మెయిన్ ఫీచర్

కొత్తగా.. గమ్మత్తుగా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీ
మందు
ముక్క
మగువ
ఈ కాంబినేషన్ ప్రస్తావించగానే -్ఠక్కున గుర్తుకొచ్చేది మూవీ ఇండస్ట్రీ. ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చినా -అప్పుడప్పుడూ బయటకు పొక్కుతున్న సంఘటనలు -‘ఔను నిజమే కామోసు’ అన్న నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ఈ ‘ఎం’ కాంబోలోకి కొత్తగా మరో ‘ఎం’ చేరింది. అది ‘మత్తు’. పచ్చిగా అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే -డ్రగ్స్. ఎప్పటినుంచి సాగుతోంది.. ఎవరు పాత్రధారులు అన్నది అంత తొందరగా బయటకు పొక్కేది కాదు. కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లా -పరిశ్రమ నరనరాల్లోకి ‘మత్తు’ ఎగబాకుతోందని పదిమందీ నిందలేస్తున్నా, పోలీసులూ పైమాటగా చెబుతున్నా ‘ఏదీ ఎక్కడా కనిపించదే’ అనుకునే పరిస్థితే ఉంది. ఇప్పుడు ‘్ఫఫ్త్ ఎం’ గమ్మతె్తైన వాదనకు తెరలేపుతోంది. కొత్త సూత్రాలు పెట్టుకోక తప్పదనిపిస్తోంది.
ఏ రంగంలోనైనా మంచి చెడులు కామన్. మంచిని ఆక్షేపించే వాళ్లెవరూ ఉండరు. చెడు చోటుచేసుకున్నపుడే దానిగురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది శ్రుతిమించి జనానికీ ఇబ్బందికరంగా మారినపుడు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తెలుగు సినీ పరిశ్రమ ఈ విషయానికి కచ్చితంగా సరిపోతుంది. మంచి ఎంతో ఉన్నప్పుడు స్వర్ణయుగం నడిచిందని, గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయని, వరల్డ్ క్లాసిక్స్‌లో మన తెలుగు సినిమా ఒకటుందని ఆనందపడుతున్నాం. కానీ, దానికి మరోవైపు చెడు రోజురోజుకీ సినిమా రంగంలో పెరిగిపోతుండడాన్ని కూడా చూస్తూనే ఉన్నాం. ఇది బహిరంగంగా జరిగే ఓ సంతలాంటిది. ఎవడు ఎలాంటి వస్తువులనైనా అమ్ముకోవచ్చు. అలాగే నిర్మాతగా వచ్చినవాడు ఎలాంటి సినిమాలైనా తీయొచ్చు. ఒక్క సెన్సార్ గండం నుంచి తప్పుకున్నాడంటే చాలు, ప్రేక్షకుడికి అది యమగండమో, సుడిగుండమో అవ్వొచ్చు. ఒక ఇంటర్వ్యూలో అలనాటి నటి వాణిశ్రీ చెప్పినట్టుగా ‘సినిమా పరిశ్రమలోకి ఎవ్వడైనా రావచ్చు, పోవచ్చు. ఇక్కడ ఎంట్రీ ఫీజంటూ ఏదీ లేదు. అందుకే రకరకాల వ్యక్తులు వస్తున్నారు, పోతున్నారు. సినిమా అనే పదంపై ఎలాంటి అవగాహన లేనివాళ్లూ వచ్చి సినిమాలు తీసేస్తున్నారు. కనీసం నటనంటే తెలియనివాళ్ళొచ్చి నటించేస్తున్నారు. స్క్రిప్ట్ అవసరమా? అనే దర్శకులొచ్చి సినిమాలు తీసేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఒకందుకు స్వర్ణయుగంలో మేము నటించినందుకు ఆనందపడతాం. ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం’ అంటూ ఆమె చెప్పిన మాట అక్షరసత్యం.
ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పుడు నేరాలు- ఘోరాలు కథనాలు సినిమాల్లోనుంచి కాక పరిశ్రమ నుంచి వచ్చేస్తున్నాయి. ఈ నేరాలు ఘోరాల చిట్టాలో అనేక కొత్త కొత్త సంఘ వ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తూనే ఉన్నాం. అన్యాయాలు అక్టోపసిలాగా సంఘంలో చొచ్చుకొనిపోతున్నాయి. ఒక్కదాని గురించి చెప్పడానికే ఎంతో సమయం పడుతుంది. ఇక ఒక్కొక్క అన్యాయాల గురించి చెప్పుకుంటూ పోతే అదొక మహా సీక్వెల్‌గా మారుతుంది.
ఇటీవల అనేక వార్తాపత్రికల్లో మనం చదివాం- మాదకద్రవ్యాల వ్యాపారస్తులు సినిమా పరిశ్రమలో కూడా ఉన్నారని. గతంలోనూ అవకాశాలు లేని హీరోలు చిన్న చిన్న పబ్‌లను, హోటళ్లను ఏర్పాటుచేసి అందులో మాదకద్రవ్యాల విక్రయాలు జరుపుతున్నారన్న వార్తలు విన్నాం. వారందరినీ పట్టుకున్నారని, వారికి శిక్షలు వేశారని కూడా చదివాం. కానీ ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని శిక్షించారు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇదంతా గతం. ఇప్పుడు మాదకద్రవ్యాల సరఫరాదారులు చిన్న పిల్లలకు, కాలేజీ యువతకు కూడా అమ్ముతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా కట్టడి చేయడానికి పోలీసు వ్యవస్థ ఒకటుంది. కానీ సినిమా ముసుగులో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నవారిని ఎలా పట్టుకోవాలి? ఏదడిగినా సినిమా షూటింగ్‌లో ఇది ఒక భాగమేనంటూ జవాబు చెప్పే మహామేధావులూ పుట్టుకొస్తున్నారు. డ్రగ్స్ బిజినెస్ చేయడానికి సినిమా పరిశ్రమలో ఉన్నవారు ఎందుకు పాల్పడుతున్నారు? సినిమా ప్రపంచంలో ఒక్క సినిమాలో నటించినా, కనీసం డబ్బింగ్‌లు చెప్పినా ఎంతోకొంత వారు బ్రతకడానికి సరిపడా వస్తాయి. కానీ డ్రగ్స్ బిజినెస్‌లో దిగి కోట్లు సంపాదించాలన్న ఆశ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి ఎందుకు కలుగుతుంది? సినిమా అంటేనే హైఫై మెయింటనెన్స్ ఉండాలి. అందుకు అధిక మోతాదులో డబ్బులు ఖర్చుపెట్టాలి. అంత సంపాదన లేనినాడు అధిక మోతాదులో డ్రగ్స్ అన్నా అమ్మాలి. సినిమా వాళ్లు కాబట్టి పోలీసుల కన్ను అంతగా వారిపై పడదని అనుకోవడం కూడా భ్రమ. అయితే, సినిమా పరిశ్రమలో ఉన్నవారందరినీ ఒకే గాటన కట్టేయలేం. సినిమా పరిశ్రమలో వుంటూ ఏదో చిన్న వేషాలు వేసుకుంటూ, వీలైతే చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ ఎవరికి ఏ హానీ కలగకుండా నడుచుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఉన్న ఆ రెండు మూడు శాతం వ్యక్తులవల్లే పరిశ్రమ అన్యాయంగా అభాసుపాలవుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ఒక్కడు కనుక సినిమా పరిశ్రమలో కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్నాడూ అంటే, వారి వెనుక తమ్ముళ్లు, అన్నలు, బాబాయలు, పెదనాన్నలు- అందరూ సినిమా పరిశ్రమలోకి వచ్చేసి ఏదొక క్రాఫ్ట్‌లో కెలికిపారేస్తున్నారు. ఒక్కడి వెనుక ఇంత ప్రతిభ వుందా? అని ఆశ్చర్యపోయేలా కూడా చేస్తున్నారు. ఆ తరువాతే చిన్న చిన్నగా సరయిన సంపాదన లేనపుడు వక్రమార్గం పడుతున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు కార్డు అవసరమని అర్థమవుతోంది. ప్రతి క్రాఫ్ట్స్‌కు యూనియన్లు ఉన్నాయి. వారికి గుర్తింపు కార్డులూ ఉన్నాయి. కానీ కళాకారులు కానివాళ్ళు, సాంకేతిక నిపుణత లేనివాళ్ళు అందరూ కొద్దిమొత్తంలో డబ్బులు కట్టేస్తే ఈ కార్డులు పొందవచ్చు. ఒక్కసారి కార్డు పొందాడంటే యూనియన్ తరఫునుంచి కచ్చితంగా ఏదోక అవకాశం వస్తూనే ఉంటుంది. ఆయా గుర్తింపు కార్డులనుబట్టి సదరు వ్యక్తి నటించనూనవచ్చు, సాంకేతిక నిపుణుడిగా రాణించనూ వచ్చు. ఇక్కడే తప్పుదారి పడుతున్నాడు. నిజమైన కళాకారులు కళను నమ్ముకుని బ్రతికేస్తారు. కళను అడ్డంపెట్టుకుని డబ్బు సంపాదనకు వచ్చినవాళ్ళు సినిమా పరిశ్రమ ఏమైపోతే మనకేంటి? మనం కోటి రూపాయలు సంపాదించుకుంటే చాలు! అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు పరిశ్రమకు తలనొప్పిగా మారింది. అందుకే పరిశ్రమలోకి నటులుగానైనా, సాంకేతిక నిపుణులుగానైనా ఎవరైనా రావాలనుకున్నప్పుడు వారికున్న కళాభినివేశాన్ని వ్యక్తంచేసే రూపాన్ని ప్రదర్శించగలగాలి. అందుకిప్పుడు అందుబాటులో ఎన్నో మాథ్యమాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లలో తమ కళను తెలియజేస్తూ ఆయా కళాకారులు షార్ట్ ఫిలింస్ లాంటివి చిత్రీకరించి ప్రభుత్వం ఏర్పరచిన వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేయాలి. ప్రభుత్వాలు కూడా ఆయా కళాకారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. అలాంటి కార్డులు ఉన్నవారే సినిమా పరిశ్రమలో పనిచేయాలని ఓ నిబంధన పాస్ చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ప్రభుత్వాలకు ఇప్పుడుంది. వీలైతే ఆ షార్ట్ఫిలింస్ తీసిన కళాకారులకు వైవాలాంటి ఇంటర్వ్యూలు పెట్టాలి. అందులో వారు చెప్పే సమాధానాల ద్వారా వారికి సినిమా పరిశ్రమపై ఎంత అవగాహన వుంది? వారి ప్రతిభ ఎంత అనే విషయాలను అంచనా వేసి గుర్తింపుకార్డులు ఇవ్వాలి. ఏదైనా అనుమానం వుంటే సదరు కళాకారుడికి ఐదారు వైవాలైనా నిర్వహించాలి. గుర్తింపు కార్డు ఇచ్చేటప్పుడు సంఘ విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొనని ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఒకవేళ ఆ కళాకారుడు ఇలాంటి డ్రగ్స్ మాఫియా కేసుల్లో చిక్కినపుడు న్యాయస్థానం అతను దోషి అని తేలితే, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డును రద్దుచేయాలి. ఇక ఆ కళాకారుడు సినిమాలకు పని చేయడానికి వీలులేకుండా చేయాలి. అప్పుడు కొద్దో గొప్పో మంచి కళాకారులు ఉంటారు. ఇందులో నిర్మాతలను కూడా చేర్చాలి. నిర్మాతకు మంచి అభిరుచి ఉన్నపుడే మంచి సినిమాలు వస్తాయి.
ప్రస్తుతం చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని చాలామంది ఆక్రందిస్తున్న మాట నిజమే. కానీ చిన్న సినిమాలు విడుదలైనా థియేటర్‌లలో ఎన్ని టికెట్లు తెగుతున్నాయి అనే విషయాన్ని కూడా గమనించాలి. విషయం లేని సినిమాలకు చిన్న సినిమాలుగా భావిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే చిన్న సినిమాల్లో మంచి సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వమే దృష్టి సారించాల్సిన అవసరం వుంది. కళాకారులకు సంకెళ్లు వేయలేరు, కళ అనంతం- అని అనుకుంటే అతని కళ అతని దగ్గరే ఉండిపోతుంది. నా కళ అందరూ చూసి మెచ్చుకోవాలి అనుకున్నపుడు ఇలాంటి సూత్రాలను ప్రభుత్వమూ ఏర్పరచాలి. కళాకారుడు తలవొగ్గి అనుసరించాల్సిన అవసరమూ వుంది. ఇప్పుడు ఇలాంటి పడికట్టు సూత్రాలు పాటించండి అంటే ఎవరూ ఒప్పుకోరు. కానీ ఉజ్జ్వలమైన భవిష్యత్ వున్న తెలుగు సినిమాకు ఇలాంటి సూత్రాలు తప్పనిసరి అని చరిత్ర త్వరలో చెబుతుంది. అప్పుడు మంచి సినిమాలు వస్తాయేమో!? డ్రగ్స్ మాఫియాలు కనపడని పరిశ్రమ నాలుగు కాలాలపాటు వర్థిలుతుంది!
*
డ్రగ్ ఎడిక్ట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరని చెప్పలేం. కాని వాళ్లు ఎవరు, ఎక్కడుంటారన్నది ఎవ్వరికీ తెలీని విషయమే. ఎవరో ఒకరిద్దరున్నారని పరిశ్రమ మొత్తాన్ని వేలెత్తి చూపించడం సహించలేని దారుణం. పనికిరానివాళ్లు చేస్తున్న వెధవ పనివల్ల పరిశ్రమ మొత్తం చెడ్డపేరు మోయాల్సి వస్తుంది. ఇది బాధాకరం అంటూ ఇటీవల రచయత, నటుడు పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. నిజాలను నిర్భయంగా మాట్లాడగలిగే పోసానిలాంటి వాళ్లు చేస్తున్న హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోక తప్పదు. డ్రగ్ రాకెట్లతో సంబంధాలు నెరపుతున్న దుర్మార్గులను ఏరి పారేయడానికి పరిశ్రమలోని వాళ్లూ దృష్టి పెట్టకపోతే, ఎప్పటికైనా పెద్ద ప్రమాదం తప్పదు

-సరయు శేఖర్