మెయిన్ ఫీచర్

క‘న్నీళ్లు’..ఎన్నాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేలేత సూర్య కిరణాలతో పల్లెలు మేల్కొని పనుల్లో పడతాయి. కాని వేసవి వచ్చిందంటే పల్లెపడుచులకు అదనపు భారం పడుతోంది. అదే.. గుక్కెడు నీటి కోసం అనే్వషణ. ఏ పొలాల్లోని బోర్‌వెల్ వద్దకు వెళ్లి బిందెడు నీళ్లు తెంచుకుందామా అని ఆరాట పడటంతోనే వారి జీవన ప్రయాణం ఆరో జు ఆరంభమవుతోంది. మన దేశంలోనే కాదు చాలా దేశాలలో మంచినీళ్లు తీసుకురావటం అనేది మహిళ బాధ్యతగానే గుర్తిస్తున్నారు. ఆమె తీసుకువచ్చిన నీటితోనే వంట పని, బట్టలు ఉతకటం, వంట పాత్రలు శుభ్రచేయటం తదితర పనులన్నీ చేయాలి. ఇందుకోసం గంటల కొద్ది సమయాన్ని మహిళలు వెచ్చిస్తుంటారు.
ఇంటి యజమానురాలికి ముసలితనం వస్తే ఆ ఇంటి ఆడపిల్లలు నీళ్లను తీసుకరావటం అనే ఆచారం కొనసాగటం వల్ల మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. గిరిజన పల్లెల్లో మాత్రం సూర్యుడు ఇంకా ఉదయించడు. చీకట్లోనే బిందెలు చేతబట్టి నీళ్లకోసం పరుగులుపెడతారు. నల్గొండ జిల్లా దెయ్యం బండ తండాలో సూర్యుడు ఉదయించక ముందే మహిళలు ఇంటి పనులు ముగించుకుని నీటి కోసం బయలుదేరతారు. ఎనిమిదేళ్ల వయసు నిండని చిన్నారులు సైతం నీళ్ల బిందెలు చేతబట్టుకుని బయలుదేరుతారు. మూడు గంటలు నడుచుకుని వెళితేగానీ అక్కడ ఉండే బోర్‌వెల్‌లో నీళ్లు దొరుకుతాయి. వాటిని తెచ్చుకుని తాగుతారు.
ఈ నీళ్ల కోసం నారీమణులు నీటి యుద్ధాలే చేస్తున్నారు. ఈ ఘటనలను హాస్యాస్పదంగా చూస్తారే గానీ కుటుంబ శ్రేయస్సు కోసం ఆమె పడే తపనను అర్థంచేసుకునేదెవరు..? వేసవిలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండదు. దీంతో ఈ యుద్ధాలు తారాస్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. నీటి కోసం మహిళలే ఒంటరి పోరాటమే చేస్తారు. ఇంట్లో మగవారు బిందెడు నీరు తెచ్చిపెట్టరని, రెండు బిందెల నీటి కోసం మూడు గంటలు కష్టపడాల్సి వస్తుందని గిరిజన మహిళల ఆవేదన. నీళ్లపని, ఇంటి పనితోమహిళలు సతమతమవుతుంటారు. ఈ నేపధ్యంలో పిల్లలను సరిగా చూసుకోలేక మహిళలు పలురకాల ఇబ్బందులు పడుతుంటారు. గ్రామీణ మహిళలకు జీవనాధారం గ్రామీణ ఉపాధి హామీ పథకం. పొట్టకూటి కోసం చేసే ఈ పనులు కూడా నీటకోసం పడే తపనలో పాపం వారు వదులుకుంటున్నారు.
ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు హెచ్చరిక
రాబోయే కాలంలో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే ఈ నగరాలలో భూగర్భజలాలను తవ్వేస్తున్నారు. ఫలితంగా మొదటి హైదరాబాద్ నగరమే ఎండిపోయే పరిస్థితికి వస్తుంది. ఇదే బాటలో
ఢిల్లీ, చెన్నై నగరాలు ఉంటాయి. ఆసియాలోనే చెన్నై, ఢిల్లీ నగరాలలో మంచినీటి సరఫరాలో అధ్వాన్నంగా ఉన్న నగరాలుగా పేరుతెచ్చుకున్నాయి. వర్షాకాలంలో కురిసే నీటిని సద్వినియోగం చేసుకోవటంలో సరైన ప్రణాళికలు లేకపోవటం వల్ల దాదాపు 75-80 శాతం నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది.

--

బికిని 60ఏళ్ల వృద్ధురాలు. ఆమె ప్రతి రోజు బిందెడు నీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళుతుంది. నీళ్ల బిందెలు మోసి భుజాల వెనుక భాగం విపరీతమైన నొప్పి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తోంది.
-పెడ్డా అనే యువతికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఫలితం గా గర్భాశయాన్ని తొలగించారు. హార్మోన్ల ప్రభావం వల్ల ఎముకలు పెళుసుగా తయారయ్యాయి. ఆమె పనులు చేయటమే కష్టం. కాని ఇంత కష్టంలోనూ నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. -తండాలకు కొత్త కోడలు వస్తే ఆమె పరిస్థితి కూడా ఇదే. పెళ్లయిన మరుసటి రోజు నుంచి బిందె చేతబట్టుకుని నీళ్లు తెచ్చుకోవాలి. చిన్నవయసులోనే పిల్లల్ని కనటం, నీళ్ల బిందెలు మోయటం లాంటి పనుల వల్ల ఈ అమాయక గిరిజనుల ఆరోగ్యం నానాటికి క్షీణిస్తోంది. ఇలాంటి దృశ్యాలను చూసినవారెవరైనా అయ్యో!పాపం అనకుండా ఉండలేరు. ఈ దృశ్యం రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతలోనిది అనుకుంటే తప్పులో కాలేసినట్లే. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో కనిపించే సజీవ సత్యం. వేసవి వచ్చిందంటే మహిళల నిత్యజీవన పోరాటంలోనీళ్లు తెచ్చుకోవటమనేది వారి మీద పడే మరో పనిభారం.

--

మంచినీరు..వాస్తవాలు

ఖ దేశ వ్యాప్తంగా ఉన్న 85 రిజర్వాయర్లలో 253 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు రిజర్వ్ చేస్తున్నారు. మిగిలిన నీటిని వృధా చేస్తున్నాం.
ఖ ఏటా3,575 మిలియన్ల జనం నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల మరణిస్తున్నారు.
ఖ 43శాతం మరణాలు డయోరియా వల్ల సంభవిస్తున్నాయి.
ఖ 14 సంవత్సరాలలోపు పిల్లల్లో నీటికి సంబంధించిన మరణాలు దాదాపు 84శాతం సంభవిస్తున్నాయి.
ఖ ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాల పాటు జీవించగలడు. కాని నీరు లేకుండా కొన్ని రోజులు కూడా బతకలేడు.
ఖ ప్రతి మనిషికి వంటకు, స్నానానికి, శానిటేషన్‌కు కలిపి 13.2 గ్యాలన్ల నీరు అవసరం.
ఖ ప్రతి 15 సెకండ్లకు ఒక చిన్నారి నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల మరణిస్తోంది.
ఖ అపరి శుభ్రమైన నీరు, శానిటేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు 5,000 మరణాలు సంభవిస్తున్నాయి. సంవత్సరానికి 1.8 మిలియన్ల జనం చనిపోతున్నారు.
ఖ చేతులు శుభ్రం చేసుకోకపోవటం వల్ల డయోరియా కేసులు 40శాతం నమోదు అవుతుండగా..చిన్నపిల్లల్లో మరణాలు నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల సంభవిస్తూ రెండవ స్థానం ఆక్రమించింది.

--

మహిళలు, ఆడపిల్లలు సగటున ప్రతిరోజూ 125 మిలియన్ గంటలు నీటి కోసం కష్టపడుతుంటారు.
మిలియన్ల మహిళలు, పిల్లలు మంచినీటి కోసం కొన్ని గంటల పాటు కష్టపడతారు.
మహిళలు, ఆడపిల్లలు నీళ్లను తీసుకురావటం తమ బాధ్యతగా గుర్తిస్తారు.
ప్రతిరోజూ సగటున ఆరు గంటల పాటు నీటి సేకరణ కోసం కష్టపడుతుంటారు.
నీటి సేకరణ కోసం ఆడపిల్లలు ఎక్కువ సమయం వెచ్చించటం వల్ల పాఠశాలల్లో వారి అటెండెన్స్ తక్కువగా నమోదవుతోంది.
ప్రతి 90 సెకండ్లకు ఓ బాలిక నీళ్లకు సంబంధించిన వ్యాధులకు బలవుతోంది.
ఇప్పటికీ 1/3 వంతు పాఠశాలల్లో నీటి సదుపాయం, శానిటేషన్ వసతి చదువుకునే బాలికలకు కల్పించలేకపోతున్నారు.
పిల్లల మరణానికి కారణమైన వ్యాధులలో డయోరియా మూడోస్థానాన్ని ఆక్రమించింది.

--

బిందెల బరువు
ఇరవై రెండేళ్ల అరుణ నాలుగు నెలల గర్భిణీ. చంకలో నాలుగేళ్ల కుమారుడు. నెత్తిమీద యాభై లీటర్ల నీళ్ల బరువున్న రెండు కుండలు. డాక్టర్లు ఈ సమయంలో బరువులు మోయవద్దని చెప్పినా ఆమెకు నీళ్ల బరువు మోయక తప్పని పరిస్థితి. గిరిజన మహిళలు నెత్తిమీద రెండు బిందెల బరువుతో ప్రతిరోజూ పక్క ఊరుకు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటారు. కనీసం రెండు బిందెలుకు తక్కువగాకుండా వెంట తీసుకువెళుతుంటారు. వేసవి వచ్చిందంటే గిరిజన తండాలలో కుటుంబ దాహార్తి తీర్చటం కోసం వారు నెత్తిన నిత్యం కనిపించే ఆయుధం అని అనటంలో ఎలాంటి తప్పులేదు.