మెయిన్ ఫీచర్

కలరియపట్టుకు దక్కిన కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీనాక్షి రాఘవన్ గది నుంచి బయటకు వస్తుంటే ఓ ఆడపులి వస్తున్నట్లు భావిస్తారు. సాధారణ మహిళ వలే చీరకట్టులో ఉండే ఆమె చేతుల కు ఉండాల్సిన గాజులు స్థానం లో కత్తి, మెడలో ఆభరణాల స్థానంలో కవ చం ఉంటాయి. ఆహార్యంలో ఆమె చూపులకు ఆ విధంగా కనిపించినా చెరగని చిరునవ్వుతో కేరళలోని ప్రాచీన యుద్ధ కళ కలరియపట్టుకు ప్రాణం పోస్తున్నారు. అమ్మ అని అందరూ పిలుచుకునే మీనాక్షి ఈ కళలో మంచి ప్రావీణ్యం సంపాదించి ఆత్మరక్షణకు ఉపయోగపడేలా బాలికలకు తన గురుకులంలో శిక్షణ ఇస్తున్నారు. కులం, వయసు, లింగభేదంతో నిమిత్తం లేకుండా ఆమె స్కూల్లో 150 మంది వరకు విద్యనభ్యసిస్తుంటారు. ఎలాంటి ఫీజు లు వసూలు చేయరు. వారు సంతోషంగా ఇచ్చింది పుచ్చుకుంటారు. పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మీనాక్షీ అమ్మ కలరియపట్టులో శిక్షణ ఆరేళ్ల నుంచే తీసుకున్నారు. ఇదే కళను అభిమానించే మాస్టర్ రాఘవన్‌ను పెళ్లి చేసుకుని 17 ఏళ్ల నుంచే ఈ కత్తి కళలో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. కలరియపట్టు కళలో అన్ని స్థాయి ల్లో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ ఇప్పటికీ విద్యార్థినిగానే భావిస్తున్నట్లు వినయంగా చెబుతారు. చరిత్ర పుటల్లో లిఖించబడిన ఈ కళకు మాసిపోదని, ఎప్పటికైనా సజీవంగానే ఉంటుందనే దృఢవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు.

- టి.ఆశాలత