Others

పిల్లలకు ఇవి చెప్పాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింధూ,బిందూ కూర్చొని గుసగుసలాడుకుంటున్నారు. ఆ ఇద్దరూ అంత రహస్యంగా ఏమి మాట్లాడుకుంటున్నారో విందామని సింధూ తల్లి పనిచేసుకుంటునే ఓ చెవి వారి మాటలపై వేసింది. టీవీ లో వచ్చిన సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాల గురించి ఎవరికీ వినపడకుండా మాట్లాడుకుంటున్నారు. ఏయ్! ఏమిటా మాటలు? మీరు చిన్న పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని కసిరి వారిని అక్కడ నుంచి పంపించివేసింది. కాని ఆ తల్లి కసురుకోవటం వల్ల ఇక అంతటితో వారి మనసులో నుంచి ఆ ఆలోచనలు దూరమవుతాయనుకుంటే పొరపాటే. టీవీలే కాదు నట్టింట్లో తిష్టవేసిన నెట్ సైతం వారి ఆలోచనలకు మరింత పదును పెడుతుంది. దీంతో వారికి చదువు తలకెక్కదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వేధిస్తుంటాయి. దీనికంతటికీ కారణం వారికి లైంగిక విద్యపై సరైన అవగాహన లేకపోవటమే. సృష్టికి మూలం, జీవన మాధుర్యమైన శృంగారం. స్ర్తి తన ప్రాణం కన్నా మాతృత్వానికే ప్రాధాన్యమిస్తుంది. అందుకే దీనిని ఆరోగ్య అంశంగా పరిగణించారు.
పిల్లలకు ఇలాంటి లైంగిక విద్యను వివరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించారు. అమెరికాకు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ అనే సంస్థ లైంగిక విద్యపై అవగాహన కల్పిస్తూ చక్కటి పాఠ్యాంశాలను రూపొందించింది. కాని మనమే వీటని పిల్లలకు సరైన పంథాలో వివరించలేకపోతున్నాం. యుక్త వయసు వచ్చిన పిల్లలకు ఈ విద్య నేర్పించకపోవటం వల్ల వారిని పక్కదారి పట్టిస్తున్నామని మానసిక నిపుణులు చెబుతున్నారు. పెద్దలు పిల్లలతో తీరిక చేసుకుని ఎపుడైనా మాట్లాడినా కేవలం వారి భవిష్యత్తు గురించి, క్రమశిక్షణ, కెరీర్ తదితర వాటిపైనే మాట్లాడతారు. ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతారే కాని లైంగిక అంశాలపై వారితో ముచ్చటించరు. అలాంటి విషయాలు మాట్లాడితే వారి నడవడిక పక్కదారి పడుతుందని భయం.
ఆడపిల్లలకు 12 ఏళ్లు వచ్చినా లైంగిక విషయాలపై కనీస అవగాహన ఉండటం లేదు. నేడు పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకు వారిపై జరుగుతున్న లైంగిక దురాగతాలను చూస్తుంటే పిల్లలకు లైంగిక విషయాలపై కనీస అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రీ స్కూ లులోనే పిల్లలకు వారి జననాంగాల గురించి వివరించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాస్తంత వయసురాగానే లైంగిక అవగాహన కల్పించినట్లయితే తెలిసితెలియని వయసులో వారు తప్పటడుగులు వేయకుండా, లైంగిక వేధింపుల బారినపడకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ఏడేళ్లలోపు పిల్లలు దేన్నైనా అనుకరిస్తారు. కాబట్టే తల్లిదండ్రులు వారి పక్కలను వేరే గదిలో ఏర్పాటు చేయటం మంచిది. శరీరధర్మం, శారీరక మార్పులు, శృంగారంపై పాజిటివ్ దృక్పథంతో మాట్లాడేలా చేస్తే పెద్దయినప్పటికీ ఇతరులతో మాట్లాడేటపుడు అసభ్యకరంగా మాట్లాడరు.
పరాయివాళ్లను ఏయే భాగాల్లో తాకనివ్వకూడదో ఆడపిల్లలకు చెప్పాలి. చిన్నచిన్న జాగ్రత్తలు చెప్పాలి. టాయిలెట్‌కు వెళ్లినపుడు తప్పనిసరిగా డోర్ వేసుకుని వెళ్లమని చెప్పండి.
ఏడు నుంచి పద్నాలుగేళ్ల వయసులో శారీరకంగా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి పిల్లలు ఏం చూస్తున్నారు. ఏం చదువుతున్నారు. స్నేహితులతో ఎలా మాట్లాడుతున్నారో పరిశీలించటం మంచిది. వారు అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వాలి. ఇవి చెప్పేటపుడు మనకు ఇబ్బందిగా అనిపించినా..పిల్లల్లో ఎలాంటి ఉద్వేగం కలుగకుండా లైగింక విషయాలను, అలాగే మర్మాం గగాలలో వచ్చే మార్పులను చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేస్తే మంచిది. పద్నాలుగేళ్ల వయసులో చెప్పటం వల్ల అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఏర్పడిన స్నేహా సంబంధాలు, వాటి ప్రతికూల, సానుకూల ప్రభావాల గురించి వివరిస్తూ శృంగారంపై అవగాహన కల్పించాలి.
లైంగిక విద్య గురించి చెప్పటం అంటే సమాజంలో ఉన్న నైతిక, సాంఘిక విలువలను నేర్పించటమే అని గ్రహించండి. శృంగారం అనేది కూడా ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో జరిపే సృష్టికార్యం అని చెప్పటంలో తప్పులేదు. ఇలా వివరించటం వల్ల మన పిల్లల్ని సరైనమార్గంలో పెంచినవాళ్లమవుతాం.
ఇదీ నిజం
మనదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 5-12 ఏళ్లవారిలో 53శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆ విషయం వారు గుర్తించే స్థితి కూడా ఉండదు. గర్భం ధరించే ప్రతి వెయ్యిమందిలో 62మంది టీనేజ్ వారే ఉండగా వారిలో 18 శాతం మంది పదిహేనేళ్లలోపువారే. 47 శాతం మంది 18 ఏళ్లలోపువారు. 50 శాతం మంది గ్రామీణ మహిళలకు ఋతుస్రావం అంటే ఏమిటో తెలీదు. ఎందుకువస్తుందో తెలీదు. పట్టణాల్లో 6.7 శాతం మంది పరిస్థితీ అంతే.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రెయినింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) పరిమిత స్థాయిలో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించాలని భావించింది. ప్రత్యేక సిలబస్ కాకుండా ప్రస్తుత సిలబస్‌లో భాగంగా బోధనాంశాల ప్రవేశపెట్టాలని అనుకుంది. చండీగఢ్‌లో ఓ అధ్యయనం కూడా నిర్వహించారు. 2005 నుంచి ఈ ఆలోచన పెరుగుతూండగా పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారత సంస్కృతి సంప్రదాయాలపై దాడిగా దీనిని భావిస్తున్నారు. గుజరాత్, ఎం.పి, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, గోవా, కర్నాటక సెక్స్‌ఎడ్యుకేషన్‌ను వ్యతిరేకిస్తూండగా ఒడిశా దీనిపై నిర్ణయాన్ని తరచూ వాయిదా వేస్తోంది.
సెక్స్ ఎడ్యుకేషన్ మూడు రకాలు. వయసుతోపాటు వచ్చే శారీరక, మానసిక మార్పులు, వాటిపై చర్చించడం, సంభోగం, సంతానోత్పత్తిగురించి వివరించడం, పెళ్లి, కాన్పులు, ఆ తరువాతి శారీరక మార్పులను టీనేజ్ యువతీయువకులకు ప్రాథమిక స్థాయిలో బోధించడం. కానీ భారత్‌లో దీనికి పెద్ద సుముఖత వ్యక్తం కావడం లేదు.
గుజరాత్‌లోని ఓ స్కూలులో చాలా పరిమిత స్థాయిలో ‘సెక్స్ ఎడ్యుకేషన్’ తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీని ప్రకారం ఆయా అంశాలపై అబ్బాయిలు, అమ్మాయిలు తమతమ సందేహాలను, అభిప్రాయాలను రాసి ఓ డబ్బాలో వేయాలన్నది ఓ సూచన. అమ్మాయిలు వ్యక్తం చేసిన సందేహాల్లో ఎక్కువగా ఋతుస్రావం, శారీరక మార్పులు, సంభోగం వంటివి ప్రధాన అంశాలు. కాగా మగపిల్లల సందేహాల్లో స్వప్నాల్లో వీర్యస్కలనం, సంభోగంపై ఉన్నాయి.
సెక్స్ ఎడ్యుకేషన్ మాట అటుంచితే సాధారణ పాఠ్యాంశాల సందర్భంగా ఇలాంటి అంశాల ప్రస్తావన చేయాల్సి వచ్చినపుడు ఉపాధ్యాయులు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఓ అధ్యయనం తేల్చింది. గుజరాత్‌లో అదే జరిగింది.
పిల్లల వైఖరి, చురుకుదనం, ఎదుగుతున్న సమయంలో వారి సందేహాలను తీర్చే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని, విదేశాల మాదిరిగా కాకపోయినా మన సంస్కృతి నేపథ్యంలో ఎడ్యుకేట్ చేయడం తప్పనిసరి అని, అలా చేయడం వల్ల వారికి సామాజిక, ఆరోగ్య రక్షణ కల్పించడమే అవుతుందన్నది ఆధునిక భావన. వైద్యవర్గాలు, మానసిక నిపుణలు సలహా కూడా అదే.

తెలుసా... మనసా!
ఇతర దేశాలతో పోలిస్తే సెక్స్‌ఎడ్యుకేషన్ విషయంలో మనది భిన్నమైన పంథా. అక్కడి సంస్కృతి సంప్రదాయాల వల్ల వారు శృంగారం, గర్భధారణ, నిరోధం, గర్భస్రావం వంటి విషయాలను వారు ప్రాధాన్యం ఇస్తూనే అదో సాధారణ విషయంగా భావిస్తారు. మనదేశంలో పరిస్థితి ఇందుకు భిన్నం. సంస్కృతి, సంప్రదాయాలు ఒక కారణమైతే, నిరక్షరాస్యత మరో కారణం. కౌమారదశలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలా మెలగాలి, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, ఇతరుల నుంచి లైంగిక వేధింపులు ఎలా ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలన్న విషయాలను ఎవరూ ఎవరికీ చెప్పరు. కనీసం తల్లికూడా కూతుళ్లతో చెప్పేందుకు మొహమాటపడుతుంది. సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నా చాలా వ్యతిరేకత ఎదురౌతోంది. ఇక్కడ కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

- ఆశాలత