మెయన్ ఫీచర్

ఇస్లాం తీవ్రవాదం.. విశ్వానికే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం మూలాలపైన, దేశంలో మతపరమైన చీలికపైన చర్చకు అంతే లేదనిపిస్తోంది. ‘ఐసిస్’తో సం బంధాలున్న కొంతమంది యువకులను ఇటీవల తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యద్భుత సమన్వయంతో అరెస్టు చేయడాన్ని- ‘మైనారిటీలకు అపరాధ క్షమాపణలు చెప్పుకొనే’ దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఇంటిలిజెన్స్ వ ర్గాలు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పనిచేసి సాధించిన ఫలితాలపై దిగ్విజయ్ రంధ్రానే్వషణ చేస్తున్నారు. ‘ఐసిస్‌ను సృష్టించింది ఆర్‌ఎస్‌ఎస్ సంస్థే’ అన్న రీతిలో దిగ్విజయ్ మితిమీరిన విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నందుకు ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిందే. ఈ దేశంలో ‘ఉదారవాదులమ’ని గర్వంగా చెప్పుకునేవారు దిగ్విజయ్ సింగ్ చేస్తున్న పనికిమాలిన వ్యాఖ్యలపై వౌనం వహిస్తుంటారు. ఇదీ మన పుణ్యభూమిలో ‘లౌకికవాదం’ తీరు.
దిగ్విజయ్ లాంటి దురభిమానులను పక్కన పెడితే, పోలీసులు అరెస్టు చేసిన ‘అనుమానితుల’కు ‘ఐసిస్’తో సం బంధాలు లేవని, వీరికి ఆ ఉగ్రవాద సంస్థ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేదా శిక్షణ అందలేదని కొందరు వాదిస్తున్నారు. కానీ, ‘ఐసిస్’ను స్ఫూర్తిగా తీసుకున్న ఆ యువకులు తమకు తాముగా ఓ మార్గాన్ని ఎంచుకుని, నిధులను సమీకరించుకుని పనిచేస్తున్నారు. ఉగ్రవాద సంస్థను ‘స్ఫూర్తి’గా తీసుకోవడం అంటే- వారు ఎలాంటి పెడదోవలో వెళుతున్నారో మనకు అర్థం అవుతుంది. కే రళ, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఎంతోమంది ‘అనుమానితులు’ సిరియా వెళుతున్నారన్నది కఠోర వాస్తవం. అలా వెళ్లిన సుమారు ఏభైమందికి ఈ వాదన దోషపూరితంగా తోస్తుంది. నిజంగా తమంతట తాము పనిచేస్తుంటే వారు సిరియా వెళ్లడం ఎందుకు? ‘ఐసిస్’లో చేరడం ఎందుకు? సిరియా వెళ్లి తిరిగి స్వదేశానికి వచ్చిన కొద్ది మంది యువకులు చెప్పే కథనాలు వింటే మనకు వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. ‘ఐసిస్’ ఉగ్రవ్యవస్థ నీ డలో భారత్ ఉందని పలు నిఘా సంస్థలు ఇప్పటికే నివేదికలు ఇచ్చాయి.
ముస్లిం యువత పరారుూకరణ, తప్పుదోవ పట్టడంపై ‘జిహాదీ’ సానుభూతిపరులు నిత్యం ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలను అదేపనిగా నిందిస్తుంటారు. బాబ్రీ కూల్చివేత, ముంబయి దాడులు, గుజరాత్‌లో అల్లర్లు వంటి సంఘటనలు ముస్లింలను ప్రధాన స్రవంతి నుంచి దూరం చేశాయి. వలసల కాలం నుంచి మతపరమైన విభజనకు ఎదో ఒక కారణాన్ని కనిపెడుతుండడం ఈ దేశంలో పరిపాటే. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఏం చెప్పారు? హిందువులు, ముస్లింలు ఎప్పటికీ కలసి ఉం డలేరని ఆయన కొన్ని కారణాలు చూపించేవారు. జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వస్తధ్రారణ వంటివన్నీ భిన్నంగా ఉన్నందున ఈ రెండు మతాలకు రెండు దేశాలుండాలన్నది ఆ యన వాదన. అత్యంత హానికరమైన ఈ ‘రెండు దేశాల సిద్ధాంతం’ విషంలా పాకడంతో దేశం ముక్కలైపోవడమే గాక ఉభయ మతాలకు చెందిన లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు.
‘రెండు దేశాల సిద్ధాంతం’ ఉన్నప్పటికీ ముస్లింలలో ఎక్కువమంది భారత్‌లోనే స్థిరపడ్డారు. దేశ విభజన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు వారి ఆలోచనల్లో ఎలాంటి మార్పు లేదు, వారు జాతీయ జీవన స్రవంతిలోనే ఉన్నారు. అయితే, ఉదారవాదులమని చెప్పుకొనే కొంతమంది ‘ముస్లింల పోషకులు’గా వ్యవహరిస్తూ వారి మనసుల్లో పరారుూకరణ వంటి విషబీజాలను నాటారు. ‘అయోధ్య’ వివాదంతోనే ఈ దేశంలో మతకలహాలు ప్రారంభం కాలేదన్నది నగ్నసత్యం. బ్రిటిష్ పాలకుల హయాంలోనూ మతఘర్షణలు జరిగాయి. ‘ప్రత్యక్ష చర్య’కు దిగాలంటూ అలనాడు ముస్లిం లీగ్ అధినేత జిన్నా ఇచ్చిన పిలుపును ఎవరు మరచిపోగలరు? ఆయన పిలుపు ఫలితంగా హిందువులు ఊచకోతకు గురికావడం, వారి ఆస్తులు ధ్వంసం కావడం చెరిగిపోని చరిత్ర. కలకత్తాలో దారుణ ఘటనకు బిహార్‌లో అల్లర్లు జరగడం, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం.. ఇవన్నీ అవాంఛనీయ స్పందనలే. కొంతమంది నిగూఢ ఉద్దేశాలకు అప్పటి పాలకులు సహకరించడంతో ఈ దారుణాలు జరిగాయి. బ్రిటిష్ పాలన చివరి రోజుల్లో మతహింస, మారణకాండ నిత్యకృత్యంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ వ్రాసిన ‘్ఘశ ళ్ఘూ యచి జ్ఘూరీశళఒఒ’ పుస్తకంలో బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగ్‌కు మద్దతుగా నిలవడం, జిన్నా ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో భయానక వాతావరణం ప్రజ్వరిల్లడం వంటి విషయాలను గమనించవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర వల్లనే ఆనాడు నెహ్రూకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయని, ‘హిందువు’ అయినందు నే నెహ్రూను జాతీయ నాయకుడిగా ము స్లింలు అంగీకరించరన్న వాదనను లేవదీశారని శశి ధరూర్ తన పుస్తకంలో రాశారు.
జిన్నా అనుచరులు ‘రక్తం గడ్డకట్టే’లా హెచ్చరికలు చే శారు. ‘అహింస’పై ముస్లింలకు విశ్వాసం లేదని వారు తేల్చిచెప్పారు. ‘ఊచకోతకు సమయం వస్తే ఎవరూ తప్పించుకోలేర’ని జిన్నా హెచ్చరించినట్లు ముద్రించిన కరపత్రాలను ఆరోజుల్లో పలు నగరాల్లో పంచిపెట్టారు. కలకత్తాలో జరిగిన ఊచకోతను సమర్ధిస్తూ అవిభాజ్య బెంగాల్ ముఖ్యమంత్రి హెచ్‌ఎస్ సుహ్రవార్దీ విస్మయకర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ‘మెజారిటీ మతస్థుల’ (హిందువులు) కారణంగా ముస్లింలు బాధితులుగా మారారన్న వాదనను జిన్నా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ నేతలు, బ్రిటిష్ పాలకులు ఉద్దేశ పూర్వకంగా వ్యూహాత్మక పాత్రను పోషించారు. కనుక, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చెప్పే విషయాలేవీ కొత్తగా అన్పించవు. మతపరమైన చీలికకు ఆనాడే జిన్నాకు చెందిన ముస్లిం లీగ్, బ్రిటిష్ ప్రభుత్వం విత్తనాలు చల్లాయి. కాబట్టి మతవిద్వేషాలకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు కారణమని నిందించడంలో అర్థం లేదు.
దేశ విభజన జరిగి దశాబ్దాలు గడిచినా, ‘మైనారిటీ మతస్థుల’ ఆలోచన మారలేదు. ‘మేము విభిన్నం’ అన్న మానసిక భావన వారిలో కొనసాగుతోంది. ఇంతకీ ‘ఉసిగొల్పేవారు’ ఎవరు? మైనారిటీ మతస్థులో.. తీవ్రవాద స్వభావులో కాదు.. ‘లౌకికవాదులం’ అని చెప్పుకొనేవారే!
ఈ వాదనలన్నీ పక్కన పెడితే, ముస్లిం యువత పెడదోవ పట్టడం భారత్‌కే పరిమితమైన ‘ప్రత్యేక దృగ్విషయమా’? అక్రమ వలసల కారణంగా ఇలాంటి పరిస్థితి యూరప్‌లోని చాలా దేశాల్లో నెలకొంది. ‘ఇస్లామీకరణ’ అనే బాంబుపై ఫ్రాన్స్ కూర్చొని ఉంది. సాధారణ చట్టాల కన్నా- ఇస్లాం విలువలు, ఇస్లాం చట్టాలే తమకు ముఖ్యమని ఫ్రాన్స్‌లోని ముస్లింలు భావిస్తున్నారు. భారత్‌లోని ముస్లింలకు, ‘హ్రస్వదృష్టి’ ఉన్న వారి నాయకులకు మన రాజ్యాంగం, ఉమ్మడి పౌరస్మృతి కన్నా ‘షరియా’నే ముఖ్యం.
గొప్ప లౌకిక రాజ్యంగా పేరొందిన స్విట్జర్లాండ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. స్విట్జర్లాండ్‌లో దాదాపు 480 మంది అనుమానిత జిహాదీలు పనిచేస్తున్నట్లు ఆ దేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. స్వీడన్, యుకె తదితర దేశాలకూ ఇస్లాం తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. మన దేశంలో మహా మేధావులుగా చెలామణి అయ్యేవారు ‘లౌకికవాదులు’గా మరో పాత్రను పోషిస్తుంటారు. ‘ఐసిస్’ ఎజెండా పట్ల ఆకర్షితులవుతున్న ముస్లిం యువతను మంచి మార్గంలో పెట్టాలని ఈ మేధావులు సలహాలిస్తుంటారు. చెయ్యడం కన్నా చెప్పడం చాలా సులువు. ఈ దిశగా పనిచేయడం ‘పూర్తి వైఫల్యం’ అని ఫ్రాన్స్‌కు అనుభవమైంది. పెడదోవ పట్టిన ముస్లిం యువతను ప్రత్యేక కేంద్రాల్లోనో, జైళ్లలోనో సంస్కరించడం సులువు కాదని తేలింది. ఎందుకంటే ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన యువత తిరిగి వెనక్కి వచ్చేందుకు సుముఖంగా ఉండదు. ఫ్రాన్స్‌లో సుమారు ఎనిమిది వేలమంది కరడుకట్టిన ఇస్లాం తీవ్రవాదులుండగా, తిరిగి వెనక్కి వెళ్లేందుకు 17 మంది దరఖాస్తు చేసుకోగా, చివరికి ఎనిమిది మంది మాత్రమే వచ్చారు.
ఇటీవల లక్నోలో సైఫుల్లా అనే యువకుడు- ‘చట్టానికి లొంగిపోవడం కన్నా బలిదానానికే ఇష్టపడతాన’ని చెప్పాడు. ఇదీ- పెడదోవ పట్టిన ముస్లిం యువత ధోరణి. ఇస్లాం ఉగ్రవాదం ప్రపంచంలో వర్థిల్లుతుండగా, ఈ సమస్యను భారత్ నుంచి పెకిలించడం అసాధ్యం అనిపిస్తుంది. రామజన్మభూమి (అయోధ్య)లో అదే వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును కొత్తగా నిర్మించినా, హిందువులందరినీ అయోధ్య నుంచి తరిమేసినా ఇస్లాం తీవ్రవాదం ఈ దేశంలో అంతరించడం కల్లే.
*

ఎస్‌ఆర్‌ రామానుజం, సెల్ : 80083 22206