మెయన్ ఫీచర్

జ్ఞానాన్నివ్వని చదువులు! సామర్థ్యాల్ని పెంచని బోధన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళంలో పేరుమోసిన కథా రచయిత ఎవరు?...త్రిపురనేని రామస్వామి చౌదరి, చేకూరి రామారావు...చారా! ‘కారా’ అనే పేరు విన్నారా..?...ఆ! అ అ...(కాళీపట్నం) ఆ! రామారావు. కాళీపట్నం రామారావు! ఆయన ప్రసిద్ధి రచనలు తెలుసా? నక్షత్రాల గూర్చి, రుతు పవనాలు వస్తున్నాయి నవలు రాశాడు..! (ఆయనో పేరుమోసిన కథా రచయిత... ‘యజ్ఞం‘ కథ...కథానిలయం అనే సంస్థను స్వంతంగ ఓ పెద్ద బిల్డింగ్‌లో ఏర్పాటు చేసాడు..) గురజాడ అప్పారావు దేనికి ప్రసిద్ధి? సంఘ సంస్కర్త..! ఆయన ప్రముఖ రచనలు...? కన్యాశుల్కం...! మిటిల్డా, మనుషులు చేసిన దేవతలారా, దేవుడు చేసిన మనుషుల్లారా, పెద్ద మసీదు లాంటి..! కన్యాశుల్కంలోని రెండు పాత్రల పేరు చెప్పు? సారీసర్! జ్ఞాపకం లేదు..! శ్రీకాకుళం అనే పేరు ఎలా వచ్చింది..? సిక్కం (సంచి) అనే దాంట్లో నవాబు డబ్బులు వేయడం..! (ఆసంచీకి వేసిన సీలు..సిక్కా..సిక్కా కోలు) శ్రీకాకుళం దేనికి ప్రసిద్ధి..? (ఔ్య్య్ఘౄశ‘ఒ య్యఆక) అవున్‌సార్! వేసవిలో చల్లగా ఉంటుంది. ఇలాంటిదే మరోటి ఉంది..తెలుసా...?...లేదు..! (ఇర్కెడు..త.నాడు) రోణంకి అప్పలస్వామి...? ఆయన బహుభాషా కోవిదుడు...బనారస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్! పలాస అంటే...కాష్యూస్ అని చెప్పావు...మరొకటి..? నక్సలైట్ ఉద్యమానికి మంచి ప్రసిద్ధి!(ప.పార్వతి, ల-లక్ష్మి, స-సరస్వతి). తెలుగువారిలో ఎంతమందికి జ్ఞానపీఠం వచ్చింది? ఇద్దరికి...!ఎవరువారు...? సి.నారాయణరెడ్డి...! దేనికి...? (విశ్వంభర) ఆ..! మరో గ్రహీత...? (పాకుడురాళ్లు)...రచయిత తెలవదుసార్! (రావూరి విశ్వనాథ.) దిగంబర కవిత్వమంటే..? వారు చెప్పదలుచుకున్న దానికి పెట్టుకున్న పేరు...! ఎవరు వారు? నిఖిలేశ్వర్, చరబండరాజు, నగ్నముని...! వారున్నారా? బతికున్నారనేది కరెక్టుగా తెలియదుసార్! త్దీక క్యఖ ద్ఘ్పళ యఔఆళజూ చ్యి ఆళఖఖ..? ఒ్ఘక జఆఒ ఘజ్ప్ఘూశఆ్ఘ్ళఒ..తెలుగు మంఛి స్కోరింగ్ సబ్జెక్ట్..్భష ఎలా పుట్టింది తెలుస్తుంది..తెలుగు జఆఒళచి ఏ పరిపాలన గ్రంథం..! (ని ఘఒరీళజూ యశక ఘజ్ప్ఘూశఆ్ఘ్ళఒ..జఆఒ ఇళజశ క్యఖూ యౄఆ్దళూ ఆ్యశఖళ..) సరే! శభ్దాలంకారాలేంటో చెప్పు...? ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష, రూపక, అర్ధాంత్రన్యాస...సారీసర్! అవి అర్ధాలాంకారాలు...నృత్యనుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస..!
టీచర్స్‌కు ఉండాల్సిన లక్షణాలేంటి? పెద్దటోన్...! (కంఠం బాగుండి పాటలుపాడితే సరిపోతుందా? విషయ పరిజ్ఞానం మాటేంటి..) మీరు సింగిల్ టీచర్ గదా! ఎన్నిగంటలు బోధిస్తారు? ఉదయం 9-12 గం, 1 గంనుంచి 4 గం! (అంటే సమయాన్ని మర్చిపోతే..! టీచింగ్ అభిమానమంటున్నా..టీచర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌కు ఎందుకు వ స్తున్నారు..? నేను పడిన బాధలు, మా తల్లిదండ్రులు పడిన బాధలు పడకూడదని..ఇక్కడైతే పరిమితం కాబట్టి..ఎక్కువమందికి..! ఎలా? వినడం, మాట్లాడడం ద్వారా...ప్రజలు చెప్పేది వినడం, మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపించడం.! టూర్‌లో క్లాసులు చెప్పవచ్చు. కొన్ని దేశాల్లో టీచర్‌కే ప్రాధాన్యత ఉందిగా..? అవున్‌సార్! ఫిన్‌లాండ్, నార్వే!
(* బ్రాకెట్లలోని సంభాషణలు-ఇంటర్వ్యూ చేసిన సభ్యులవి..మిగతావి వారు అడిగిన దానికి, రోణంకి సమాధానాలు.)
పై కథనమంతా సివిల్స్‌లో మూడోరాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ మాదిరి(మాక్) ఇంటర్వ్యూకు సంబంధించింది. ఈ ఇంటర్వ్యూ గురించి సామాజిక మాధ్యమంలో భిన్న కథనాలు, వ్యాఖ్యానాలు హోరెత్తుతున్నాయి. ఎలక్ట్రాన్ మీడియాలు గోపాలకృష్ణ చదువుకున్న (హైదరా) గదిని నేపథ్యంగా చేసి కథనాల్ని ప్రసారం చేసాయి. కొందరు ఆహా! అంటే మరికొందరు ఓహో! అంటు అబ్బురపడగా, మూడో రాంకర్ ఇంత పూరుగా సమాధానాలు చెప్పాడేంటని ముక్కుమీద వేలేసుకుంటున్నారు.ఏది ఏమైనా మూడోరాంకు సాధించినవాడు, అసలైన ఇంటర్వ్యూలో ఢంకా బజాయించి ఉంటాడని సంతృప్తి చెందుతున్నారు. మాదిరి ఇంటర్వ్యూలోనే ఇంతగా అస్పష్టత ఉన్నప్పుడు, నిజమైన ఇంటర్వ్యూలో ఏకబిగిన సరైన సమాధానాలు చెప్పే అవకాశమెంత? మిగతా టాపర్లది, ఇతరుల స్థాయి ఎంత అనేది తేలని ప్రశే్న! ఇక వీరు రాసిన ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షల స్థాయి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే! లక్షలాది మందిలో నిలదొక్కుకున్నారు కాబట్టి రాసిన సమాధానాలన్నీ కరెక్టే అని భావించాల్సిందే! ఈ సందర్భంగా వేసుకోవాల్సిన ప్రశ్న మరోటి ఉంది. అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే అన్నట్టు, పేపరు దిద్దేవారి సామర్ధ్యాన్నిబట్టి, మార్కులు పొందినవారి సామర్ధ్యాన్నిబట్టి అంచనా వేయవచ్చు! వేయాలి కూడా!
ఒకప్పుడు 70 శాతం దాటితే డిస్టింక్షన్ అని సంబరపడేవారు. దానికి తగ్గ పరిజ్ఞానం, విషయ పరిపక్వత కూడా ఆనాడు మెండే! ఇప్పుడు 90 శాతంకు పైగా వచ్చినా (వేస్తున్నారు కాబట్టి) వంద రాకపోయే అనే దిగులు. విషయ పరిజ్ఞానంలో ఆబ్జక్టివిటీ తప్ప సబ్జక్టివిటీ కనపడదు. భాషాపరంగా చూస్తే పది పంక్తులు కాదు..పది మాటలు సరిగా రాయలేరు. చెప్పలేరు. ఆంగ్ల మాధ్యమంలో చదివినా, ఓ లెటర్ రాయలేని దౌర్భాగ్యం! ఇక తెలుగు భాష సరేసరి! అచ్చులకు, హల్లులకు భేదం తెలియకపోగా, కచటతపల, గజడదబల గూర్చి అడిగితే గజిబిజే! ఇంటర్‌లో అంతా రెండో భాషగా సంస్కృతానే్న తీసుకుంటారు. గత రెండు దశాబ్దాలుగా లెక్కించినా ఉమ్మడి రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు రెండు కోట్లు. వీరు సాధించిన మార్కులు 90కి పైగానే! అయినా సంస్కృతం మాట్లాడేవారు కారుకదా, సంస్కృతంలో వీరేమైనా చదువుతారా? కనీసం రేడియోలో వార్తలు వింటారా? అనేది వేసుకోకూడని ప్రశ్న. సంస్కృతాన్ని చూసి తెలుగులో కావాల్సినన్ని మార్కులు వేయడం, ఇందులో 90కి పైగా రావడం జరిగినా, కనీసం ఓ దినపత్రిక, సాహితీ పేజీ అంటే వీరికి తెలియదు. యథా ఉపాధ్యాయ, తథా విద్యార్థిగా మారిపోయింది. సుమతీ, వేమన, సుభాషితాలు నాలుకపైకి రావడమే కష్టం. ఇక కృతికర్తల, మూల గ్రంథ కవుల గురించి అడగడం మహా నేరం! సంధులు, సమాసాలు, అలంకారాలు, గణాలు ఊహల్లోకి కూడా రాని అంశాలే! సరే! ఇదంతా పండిత భాష అని కొట్టిపారేస్తే ఆధునిక భాష, వ్యవహారిక భాష అంటే తెలియని వ్యవహారం. అలాంటప్పుడు అభ్యుదయ, విప్లవ సాహిత్యం, భావకవిత్వం తెలుస్తుందనుకోవడం అతిశయోక్తే! కందుకూరి, గురజాడ, గిడుగు ఏ మార్పుకై రచనా వ్యాసంగం చేసారో చెప్పడం కాదూ- తాపీ, చలం, కొకు, బుచ్చిబాబు, అల్వారుల గూర్చి తెలుస్తుందనుకోవడం, తెలుగు సాహిత్యంపై ప్రభావం చూపిన శరత్ సాహిత్యాన్ని చదివారనుకోవడం పొరపాటే అవుతుంది. జాతీయ, అంతర్జాతీయ రచనల గూర్చి, రచయితల గూర్చి చర్చనే అనవసరం!
ఆములో ఇటుకల్ని కాల్చినట్టు, బోధన పేరున తరగతి గదిలో గంటల తరబడి బిట్స్‌ను చెప్పే వ్యవస్థ గ్రంథాలయం వాసన కూడా రానీయని స్థితి. తోడుగా ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లోనే భావ, భాష, విషయ పరిజ్ఞాన దారిద్య్రం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మార్కుల వేట, పోటీ ఆలోచన తప్ప, బోధించేవారికి విషయ అవగాహన పట్ల, విద్యార్థుల్లో పెంపొందించాల్సిన ఆలోచనలపట్ల ఏనాడు దృష్టిసారించని క్లాస్ రూంలు మనవి. ఇప్పుడైతే డిజిటల్ పేరున ప్రొజెక్టర్ ప్రజెంటేషనే్ల? ఫోన్లలో మాటలు కూడా కరువైపోయి, అంతా ఏనిమేషన్ సమాధానాలే! తలకట్టు, దీర్ఘాలు ఎవడిక్కావాలండి? స్పెల్లింగ్ ఎవరుపట్టించుకుంటున్నారు..? అమెరికా చూడండి..సైలెన్సు పదాల్ని ఎలా విడిచిపెట్టిందో...అంటూ తల తెలివి తక్కువతనాన్ని ఆధునిక తెలివి అనే ముసుగుతో కప్పేసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారింది. పిల్లల రాతని, తప్పొప్పుల్ని సరిదిద్దే వ్యవస్థ తెరమరుగైపోయింది. చివరికి ఉపాధ్యాయులుగా మారిన తల్లిదండ్రులకే ఈ వ్యవహారం పట్టదు. వారికి కూడా సరిగా తెలియదు.
ఓ దశాబ్ద కాలంగా ఉపాధ్యాయుడిగా సేవలందించానని సెలవిచ్చిన రోణంకికి పాత మూడు సూత్రాల్ని (ఔ్య్యళనఔ్ఘజశ/్య్యజూజూళ్యౄ/ఇళఒఆజశఒఔజూళఒ) ఇంటర్వ్యూ భోర్డు సభ్యులు గుర్తు చేసినా, నేటి వ్యవస్థలో వుండాల్సిన ప్రజాస్వామ్య, శాస్ర్తియ, లౌకిక వాద దృక్పధాల గూర్చి, మానవీయత, దయా, ప్రేమ, నిజాయితీ జవాబుదారితనం, ప్రకృతి ఆరాధన వంటి అంశాలు ఉపాధ్యాయుడిగా విధిగా ఉండాలనే ఆలోచన ఎక్కడా చర్చకు రావడంలేదు. వీటన్నింటి తర్వాతనే, విషయ, భాషా పరిజ్ఞానం వుండాలి. ఇందులో ఏదిలోపించినా ఉపాధ్యాయులుగా మనజాలరు. ఈ లోపాలే ఉపాధ్యాయుల్లోను, విద్యార్థుల్లోను కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. బస్సుల్లో, రైళ్లలో, పబ్లిక్ ప్రదేశాల్లో, చివరికి ఆలయాల్లో మ్యానరీజం (్ఘౄశశళూజఒౄ) కనుమరుగైపోయింది. విలువలు పతనమై వెకిలి వెర్రి తలలు వేస్తున్నది. స్వార్థం పడగలు విప్పుతున్నది.
ఈ నేపథ్యంలోనే రోణంకిని, జ్ఞానపీఠ గ్రహీతలు ముగ్గురని చెప్పకపోతే ఎలా? ఏ రచనలకై వచ్చిందో తెలవాలిగా..? అంటూ ప్రశ్నించారు. ఎలిమెంటరీ విద్య గురించిన స్పష్టత రావాలని సూచించారు. తెలుగు భాషనే ఎంచుకున్నదానికి కారణాలు వారే చెప్పాల్సి వచ్చింది. దుశ్యంతుడి పాటల ఇతిహాసంగా, తిక్కన పాఠం (రోణంకి ప్రస్తావించగా) సాహిత్యపరంగా ఉపయోగపడుతుందని, ప్రవరాఖ్యుడి ఉదంతంలా మేఘ సందేహం ఇమాజినరీ (ఊహ) సాహిత్యానికి పనికి వస్తుందని వివరించారు. మెయిన్ ఇంటర్వ్యూకి పోయే ముందు మరింత స్పష్టతతో, జ్ఞాన సముపార్జనతో పోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి చివరికి ఇంటర్వ్యూలో కూడా నిలదొక్కుకొని మూడోస్థానంలో నిలిస్తే, ఇంత ‘నస’ అవసరమా అని, ఇంత సూక్ష్మంగా చూడాలా అని భావించవచ్చు! త్రిపురనేని, చేరాలు శ్రీకాకుళం వారని, రోణంకి బెనారస్ వైస్ ఛాన్సలర్ అని చెప్పడం, కన్యాశుల్కం పాత్రలు చెప్పకపోవడం ఆశ్చర్యం కాదా! కాళీపట్నం రామారావుగూర్చే తెలియకపోతే ఎలా...? (పాలనాపరంగా, సామాజికంగా, రాజకీయంగా, విషయపరంగా) పాలకులకు, రాజకీయ నాయకులకు ఊడిగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దేశంలో ఇదే ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టే దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలు రూపుమాపక పడకపోగా, రాజకీయ అనిశ్చితి బాగా ముదిరిపోయింది. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల, మధ్యభారత్‌లోని గిరిజన ప్రాంతాల సమస్యలకు పరిష్కారాలు ఆలోచనకు రావడంలేదు. పైగా ఐఎఎస్‌ల కనుసన్నల్లో పనిచేయాల్సిన ఐపిఎస్‌లు స్వతంత్రంగా పనిచేస్తూ సమస్యల్ని మరింతగా జఠిలం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఐపిఎస్‌ల కనుసన్నల్లోనే వీరు మసలుకుంటున్నారు.
ఇదిమారాలి. పాలకులకు అనుకూలంగా కాక, రాజ్యాంగబద్ధంగా, నియమబద్ధంగా. సమాజానికి జవాబుదారీ తనంతో పనిచేసే వ్యవస్థ రూపొందాలి. వ్యక్తుల ఆరాధన స్థానంలో వ్యవస్థ ఆరాధన పెరగాలి. దీనికైసామాజిక విప్లవం రావాల్సిందే! ఇది రావాలంటే మన తరగతి గది స్వరూపం మారాలి. అప్పుడే రాజ్యాంగ ప్రవచిత సమాజం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రోణంకికి ఉపాధ్యాయుడిగా అనుభవం ఉంది కాబట్టి, ఈ దిశగా పనిచేస్తే ఆయన అభినందనీయుడే!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162