మెయిన్ ఫీచర్

కిలిమంజారోపై వినీల జయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల వినీల ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే కాదు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసుకుంది. ఈ చిన్నారి హైదరాబాది వాసి. సాహసంగా చేసిన తన యాత్ర గురించి అడిగితే చాలు ఆ రికార్డులు గురించి నాకేమి తెలియదు. అన్నయ్య చెయ్యి పట్టుకున్నాను. అధిరోహించాను అని చెబుతుంది.
హై దరాబాద్‌కు చెందిన మద్దెల వినీల నాలుగవ తరగతి చదువుతుంది. తల్లి గృహిణి. తండ్రి ఉపాధ్యాయుడు. అన్నయ్య స్పోర్ట్స్ పర్సన్. సాహసమే ఊపిరిగా ఈ చిన్నారిని ఆమె అన్నయ్య సాగర్ తీర్చిదిద్దాడు. అన్నయ్య కొండలను ఎక్కటం చూస్తుండేది. అలాగే అతను చేసే జాగింగ్, రన్నింగ్ ఇష్డపడేది. అన్నయ్యతో పాటు ఈ చిన్నారి కూడా చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేసేది. ఫిట్‌నెస్ ప్రాధాన్యత అంటే ఏమిటో తెలియని ఆ పసిమనసు అన్నయ్య ఇచ్చిన శిక్షణలో క్రమంగా రాటుదేలటం ఆరంభించింది. కిలిమంజారో అధిరోహించాలనే ఆన్న య్య దృఢ నిర్ణయానికి ఆమె తోడైంది. దీనికోసం కొన్ని నెలల ముందు నుంచే అన్నయ్యతో పాటు శిక్షణ
తీసుకున్నది.
ఆటంకాలు ఎదురైనా..
మా ప్రయాణం సజావుగా సాగకపోయినా అన్నయ్య తోడు ఉండటం వల్ల భయపడలేదు. అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. తొలుత మా అమ్మానాన్నలు అంగీకరించలేదు. మేము తీసుకుంటున్న శిక్షణ చూసి చివరకు అంగీకరించారు. అమ్మనాన్నల అనుమతితో ఈ ఫీట్ సాధించటానికి బయలుదేరాం. మా ప్రయాణ కాలం ఏడు రోజులు. కాని ఆరు రోజుల్లోనే పర్వతాన్ని అధిరోహించాం. కొండ మీద ఆరు లేదా ఏడు క్యాంప్‌లు ఉన్నా యి. మాలాగే అక్కడకు ట్రెక్కిం గ్‌కు వచ్చినవారిని చూ స్తే ఆనందంగా ఉండేది. ఈ ప్రయాణంలో కాళ్లు నొప్పులు పుట్టి బొబ్బలైనా అన్నయ్య ధైర్యం చెప్పేవాడు. కొంతసేపు ప్రయాణించిన తరువాత అన్నయ్య విశ్రాంతి తీసుకోమనేవాడు. మొదటి మూడు రోజులు అసలు జనా లే కనిపించలేదు. నాలుగవ రోజు మాత్రం కొండపై జనాలు కనిపించారు. అంతేకాదు. వారిని చూస్తే ఎంతో శక్తి వచ్చినట్లు ఉండేది. అన్నయ్య ఈ ప్రయాణం కోసమని ఇచ్చిన శిక్షణ వల్ల శరీరం ఫిట్‌గా ఉండేది కాబట్టి అధైర్యపడలేదు. అందుకే అనుకున్న లక్షాన్ని సాధించగలిగాం. అంతేకాదు ఆ ప్రాంత వాతావరణానికి తగినట్లుగా ఆహారాన్ని తీసుకునేవాళ్లం. ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పండ్లను తినేవాళ్లం. అన్నయ్య తోడ్పాటు, సహకారంతో ఈ విజయాన్ని సాధించానని వినీల గర్వంగా చెబుతుంది.

ఎత్తయిన పర్వతం. చల్లటి గాలులు. రాత్రిపూట నిత్యం కురిసే వర్షపు జల్లులు. దారంతా మెత్తటి బురద. ఇలాంటి ప్రతికూల వాతావరణమైనప్పటికీ తొమ్మిదేళ్ల వీనీలను ఇవేమి భయపెట్టలేదు. 5895 మీటర్ల ఎత్తయిన ఆ పర్వతం చిట్టెలుక వంటి ఆ చిన్నారి ముందు చిన్నబోయింది. ఆప్రికా ఖండంలోని ఎత్తయిన కిలిమంజారోను అధిరోహించటానికి అన్నయ్య అందించిన తోడ్పాటు ఎంతో సహకరించింది. అన్నయ్య వల్లే ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.
*