భవిష్య కాలం

ఫ్యాషన్ ఐకాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో పర్యటించిన బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్, ఆయన భార్య ది డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేథరిన్‌ల చూపు భారతదేశ పర్యాటక ప్రదేశాలపై ఉంటే అందరి చూపు అందాల కేథరిన్‌పై నెలకొన్నాయి.రాచరికపు మర్యాదలను పాటించటంలోనే కాదు ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కేథరిన్ ధరించిన దుస్తులపై నేడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆమె నాలుగు రోజుల భారతదేశ పర్యటనలో 15 రకాల అందమైన దుస్తులను ధరించారు. అందంతోనే కాదు అద్భుతమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షించిన కేథరిన్ బ్రిటిష్, అమెరికా ఫ్యాషన్‌ను ఇష్టపడతారు. కాని తన ఇష్టాలతో ఆయా దేశాలకు వెళ్లినపుడు ఆక్కడి స్టైల్‌ను అనుసరించి ఆయా దేశాలవాసుల మనసులను చురగొనటంలో అందెవేసిన చేయి. అందుకేనేమో 2012,2013 సంవత్సరాలలో వరుసగా టైమ్ మ్యాగజైన్ నిర్వహించిన ప్రపంచంలోని మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారతదేశ పర్యటనకు వచ్చిన ఆమె తొలుత అమెరికా, బ్రిటిష్ డిజైనర్ల దుస్తులనే ధరించారు. తదనంతరం రాజస్థాన్‌లో పర్యటిస్తున్నపుడు ఆమె అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా భారత్ ఫ్యాషన్ డిజైనర్ అనితాడోంగ్రే డిజైన్ చేసిన దుస్తులను ధరించి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలవటం విశేషం. కేథరిన్ ఫ్యాషన్ టీమ్ తన కలెక్షన్ల నుంచి డిజైన్ దుస్తుల కోసం సంప్రదించినపుడు ఆశ్చర్యపోయానని అనితాడోంగ్రే అన్నారు. ఆ దుస్తులతోనే ఆమె క్రికెట్ ఆడారు. చాలాసేపు ఆమె తాను రూపొందించిన దుస్తులనే ధరించటం ఆనందంగా ఉందని అనితాడోంగ్రే పేర్కొన్నారు. కేథరిన్‌కు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ అలెగ్జాండర్ మాక్వీన్. ఆమె రూపొందించిన రెడ్ కలర్ పొడవాటి గౌన్‌ను ధరించి అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకున్నారు. అలాగే బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ జెన్నీ పాక్చమ్ రూపొందించిన బ్లూకలర్ ఫుల్ లెన్త్ గౌన్, దానికి మ్యాచ్ అయ్యేవిధంగా ఇయర్ రింగ్స్ ధరించటం వల్లఆమె చారిస్మాటిక్ పర్సనాల్టీని మరింత దిగ్విణీకృతం చేసింది. రాచరికపు మర్యదలను పాటించటంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించని కేథరిన్ ఐదువేల రూపాయల దుస్తులు ధరించనా మిలియన్ పౌండ్ల విలువ చేస్తుందని ఫ్యాషన్ డిజైనర్లు సంబరపడిపోతుంటారు. సమయం, సందర్భాన్ని బట్టి దుస్తుల ఎంపికలో తనదైన శైలిని ప్రదర్శించే కేట్
కేథరిన్ స్టైల్, గ్రేస్ అందరినీ చూపులు తిప్పుకోనివ్వవు. ఇప్పటికీ తన మేకప్‌ను తానే వేసుకుంటారు. భారత్ నుంచి భూటాన్ వెళ్లినా అక్కడ కూడా ఆదేశ స్టైల్‌ను అనుసరించటం ఆమె చురకైన వ్యక్తిత్వానికి నిదర్శనం. కేథరిన్‌లో అందమేకాదు అందమైన వ్యక్తిత్వం దాగి ఉండటం వల్ల ఆమె అందాన్ని మరింత ఇనుమడింపజేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు.