Others

తండ్రి సానపెట్టిన భారతరత్నమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి సాహచర్యమే ఆ కుమారుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో పాఠాలు నేర్పింది. పల్లెలో పుట్టిన తన కుమారుడు ప్రపంచస్థాయికి చేరుకునే ప్రస్థానంలో ఆ శతాధిక వృద్థుడు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఆయనే జైనులుద్దీన్. ఆయన సానబెట్టిన ఆ భారతరత్నమే అబ్దుల్ కలామ్. పసివయసు నుంచి తండ్రితో పాటు వెళ్లి పడవలు మరమ్మతుచేసే పనిలో అబ్దుల్ కాలమ్ సాయం చేసేవారు.‘ సహాయం కోసం చూడటం అంతిమ పరిష్కారం కాదని’ తన తండ్రి తనకు నేర్పారని అబ్దుల్ కలామ్ చెబుతుండేవారు. ఎన్నో పరాభవాలను, అపజయాలను ఎదుర్కోవటానికి నాన్న చెప్పిన మాటలే బలాన్నిచ్చేవి అని అబ్దుల్ కలామ్ చెబుతారు. విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని జైనులుద్దీన్ తన కుమారుడి మనసులో నాటారు. అందుకే అబ్దుల్ కలామ్ ప్రపంచంమెచ్చిన మహోన్నత వ్యక్తిగా మలచబడ్డారు.

-కె.రామ్మోహన్‌రావు