మెయిన్ ఫీచర్

ముదిమి వయసులోనూ మమకారంతో వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేషెంట్లు అంటే ఆ తల్లికి ప్రాణం. మందులతో పాటు మమకారాన్ని రంగరించి వైద్యం చేసే చేతులు అవి. అందుకే 91 సంవత్సరాల వయసులోనూ ఆ చేతివైద్యం ఎందరికో పెన్నిధిగా మారింది. ఆమే భక్తియాదవ్. దేశంలోనే తొలి గైనకాలజిస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన భక్తియాదవ్ తొ మ్మిది పదుల ముదిమి వయసూలోనూ వైద్యురాలిగా ఎంతోమందికి పురుడు పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె బరువు 28 కిలోలు. వచ్చిపడిన వయసు వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నా 68 సంవత్సరాలుగా పేదలకు ఉచిత వైద్య సేవ అందిస్తూనే ఉన్నారు. 1948లో మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ప్రవేశం కోసం 40 మంది దరఖాస్తు చేసుకోగా అందులో తొలి మహిళ భక్తియాదవ్. 1952లో వైద్యపట్టా తీసుకున్నప్పటి నుంచి కొన్నివేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన సేవాతత్పరత ఆమెది. ప్రభుత్వ వైద్యురాలిగా అవకాశం వచ్చినా వెళ్లకుండా మిల్లు కార్మికుల కోసం ఏర్పాటుచేసిన నందలాల్ బండారి మెటర్నిటీ ఆసుపత్రిలో వైద్యురాలిగా చేరి కార్మికుల భార్యలకు పురుడు పోశారు. తదనంతరం ఆ ఆసుపత్రి మూతపడగా ఆమె ఇంటినే ఆసుపత్రిగా చేసుకుని వైద్యసేవలు అందించారు. నామమాత్రం ఫీజు తీసుకునేవారు. వయసు..జీతం గురించి ఎవరైనా అడిగితే చిరునవ్వుతో అలాంటివి అడగవద్దు అని సుతిమెత్తగా మందలిస్తారు. ఎన్నో సంక్లిష్టమైన ప్రసూతి కేసులు ఆమె వద్దకు వచ్చినా పండంటి బిడ్డను వెంట తీసుకువెళ్లేవారు. వయసురీత్యా నేడు వైద్య సలహాలు అందిస్తున్నప్పటికీ ఎక్కడున్నా.. ఎలాంటి వైద్య సాయం కావాలన్నా.. పైసా ఫీజు తీసుకోకుండా సేవచేస్తున్న ఈ మానవతామూర్తికి పద్మశ్రీ పురస్కారం దక్కటం ఆమె నిస్వార్థ వైద్య సేవకు కొలమానం.