మెయిన్ ఫీచర్

నేపాల్ మదర్ థెరిసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల గీత మేకప్ వేసుకుంటుంది. ఆ మేకప్ తెల్లవారుజామున రెండు గంటల వరకు ఉండాలి. రోజుకు 60 మంది కామదాహం తీర్చుతుంది. అలా చేయకపోతే వైర్లు, రాడ్లతో దెబ్బలు. కాలిన స్పూన్లతో వాతలు. ఇలాంటి చిత్రహింసలు కొనే్నళ్లు పాటు భరించింది. ఇపుడు గీత వయసు 26 ఏళ్లు. చల్లని తల్లి ఒడి చేరింది. అవును. ఆ తల్లి నేపాల్ మదర్ ధెరిసా. వేశ్యావృత్తిలో మగ్గిపోతూ ఛిద్రమవుతున్న ఎన్నో వేలమందిని తన అక్కున చేర్చుకుని సేద తీర్చుతుంది. ఆమే అనురాధ కొయిరాల. అందాలకు నెలవైన నేపాల్‌లో వేలాది మంది యువతులు, చిన్న పిల్లలు అక్రమంగా రవాణచేయబడతారు. వీరిని వేశ్యావృత్తిలోకి దింపుతారు. ఇలాంటి 12,000 మందిని అనురాధ కొయిరాల ఆదుకున్నారు. అంతేకాదు 45,000 మంది చిన్నారులను ఈ వృత్తిలోకి దిగకుండా రక్షించారు. టీచర్‌గా పనిచేసే అనురాధ కొయిరాల ఆడపిల్లల అక్రమ రవాణ కథలకు చలించిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి మైతీ నేపాల్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థను మదర్స్ హోమ్ ఇన్ నేపాల్ అని అంటారు. ఖాట్మాండులో నెలకొల్పిన ఈ ఇంటికి వేశ్యావృత్తిలో మగ్గిపోయేవారిని ఆ వృత్తిని నుంచి బయటకు తీసుకువచ్చి సాధారణ జీవితం గడిపేలా చేస్తారు. హెచ్‌ఐవి వంటి వ్యాధులు సోకినవారు ఇక్కడే ఉండవచ్చు. లేదంటే ఇళ్లకు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు. పోలీసులు, ఉన్నతాధికారుల సాయంతో బాధితులను బయటకు తీసుకువచ్చి అనురాధ కొయిరాల వారికి చేయూతనందిస్తారు. అనురాధ చేస్తున్న సేవకు ఎన్నో అవార్డులు ఆమె సొంతమయ్యాయి. సిఎన్‌ఎన్ హీరో అవార్డు సైతం దక్కింది. నేడు ఆమె పద్మశ్రీ వరించింది. ఈ అత్యున్నత పురస్కారంతో ఆమె ఇలాంటి బాధితులకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.