మెయన్ ఫీచర్

‘ఇస్రో’ దూకుడుతో అగ్రరాజ్యం బెంబేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అహంకారం పటాపంచలైంది. కేవలం వేయి రోజుల సమయంలో ‘ఓడలు బళ్ళు- బళ్ళు ఓడలు’ అయ్యాయి. 2014లో అమెరికా చేసిన ఎగతాళికి భారత శాస్తవ్రేత్తలు అగ్రరాజ్యం దిమ్మతిరిగేలా, ప్రపంచం విస్తుపోయేలా దీటైన సమాధానం చెప్పారు. పశ్చిమ దేశాల వారి జాత్యహంకారాన్ని తుత్తునియలు చేస్తూ 104 ఉపగ్రహాలతో కూడిన భారత ఉపగ్రహ వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. అపహాస్యాలు, అవమానాలు, బెదిరింపులను లెక్కచేయక భారత మేధావులు అంతరిక్ష చరిత్రలో నూతన అధ్యాయాన్ని రచించారు.
‘దేశాభివృద్ధికి అంతరిక్ష విజ్ఞానం’ అన్న నినాదంతో బెంగళూరు కేంద్రంగా 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (ఇస్రో)ను ప్రారంభించారు. భారత అంతరిక్ష విజ్ఞానానికి అధునాతన పితామహుడు విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ‘ఇస్రో’ అనతికాలంలోనే ‘ఆర్యభట్ట’ ఉపగ్రహాన్ని రూపొందించింది. 19 ఏప్రిల్ 1975న రష్యా నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆ తరువాత అయిదు సంవత్సరాలకే 1980లో ఇస్రో ‘రోహిణి’ని సొంతంగా తయారుచేసుకున్న ఉపగ్రహ నౌక ఎస్‌ఎల్‌వి-3 ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఆ తరువాత ‘‘పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్’ (పిఎస్‌ఎల్‌వి), ‘జియో సింక్రోనస్ శాటిలైట్ లాంఛ్ వెహికల్’ (జిఎస్‌ఎల్‌వి) అనే ఉపగ్రహ నౌకలను తయారుచేశారు. 2008లో చంద్రయాన్-1ను ‘ఇస్రో’ విజయవంతంగా అమలు చేసింది. ‘మార్స్ ఆర్బిట్ మిషన్’ (ఎంఒఎం) మంగళయాన్ గ్రహాంతర నౌకను ప్రయోగించాలన్న బృహత్తర పథకాన్ని 5 నవంబర్ 2013న ప్రకటించింది.
ఇస్రో ఆధ్వర్యంలో భారత వైజ్ఞానికులు సాధిస్తున్న వరుస విజయాలు, గ్రహాంతర సీమలు దాటుతున్న భారత అంతరిక్ష మేధా సంపత్తి ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారింది. భారత్‌పై తమ అక్కసును బహిరంగంగా ప్రకటించాయి. నిన్నమొన్నటి వరకూ వలస రాజ్యంగా బతుకుతూ తాము అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఆధారపడ్డ భారతదేశం అంతరిక్ష పరిజ్ఞానంలో తమతో పోటీపడడం, కొన్ని సందర్భాలలో తమను అధిగమించడం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న కొన్ని పశ్చిమ దేశాలు తట్టుకోలేకపోయాయి. సగటు భారతీయుడి మనసు గా యపడేలా, మన శాస్తవ్రేత్తలను కించపరుస్తూ అనేక ప్రకటనలు చేశారు.
2013లో భారత్ ‘మంగళయాన్’ పథకాన్ని ప్రారంభించినపుడు పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే సభ్యదేశాలుగా చెప్పుకోబడుతున్న వారి ప్రవర్తన ఇంత అథఃస్థాయికి చేరుతుందా? అన్న ప్రశ్న కలుగకమానదు. ‘కడు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్న భారత్ మంగళయాన్ పథకాన్ని చేపట్టిం’దంటూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ దినపత్రిక ఒక వ్యాసాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ ఎగతాళి చేసింది. ఈ వార్తాకథనం శీర్షికలోనే వారి అక్కసంతా కనపడుతుంది. ‘కడు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్న’ అన్న పదం ద్వారా వారి కడుపుమంట అంతా కక్కేశారు. ఆస్ట్రేలియాకు చెందిన మరొక దినపత్రిక ‘్భరత్ మంగళయాన్ పథకం ఆసియా ఖండంలో అంతరిక్ష పోటీని ప్రారంభించనున్నదా?’ అని రాస్తూ ఇరుగు పొరుగు దేశాల సంబంధాల మధ్య చిచ్చుపెట్టే పని చేసింది. ‘గార్డియన్’ దినపత్రిక ఏకంగా భారత్‌ను బెదిరించినంత పనిచేసింది. ‘ఇస్రో మంగళయాన్ పథకాన్ని ప్రారంభించింది. భారత్‌కు ఆర్థిక సహాయం అందడాన్ని జీర్ణించుకోలేని వారికి ‘మంగళయాన్’ మరింత ఆగ్రహాన్ని కలిగించింది. బ్రిటీష్ ప్రభుత్వం ఏటా భారత్‌కు 300 మిలియన్ల ఆర్థిక సహాయం అందిస్తోంది’ అంటూ, ‘మా దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న భారత్ తమ అనుమతి లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపడుతుంది?’ అంటూ అన్యాపదేశంగా ఆ పత్రిక ప్రశ్నించింది. తాము అందిస్తున్న ఆర్థిక సహాయం ఆపివేస్తామంటూ పరోక్ష బెదిరింపులు జారీచేసింది. ‘్భరత్ లాంటి పేద దేశం అంతరిక్ష పథకాలను ఎలా నిర్వహించగలుగుతుంది?’ అంటూ మరొక ప్రముఖ దినపత్రిక ప్రశ్నించింది. ఈ వార్తలు, వ్యాఖ్యలు వెనుక- అసలు ఉద్దేశం ఒక్కటే. భారత్‌ను పేదదేశంగా చిత్రీకరించడం, భారత్ ఎంత ప్రయత్నించినా తమతో పోటీ పడలేదు అని హెచ్చరించడం, అవసరమైతే భారత్‌కు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తామంటూ బెదిరించడం. పశ్చిమ దేశాల మేధావులు కొందరు చేసిన వ్యాఖ్యలు చెప్పుకుంటే మనకే సిగ్గనిపిస్తుంది. భారత శాస్తవ్రేత్తలు పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణంపై పరిశోధనలు ఎందుకు చేయరాదంటూ వీరు సూచించారు. ఇటువంటి మరొక ఘోర అవమానం ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రిక కార్టూన్ రూపంలో చేసింది. 2014లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్దిరోజుల ముందర ఉద్దేశ పూర్వకంగా మన ‘ఇస్రో’ను అవమానిస్తూ ఒక కార్టూన్ ప్రచురించింది. ఒక అద్దాల గదిలో ఇద్దరు శాస్తవ్రేత్తలు దినపత్రిక చదువుతూ వుంటారు. గదిమీద ‘ఎలీట్ ప్రెస్ క్లబ్’ అని రాసి ఉంటుంది. అంటే వీరంతా అంతరిక్ష విజ్ఞానంలో ఆరితేరినవారన్నమాట. వారి ద్వారం దగ్గర తలపాగా ధరించి, పంచె కట్టుకుని, ఎద్దును వెంటబెట్టుకుని ఒక బీద భారత రైతు నిలబడి గదిలోకి ప్రవేశానికి అనుమతించమని ప్రాధేయపడుతున్నట్లుగా ఉం టుంది ఈ కార్టూన్. ఇటువంటి అవమానాలు, అపహాస్యాలు ఇస్రోను ఇసుమంత కూడా ప్రభావితం చేయలేకపోయాయి. కేవలం 450 కోట్ల రూపాయల అత్యల్ప ఖర్చుతో మొట్టమొదటి ప్రయత్నంలో మంగళయాన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి భారత శాస్తజ్ఞ్రులు తమ ప్రతిభాపాటవాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచంలోని విమర్శకుల నోళ్ళు మూయించారు. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), రష్యాకు చెందిన ‘రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ’ (ఆర్.ఎఫ్.ఎస్.ఎ), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇ.ఎస్.ఎ)లు సాధించలేని ఘన విజయాన్ని భారత ఇస్రో శాస్తజ్ఞ్రులు అలవోకగా సాధించారు. మార్స్ ఉపగ్రహం కోసం నాసా ఖర్చుపెట్టినదానిలో కేవలం 10వ వంతు ఖర్చుతో భారత్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది.
పాశ్చాత్య దేశాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి గ్రహాంతర ఉపగ్రహాలను ప్రయోగిస్తుంటే భారత్‌కు మాత్రం తమ ప్రయత్నాల వెనుక స్పష్టమైన లక్ష్యాలున్నాయి! ‘ఇస్రో’ తన ధ్యేయ వాక్యం- ‘దేశాభివృద్ధికి అంతరిక్ష విజ్ఞానం’ అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ పదే పదే ఈ ప్రకటనలు చేస్తున్నది. ‘రిమోట్ సెన్సింగ్- ఇన్సాట్’ ద్వారా దేశానికి అవసరమైన వౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇస్రో కృషి చేస్తున్నది. అంతరిక్ష విజ్ఞానం ద్వారా ‘పైలాన్’ పెను తుఫాన్ ముప్పునుంచి లక్షలాది మంది ప్రాణాలను, వేల కోట్ల రూపాయల సంపదను ఇస్రో కాపాడగలిగింది. రిమోట్ సెన్సింగ్ ద్వారా భారత రైతులు, మత్స్యకారులకు సహాయం చేయగలుగుతున్నది. భారత ప్రజల జీవనోపాధికి, సమృద్ధ జీవనానికి ఇస్రో మేలైన బాటలు వేస్తున్నది.
కొద్ది సంవత్సరాల క్రితం వరకు అమెరికా, రష్యాలకే పరిమితమైన అంతరిక్ష విజ్ఞానాన్ని భారత శాస్తవ్రేత్తలు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో మేలైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నారు. వీటి ఫలితాలను పేద ప్రజల ఉన్నతికి వినియోగిస్తున్నారు. కేవలం 14 నెలల కాలంలోనే భారతదేశం మంగళయాన్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టగలిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా, జపాన్, రష్యాలు అనేకసార్లు ఈ ప్రయత్నంలో విఫలమయ్యాయి. మంగళయాన్‌తో అంతరిక్షంలో భారత జైత్రయాత్ర ఆగిపోలేదు. 15 ఫిబ్రవరి 2017న ఒకేసారి 104 ఉపగ్రహాలను ఒకే నౌక నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి భారత్ ప్రపంచ రికార్డ్ సాధించింది. ఈ 104 శాటిలైట్లలో 101 విదేశాలకు చెందినవి. వీటిలో 96 ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, కజగిస్తాన్ చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. గతంలో రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఏకకాలంలో 37 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి రికార్డు సాధించింది. భారత్ కూడా 2015లో ఒకసారి 23 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. వచ్చే ఏడాది చంద్రయాన్-2ను ప్రయోగించడానికి ఇస్రో సిద్ధమవుతున్నది. ఇప్పటికి ఇస్రో 226 ఉపగ్రహాలను ప్ర యోగించగా, ఇందులో 179 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి.
మూడు సంవత్సరాల క్రితం భారత్‌ను అపహాస్యం చేసిన విదేశాలు, ఆయా దేశాల పత్రికలు ప్రస్తుతం భారత్‌ను కొనియాడడంలో,ప్రశంసించడంలో మునిగిపోయాయి. ఒకప్పుడు భారత్‌ను ఎగతాళి చేసిన న్యూయార్క్ టైమ్స్- ‘18 నిమిషాల వ్యవధిలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ గతంలోని రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. అంతరిక్ష సాంకేతిక వ్యాపార రంగంలో భారత్ కీలకమైన పోటీదారుగా నిలబడుతున్నది’ అంటూ ప్రముఖంగా వార్తలను ప్రచురించింది. ఉన్నత లక్ష్యాలతో పనిచేస్తున్న భారత అంతరిక్ష శాస్తవ్రేత్తలు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలుగుతున్నారు. ఇది వారి కిరీటంలో మరొక కలికితురాయి అని విశ్వవిఖ్యాత వార్తా సంస్థ బిబిసి పేర్కొన్నది. ఒకప్పుడు అమెరికా, రష్యాలకే పరిమితమైన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన పోటీ ఇప్పుడు ఆసియాకు చెందిన చైనా, భారత్‌ల ప్రవేశంతో మరింత తీవ్రం అయింది అని సిఎన్‌ఎన్ రాసింది. అంతరిక్ష రంగంలో ఇప్పటికే పాతుకుపోయిన వారితో తక్కువ ఖర్చు శాస్త్ర పరిజ్ఞానంతో భారత్ పోటీపడుతున్నదని ‘అల్ జజీరా’ ప్రకటించింది.
అంతరిక్ష విజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న భారత శాస్తవ్రేత్తలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని దీటుగా ఎదుర్కోవడంలో, పాశ్చాత్య దేశాల సవాళ్ళను అధిగమించడంలో, అభివృద్ధి చెందిన దేశాల బెదిరింపులను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో మన శాస్తజ్ఞ్రులు విజయం సాధించారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మనల్ని అనుసరిస్తుందనడంలో సందేహం లేదు. అమెరికా బెదిరింపులను, పశ్చిమ దేశాల అవమానాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వ కాలంలోనే తిప్పికొట్టడం సాధ్యమైంది. భారత్ అణుపరీక్షలు జరగకుండా అమెరికా చేసిన బెదిరింపులను కాదని గతంలో అటల్‌బిహారీ వాజపేయి ప్రభుత్వం పోఖ్రాన్ పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తే, నాసా తదితర సంస్థల హెచ్చరికలను బేఖాతరు చేసి నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించిన సంగతి మర్చిపోకూడదు. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113