మెయిన్ ఫీచర్

ఆదర్శం.. భీష్మ చరితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టవసువులలో అష్టమ వసువైన ప్రభాసుడే గాంగేయుడుగా జన్మించాడు. కాబట్టి దైవాంశపరుడు. దేవవ్రతునిగా పేరుబడిసాడు. శంతనుని గంగాదేవి ఇచ్చిన మాట ప్రకారం భీష్ముని బాల్యావస్థ దేవలోకంలో తల్లి దగ్గరే సాగింది. వశిష్ఠ మహర్షివద్ద నాలుగు వేదాలను, షట్ శాస్తమ్రులను కూలంకషంగా అభ్యాసము చేసి, వేదశాస్త్ర పారంగతుడైనాడు. పరశురాముని వద్ద అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకొని నిష్ణాతుడైనాడు. బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారుని పోలియున్న ఆత్మ విజ్ఞానమును సంపాదించాడు. అలాగే శాస్త్ర పరిజ్ఞానములోను బుద్ధిలోను బృహస్పతికి సదృశుడై ఉన్నాడు. శంతన మహారాజు దగ్గరకు గంగామాత వల్లే చేరుకున్నాడు.
తన తండ్రి దాశరాజు కూతుర్ని వివాహం చేసుకోవాలనుకున్నట్టు భీష్ముడు తెలుసుకొన్నాడు. కాని దాశరాజు అభ్యంతరాల వల్ల శంతన మహారాజు వివాహేచ్ఛను విడనాడాడనీ తెలుసుకున్నాడు. దాశరాజు అభ్యంతరాలేవో తాను తెలుసుకోవాలంటూ స్వయంగా దాశరాజు దగ్గరకు వెళ్లాడు. అతనితో సంభాషించాడు. సత్యవతి కుమారులే రాజ్యపాలనార్హులుగా ఉండడంలో తాను ఏవిధమైన అడ్డంకిగా వుండనని దాశరాజుకు చెప్పాడు.
కాని దాశరాజు - సరే కాని నీవు నా తండ్రి కదా అనుకుంటున్నావు కాని నీకు కలిగే సంతానం ఇట్లానే అనుకొంటారని ఏముంది? ఒకవేళ నీకుమారులు రాజ్యపాలనకు వస్తారేమో అన్నదాశరాజు సందేహాన్ని నిర్వృత్తి చేయడానికి తాను ఆజన్మాంతమూ బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాట విన్న దేవతలు సైతం ఎంతటి భీషణ ప్రతిజ్ఞనో అని పుష్పవృష్టి కురిపించారు. తండ్రికోసం తన సంతోషాన్ని ఆనందాన్ని తృణ ప్రాయం గా ఎంచి త్యాగం చేసే పుత్రుని సకల లోకాలు కొనియాడాయి. అహో భీష్మ అని కీర్తించాయి. శంతనుడు తనయుని వాక్కులు విని సంతసించి ఆ త్యాగశీలికి ఇచ్ఛామరణ వరాన్ని అనుగ్రహించాడు. హస్తినాపుర సామ్రాజ్య పరిరక్షణా భారాన్ని భీష్ముడు తన భుజస్కంధములపై వేసుకొని కురు పాండవులను సంరక్షించుకుంటూ వచ్చాడు. కాని వారిలో వారికి ఉన్న స్పర్థల వల్ల కలహాలు ఏర్పడ్డాయ. అహంకారాలు అజ్ఞానామూ అధర్మాచరణ మోసకారితనమూ లాంటి అన్ని దుర్లక్షణాల వల్ల మహా సంగ్రామానికి దారి ఏర్పడింది. అట్లాంటి భీష్ముడే కౌరవుల పక్షాన కురుక్షేత్ర సంగ్రామంలో నిలిచాడు. అపార విద్యా కౌశలాన్ని చూపాడు. తాను చేసిన ప్రతిజ్ఞ వల్లే అస్త్ర సన్యాసం చేశాడు. తన మనుమడైన అర్జునుని చేత మరణావస్థను పొందాడు. అంపశయ్య పై మేను వాల్చాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూచాడు. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడంతటివాడే వచ్చి ఆజన్మ బ్రహ్మచారివి, అపార మేధోసంపన్నుడవి, ధర్మస్వరూపివి కనుక భావి రాజ్యాధిపతి కాబోతున్న ధర్మరాజుకు ధర్మాలను బోధించమని చెప్పాడు. భక్తుల రక్షణార్థం తాను ఇచ్చిన మాటనే మరిచి ఆయుధం పట్టిన ఆ కృష్ణపరమాత్మ ఆజ్ఞను విన్నాడు. కృష్ణుని భక్త వాత్సల్యాన్ని నెమ రేసుకున్నాడు. కృష్ణుని జీవితాన్ని అవలోకించాడు. ధర్మ సంస్థాపనకు ఏతెంచిన మహావిష్ణువే కృష్ణపరమాత్మ అని చేతులెత్తి నమస్కరిం చాడు. తాను నేర్చిన, అనుసరించిన ధర్మానే్న ధర్మరాజుకు బోధించాడు. మహావిష్ణువును సహస్రనామాలతో నుతించాడా అంపశయ్యపై పడుకుని ఉన్న ఆ గంగాసుతుడు. ఆ భీష్ముడిని సకల లోకాలు కీర్తించాయ. మాఘశుద్ధ అష్టమి తిథి వచ్చాక గంగాసుతుడు దేవవ్రతుడు, భీష్ముడు ప్రాణాలు విడిచిపెట్టాడు. అటువంటి పుణ్యాత్ముడు తనువు చాలించిన రోజు కాబట్టి అది భీష్మాష్టమి అయింది. మహావిష్ణువుకు మహాభక్తుడు ఇష్టుడు అయన భీష్ముని తలుచుకుని భీష్మాష్టమి తరువాత వచ్చే ఏకాదశని సజ్జనులు భీష్మ ఏకాదశిగా సంభావించి ఆరోజున ఏకాదశి ఉపవాసాలు భీష్మ సంస్మరణ చేస్తారు. భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామాన్ని ఏకాదశిన ప్రత్యేకంగా పఠిస్తారు.
ఈ భీష్ముని గురించి పద్మ పురాణం
‘‘మాఘమాసే సీతాష్టమ్యాం సలిలం భీష్మ తర్పణం శ్రద్ధంచ యేనరాః కుర్యుః తేస్యుః సంతతి భాగినః॥ అంటే బ్రహ్మచారి, సంతాన రహితుడైన భీష్మునికి భీష్మాష్టమి రోజున శ్రాద్ధకర్మలు చేసిన వారికి తర్పణలు విడిచిన వారికి సంతానం కలుగుతుందని ఉద్ఘోషిస్తోంది.
అలాగే
‘‘శుక్లాష్టమ్యాంతు మాఘస్య దద్యాత్ భీష్మాయ యోజలం’’ అని కనీసం జల తర్పణం అయినా విడిచిపెట్టాలి. ఆ మహాపురుషుడికి అన్ని కులాల వాళ్లు ఇలా
‘‘్భష్మః శాంతనవో వీర. సత్యావాదీ జితేంద్రియః
అభివృద్ధి రవాప్నోతి పుత్ర పౌత్రో చితాం క్రియాం
వైయాఘ్ర పాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ దదామ్యేత జ్జలం భీష్మాయ వర్మణే॥
శ్లోకాన్ని పఠిస్తూ తర్పణ విడిచిపెట్టాలి. ఋషి ఋణం తీర్చుకోవడం మానవుల కున్న విధుల్లో ఒకటి. ధర్మాచరణుడు, తపోనిష్ఠాపరుడైన ఈ భీష్మునికి తర్పణం విడవడం ద్వారా ఋషి ఋణం తీర్చు కున్నట్టు అవుతుంది.

- చివుకుల రామమోహన్