మెయిన్ ఫీచర్

ఏ ఆడపిల్లా రొంపిలో దిగకూడదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు‘మానవత్వం’తో చికిత్స!
* వెబ్‌సైట్‌తో అవగాహన కల్పిస్తున్న క్లైరే క్విడెట్

ఒక చిన్న ఆలోచన సరికొత్త ప్రయత్నానికి నాంది పలికింది. రోజు రోజుకు విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు ఆలంబనగా నిలిచేందుకు ముందుకు వచ్చింది ఈ విదేశీ వనిత. ఇంట్లోనూ, వీధిల్లోనూ విద్యాసంస్థల్లోనూ లైంగిక వేధింపులకు గురవుతూ బిక్కుబిక్కుమని భయపడుతూ జీవించేవారికి మానవత్వంతో సేవలందించేందుకు నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణాకు గురయ్యేవారిని ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తుంది. ఆమే క్లైరే క్విడెట్. ఫ్రాన్స్‌లోని కేప్ అనే అంతర్జాతీయ సంస్థతోపాటు ఫ్రెంచ్ ఫ్రంట్‌లైన్ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోన్న ఆమె తాను అందిస్తున్న చేయుతను వివరించింది.

కొంతమంది ‘ఈజీమనీ’ కోసం మహిళలకు మాయమాటలు చెప్పి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆన్‌లైన్ వెబ్‌సైట్లు తెరిచి, ఈ రొంపిలోకి దించుతున్నారు. అంతేకాకుండా తమ అధీనంలో వున్న మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ వ్యవహారాలు దాదాపుగా 60 శాతం ఆన్‌లైన్ ద్వారా సాగుతుందని చెప్పారామె. దీనిని నివారించేందుకు, అవగాహన కల్పించేందుకు ‘గర్ల్స్ ఆఫ్ పారిడైజ్’ అనే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి, కొనసాగిస్తున్నానని వివరించిందామె. ఈ వ్యాపారం రుచిమరిగిన అసాంఘిక శక్తులకు ఈ వెబ్‌సైట్ ఆకర్షిస్తుందని, అయితే వారు వారి భ్రమలో వుండి, ఈ వెబ్‌సైట్‌లోకి వస్తే ఒక్కసారిగా చలించిపోతారని చెప్పిందామె.
మహిళలపై నిరంతరంగా అఘాయిత్యాలకు పాల్పడిన దృశ్యాలు, నరహంతకుల చేతిలో చిక్కుకుని అసువులు బాసిన స్ర్తిలు, అత్యాచార బాధితులు, హింస భరించలేక ఆత్మహత్యలకు పాల్పడిన మహిళల చిత్రాలు ఉంటాయని వెల్లడించిందామె. తమ సంపాదన కోసం ఆన్‌లైన్‌లో మహిళలను వేటాడుతున్న మనుష్యుల్లో మానవత్వాన్ని ఈ చిత్రాలు ఒక్కసారిగా తట్టిలేపుతున్నాయని చెబుతున్నారామె. ఎంతగా అంటే..వినియోగదారులు మొదటి లాగిన్ అయినపుడు అందగత్తెల ఫొటోలు ప్రత్యక్షమవుతాయి. తర్వాత అసలు సంగతి తెలుస్తుందన్నారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహిళలు ఇలా మోసపోతున్నారని, వారి వారి బాధలు బయట ప్రపంచానికి తెలియడంలేదన్నారు. వ్యభిచారం, లైంగిక దాడుల వంటి విష పరిణామాలను ఎదుర్కొని, బతుకు ఛిద్రమైన ఆయా మహిళల చిత్రాలను చూసేవారికి అసహ్యం పుట్టి, వాంతులు తన్నుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పారామె.
ఇలా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవడం ఖాయమన్నారు. వెబ్‌సైట్ ప్రారంభించిన మొదటి వారంలో 600 కాల్స్, వెయ్యి చాట్ సందేశాలు వచ్చాయన్నారు. కొంతమందినుంచి మిశ్రమ స్పందన లభించిందని క్లైరే క్విడెట్ తెలిపారు. ఇలా అయినా కొంతమేరకు మహిళలపై లైంగిక దాడులు తగ్గుతాయని ఆశపడినట్టు ఆ కార్యక్రమంలో పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు ఆన్‌లైన్ ఆశ్రయించి, చదువుకున్న మహిళలను ట్రాప్ చేసి ఈ కూపంలోకి బలవలంతంగా దించుతున్నారని చెప్పారామె. ట్రాప్ చేసేవారికి అంతిమంగా డబ్బే ప్రధానమని, దీనికివారు ఎంతటికైనా తెగిస్తున్నారని హెచ్చరించారామె. ఈ పరిస్థితుల దృష్ట్యా మహిళలంతా జాగరూకతతో మెలగాలని సూచించారు. కొంతమంది మరింత ముందుకు పోయి బ్యూటీపార్లర్, మసాజ్, స్పా సేవలు అందిస్తామంటూ అమాయకులను వల చేస్తున్న సంఘటనలు లేకపోలేదని పేర్కొన్నరామె. చాలామటుకు ఈ కార్యక్రమాలను తమ వ్యాపారంగా భావించుకుంటూ చట్టానికి దొరకడంలేదని ఆందోళన వ్యక్తంచేశారామె. ఒక మహిళగా తాను చేపట్టిన ఈ కార్యక్రమం సఫలీకృతమైతే జన్మధన్యమైనట్టే!

ప్రతి పదిమందిలో నలుగురు

మన దేశం నుంచి విదేశాలకు అక్రమ రవాణా అవుతున్న మహిళలు, ఆడపిల్లల వివరాలు తెలుసుకుంటే మనసు ఒకింత బాధకు లోనవుతుంది.
* జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఏటా 8000 మంది మహిళలు, 5000 మంది ఆడపిల్లలు దుబాయ్‌కి అక్రమంగా రవాణా చేయబడుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది.
* ఆడవాళ్ల అక్రమ రవాణా ఐదేళ్లలో 38.3 శాతం నుంచి 45శాతానికి పెరిగినట్లు అంచనా వేశారు.
* అక్రమ రవాణాకు గురవుతున్న మహిళల కేసుల్లో కేవలం 65.5శాతం మాత్రమే నమోదవుతున్నాయి.
* వ్యభిచార రొంపిలోకి మహిళలను దింపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ముఠాలు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇలా వ్యభిచార రొంపిలోకి దిగుతున్న మహిళలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి.
* దేశంలోని పశ్చిమబెంగాల్‌లో 23శాతం, బీహార్‌లో 17శాతం, అస్సాంలో 13శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 11శాతం, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలలో 8శాతం మంది మహిళలు అక్రమ రవాణాకుగురవుతున్నారు.
* మనదేశంలో ప్రతి పదిమంది ఆడవాళ్లల్లో నలుగురు (41శాతం) 19 ఏళ్లకే ముందే హింస, వేధింపులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న పదేళ్లలోపు ఆడపిల్లలు బ్రెజిల్‌లో 16శాతం, బ్రిటన్‌లో 12శాతం, థాయ్‌లాండ్‌లో 8శాతం మంది ఉన్నారు.

-కల్యాణి