మెయిన్ ఫీచర్

ఆనందం... అమృత వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహ్లాదకరమైన నవ్వుల్లోనే ఆనందం దాగివుంటుందనే విషయం మరిచిపోతున్నాం. చిరునవ్వులు చిందించే ముఖంలోనే అందం సైతం దోబూచులాడుతోంది. నవరసాల్లో ఆరోగ్యకరమైన నవ్వును నిర్లక్ష్యం చేయటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతో కనిపించేవాళ్లు సరదాగా, ఆనందంగా ఉండే వారికంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నటు ఇటీవల జరిపిన ఓ సర్వేలో సైతం వెల్లడైంది.

ఇటీవల ఓ ఆధ్యాత్మిక సదస్సులో ఓ ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ ‘‘మీలో ఎంతమంది ఆనందంగా..మనశ్శాంతిగా ఉంటున్నారో చేతులెత్తండి అని అంటే.. ఆ సదస్సులో పాల్గొన్న మూడు వేలమందిలో అతి కొద్దిమంది మాత్రమే చేతులు ఎత్తారు. ఈ ఉరుకులు పరుగుల జీవనంలో మనిషికి ఆనందం అనేది కరవవుతోంది. చాలామంది చక్కని హాస్యాన్ని సైతం ఆస్వాదించకుండా మేథావులమనే భ్రమలో ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉంటారు. నిజానికి ఆహ్లాదకరమైన నవ్వుల్లోనే ఆనందం దాగివుంటుందనే విషయం మరిచిపోతున్నారు. చిరునవ్వులు చిందించే ముఖంలోనే అందం సైతం దోబూచులాడుతోంది. నవరసాల్లో ఆరోగ్యకరమైన నవ్వును నిర్లక్ష్యం చేయటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. మనలో చాలామంది ఈ సృష్టిలోని కష్టాలన్నీ తానే అనుభవిస్తున్నట్లు నవ్వితే ఎక్కడ నోటి ముత్యాలు రాలిపోతాయన్నట్లు ముఖం మాడ్చుకుని వుంటారు. కాని జీవితంలో మనం నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించుకోవాలంటే ముఖంపై ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వతో ఉంటునే వాటిని సాధించగలమని విషయాన్ని మరిచిపోతున్నాం.
మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే
మనిషి సంఘజీవి. తనచుట్టూ ఉన్నవారితో మానవసంబంధాలను మెరుగుపరుచుకోవాలంటే మందహాసమే ముఖ్యసాధనంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు క్షణికమైన, భౌతికమైన ప్రయోజనాల కోసం మానసిక ఆనందాన్ని కోల్పోతున్నాం. పరిచయస్థులు ఎవరు ఎదురైనా పలకరింపుగా ప్రసన్నవదనంతో నవ్వితే ఆరోగ్యకరంగా సమాజంలో మనగలుగుతాం.
మనిషికి ఎలాంటి సిరిసంపదలు లేకున్నా హాయిగా ఆనందంగా ఉండే లక్షణం ఉంటే ఇక అతని ముఖంలో కదిలాడే అందం శోభనిస్తుంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతో కనిపించేవాళ్లు సరదాగా, ఆనందంగా ఉండే వారికంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నటు ఇటీవల జరిపిన ఓ సర్వేలో సైతం వెల్లడైంది.
మానసిక ఆనందం శారీరక ఆరోగ్యాన్ని సైతం అధిగమింపజేస్తోంది. ఆనందంగా ఉండే వ్యక్తి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సామర్ధ్య సైతం సంతరించుకుంటాడు.
మృత్యు భయం ఉంటే..
ఈ సృష్టిలో మృత్యు భయం ప్రతి మనిషిని వెంటాడుతుంటుంది. ఈ భయంతోనే ఆనందాన్ని కోల్పోతుంటాం. సుఖాల్లో ఉన్నపుడు ఆనందంగా ఉండం వేరు.
కాని కష్టాల్లో ఉన్నపుడే ఆనందంగా ఉండటం ధీరుని లక్షణం అని మన పెద్దలు అంటారు. చార్లీచాప్లిన్‌ను ఈ విషయానే్న ప్రశ్నిస్తే.. మరణాన్ని మనం ఆపలేం. ఈ భయంతో నవ్వుల జీవితాన్నా కోల్పోవటం ఎందుకు అని ప్రశ్నించేవారు. ఉన్న నాలుగురోజులైనా నవ్వుతూ ఉంటే పోలా? అని చెప్పేవారు. జీవితాన్ని సరళంగా..సరదాగా తీసుకున్న వ్యక్తే ఆనందంగా నలుగురిలో విభిన్నంగా కనిపిస్తాడు. కాబట్టి ఆనందం వల్ల ఏర్పడే ఆహ్లాదకరమైన వాతావరణంలో అమృత వర్షమే కురుస్తుంది. దీనివల్ల ఆరోగ్యంతో మనిషి ఎల్లప్పుడు హుందాగా జీవిస్తాడు.

ఆనంద నిలయంలోకే అదృష్టం
ఆనందంగా ఉండాలంటే డబ్బుకావాలి కాబట్టి మన ఇంటిలో మనీప్లాంట్ వంటి మొక్కలను సైతం పెంచుతుంటాం. అలాగే కొన్నిరకాల బొమ్మలను సైతం తెచ్చిపెట్టుకుంటాం. సంతృప్తి నిండిన మనసులు. సంతోషంతో కనిపించే మనుషులు ఉండే ఇల్లు ఆనందనిలయంగా విలసిల్లుతుంది. ఇలాంటి ఇంటి యజమానురాలు చెరగని చిరునవ్వతో తలుపు తీస్తే అదృష్టం సైతం తటాలున లోనికి వస్తుంది. చైనాలో లాఫింగ్ బుడాయి బొమ్మను ప్రతిచోట పెట్టుకుంటారు. ఈ బొమ్మ ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు ఢోకా ఉండదని ఆ దేశీయుల నమ్మకం. చూడండి ఆనందం వల్ల వచ్చే అదృష్టాన్ని ఈ బుడాయి బొమ్మ సైతం తెలియజేస్తోంది.