మెయిన్ ఫీచర్

అవకాశం ఇస్తే దూసుకుపోతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశం ఎవరూ ఇవ్వరు.. మనమే వెతుక్కోవాలి.. ముందుకు దూసుకువెళ్లాలి అంటూ మహిళా నేతలు పిలుపునిచ్చారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటుకు పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక, విద్యారంగాలకు చెందిన ప్రముఖులతోపాటు వేల సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఎదుగుతూ వచ్చిన మహిళలు తమ అనుభవాలను వివరిస్తే... సమస్యలను ఎదుర్కొని ముందు కు వెళ్లే ప్రయత్నంలో ఎదురైన అనుభవాలను మరికొందరు చెప్పుకొచ్చారు. అక్కడ అందరిమాటా ఒకటే మాకూ అవకాశం కావాలి. పురుషులకు దీటుగా ప్రతిభ చాటుతాం అంటూ నినదిస్తున్న మహిళలే అంతటా కనిపించారు. వారిలో సరికొత్త చైతన్యం వెల్లివిరుస్తోంది. దేశవిదేశాలు, విభిన్నరంగాలకు చెందిన మహిళా ప్రతినిధుల మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.