మెయిన్ ఫీచర్

సామాజిక గుర్తింపే జీవిత లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని రోజులు వరకూ ఆమె అంటే ఎవరికీ తెలియదు. తన జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా రాని పేరు నేడు వచ్చింది. ఆమె పేరు నేడు తమిళనాట అంతా మారుమ్రోగుతోంది. లింగమార్పిడి ఆపరేషన్‌తో మహిళగా మారి తొలిసారి ఎన్నికలలో నిలబడటం ఓ విశేషమైతే.. అన్నింటికంటే ముఖ్యం ఆ రాష్ట్ర అధినేత్రి, అందరూ ‘పురచ్చితలైవి’ అని పిలుచుకునే ముఖ్యమంత్రి జయలలితపై పోటీ చేయటం వల్ల ఆమె నేడు పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఆమే పేరే దేవి. ముప్పయి మూడేళ్ల ఈ మహిళ ‘నామ్ తమిలార్ కట్చి’ పార్టీ అభ్యర్థిగా ఆర్కె నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తోంది. సామాజిక కార్యకర్తగా గత కొనే్నళ్లుగా పనేచేస్తున్నా పట్టించుకోని ప్రజలు ఈ పోటీతో రాష్టమ్రంతటా గుర్తించారని ఆమె సంబరపడిపోతుంది. లింగమార్పిడి చేయించుకుని ఆమె వలే జనజీవన స్రవంతిలో జీవిస్తున్న తోటి ఆమె సామాజిక వర్గానికి చెందినవారే ఆమెను పోటీ నుంచి విరమించుకోమని బెదిరిస్తున్నా భయపడకుండా అడుగు ముందుకువేసింది. పేద కుటుంబాలు నివశించే ఓ కాలనీలో సింగిల్ బెడ్ రూమ్ ఆపార్ట్‌మెంట్‌లో దేవి తన తల్లితో నివశిస్తోంది.
పుట్టుకతోనే పుట్డెడు కష్టాలు
దేవి అందిరిలాగేనే సంప్రదాయ కుటుంబంలో పుట్టింది.పుట్టుకతోనే పుట్టెడు కష్టాలతో పుట్టిన ఆమె తొలినాళ్లలో విజయ్‌కుమార్ అనే పేరుతో పెరిగింది. తల్లికి 40 ఏళ్ల వయసు ఉన్నపుడు జన్మించింది. అంతేకాదు పుట్టిన వెంటనే తండ్రి చనిపోయాడు. తల్లి, అక్క కష్టార్జితంపై పెరిగింది. ఏడేళ్లు వయసు వచ్చేసరికి తాను మగపిల్లాడిని కాదని గ్రహించింది. ఆ బాలుడు రూపంలో బాలిక పెరుగుతోంది. టీనేజ్ వయసు వచ్చేసరికి మగపిల్లలు సైతం వెంటపడటం ప్రారంభించారు. మగ పిల్లలతో ఉండేది కాదు. ఆడపిల్లలతో ఎక్కువ స్నేహం చేసేది. స్కూల్లో మంచి విద్యార్థిగా ముద్రపడటం వల్ల టీచర్లు సైతం ఇష్టపడేవారు. అసలే పేదరికం.. ఆపై శరీరంలో సంభవించే ఈ వింత మార్పులు ఆ కుటుంబంలో కలతలు తెచ్చాయి. ఎన్ని ఇబ్బందులెదురైనా మానసిక స్థైర్యంతో వాటిని ఎదుర్కొంది. శరీరంలో అమ్మాయి లక్షణాలు ప్రస్పుటమవ్వటంతో ఇక లాభం లేదనుకొని సుమతి అనే స్నేహితురాలు ఇచ్చిన సలహా మేరకు ఓ రోజు తల్లి నగలు, ఇంట్లో ఉన్న డబ్బుతో ఉడాయించి, లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. ఆ తరువాత దేవిని సెక్స్ వర్కర్‌గా చేసేందుకు తోటి ఆమె సామాజిక వర్గానికి చెందినవారు ప్రయత్నించినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని దేవిగా నామకరణం చేసుకుని సేవా మార్గంలోకి అడుగుపెట్టింది.
పిల్లల్ని ఎత్తుకున్న తల్లుల్ని చూస్తే తాను కూడా ఓ తల్లిని కాలేకపోయాననే బాధకలుగుతుందని, జీవితంలో ఎలాగూ తల్లినయ్యే భాగ్యానికి నోచుకోలేదుకాబట్టి సేవామార్గంలో పయనిస్తూ అనేకమంది అనాథలను
తల్లిగా ఆదరిస్తోంది.
దేవిగా సొంత ఊరుకి వచ్చినపుడు ఆ ఊరి గ్రామస్తులు ఆమెను ఎగతాళి చేశారు. జన జీవన స్రవంతిలోకి కలవటానికి జనం ఆమోదించకపోవటంతోసేవామార్గాన్ని ఎంచుకుంది. తొలుత గ్రామంలో ఆకలిగొన్న పేదవారికి స్వయంగా తనింట్లోనే వంటచేసి పెట్టేది. ఆ ఊళ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. కొడుకుగా తల కొరివి పెట్టాల్సినవాడు కూతురుగా మారి నలుగురి చేత ‘అమ్మా’అని పిలుపించుకోవటం ఏ తల్లికి మాత్రం ఇష్టముండదు. దేవి తల్లి కూడా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎలాంటి అడ్డంకి చెప్పేదికాదు. తదనంతరం తన సంపాదనతో భవనాన్ని నిర్మించి అక్కడ ఓ ట్రస్ట్ ఏర్పాటుచేసి మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇపుడు ఆ ట్రస్ట్‌లో 25మంది సభ్యుల వరకు చేరారు. వందలాది మందికి ఆమె తన ట్రస్ట్ ద్వారా చేయుతనిస్తోంది.
శ్రీలంక తమిళ శరణార్థుల కోసం పనిచేసే నటుడు సలీమ్ స్థాపించిన ‘నామ్ తమిళార్ కట్చి’పార్టీలో చేరి ఇపుడు ఆ పార్టీ నుంచే జయలలితపై పోటీకి దిగింది. ఈ పోటీలో గెలవకపోయినా ఈ రోజు తమిళనాట అంతా సుపరిచితురాలినయ్యానని, ఇది తన సేవా కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దేవి ఆనందం వ్యక్తంచేస్తోంది. తొలిసారి లింగమార్పిడికి చేయించుకున్న వ్యక్తి పోటీలో నిలబడితే అభినందించాల్సిన తమ కమ్యూనిటీవారు తనను పోటీ నుంచి విరమించుకోమని ఒత్తిడి చేయటం ఒకింత బాధ అనిపిస్తోందంటారు. ఎందుకంటే జయలలిత ఆ కమ్యూనిటీవారికి ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తానని ఎన్నికల వాగ్ధానం చేసింది. దీంతో దేవికి మద్దతు ఇస్తే తమకు ఇళ్లు రాకుండా పోతాయని వారి భయం. నాకు సమాజమే ముఖ్యం. ఈ పోటీతో సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నానంటారు. ‘చాలా మంది ఈమె అమ్మాయి వలే చాలా అందంగా ఉందంటారు. కాని అమ్మాయిగా అంగీకరించారు. నన్ను మూడో జండర్‌గానే చూస్తారు. ఇది నాకు ఎంతో బాధ కలిగిస్తుందంటారు. కాని మా ఊరు ప్రజలు మాత్రం నా సేవా కార్యక్రమాలు నచ్చి నన్ను ‘అమ్మా స్వాగతం’ అని అంటారు. ఈ ఆదరణ నా జీవితానికి ఎంతో విలువైనది అని ఆమె అంటారు. సేవా అనే కలను ఈ పోటీద్వారా సాకారం చేసుకుంటానని అంటోంది.
--
ఎన్నికలలో ఓ దళితుడుగానీ, మరే ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగానీ పోటీ చేస్తే వారికి అభినందనలు చెబుతారు. అదే తమ జాతి సంతతి పోటీ చేస్తే అభినందనలు చెప్పకపోగా, అవహేళన చేస్తారు. సామాజిక, రాజకీయాలలో తమ జాతి గుర్తింపు కోసమే ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాను.

- దేవి