకాలు సాధించారు. మళ్లీ ఆదివారంనాటి విజయంతో ఆమె మూడు బంగారు పతకాలను కొంగున ముడేసుకుంది.
రాజీవ్ త్రివేది ప్రోత్సహించేవారు
ఐపిఏస్ అధికారి రాజీవ్ త్రివేది ఈ మారథాన్‌లలో పాల్గొమని ప్రోత్సహించేవారని, ఈ వయసులో మారథాన్‌లలో పాల్గోటమేమిటని చాలామంది వెనక్కిలాగినా.. రాజీవ్ త్రివేది మాత్రం ప్రోత్సహించేవారని, అలాగే నేను పరుగెత్తుతుంటే భర్త, పిల్లలు కూడా సపోర్ట్‌గా నిలుస్తారని మురిపెంగా చెబుతున్నారు.
రేచల్ ఫిట్‌నెస్ మంత్రం
రేచల్ ఛటర్జీ ఫిటెనెస్ మంత్రం పరుగే. వారానికి నాలుగైదు సార్లు పరుగు పెడతా. ప్రతిసారీ కనీసం పది కిలోమీటర్లు తగ్గకుండా పరుగుపెడతానంటున్నారు. మారథాన్‌లో పాల్గొనాలని ఆసక్తితో శిక్షణ కూడా ఆమె తీసుకున్నారు. ఈ పరుగు వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయని అపోహ పడుతుంటారు. కాని కీళ్లకు లాక్టిక్ యాసిడ్ అందుతుందంటారు. శరీరం ఫిట్‌గానూ, భుజాలు, చేతులు చక్కగా పనిచేస్తాయంటారు. పరుగు పెట్టేటపుడు దెబ్బలు తగలటం సహజం. ఏడుసార్లు కిందపడినా ఎనిమిదోసారి లేవగలిగే సత్తా పరుగు వల్ల సమకూరుతుంది. అన్నింటికంటే ముఖ్యం మానసిక ప్రశాంతత కలిగి కమ్మగా నిద్రపోగలుగుతామని అంటున్నారు.
ఆహార నియమాలూ ముఖ్యమే
పరుగు ప్రాక్టీసు చేస్తున్నపుడు ఆహార నియమాలు కూడా కంట్రోల్‌లో ఉండాలని రేచల్ అంటారు. అధిక ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే మారథాన్‌లో పాల్గొనేవారు వారం రోజులు ముందు నుంచే కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. ప్రతిరోజూ మూడు లీటర్ల నీరు తాగితే మంచిదంటారు.
రాబోయే కాలంలో
మారథాన్‌లలో పాల్గొనటం తన జీవితంలో ఓ భాగమైందని చెబుతూ.. మహిళలు బాగున్నారా లేదా అని చెప్పాలంటే వారి శారీరక దారుఢ్యాన్ని చూసి చెప్పొచ్చంటారు. కాబట్టి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనివ్వమని మహిళలకు ఆమె సలహా ఇస్తున్నారు. మహిళ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. ప్రతి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే నమ్ముతారు. రాబోయో కాలంలో కూడా ఇలాగే చురుకుగా మారథాన్‌లలో పాల్గొంటానని, ఫిబ్రవరి, నవంబర్‌లలో ఢిల్లీలో జరిగే మారథాన్‌లోనూ, ఆదిలాబాద్‌లో జరిగే స్పోర్ట్స్ మీట్‌లోనూ పాల్గొంటానని చెబుతున్నారు. అయితే అన్నింటికంటే హైదరాబాద్‌లో జరిగే మారథాన్ కూస్తంత టఫ్‌గా ఉంటుందని చెబుతున్నారు.
మహిళలకు ఇచ్చే సలహా
బాగా తినండి. యోగా, జిమ్, నడక, రన్నింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్- వీటిల్లో ఏదోఒకటి ఎంపిక చేసుకోండి. కొంత సమయాన్ని వీటి కోసం మీ పనిలో భాగంగా కేటాయించండి. నాకు పరుగుతో పాటు చదవటం, సంగీతం వినటం అని ఇష్టమని చెబుతున్నారు. *