మెయిన్ ఫీచర్

బామ్మ చేతివంట.. భలే పసందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె వయసు 106 సంవత్సరాలు. పళ్లూడిపోయాయి. కంటిచూపు ఇప్పుడిప్పుడే మందగిస్తోంది. అనుభవం, అభిమానం కలగలపి ఆమె చేసే వంటకాలంటే ఓ క్రేజ్. ఆమె ఏం చేసినా రుచి చూస్తే వదలబుద్ధి వేయదు. పాకశాస్త్రంలో పిహెచ్‌డి చేసినవారు చేసిన వంటలు కూడా ఆమె చేతివంట ముందు దిగదుడుపే. ఆమె చేసిన వంటలేవైనా లొట్టలు వేసుకు తినాల్సిందే. అంత రుచిగా, శుచిగా చేస్తారామె. ఎందుకంటే అనుభవంతో చేసే వంట కదా! అందుకేనేమో ఈమె చెప్పే పాకశాస్త్ర పాఠాల వీడియోలు లక్షలాదిమందిని అబ్బురపరుస్తున్నాయి. వీడియో చూస్తుంటేనే ఆమె చేసిన వంటకాలను తినెయ్యాలనిపించేలా నోరూరిస్తున్నాయంటున్నారు వీక్షకులు.
అంత రుచిగా చేస్తున్న ఆ బామ్మ పేరు మస్తానమ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి ఆమె స్వస్థలం.
వందేళ్లు నిండిన మస్తానమ్మ తెనాలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ చిన్న గ్రామంలో పూరి గుడిసెలో ఉంటుంది. భర్త 22 ఏళ్ల వయసులో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఆమె స్వతంత్రంగా.. ఒంటరిగా ఉంటోంది. 105 సంవత్సరాల వయసులోనూ ఆమె వరిపొలాల్లో పనిచేస్తుంది. ఎవ్వరి మీద ఆధారపడకుండా బతుకుతున్న ఆ వృద్ధురాలు అంటే ఆ గ్రామస్తులకు అభిమానమే. తెలివిగా.. గంభీరంగా ఉండే మస్తానమ్మ గుడిసె పక్కనే ఓ మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు కిందే పొయ్యిపెట్టుకుని వంట చేసుకుంటుంది. ఆ మర్రిచెట్టుతో గ్రామస్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అయితే ఆమె వంటలు నేడు సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేయటమే కాదు దాదాపు 4.3 కోట్లమంది ఆమె వంటల వీడియోలను చూసి తమ అభిప్రాయలను పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె చేసే కోడికాళ్ల కూర అమోఘం అని లొట్టలు వేస్తూ చెబుతున్నారు. సీదాసాదాగా వేసే ఆమ్లెట్ చూస్తుంటే నోరూరిపోతుందని తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీ
సామాజిక మాధ్యమాలలో ఈ బామ్మ నేడు సెలబ్రిటీగా మారిపోయింది. అది ఎలా జరిగిందంటే మనవడు లక్ష్మణ్ ఆమెను చూడటానికి అపుడపుడు వస్తుంటాడు. ఓరోజు లక్ష్మణ్ తల్లి అమ్మమ్మ బాగా వంట చేస్తుందిరా..అని చెప్పింది. ఆమె వండిన వంకాయ కూర లక్ష్మణ్ తిన్నాడు. ఆ కూర రుచి అద్భుతంగా ఉంది. దీంతో ఇలాంటి రుచికరమైన సంప్రదాయ వంటల గురించి నలుగురికి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆమె చేసిన వంటలను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అంతే లక్షలాది మంది ఆమె చేస్తున్న వంటకు దాసోహమయ్యారు. ఆమెకు ఇంటర్నెట్ గురించి ఏమీ తెలియదు. కాని అదే ఇంటర్నెట్‌లో ఆమె ఓ సెలబ్రిటీ అయిపోయింది. ఒక్కరోజులోనే రెండు లక్షలమంది ఆ వంటల వీడియోలను చూశారంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆమె చేసే చికెన్, మటన్, ఎగ్, పీత, చేపల కూరల వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. నాన్‌వెజ్ మాత్రమే కాదు వెజిటేరియన్ వంటలు సైతం నోరూరించేలా చేయడంలో ఆమె దిట్ట. లక్ష్మణ్, అతని స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డి కలిసి ఈ వీడియోలను షూట్ చేస్తారు. ఒక్కొక్క వీడియోపై కనీసం లక్షమంది అభిప్రాయాలను చెబుతుంటారు.
ఆహ్వానాలు.. బహుమతులు
ఇటీవలనే ఈ బామ్మ పుట్టినరోజు జరుపుకుంటే పాకిస్థాన్ నుంచి ఓ అభిమాని బహుమానంగా చీర పంపింది. ‘వసతి ఏర్పాటు చేస్తాం. ఇక్కడకు వచ్చి ఉండమని’ న్యూజిలాండ్‌లో ఉండే ఓ భారతీయ కుటుంబం ఆహ్వానించింది. కుమారుడు తనతో పాటు వచ్చి ఉండమంటేనే అతనితో ఉండటానికి ఇష్టపడకుండా స్వతంత్రంగా జీవించటానికి మక్కువ చూపే ఈ బామ్మ ఆ ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరిస్తోంది. బామ్మకు పదకొండేళ్ల వయసులో పెళ్లిచేశారు. 22 ఏళ్లు వచ్చేసరికి వైధవ్యం గుండెను పిండేసింది. ఆమెకు పుట్టిన పిల్లల్లో ఐదుగురు కలరా సోకి చనిపోయారు. అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇప్పటికీ ఒకరిపై ఆధారపడకుండా జీవిస్తోంది. రాబోయే కాలంలో ఈ బామ్మ వీడియోలు మరెంత సంచలనం సృష్టిస్తాయో చూడాలి.

చిత్రాలు..మస్తానమ్మ, ఆమె చేసిన చికెన్ కూర