మెయన్ ఫీచర్

కాశ్మీర్‌కు ముస్లింల వలస.. ఓ కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రోహింగ్యా’లు మయన్మార్‌లోని రాఖినీ రాష్ట్రంలో నివసించే ముస్లింలు. ఇటీవలి కాలంలో కాశ్మీర్ ప్రాంతంలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు వలసల రూపంలో పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, దిల్లీ మీదుగా వచ్చి కాశ్మీర్‌లోని జమ్మూ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మన దేశంలోకి అక్రమంగా చొరబడుతూ వీరు ఇలా స్థిరపడటంలో కాశ్మీరీ ముస్లింల సహకారం వీరికి దండిగా ఉంది. 2015వ సంవత్సరంలోనే వీరి అక్రమ వలసల గురించి దేశంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వీరంతా మయన్మార్‌లో బతకలేక వచ్చిన శరణార్థులు కారు. రోహింగ్యాలు వలసదారులుగా వచ్చి చట్టవిరుద్ధంగా స్థిరపడటం 2008లో జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్- నేషనల్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి యథేచ్ఛగా కొనసాగుతోంది.
వలసల రూపంలో కాశ్మీర్‌లోకి చొచ్చుకువస్తున్న రోహింగ్యాలకు ‘హిజ్బుల్ ముజాహిదీన్’ వంటి ఉగ్రవాద సంస్థల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మయన్మార్ దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన ఈ ముస్లింలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా అందుకు తగిన మూల్యం చెల్లిచాల్సి ఉంటుందని కాశ్మీరీ ప్రజలకు ఈ ఉగ్రవాద సంస్థలు చాలాకాలంగా హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో కాశ్మీర్‌లోని ముస్లింలు నోరువిప్పే పరిస్థితి లేదు.
‘మయన్మార్‌లో ముస్లింలపై జరుగుతున్న అత్యాచారాలు భరింపరానివిగా ఉన్నాయి. అందుకే నేను బంగ్లాదేశ్ మీదుగా కోల్‌కతకి వలస వెళ్లిపోయాను. ఆ తరువాత నేను దిల్లీకి వెళ్లి కుటుంబ పోషణ కోసం అక్కడ బిచ్చమెత్తుకున్నాను. దిల్లీలోనే నాకు ఒక కాశ్మీరీ ముస్లింతో పరిచయం ఏర్పడింది. అనంతరం కాశ్మీర్‌లో స్థిరపడ్డాను. భారతదేశం మొత్తం మీద జమ్మూ కాశ్మీర్‌లోనే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా జీవిస్తున్నారు. అందుకని నేను 2008 నుండి కాశ్మీరులోనే స్థిరపడ్డాను’- అని చెబుతున్నాడు 39 ఏళ్ల మోల్వీ యూనస్. వలసదారుడిగా జమ్మూలోకి చొరబడిన వేలాది మంది రోహింగ్యా ముస్లింలలో యూనస్ ఒకడు.
జమ్మూ పరిసర ప్రాంతాలలో 20 వేలమంది రోహింగ్యా ముస్లింలు, 50 వేలమంది బంగ్లాదేశీ ముస్లింలు చట్టవిరుద్ధంగా నివాస స్థావరాలు ఏర్పరచుకున్నారని ఒక అంచనా. ఇలా అక్రమ వలసదారులు నివాసమేర్పరచుకున్న ‘సంబా’ ప్రాంతంలో గతకొద్ది సంవత్సరాలుగా ఉగ్రవాదుల దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాలలో సమర్పించిన ఒక అధికారిక నివేదిక ప్రకారం- కేవలం జమ్మూ పరిసర ప్రాంతాలలో అక్రమంగా స్థిరపడిన 13,433 మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో 5,743 మంది రోహింగ్యా ముస్లింలు, 7,690 మంది టిబెటన్ ముస్లింలు. అయితే, కాశ్మీర్ లోయలో మాత్రం ఒక్క రోహింగ్యా ముస్లిం కూడా నివసించడం లేదు. దీనికి కారణం అక్కడి ముస్లింలు రోహింగ్యాలను తీవ్రంగా వ్యతిరేకించడమే.
జమ్మూలో స్థిరపడిన రోహింగ్యా ముస్లింలకు న్యాయవాదులు, పలు స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) మద్దతు ఉందని మోల్వీ యూనస్ అంటాడు. శ్రీనగర్‌కి చెందిన మహమ్మద్ - ఉల్ - ఉమర్ నిర్వహిస్తున్న శాఖావత్ సెంటర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎస్.ఆర్.ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ వంటి సంస్థలకు ఈ ఎంజివోల సహకారం ఉంది. నిజానికి జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా ‘ఆజాదీ’ డిమాండ్ చేస్తున్నవారికి మద్దతుగా రోహింగ్యాలను రప్పిస్తున్నారు.
‘హిజ్బుల్ ముజాహిదీన్’ వంటి కరుడుగట్టిన మతోన్మాద ఉగ్రవాద సంస్థలు రోహింగ్యా ముస్లింలకు అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నాయి. రోహింగ్యాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆ ఉగ్రవాద సంస్థలు స్థానిక ప్రజలను హెచ్చరిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపై కూడా వీరి ప్రభావం పడుతోంది. రోహింగ్యాల చొరబాట్ల పట్ల జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం మెతక వైఖరినే అవలంబిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోహింగ్యాలను జమ్మూ-కాశ్మీర్ నుంచి వెనక్కి పంపేయాలన్న భాగస్వామ్య పక్షం భాజపా డిమాండ్‌ను ముఖ్యమంత్రి మెహబూబా గతంలోనే తోసిపుచ్చారు. జమ్మూలో అక్రమంగా నివాసం ఉంటున్నప్పటికీ రోహింగ్యాలు ఏ విధమైన విధ్వంసాలకు పాల్పడటం లేదనీ, కాబట్టి వారిని బయటికి పంపివేయాలనుకోవడం సరియైనది కాదని ఆమె అసెంబ్లీలోనే అక్రమ వలసదారులను వెనకేసుకొచ్చింది. ముఖ్యమంత్రి మెహబూబా మాటలను బట్టి రోహింగ్యా ముస్లింలకు జమ్మూ కాశ్మీర్‌లో అధికారిక సమర్థన ఉందని అర్థవౌతోంది. రోహింగ్యాలకు ప్రభుత్వం అధికారికంగానే సహకరిస్తోందనడానికి నాలుగు ప్రధాన ఆధారాలున్నాయి. అవి..
1.జమ్మూలోని తావీనది పొడవునా రక్షణ పరంగా అత్యంత కీలకమైన కొండలలో, అడవులలో రోహింగ్యాలు తమ స్థావరాలను ఏర్పరచుకున్నారు. జమ్మూ పరిసర ప్రాంతాలైన బతింది, నర్వాల్, తలాబ్ తిలో, భగవతి నగర్, విధాతా నగర్, రెహారి, బేలీచరనలలో రోహింగ్యాలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు.
2.నర్వాల్ ప్రాంతంలో రోహింగ్యాలు ఒక మార్కెట్ నడుపుతున్నారు. దీన్ని ‘బర్మా మార్కెట్’ అని పిలుస్తారు.
3.కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల సంఖ్య 80 శాతంపైనే ఉంటుంది. వీటిలో నర్వాల్ బారి పాఠశాల ఒకటి. ఇది గమనించిన ఆ రాష్ట్ర బిజెపి ఎంఎల్‌సి బిక్రమ్ రన్దావా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన ఎవరికీ కూడా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాలయంలోనూ ప్రవేశానుమతి ఇవ్వరాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘బేటీ బజావో.. బేటీ పడావో’ పథకం ద్వారా రోహింగ్యా బాలికలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. వారికి చదువులు చెప్పడానికి 24 మంది రోహింగ్యాలనే టీచర్లుగా నియమించారు. వారి జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశీ ముస్లింలు తప్పుడు ధ్రువపత్రాలను ఉపయోగించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని, ఇందుకు వారి సానుభూతిపరుల సహకారం కూడా ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
4.జమ్మూ కాశ్మీర్‌లోని రోహింగ్యా ముస్లింలందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటరు కార్డులు, హెల్త్‌కార్డులు, ప్రభుత్వ పరమైన ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయి. విద్యుదుత్పత్తి శాఖ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖలు వీరి ఇళ్లకి విద్యుత్, మంచినీటిని సరఫరా చేస్తున్నాయి. స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో రోహింగ్యాలు తమకు కావలసిన అన్ని రకాల పత్రాలను పొందారని జమ్మూ జిల్లా యంత్రాంగానికి చెందిన అధికారులు చెప్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (జెసిసిఇ), జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్-జమ్మూ (జెకెహెచ్‌సిబిఎజె) వంటి సంస్థలు, రాజకీయ వర్గాలు, మత, సామాజిక సంస్థలు రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసలను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. వీరి వలసల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని ఈ సంస్థలకు చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. వీరి వలసలు జాతీయ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించడమే కాకుం డా జమ్మూ కాశ్మీర్ జనాభాలో మతపరమైన నిష్పత్తిలో పెను మార్పులు రానున్నాయని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని 370, 35ఎ అధికరణలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకి కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను, హక్కులను బయటి రాష్ట్రాల నుండి వచ్చినవారికి వర్తింపజేయరాదని, ఈ కారణంగానే రోహింగ్యాలను బయటికి గెంటివేయాలనీ వారు డిమాండ్ చేస్తున్నారు. ‘‘370వ అధికరణాన్ని రద్దుచేయండి లేదా దానిని పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకే వర్తింపజేయండి’’ అన్నది ఇపుడు వారి సరికొత్త నినాదమయింది. రాజకీయ, మత, సామాజిక సంస్థలే కాదు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా జమ్మూ కాశ్మీరులో రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ వలసదారులలో కొందరు వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారనీ, నల్లమందు వంటి మత్తు పదార్థాల రవాణాకి సహకరిస్తున్నారనీ, వీరివల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నాయి.
మయన్మార్, బంగ్లాదేశ్‌లు తమ దేశాలలోకి రోహింగ్యాల చొరబాటును అనుమతించడం లేదు. వారివల్ల తమ భద్రతకు ముప్పు ఉందని ఆ దేశాల వారే అంటున్నారు. మరోవైపు తమ దేశంలో అక్రమంగా నివాసాలేర్పరచుకున్న 12వేలమంది బంగ్లాదేశీ ముస్లింలు తక్షణం బయటికి వెళ్లాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, మన దేశంలో మాత్రం అక్రమంగా వలసలు వచ్చి స్థిరపడ్డ రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు భారత రాజ్యాంగం కల్పించే అన్ని సదుపాయాలనూ దర్జాగా అనుభవిస్తున్నారు. వోటు బ్యాంకు కోసం ఆరాటపడే రాజకీయ పక్షాలు కూడా వీరికి అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు కూడా వీరిని తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో అక్రమ వలసదారుల సమస్యను తీవ్రంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రోహింగ్యాలు మరో లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఈటి)గా తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది.

చిత్రం.. మయన్మార్, బంగ్లాదేశ్ ముస్లింలు జమ్మూను వీడిపోవాలని ఆందోళనకారుల ప్రదర్శన

-డిఆర్‌కె