మెయన్ ఫీచర్

ఆటుపోట్లకు రాటుదేలిన ఉస్మానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతాలు పూర్తిచేసుకుంటోంది. ఎంతో పేరుప్రతిష్టలున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ప్రస్తుత తరం దృక్పథం మారితే వందేళ్ల ఓయూకు మరింత వనె్న వస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, పలు రంగాలలో ప్రసిద్ధి చెందిన పూర్వ విద్యార్థులు, ప్రముఖులతోపాటు మరెందరో ఈ వర్శిటీ వైభవాన్ని, ఈ సంస్థతో అనుబంధాన్ని, స్మృతులను, అనుభూతులను స్మరించుకోవడం ఈ సందర్భంలో సర్వసాధారణం. అయినప్పటికి ప్రతి విశ్వవిద్యాలయానికి తనదంటూ ప్రత్యేకత ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అత్యంత పిసినారిగా ప్రసిద్ధి చెందిన చివరి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ విశ్వవిద్యాలయాన్ని అత్యంత కళాత్మకంగా ప్రపంచమే గర్వించదగినంత వైభవోపేతంగా నిర్మించటం ఒక ఎతె్తైతే అంతే వైభవోపేతంగా ఎదిగి ప్రపంచంలోనే పురాతన - ఆధునికతల మేళవింపుగా ఖ్యాతి గడిచించింది. ప్రపంచ మేధావులనే కాకుండా హైదరాబాద్‌ను దర్శించిన వివిధ దేశాల పౌరులను మేధావులను పాలకులను నేటికీ ఆకర్షిస్తూనే వుంది. దీని విశిష్టతలు నిర్మాణాపరంగా ఎలాగుందో జ్ఞానార్జన, జ్ఞానబోధ, సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆర్ట్, సోషల్ సైనె్సస్ , ఉపాధ్యాయ విద్య, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, సామాజిక శాస్త్రాలు, తత్వ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జియోఫిజిక్స్ , వృక్షశాస్త్రం, ఫిజికల్ అండ్ బయలాజికల్ సైనె్సస్, ఎకనామిక్స్, పొలిటికల్ సైనె్సస్, హిస్టరీ, జియోగ్రఫి, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజమ్, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, ఇంగ్లీష్ సహా లింగ్విస్టిక్ సబ్జెక్టుల్లో ప్రపంచ స్థాయి మేధావులనందించిన చరిత్ర కూడా వుంది. ఉస్మానియాలో చదివి దేశ రాజకీయాలలో ప్రసిద్ధి పొందిన రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, పరిపాలకులు, విధాన నిర్ణేతలు, శాస్తవ్రేత్తలు, రచయితలు ఎందరో ఉన్నారు.
ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఈ విశ్వవిద్యాలయం ఔన్నత్యం చెక్కు చెదరలేదు. ప్రపంచీకరణకు ముందు తర్వాత ఎన్నో ఉద్యమాలు సంవత్సరాల తరబడి కొనసాగినా, దీని వైభవాన్ని, విద్యాభివృద్ధిలో, విద్యాబోధనలో కొద్దిపాటి ఆటుపోట్లు కాలానుగుణంగా సంభవించినప్పటికి వర్శిటీ ఔన్నత్యాన్ని తగ్గించలేకపోయాయి. ఈ విశ్వవిద్యాలయానికి తలమానికమైన కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైనె్సస్, సెంట్రల్ లైబ్రరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, లా కాలేజ్, ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజ్‌ల విశాలమైన భవనాలు, నిర్మాణరీతులు, దూర దృష్టి ఉపాధ్యాయులనే కాకుండా విద్యార్థులను నిత్యనూతనోత్సాహంలో ఔన్నత్యభావనతో వ్యవహరించే విధంగా కనపడని ప్రచారాన్ని కల్పిస్తుంది. నిజాం కాలం నాటి ఏ హాస్టల్, బి హాస్టల్, మెస్, ప్రొఫెసర్ క్వార్టర్స్, విశాలమైన ఎఐ ప్లేగ్రౌండ్, లాండ్‌స్కేప్ గార్డెన్, వి.సి లాడ్జ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మరియు నెమళ్ళ పార్కు దాదాగా 1600 ఎకరాలకు విస్తరించింది. విద్యానగర్ నుంచి తార్నాకా, హబ్సిగూడ, రామంతాపూర్ ప్రాంతాలు వర్శిటీ ఛాయలోవే. సిసిఎంబి, ఐఐసిటి, సిఐఎఫ్‌ఎల్, ఎన్‌ఐఎన్, ఐపిఇ, ఐసిఎస్‌ఎస్‌ఆర్, అమెరికన్ స్టడీస్ సెంటర్, ఇండియన్ ఓషన్ స్టడీస్ మొదలగు జాతీయ అంతర్జాతీయ సంస్థలతో అలరారుతూ నిత్య నూతన పరిశోధనలతో, విద్యాబోధన, శిక్షణ మొదలైన కార్యక్రమాలలో దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో తనదైన ముద్రతో గుర్తింపును కొనసాగిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. యుజిసి, ఐసిఎస్‌ఎస్‌ఆర్ మరియు దేశీయ అంతర్జాతీయ సంస్థల గ్రేడింగ్‌లో ఎప్పుడు దేశంలోని మొదటి 10 విశ్వవిద్యాలయాల స్థాయిని కల్గి ఉందనుడం జగమెరిగిన సత్యం. సౌత్ ఇండియాలో మొదటిగా నార్త్ ఇండియాలో సెంట్రల్ యూనివర్శిటీ ఐఐటి, ఐఐఎమ్ స్థాయిలో తన వైభవాన్ని నిలదొక్కుకుంటుందననుటలో అతిశయోక్తి లేదు. అయినప్పటికీ ఈ విశ్వవిద్యాలయంలో కూడా ఇతర విశ్వవిద్యాలయాల మాదిరే మంచి చెడు పాలనా విధానాల ప్రభావానికి గురి కావడం కూడా సహజమే. స్వాతంత్య్రానికి 30 సంవత్సరాల ముందే అత్యంత వైభవోపేతంగా స్థాపించబడిన మొదటి ప్రాంతీయ యూనివర్శిటీ ఉస్మానియా. కోట్లాది మంది విద్యార్థులను, వేలాదిమంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావులను అందించినప్పటికీ, అంతే బలమైన ఆటుపోట్లను కూడా ఎదుర్కొన్నది. ఈ విశ్వవిద్యాలయంలో చదివి ప్రేరేపితులైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, శివరాజ్ పాటిల్, యశ్వంత్ చౌహాన్ , ప్రొఫెసర్ మాథూర్, ప్రొఫెసర్ అయ్యంగార్ లాంటి మహా రాజకీయ నాయకులకు ప్రేరణనిచ్చింది. కాలక్రమంలో ప్రజాస్వామ్యయుగంలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా విద్యను విస్తరింపజేసే క్రమంలో మరియు పాలక వర్గ సంకుచిత ప్రయోజనాలలోబడి దాడులకు లోనవుతూనే వున్నది. ప్రజాస్వామ్య యుగంలో అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హయ్యర్ ఎడ్యుకేషన్‌ను అందరికి అందుబాటులో తేవాలి. ఉపాధ్యాయులను కూడా అన్ని వర్గాలలలోని మేధావులను ఆయా సబ్జెక్టులలో నియమించుకోవాలి. తదనుగుణమైన వసతులను కల్గించి, విద్యాబోధన మరియు పరిశోధనలు ప్రమాణాలతో జరగాలి. కాని దురదృష్టవశాత్తు వైస్ ఛాన్సలర్ల నియామకాలు, ఉపాధ్యాయుల నియామకాలు విద్యార్థుల ప్రవేశాలు ఆబ్జెక్టివ్‌గా జరగకపోవడం ఒకటైతే, సరియైన వసతులు లేక, సరియైన బోధనాసిబ్బందిని సకాలంలో నియమించకపోవటం, ప్రభుత్వాలు బడ్జెట్ ఇవ్వకపోవటం, విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం విశ్వవిద్యాలయాల ప్రతిపత్తి విద్యని దెబ్బతీయటమే. ప్రభుత్వాల రోజువారి ప్రమేయం పెరిగి మన రాష్ట్రంతోపాటు అన్నిచోట్లా విశ్వవిద్యాలయాలు ఏ లక్ష్యాలకైతే స్థాపించబడినవో ఆ లక్ష్యాలను కోల్పోయి ప్రైవేట్ విద్యా సంస్థలకన్నా బలహీనంగా మారాయి. ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి, ప్రభుత్వ విద్యాలయాలను, విశ్వవిద్యాలయాలను చిన్నచూపు చూడడం ఒక కారణమైతే, ప్రజావసరాలకు అనుగుణంగా విద్యాబోధన, పరిశోధనా రంగాలు విద్యార్థుల నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల పాత్ర లేకపోవటం గమనించదగిన విషయం.
దీనికి ముఖ్య కారణం విద్యను ఒక కమర్షియల్ కమాడిటిగా మార్చడం ఒకటైతే, విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యను విద్యార్థుల స్కిల్ మరియు అభిరుచికి అనుగుణంగా చూడక ఒక స్టాటస్ సింబల్‌గా చూడటం మరో కారణం.
ప్రపంచీకరణ ప్రారంభమైన నాటినుండి మన దేశ నాయకులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ మరియు విశ్వవిద్యాలయాల స్థితిగతులను పట్టించుకోకపోగా కనీస వసతులకు కావలసిన బడ్జెట్ ప్రతిపాదనలు చేయకుండా, కాలానుగుణంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా కోర్సులకు ప్రాధాన్యతను నొక్కి చెప్పి, విశ్వవిద్యాలయాలు వాటిని అవే పోషించుకోవాలని భీష్మించుకుపోవటంతో గత 30 సంవత్సరాలలో అవసరాలకనుగుణంగా ఉద్యోగ భర్తీలు లేక ఒకరిద్దరి పర్మినెంటు వాళ్లతో 75 శాతం కాంట్రాక్టు పార్ట్‌టైమ్ లెక్చరర్లతో విద్యాబోధనను చేయించి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలి, స్వయం పోషకత్వాన్ని సాధించుకోవాలని చెప్పటం ఎలా సాధ్యమవుతుంది.
విద్యావిధానం జాతీయ, అంతర్జాతీయ పోకడల కనుగుణంగా మార్పు చెందే విధంగా సమర్థులైన, నాయకత్వ లక్షణాలు కల్గిన, ఇంటిలెక్చ్యువల్ విజన్‌తో కూడిన నీతి నిజాయితీ విలువలతో కూడిన మేధావులను సమర్థులను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్‌గా నియమించాలి. కాని ఒక రోజు క్లాసు తీసుకొని, ఒక లాంగ్వేజ్ సరిగ్గా రాని, ఒక గంట యూనివర్శిటీలో బోధన చేసే ప్రైవేట్ లావాదేవీలలో రాజకీయ నాయకుల అంతేవాసులుగా ప్రవర్తించే వారిని విద్యావేత్తలుగా గుర్తించి వైస్ చాన్సలర్లుగా, కమిషన్ సభ్యులుగా, చైర్మన్‌గా నియమించి శాడిస్ట్ రాజకీయ దురహంకారాన్ని ప్రదర్శిస్తే విశ్వవిద్యాలయాల ఉనికికే ప్రమాదం. ఇది సమాజానికే ప్రమాదమైతే ఎవరు బాధ్యులు.
నా అనుభవంలో స్కూలు టీచర్స్‌లో ఎంతోమంది మేధావులను, కళాకారులను, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నలాంటి కవులు మేధావులు ఎంతోమందిని చూడవచ్చు. కాని యూనివర్శిటీలో ఏ ఒక్క ప్రొఫెసర్ ఆ స్థాయిలో లేకపోతే ఎవరిది తప్పనాలి. అంత మాత్రాన మహామహులు లేరని చెప్పలేం. ప్రొఫెసర్ సరోజని రేగాని, రామిరెడ్డి, ప్రొఫెసర్ పరమేశ్వర్, ప్రొఫెసర్ మంజునాధ, ప్రొఫెసర్ మాలతి, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ ఎస్‌కె కుమార్, ప్రొఫెసర్ బద్రిరాజు కృష్ణమూర్తి, ప్రొఫెసర్ బషీరుద్దీన్ బాబూఖాన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ప్రొఫెసర్ నాయని కృష్ణకుమారి, బిరుదురాజు రామరాజు , అరుణ్‌కుమార్ శాస్ర్తీ వంటి హేమా హేమీలు అందించిన సేవలు ఎవరు సైతం మరిచిపోగలరు??
విశ్వవిఖ్యాతిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నేటికి దేశంలోని విశ్వవిద్యాలయాలలో 7 నుంచి 10వ స్థానాలలో ఉన్నదంటే అందుకు కారణం దాని పెర్‌ఫార్‌మెన్స్ కాదు. దాని చరిత్ర, సంస్కృతి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిజాం కన్‌స్ట్రక్షన్, ఫౌండేషన్ చెక్కుచెదరకపోవడం అందుకు కారణాలు. చెడిపోయిన వాటిలో కూడా బాగా చెడిపోయినవాడు, కొద్దిగా చెడిపోయినవాడులా మన యూనివర్శిటీ ఔన్నత్యానికి నేటికి ప్రాచుర్యం ఉన్నదంటే మురిసిపోవడం కాదు.
పాలకులు కళ్లు తెరచి, ప్రభుత్వ నిధిని మేధావుల పరంగా ఎలా ఉండాలో అలా ఉండాలి, జాలు లేని చెలమ, వాగులేని చెరువు, మేధావులు లేని విశ్వవిద్యాలయాలు, నీతి లేని యువకులు వ్యవస్థలను మాత్రమే నాశనం చేయరు, తమను, తమతోపాటు సమాజాన్ని నాశనం చేస్తారు. ఈ వంద సంవత్సరాల వసంతోత్సవాలలోనైనా పాలకులు తమ మైండ్ సెట్‌ను మార్చుకొని వేల ఘర్షణల ప్రతిబింబించే భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సమాజ లౌకిక వాద వారసత్వాన్ని పునరుద్ధరించాలి. అందుకు ముందుగా ప్రభుత్వం వాటి నాయకులలో మార్పు రావాలన్నది అభిలాష.

- ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ 9866678087