మెయిన్ ఫీచర్

విమెన్ పార్లమెంట్ అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య, రాజకీయాలు, ఆర్థిక, క్రీడలు ఇలా అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారంతట వారే అభివృద్ధి చెందేలా, అధికారం సాధించే మార్గాలను అనే్వషించడం, వారి మనసులో మాటలు స్వేచ్ఛగా చెప్పే వీలు కల్పించడమే లక్ష్యంగా దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల కార్యక్రమం ‘నేషనల్ విమెన్ పార్లమెంట్’. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దీనిని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఏపీ శాసనసభ సారథ్యంలో ఇది జరుగుతోంది. మహిళలకు అన్ని రంగాలలో సాధికారత కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆలోచన స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రాగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. భావి రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే ఆసియాలోనే తొలి విద్యాసంస్థ ‘ఎమ్‌ఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ వ్యవస్థాపకుడు రాహుల్ కరద్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ విమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇడబ్ల్యుఎ) పాట్రన్, సామాజిక ఉద్యమకర్త ఎలాభట్ వీరికి తోడయ్యారు. అంతా కలసి చేపట్టి ఈ బృహత్తర కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పదివేలమంది విద్యార్థినులు వస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా శాసనసభ్యులు, విధానసభ సభ్యులు దాదాపూ 405 మంది, మహిళా ఎంపీలు 92మంది హాజరవుతున్నారు. రాష్టప్రతి ప్రణబ్, ప్రధాని నరేంద్రమోది, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర సహా దేశవిదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు దాదాపు మూడువేలమంది హాజరవుతున్నారు. ఈ మూడు రోజుల సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థినులకు సర్ట్ఫికెట్లు ఇస్తారు. ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.

స్వాతంత్య్రం వచ్చాక 1952లో మొదటిసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 22 మంది మహిళలు గెలుపొందారు. అప్పటి పార్లమెంట్‌లో ఇది 4.5 శాతంగా ఉంది. అది అంచెలంచెలుగా పెరిగి ప్రస్తుత పార్లమెంట్‌లో 93 స్థానాలకు (లోక్‌సభ 66, రాజ్యసభ 27) చేరింది. అంటే 12 శాతానికి చేరుకుంది. పార్లమెంట్ స్థానాల్లో పోటీపడిన వారి నిష్పత్తి ప్రకారం పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది గెలుపొందడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో పార్లమెంటేరియన్లపై జరిపిన ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఎక్కువగా మహిళా ప్రాతినిధ్యం కనబడుతుంది. ప్రపంచం మొత్తం మీద మారుమూల ఆఫ్రికన్ దేశమైన రువాండా పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం 63 శాతానికి పైగా ఉండడం విశేషం. ప్రపంచం మొత్తం మీద మహిళా పార్లమెంటేరియన్లు 22.4 శాతంగా ఉన్నారు.
ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే బిహార్, రాజస్థాన్, హర్యానాల్లో మహిళల ప్రాతినిధ్యం అధికంగా ఉంది. పాండిచ్చేరి, నాగాలాండ్‌లో అసలు మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఈశాన్య రాష్టమ్రైన నాగాలాండ్‌లో మహిళలు అధికార స్థానాల్లో ఉండకూడదన్న సాంప్రదాయం కారణంగా అక్కడ స్ర్తిల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇటీవల అక్కడ మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఇంటికే నిప్పు పెట్టారు.

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు అనగానే ముం దుగా పార్లమెంట్‌లో మహిళా ప్రతినిధుల సమావేశం అనే అనిపించింది. అయితే క్రమంగా అది కేవలం పార్లమెంటేరియన్లకే కాదు, మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన రాజకీయ, కార్పొరేట్, కళారంగ ప్రముఖులు, 10 వేలకు పైగా విద్యార్థినులు హాజరవుతున్నారని తెలిసి ఇది గతంలో ముందెన్నడూ జరగనంత స్థాయిలో జరిగే విస్తృత మహిళా సమూహ సదస్సు అని అర్థమైంది. ఈ సదస్సు నిర్వహణ తీరు చూస్తుంటే పురుషాధిపత్యంలోనే జరుగుతుందన్న భావన కలుగుతోంది. సదస్సు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలలో ఐదుగురు పురుషుల మధ్య ఒకే ఒక మహిళకు స్థానం కల్పించడం అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.