మెయన్ ఫీచర్

నేతల జోరు..ప్రసంగాల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నయ్య కుమార్‌కు మద్దతిస్తున్న పార్టీల బలం పార్లమెంటులో 0.68 శాతం మాత్రమే. కన్నయ్యకుమార్‌కు లూథియానాకు చెందిన జాహ్నవి అనే 15 ఏళ్ల బాలిక సవాలు విసిరింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ కొన్ని హద్దులున్నాయని ఆమె 29 ఏళ్ల కన్నయ్యకుమార్‌కు హితవు చెప్పింది. 12,14 ఏళ్ల వయసున్న చెన్నైకి చెందిన శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్‌లు 11 రకాల యాప్‌లను సృష్టించారు. ఐఐఎమ్‌లలో ప్రజంటేషన్ ఇచ్చారు. మీడియా వారి గురించి రాయదు. జాతి వ్యతిరేక నినాదాలిచ్చే, చదువులు తప్ప అన్ని విషయాలు మాట్లాడే ఒమర్ ఖలిద్, కన్నయ్య కుమార్‌ల గురించి రాస్తుంది.
---
గత రెండు వారాలుగా దేశంలో ప్రసంగాల హోరు జోరందుకుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలు యితరత్రా కూడా నేతల మాటలెలా వున్నా మీడియా వాటిని కోటలు దాటిస్తోంది. జెఎన్‌యు వివాదంపై స్మృతి ఇరానీ వైరి పక్షాలను చెండాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలందుకుంది. మోదీ సైతం ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేశారు. స్మృతి ఇరానీ బయటపెట్టిన అనేక విషయాలు విజ్ఞతను తట్టిలేపేవిగా ఉన్నాయి. దుర్గామాతను సభ్యత విడిచి వ్యాఖ్యానించిన, మహిషాసురుణ్ణి మర్యాదకు మించి నెత్తినెత్తుకున్న కొన్ని మేధావి ముఠాల గుట్టు ఆమె రట్టు చేసింది. విద్యాలయాలను రణభూమిగా మార్చవద్దని ఆమె కోరింది. చివరకు కన్నయ్య కుమార్ విడుదలయ్యాడు. ఎనిమిది వేల మంది జెఎన్‌యు విద్యార్థులో వెయ్యిమంది ఓట్లు వేస్తే గెలిచిన కన్హయ్య కుమార్ విడుదలను ఆంగ్ల మీడియాలో ఓ వర్గం వీరోచితంగా చూపించింది. విడుదలైన కన్నయ్యకుమార్ సాయు ధ బలగాలు కశ్మీరులో అత్యాచారాలకు పాల్పడ్డాయని నోరు జారాడు. గత సంవత్సరం కశ్మీరులో తుపాను బీభత్సంలో సైన్యం తమనెలా ఆదుకుందో కశ్మీరు ప్రజలకు తెలుసు. ఆ తరువాత ఎన్‌డిఎ-పిడిపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో నిజానికి కశ్మీర్ ప్రజలు సైన్యంపట్ల తమ అభిప్రాయం మార్చుకున్నట్లనిపించింది. కాని ఈ మధ్య జరిగిన జెఎన్‌యు ఘటనల తరువాత అక్కడి ప్రజలను రెచ్చగొట్టినట్లైంది. అందుకే కొందరు రెండు వారాల క్రితం జెఎన్‌యుకు తమ సంఘీభావం తెలుపుతూ వీధికెక్కారు. జెఎన్‌యులో ఘటన పక్కనున్న భాగవపూర్ విశ్వవిద్యాలయానికి కూడా పాకింది. ఇతరత్రా కొన్ని విశ్వవిద్యాలయాల్లో జెఎన్‌యు ప్రకంపనలు వినిపించాయి. అందుకే ఇది రాజ్యాంగం 124 (ఎ) అధికరణం కిందికి వస్తుందని కొందరు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే దేశంలోని 737 విశ్వవిద్యాలయాల్లో 2,3 చోట్ల తప్ప మిగిలిన చోట్ల ఈ రగడ లేకపోవడం ఆశావహమైన విషయం.
ఇంతకీ కన్నయ్య కుమార్‌కు మద్దతిస్తున్న పార్టీల బలం పార్లమెంటులో 0.68 శాతం మాత్రమే. కన్నయ్యకుమార్‌కు లూథియానాకు చెందిన జాహ్నవి అనే 15 ఏళ్ల బాలిక సవాలు విసిరింది. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాల్గొన్నందుకు కేంద్ర ప్రభుత్వ సత్కారం కూడా పొందిన జాహ్నవి గతంలో సోషల్ మీడియాలో నీలి చిత్రాలు నిషేధించాలని కోరుతూ చండీగఢ్ హైకోర్టులో పిటిషన్ గెలిచింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ కొన్ని హద్దులున్నాయని ఆమె 29 ఏళ్ల కన్నయ్యకుమార్‌కు హితవు చెప్పింది. 12,14 ఏళ్ల వయసున్న చెన్నైకి చెందిన శ్రవణ్ కుమరన్, సంజయ్ కుమరన్‌లు 11 రకాల యాప్‌లను సృష్టించారు. ఐఐఎమ్‌లలో ప్రజంటేషన్ ఇచ్చారు. మీడియా వారి గురించి రాయదు. జాతి వ్యతిరేక నినాదాలిచ్చే, చదువులు తప్ప అన్ని విషయాలు మాట్లాడే ఒమర్ ఖలిద్, కన్నయ్య కుమార్‌ల గురించి రాస్తుంది. కన్నయ్యకుమార్‌ను విడుదల చేస్తూ కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా మీడియా తోసి రాజంది. పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం మోదీ చుట్టూ పరిభ్రమించింది. మోదీ ఉద్యోగాలు ఇవ్వలేదని, జైట్లీ నల్లధనం కుబేరులను రక్షించేందుకు ఫెయిర్ అండ్ లవ్‌లీ యోజన తెచ్చారంటూ గణాంకాలేవీ ఉటంకించకుండా రాహుల్ ప్రసంగం చప్పగా సాగింది. పైగా అధికార పక్ష సభ్యులు జవాబివ్వడం మొదలు కాగానే ఆయన సభనుంచి నిష్క్రమించేవారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని మోదీ ప్రసంగం ఆద్యంతం గంటసేపు ఆసక్తిగా సాగింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం తామే తెచ్చామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌కు ఆయన ఆ పథకం అనేక రూపాలు మారిందని, అసలు పేదరికం లేని దేశంలో ఈ పథకం అవసరమేముందని, 52 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పేదరిక నిర్మూలనకు చేసిందేముందని ఎద్దేవా చేశారు. చట్టసభల సమావేశాలకు అడ్డుపడవద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు చెబుతూ, ఆ విషయంలో నెహ్రూ, రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, సోమనాథ్ చటర్జీలు చెప్పిన మాటల్ని మోదీ చదివి వినిపించారు. దీంతో తమ పార్టీ నేతల మాటలే వినిపించినందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల సభ్యులు ఖంగుతిన్నారు. పైగా మోదీ రహదారుల నిర్మాణం, రైల్వే ట్రాక్‌ల నిర్మాణం వంటి విషయాలలో గణాంకాలు వినిపించారు.
దీనితోపాటు ఆయన కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. చిన్న చిన్న పార్టీల సభ్యులు కూడా మాట్లాడాలని, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా కేవలం మహిళలే మాట్లాడేలా చూడాలన్నారు. అనేక బిల్లులను సభ అనుమతి పొందకుండా అడ్డుపడడం సమంజసం కాదని, జిఎస్‌టి బిల్లు, మాది, మాది అని చెబుత్ను కాంగ్రెస్ ఆ బిల్లు అనుమతికి ఎందుకు అడ్డు పడుతున్నదంటూ విమర్శించారు. సంవత్సరంలో రెండు సమావేశాలను కేవలం మొదటిసారి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన వారే మాట్లాడేలా చూడగలగాలని సూచించారు. యుఎన్‌వో ప్రపంచం ముందుకు తెచ్చిన నిలుపుకోదగిన అభివృద్ధిపై మనదేశంలో మన పార్లమెంటు సభ్యులంతా కలిసి ఏం చేయగలమనేది ఆలోచించాలన్నారు. ప్రాథమిక విద్య, న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో మనం మంచి చేయగలమో ఆలోచించాలన్నారు. ‘‘పాఠశాలల్లో 4 లక్షల టాయిలెట్ల నిర్మాణం, నలబై ఏళ్లుగా నలుగుతున్న బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదం పరిష్కారంలో మేం చూపిన చొరవ, 18 వేల గ్రామాలకు విద్యుదీకరణ చేయడం వంటి మంచి పనులను కాంగ్రెస్ అభినందించాలన్నారు. రష్యా మాజీ అధ్యక్షుడు కృశే్చవ్, స్టాలిన్‌కు గొప్ప అనుయాయుడు. స్టాలిన్ మరణం తరువాత ఓ సమావేశంలో మాట్లాడుతూ కృశే్చవ్ ఆయన్ను విమర్శించాడు. అపుడా సమావేశంలో ఒక వ్యక్తి లేచి స్టాలిన్‌తో కలిసి తిరిగి, స్టాలిన్ అనంతరం ఆయ న్ను విమర్శిస్తున్నావేంటని ప్రశ్నించాడు. అపుడు కృశే్చవ్, స్టాలిన్ సమయంలో తనకిలా ప్రశ్నించే అధికారం వుండేది కాదన్నాడు. ఇవాళ ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, విమర్శిస్తూ పార్లమెంట్‌ను నడవకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నుద్దేశించి ఈవిధంగా మాట్లాడారు.
మనం వొకరిమీద వొకరం బురద జల్లుకుంటుంటే కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికార గణం నవ్వుకుంటున్నారని, జవాబుదారి తనం వుండడం లేదని, యిది అందరు కలిసి ఆలోచించాలని మోదీ అన్నారు. మరో సందర్భంలో టెలిగ్రాఫ్ పత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడిన ఆనుపమ్ ఖేర్ ఫిబ్రవరి 9న జెఎన్‌యు సంఘటనను సమర్థించిన సుప్రీంకోర్టు జడ్జి గంగూలీని చెండాడాడు. సుప్రీంకోర్టు జడ్జి అయి వుండి అఫ్జల్ గురుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విమర్శించడం దురదృష్టమన్నారు. రాహుల్ గాంధీని సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే అసలు సిసలు సహనానికి ఉదాహరణ అని ఆయన్ను సహిస్తే దేశంలో దేన్నైనా సహించవచ్చునన్నారు. వేదికపై కాజోల్, సుహెల్ సేట్, వేదిక కింద ఉన్న ప్రజలు చప్పట్లు కొడుతుంటే వేదిక మీది కాంగ్రెస్ నాయకుడు సుర్జేవాల, జడ్జి గంగూలీలు బిత్తర చూపులు చూడడమే వారి వంతైంది. ప్రసంగాలు అవగాహన పెంచేందుకు, అర్థం చేసుకునేందుకే కాని, అయోమయం సృష్టించేందుకు కాకూడదు. మాటలు తూటాలైతే ప్రజల మధ్య సహనం సంయమనం కొరవడుతుంది. మన వ్యవస్థలు, సమాజం సజావుగా నడిచే మాట ఎవరు చెప్పినా వినాల్సిందే. ప్రస్తుతం ఎన్‌డిఎ అధికారంలో వున్నంతమాత్రాన ‘పాత అంతా రోత’ అనుకోనక్కరలేదని చెప్పడమే సభలో మోదీ ప్రసంగం వెనుక ఉద్దేశం. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నా స్పీకర్‌గా ఉండి లోక్‌సభ నిర్వహణ విషయంలో సోమనాథ్ చటర్జీ చెప్పిన రెండు మంచి మాటలను ఉటంకించడం ద్వారా ప్రతిదానికీ లాజిక్ చెప్పే కామ్రేడ్‌లను కట్టడి చేయడమే మోదీ వ్యూహం. గత 14 ఏళ్లుగా అన్నీ భరిస్తూ, అన్సీ సహిస్తూ, నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్న ప్రధాని విజ్ఞతను ప్రజలు అర్థం చేసుకున్నారు. కాని కొందరు నాయకులే ఇంకా నోరు పారేసుకుంటున్నారు.
తాజాగా కన్నయ్య కుమార్‌ను కాంగ్రెస్ నేత శశిథరూర్ భగత్‌సింగ్‌తో పోల్చడం సరికొత్త విడ్డూరమైంది. కన్నయ్య కుమార్ హైద్రాబాద్‌లో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాట్లాడిన సందర్భంగా కొందరు గోరక్షక దళ్ కార్యకర్తలు ‘్భరత్‌మాతాకీ జై’ అని నినదిస్తే అంతా కలిసి చితకబాదారు. మరి భగత్‌సింగ్ ఊరికి ముందు కూడా ‘్భరత్ మాతాకీ జై’ అని ఉద్వేగంగా అన్నాడు. ఆ స్ఫూర్తి కన్నయ్య కుమార్‌కు ఆయన అనుచరులకు వర్తించదా? పిల్లలకు, విద్యార్థులకు దేశం పట్ల ప్రేమ, అభిమానం పెంచే కృషిలో భాగంగా వారితో ‘్భరత్ మాతా కీ జై’ అనిపించాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భాగవత్ అంటే దాన్ని సంచలనాత్మకం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ తన కుత్తుకపై కత్తిపెట్టినా దాన్ని అనను అన్నాడు. మరి ప్రధానంగా జాతీయ వాద లక్షణంతో ఊపిరి పోసుకున్న ఆ నినాదం చేయడంలో తనకేమాత్రం అభ్యంతరం లేదని రాజ్యసభ సభ్యుడు జావెద్ అక్తర్ పార్లమెంట్‌లో పలుసార్లు ఆ నినాదం చేశారు. శ్రీమతి నజ్మాహెప్తుల్లా తనపై కత్తి పెట్టినా తాను ‘్భరత్ మాతా కీ జై’ అనడం మాననని అన్నారు. మీడియాలో ఇండియాటుడేకు చెందిన రాహుల్ కన్హల్ అమిత్‌షాను రెట్టించి అడుగుతూ, భారత్ మాతా కీ జై అనని వారిని పాకిస్తాన్‌కు పంపుతారా అంటూ ప్రశ్నించాడు. అలాంటి వారికి నచ్చజెప్తామని అమిత్‌షా అన్నారు. చివరకు మోహన్ భాగవత్ కూడా ఈ విషయంలో ఎవరినీ బలవంత పెట్టడం లేదన్నది గుర్తించాలన్నారు. దాంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఏది మాట్లాడినా అందులో తప్పులు వెదకడం, సంచలనం చేయడం కాకుండా సంయమనం పాటించడం బాధ్యతగలవారు పాటించాల్ని కనీస మర్యాద. లేకపోతే సమాచార పర్వం, సంభాషణా పర్వం గందరగోళానికి దారితీస్తుంది. ఇది సమాచారం తన సహజ స్వభావం కోల్పోవడం కంటె ప్రమాదకరం.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888