మెయిన్ ఫీచర్

చీరలు.. హొయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతిలో మహిళల కట్టూబొట్టుకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంత కాదు. చీరకట్టులో సంస్కారంతో పాటు అందమూ ఉట్టిపడుతుంది. ఆధునిక పోకడల్లో కొంతకాలంపాటు చీర కళాకాంతులు కోల్పోయినా ఇటీవలి కాలంలో మళ్లీ ఆదరణ పెరిగింది. సినీతారలు, రాజకీయ నాయకులు చీరలంటే మోజు చూపుతున్నారు. ఆధునిక వస్త్రాల రూపకల్పనతో రాజ్యమేలుతున్న మేటి డిజైనర్లు కూడా చీరలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. సరికొత్త హంగులతో వారు సేకరించి సరికొత్త రూపమిస్తు తగిన విధంగా ప్రచారం చేస్తుండటంతో చీరలంటే మోజు పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. ఇంజనీర్ కావలసిన వ్యక్తి ఫ్యాషన్ డిజైనింగ్‌వైపు వచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్నా డు. ఆయన సేకరిస్తున్న, రూపొందిస్తున్న కళాత్మక చీరలకు అందమైన తారలు, సెలబ్రిటీలు కొత్తకళను తెచ్చిపెడుతున్నారు. ముఖ్యంగా సవ్యసాచి ముఖర్జీ సిద్ధం చేస్తున్న చేనేత చీరలంటే వీరి కి పిచ్చి. మేనిఛాయను బట్టి ఎంపిక చేసుకునే విధంగా, స్పష్టమైన, ముదురు, లేతవర్ణపు చేనేత, అద్దకపు చీరలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. అలాంటి చీరల సృష్టికర్త సవ్యసాచి ముఖర్జీ. చీరలపై పూలు విరిసాయా అన్నట్లు ఆయన రూపొందించిన డిజైన్ల చేనేత చీరలు చూస్తే చాలు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. బాలీవుడ్ తారలు ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్, దీపిక పదుకొనే వంటివారు సవ్యసాచి కలెక్షన్స్ అంటే తెగ ముచ్చట పడతారు. పెళ్లిదుస్తులు, చేనేత దుస్తుల ప్రచారానికి, విక్రయానికి సవ్యసాచి నిర్వహించే ప్రదర్శనలు, షోలకు వారు ఆయా చీరల్లో కనిపించి కనువిందు చేయడం అందరికీ తెలిసిందే. ఇటీవల ప్రఖ్యాత కపిల్ కామెడీ షోలో దీపిక ధరించిన చేనేత చీరలు ఆహూతులను కట్టిపడేశాయి. దీపిక అందానికి సవ్యసాచి చీరలు సరికొత్త అందాన్ని తెచ్చాయి. ఈ చీరలకు తోడుగా అతడు అందమైన అలంకర సామాగ్రి, ఆభరణాలనూ అందుబాటులోకి తెస్తున్నాడు. వీటితో తారల తళుకులకు అంతుండటం లేదు. రేఖ, విద్యాబాలన్ వంటివారు కంచిపట్టు చీరలంటే ఎంత మక్కువ చూపుతారో దీపిక చేనేత వస్త్రాలంటే అంత ఇష్టపడతారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చీరకట్టుకు ఇచ్చే ప్రాధాన్యత తెలిసిందే. ఇక పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వాడే చౌకరకం చేనేత చీరలకు ఎంతో గిరాకీ ఉంది. ఆధునిక పోకడలు ముంచెత్తుతున్న తరుణంలో చీరకట్టులో మన మహిళలు సగర్వంగా హొయలొలికించడం సరికొత్త వనె్న.
**

సొగసు చూడతరమా!
కలకత్తాలో పుట్టిన సవ్యసాచి ముఖర్జీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఖరీదైన చీరలు, ఆధునిక దుస్తులు, ఆభరణాలు సేకరించి విక్రయించడం అతడి వృత్తి. తల్లి, చెల్లి అతడి వ్యాపారాలు చూస్తూంటారు. బాలీవుడ్‌లో అతడు కాస్ట్యూమ్స్ అందించిన చిత్రాలు ఎంతో విజయం సాధించాయి. ఇంజనీర్ కావాలసిన వాడు ‘నిఫ్ట్’లో చేరి వస్త్రాలతో నేస్తం కట్టాడు. ఆధునికత జోడించి సరికొత్త డిజైన్లు సృష్టించాడు. ఫ్రెంచ్, మద్యప్రాచ్య, యూరోపై శైలిలో సరికొత్త దుస్తుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చాడు. దేశవిదేశాల్లో అతడి పేరు మారుమోగిపోయింది. కొద్దికాలంగా పెళ్లికుమార్తెల దుస్తుల రూపొందించి, విక్రయించడంలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. అతడు రూపొందించిన చీరలు లేదా ఆభరణాలు ధరించని బాలీవుడ్ సెలబ్రిటీ లేదంటే నమ్మాల్సిందే. ప్రస్తుతం హ్యాండ్‌లూమ్ చీరలపై అతడి దృష్టిపడింది. 9గజాల పొడవైన చీరలు, ముదురు రంగులు, సరికొత్త డిజైన్లలో రూపొందిస్తు అతివల మనసుదోస్తున్నాడు. ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉన్న ఈ డిజైనర్ వయసు 43 మాత్రమే. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ షోలో అతడికి ప్రత్యేక స్థానం ఉంది. హ్యాండ్ బ్లాక్ పద్ధతిలో సరికొత్త డిజైన్ల సృష్టి అతడికి ఇష్టం. నేహధూపియా, శ్రీదేవి వంటి తారలు అతడి ఫ్యాషన్ షోలలో పాల్గొనడాన్ని గౌరవంగా భావిస్తారు. అతడు సేకరించిన, సృష్టించిన చీరలు, దుస్తులను ప్రదర్శించాల్సిందిగా ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కోరిందంటే సవ్యసాచి ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. ఎంత పేరు వచ్చినా ఆధునిక పోకడల జోలికి వెళ్లకుండా భారతీయ సంస్కృతిని అద్దంపట్టే చీరకు సొగసుతెస్తున్నందకు భారతీయ ఫ్యాషన్ ప్రపంచం అతడిని ఆరాధిస్తోంది. ప్రస్తుతం అతడు ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
**

చీరకట్టులో ప్రొఫెసర్ పాఠాలు
భారీకాయంతో ఉన్నావ్, మరింత లావుగా కనిపించే చీరెందుకు నీకు అన్నవాళ్ల మాటలు ఆమె ఖాతరు చేయలేదు. అందంచందం నా ఇష్టం అనుకుందంతే. నచ్చిన ప్రాంతం నుంచి చేనేత వస్త్రాలను తెప్పించుకుంటుంది. తన ఇష్టాన్ని జోడించి వివిధ రంగుల బట్టను ఉపయోగించి సరికొత్త రూపులో, డిజైన్‌లో చీరలు సిద్ధం చేస్తుంది. బ్లౌజ్‌కూడా అలాగే సిద్ధం చేసుకుంటుంది. అవి కట్టుకున్నవారెవరైనా ఎదుటివారిని కట్టిపడేయాల్సిందే. చీరకట్టుతో కనికట్టు చేయడం ఎలాగో చెప్పేందుకు ఆమె ఓ బ్లాగ్‌నూ నడుపుతోంది. ఈమె ఆషామాషీ వ్యక్తికాదు. 50 ఏళ్లుకూడా లేని ఆమె పేరు ఫల్గుణి వసవాడ ఓఝా. డబుల్‌గోల్డ్ మెడలిస్ట్. ఎంబిఎ చేశారు. ప్రముఖ కమ్యూనికేషన్, అడ్వర్టయిజ్‌మెంట్ సంస్థలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో ఆమె సేవలందించారు. బాగా లావుగా ఉండే ఆమె మొదట్లో ఆత్మన్యూనతతో ఉండేవారు. సల్వార్‌కమీజ్ ధరించి శాలువా కప్పుకునేవారు. వ్యాపార ప్రకటనల రంగంలో వస్తున్నమార్పులు, సామాజిక మాధ్యమం వేదికగా ప్రచారం వంటి అంశాలపై ఆమె పాఠాలు చెప్పేవారు. తరచూ ప్రయాణాలు, పుస్తకాలు చదవడం, సరికొత్త స్నేహితులతో మెలగడం ఆమెకు ఎన్నో నేర్పాయి. శరీరం, రంగు మనిషికి జీవితాన్నిచ్చేవికావని తెలుసుకున్న ఆమె చీరకట్టులో సొగసును గుర్తించింది. తనకు ఇష్టమైన చీరలను కట్టుకోవడం మొదలెట్టింది. గోరింట నుంచి చెవి రింగుల వరకు, చీరలు, జాకట్లు ఇలా అతివ అందాన్ని ఇనుమడింప చేయడం ఎలాగో తెలుసుకుంది. ఆచరించింది. ఆ విజయాలను అందరికీ పాఠాలుగా చెప్పేందుకు సొంతంగా ‘్ఫల్గుణి ఫ్యాషన్ ఫండాస్’ అనే సంస్థను నిర్వహిస్తోంది. చీరకట్టులో సొగసును ఆమె మెలకువలు నేర్పుతోంది. మొదట్లో ఒబెసిటీవల్ల ఆత్మన్యూనత వెంటాడేదని, అమెరికాలో అక్కడివారి జీవనశైలి చూసి ఎంతో నేర్చుకున్నానని ఆమె చెబుతుంది. అక్కడ ప్రతిభ, ఇష్ట, సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారే తప్ప మిగతా విషయాలకు ప్రాధాన్యం ఉండదని ఆమె అంటారు.