మెయిన్ ఫీచర్

ఫోకస్ మారింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరన్నారు? -తెలుగు హీరో మారడని. కథ కోసం కాకున్నా -కానికాలం దాపురించినపుడు కెరీర్ కోసమైనా మారాలి. లేకపోతే ఆడియన్స్‌కు విలనైపోతాడు.
ఒక్క కథను వంద సినిమాలు తీయగల సత్తా -తెలుగోడి సొంతం. లెక్కలు తీస్తే ఆ స్టామినా లెక్కించడానికి వేళ్లు, ఏళ్లు సరిపోవు. ఇది సాగినంత కాలం సాగి’పోయింది. ఆదిలో హీరోను దృష్టిలో పెట్టుకుని కనెక్టయినా, రోటీన్ స్ట్రాటజీకి అలవాటుపడి మొహం మొత్తేయంతో పెద్ద హీరోనైనా చెత్తకథతో వస్తే తిప్పికొట్టడం మొదలెట్టారు. మరోపక్క తెలుగు కథకుల సంచి ఖాళీ అయిపోవడం, కొత్త జనరేషన్ మొత్తం ఫార్ములా డిజైన్‌కు అలవాటుపడిన పరిణామాల్లో -మంచి కథలూ అందని ద్రాక్ష అయిపోయాయి.
**
కొత్త సీన్లు లేనపుడు -కొత్త స్క్రీన్లు వెతుక్కోవాలి. కొత్త ఆడియన్స్‌ని ఫైట్ చేసి పట్టాలి. నిజానికి ఈ పనిని పొరుగు హీరోలు ఎప్పుడో మొదలెట్టారు. దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాల హీరోలు -తెలుగును టార్గెట్ చేస్తూ చేతనైనంత మార్కెట్‌ను పెంచుకున్నారు. మార్కెట్ గేమ్ మెల్లగా అర్థమవడంతో -తెలుగు హీరోలు సైతం పొరుగు స్క్రీన్ తట్టక తప్పడం లేదు. కుదిరితే దక్షిణాది, వీలైతే ఉత్తరాదికి ఆడియన్స్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నారు. అంటే -తెలుగు హీరోల లెక్కలు మారుతున్నాయి. కమర్షియల్ ఫార్ములాను స్క్రీన్ వెనక్కి నెట్టేసి, పక్క రాష్ట్రాల్లో ప్లేస్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు మొదలెట్టారన్న మాట. ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు ఎంత దూరమో, ఆ రాష్ట్రాలకు ఈ రాష్టమ్రూ అంతే దూరం. అందుకే -అక్కడి హీరోలు ఇక్కడి మార్కెట్‌పై కనే్నయగా లేనిది, మనమెందుకు ప్రయత్నించకూడదని ఆలోచిస్తున్న తెలుగు హీరోల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆలస్యం అన్నిసార్లూ విషం కాదు. విషయముంటే, ఆలస్యం కూడా అమృతం కావొచ్చు. తెలుగు హీరోలకు పరభాషల్లో దొరుకుతున్న ఆదరణ -అమృతమే. ప్రస్తుతం -సీన్ ఈజ్ సీజన్ ఆఫ్ దెయిర్ ఎనర్జీ అన్నట్టుంది.
***
నిన్నటి వరకూ తెలుగు హీరోలు పంథా మార్చుకునే ప్రయత్నం చేశారు. కొత్త కథల వెతుకులాటలో భాగంగా మెచ్చే కథ దొరికేవరకూ నచ్చినంత కాలం ఎదురు చూశారు. తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలన్న కసి చూపించారు. వైవిధ్యమైన పాత్రలు చేయడానికి సైతం ముందుకొస్తున్న హీరోలే అందుకు నిదర్శనం. ఇప్పుడు తెలుగు హీరోల ఫోకస్సే మారింది. తమిళం, మలయాళంతోపాటు కుదిరితే హిందీ మార్కెట్‌పైనా దృష్టి పెడుతున్నారు. ఈ విషయంలో తమిళ హీరోలను ప్రస్తావించక తప్పదు. నేషనల్ మార్కెట్‌మీద రజనీకాంత్, కమల్‌హాసన్ దృష్టిపెడితే, ఆ అనుసరణతో కొత్త జనరేషన్ హీరోలు సైతం తమిళ సినిమాను తెలుగుకు అనువదించి, తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు మార్కెట్ మీద పట్టుసాధించే అవకాశం సైతం దక్కుతోంది. అనువాద సినిమాయే కదా అని నిర్లక్ష్యం చూపించకుండా, తన సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిపెంచే ప్రయత్నాలు చేస్తుండటం -మార్కెట్ విస్తరణ స్ట్రాటజీలో భాగమే. మొన్న వచ్చిన ‘బిచ్చగాడు’నే ప్రస్తావించుకుంటే, అంతకుముందు తెలుగులో పరిచయానికే పరిమితమైన విజయ్ ఆంటోని -ఏకంగా తెలుగులోనూ స్టార్ హీరోగా మారాడు. ఒకప్పుడు తమిళంలో చేసిన సినిమాలకు సైతం ప్రస్తుతం తెలుగులో మార్కెట్ దొరుకుతుందంటే -విజయ్ రేంజ్‌ను అంచనా వేయొచ్చు. నిజానికి బిచ్చగాడు సినిమా తమిళంకంటే తెలుగులోనే పెద్ద విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఈ స్ట్రాటజీని ప్రయోగించేందుకు తాజాగా తెలుగు హీరోలూ ప్రయత్నాలకు పదును పెట్టడం శుభపరిణామమే. ఇదివరకే అడపాదడపా చిరంజీవి, నాగార్జునలు తమిళంలో పట్టు సాధించారు. వెంకటేష్ అయితే తమిళ హిట్ సినిమాలను రీమేక్ చేస్తూ స్టార్‌గా నిలబడ్డాడు.
ఇటీవలి కాలంలో -తెలుగు సినిమాకు ఇతర భాషల్లో మార్కెట్ పెరగడానికి బాహుబలి ముఖ్య భూమిక వహించదని చెప్పొచ్చు. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు సినిమా షేర్‌ని పెంచడమే కాకుండా, తెలుగు సినిమా మార్కెట్‌కు దారి సుగమమైంది. ఇప్పటికే ఈ సినిమా ఇచ్చిన ఊపుతో చాలా సినిమాలపై ఇతర భాషలవారి ఫోకస్ ఎక్కువైంది. ఇప్పటివరకు తెలుగు మార్కెట్ మాత్రమే లోకమనుకున్న హీరోలు, అందివచ్చిన చాన్స్‌ను వాడుకునే విషయంపై ఫోకస్ పెట్టారు.
***
టాప్ హీరోల స్ట్రాటజీని గమినిస్తే -ప్రధానంగా కనిపించేది అల్లు అర్జున్. బన్నీ సినిమాలు ఎప్పటినుంచో కేరళలోనూ విడుదలవుతున్నాయి. అక్కడ ప్రేక్షకుల ఆదరణా బాగానే ఉంది. దాంతోపాటే తమిళం, కన్నడలోనూ తన స్టామినా ప్రూవ్ చేసుకొనే ప్రణాళికలతో బన్నీ కనిపిస్తున్నాడు. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్‌గా మార్చేశారు. ఆయన లేటెస్ట్ సినిమా సరైనోడు అక్కడా సంచలన విజయం సాధించింది. నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్‌లో లవర్‌బాయ్ పాత్రలతో స్టైలిష్ నటనతో ఆకట్టుకున్న బన్నీ, గత రెండేళ్లనుంచీ మాస్ యాక్షన్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు చిత్రాలతో బన్నీ టాలీవుడ్ టాప్ హీరోల లిస్ట్‌లో ఎప్పుడో చేరాడు. ఈ మూడు సినిమాలతో 50 కోట్ల క్లబ్‌లోకి చేరాడు. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ చిత్రాలతో వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లూ రాబట్టారు. బన్నీ ప్లాన్లు విజయవంతమై, పక్క రాష్ట్రాల్లోనూ బలమైన హీరోగా నిలబడితే మార్కెట్ రేంజ్ విస్తరించే అవకాశం లేకపోలేదు. అందుకే తమిళ, మలయాళ భాషలతోపాటు కన్నడ భాషలపైనా బన్నీ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. సరైనోడు తరువాత బన్నీ చేస్తున్న డిజె

(దువ్వాడ జగన్నాథం) పైనే అందరి దృష్టి పడింది. బన్నీ తన తదుపరి చిత్రంగా లింగుస్వామి దర్శకత్వంలో బైలింగ్విల్ చిత్రం చేయబోతున్నాడన్నది టాక్. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా, యథావిథిగా కేరళలోనూ విడుదల కావొచ్చు. డిజె ఎలాగూ కర్నాటకలో స్ట్రైట్ చిత్రంగా విడుదలవుతుంది కనుక, అక్కడా బన్నీ మార్కెట్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. సైన్స్ ఫిక్షన్ ‘24’తో తన సత్తా చాటుకున్న దర్శకుడు విక్రమ్‌కుమార్‌తోనూ బన్నీ ఒక సినిమాకు కమిటైనట్టు చెబుతున్నారు. ఇది కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కేదే. అలాగే మహేష్‌తోనూ విక్రమ్‌కుమార్ సినిమా చేయడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ రెండిట్లో విక్రమ్ ఏ సినిమాను ముందుగా మొదలుపెడతాడో చూడాలి.
టాలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మహేష్‌బాబు కూడా తన మార్కెట్‌ను పక్క రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో తిరుగులేని హీరోగా ఫేం సంపాదించిన మహేష్, అదొక్కటి చాలు అన్న ఆలోచనలో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫోకస్ మారింది. తమిళ, హిందీ మార్కెట్‌పైనా దృష్టి పెడుతుండటం విశేషం. అందుకే తన ప్రతి సినిమానూ తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫార్ములాతో ‘శ్రీమంతుడు’ సినిమాకు భారీ కలెక్షన్లు సాధించిన మహేష్, తదుపరి సినిమాల విషయంలో మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మురుగదాస్‌తో చేస్తున్న ప్రాజెక్టు కోసం సరికొత్త స్ట్రాటజీతో వెళ్తున్నాడు మహేష్. అందుకే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గజినీతో తన టాలెంట్‌ను బాలీవుడ్‌కూ రుచి చూపించిన మురుగదాస్, ఇప్పుడు మహేష్ సినిమానూ బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మురుగదాస్ చేపట్టబోయే ప్రాజెక్టుతోనే మహేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ ఏకకాలంలో సినిమా తెరకెక్కించాలన్నది మురుగదాస్ యోచన. గతంలో చాలాసార్లు బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా తిరస్కరించిన మహేష్, ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన ధోరణి మార్చుకుని, తన మార్కెట్ పరిధిని విస్తరించే ప్రయత్నాల్లో సీరియస్‌గా ఉన్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో ఎన్టీఆర్ ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్ ఓ రేంజ్‌లో కొల్లగొట్టాడు. అందుకే తరువాత సినిమాతో ఓవర్సీస్ మార్కెట్‌తోపాటు తమిళ్, మలయాళ, కన్నడ మార్కెట్లను క్యాప్చర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నాన్నకు ప్రేమతో చిత్రంతో ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్, తరువాత ‘జనతాగ్యారేజ్’తో మరిన్ని భారీ వసూలు రాబట్టాడు. ఆ సినిమాను మలయాళంలోనూ విడుదలచేసి ఓకే అనిపించుకున్నాడు. మోహన్‌లాల్ ఉండటంతో ఎన్టీఆర్ ప్రయత్నం సులభమైంది. బాహుబలితో అంతర్జాతీయ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్‌కు, ఎలాగూ అనేక భాషల్లో మార్కెట్ దక్కింది. ‘బాహుబలి’ టాలీవుడ్ బిజినెస్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి స్టార్లందరికీ ఒక డెస్టినేషన్ సెట్‌చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరి హీరోలకంటే ఇతర భాషల్లో ఎక్కువ మార్కెట్ వున్న హీరోగా ప్రభాస్ ఎదిగాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో బాహుబలి (రూ. 650 కోట్లు) భారీ కలెక్షన్లు రాబట్టింది. ‘బాహుబలి 2’తో ప్రభాస్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో విడుదల కానున్న బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే ఫిగర్స్‌తో జరిగిందని అంటున్నారు. అంటే ‘బాహుబలి’ ఎఫెక్ట్ ప్రభాస్ తరువాతి సినిమాల మీద ఆధారపడి ఉంటుంది. ఇకపై ప్రభాస్‌తో సినిమాలు తీసే దర్శకులు అతడి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో సినిమాలు తీయడానికి ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నారు. ‘రన్ రాజా రన్’ తీసిన సుజిత్ ఇప్పటికే ప్రభాస్‌తో సినిమాకు కమిటయ్యాడు. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమానూ మూడు భాషల్లో విడుదల చేస్తారని టాక్. ఇక వీళ్లదారిలోనే టాలీవుడ్‌లో మరో ఇద్దరు స్టార్ కథానాయకులు కూడా తమతమ సినిమాల్ని ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాన్నిబట్టే తమ సినిమాల బడ్జెట్‌లను భారీగా పెంచబోతున్నారు. వీళ్లతోపాటు రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్ కూడా ఇప్పుడిప్పుడే బయటి రాష్ట్రాలపై దృష్టి పెడుతున్నారు. పవన్ తొలిసారిగా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను హిందీలోనూ విడుదల చేశాడు. అటు చెర్రీ కూడా ఇకపై తన సినిమాల్ని తమిళంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇలా హీరోలంతా మార్కెట్ పెంచుకోవడంపై సీరియస్‌గానే దృష్టి పెట్టారు.

శ్రీనివాసరావ్